ఆత్మీయులు
వికీపీడియా నుండి
| ఆత్మీయులు (1969) | |
| దర్శకత్వం | వి.మధుసూధనరావు |
|---|---|
| రచన | యద్దనపూడి సులోచనారాణి |
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, చంద్రమోహన్, చంద్రకళ, విజయనిర్మల, సూర్యకాంతం, ధూళిపాళ, గుమ్మడి వెంకటేశ్వరరావు, పద్మనాభం, ప్రభాకరరెడ్డి |
| సంగీతం | ఎస్.రాజేశ్వరరావు |
| నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
| గీతరచన | ఆరుద్ర, దాశరధి |
| నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ క్రియేషన్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
ఆత్మీయులు 1969లో విడుదలైన కుటుంబ కథాచిత్రం.
విషయ సూచిక |
చిత్రకథ [మార్చు]
జగన్నాధం (గుమ్మడి) దగ్గర పాలేరుగా పనిచేస్తున్న వీరన్న (ధూళిపాల) కు ఒక కొడుకు సూర్యం (నాగేశ్వరరావు) మరియు ఒక కూతురు సీత (చంద్రకళ). జగన్నాధం ప్రాణాల్ని రక్షించే ప్రయత్నంలో వీరన్న చనిపోతాడు. పిల్లలిద్దరూ అనాధలౌతారు. జగన్నాధం పల్లె విడిచి పట్నం వెళ్ళిపోతాడు. పిల్లల ఆలనాపాలన కోసం డబ్బు పంపించినా అది వారికి చేరదు. కష్టపడి చదివి సూర్యం యూనివర్సిటీలోనే ఫస్ట్ గా వస్తాడు. సీత ఇంటి పనులను చక్కగా తీర్చుదిద్దుతుంది. నిజాన్ని తెలిసిన జగన్నాధం ఇద్దర్నీ తన ఇంటికి తీసుకొని వస్తాడు. జగన్నాధానికి ఒక కొడుకు చంద్రం (చంద్రమోహన్). రాజారావు కూతురు జయ (వాణిశ్రీ) సూర్యంకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తుంది. సీత పనితనానికి ముచ్చటపడిన జగన్నాధం తన కొడుకు చంద్రాన్ని సీతతో వివాహం జరిపిస్తాడు.
పాత్రలు-పాత్రధారులు [మార్చు]
- అక్కినేని నాగేశ్వరరావు - సూర్యం, వీరయ్య కొడుకు
- వాణిశ్రీ - జయ, రాజారావు కూతురు
- చంద్రమోహన్ - చంద్రం, జగన్నాధం కొడుకు
- చంద్రకళ - సీత, సూర్యం వీరయ్య, కూతురు
- నాగభూషణం - లాయర్ రాజారావు
- విజయనిర్మల - సరోజ
- సూర్యకాంతం - మహంకాళి, చిట్టిబాబు తల్లి
- ధూళిపాళ - వీరయ్య
- గుమ్మడి వెంకటేశ్వరరావు - జగన్నాధం, కళాశాల ప్రిన్సిపాల్
- పద్మనాభం - చిట్టిబాబు
- ప్రభాకరరెడ్డి
పాటలు [మార్చు]
- ఓ చామంతి ఏమిటే ఈ వింత ఈ చినవానికి కలిగెనేల గిలిగింత లేని పులకింత - పి.సుశీల, ఘంటసాల
- కళ్ళలో పెళ్ళి పందిరి కనబడసాగే పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే - పి.సుశీల, ఘంటసాల
- మదిలో వీణలు మ్రోగె ఆశలెన్నొ చెలరేగె కలనైన కనని ఆనందం ఇలలోన విరిసె ఈనాడె - రచన : దాశరథి కృష్ణమాచార్య - సంగీతం : సాలూరు రాజేశ్వరరావు - గానం : పి.సుశీల
- అమ్మబాబు నమ్మరాదు ఈ రాలుగాయి - పి.సుశీల, ఘంటసాల
- అన్నయ్య కలలే పండెను చెల్లాయి - పి.సుశీల, ఘంటసాల
- ఈ రోజుల్లో పడుచువారు గడుసువారు వీలైతే - పి.సుశీల, ఘంటసాల బృందం
- ఏం పిల్లో తత్తరబిత్తరగున్నావు ఎందుకో గాభరగీభర తిన్నావు - పిఠాపురం నాగేశ్వరరావు
- చిలిపి నవ్వుల నిను చూడగానే వలపు పొంగేను నాలోనే - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు సోగకనులు సైగ చేస్తే ఆగలేని - రచన: ఆరుద్ర[1] - గానం: పి.సుశీల
మూలాలు [మార్చు]
- ↑ కురిసే చిరుజల్లులో, ఆరుద్ర సినీ గీతాలు, 5వ సంపుటం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)