ఆసియా క్రికెట్ కౌన్సిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

 

ఆసియా క్రికెట్ కౌన్సిల్
ఎసిసి అధికారిక లోగో
సంకేతాక్షరంACC
స్థాపన1983 సెప్టెంబరు 19 (1983-09-19)
కేంద్రీకరణక్రికెట్ నిర్వహణ
ప్రధాన
కార్యాలయాలు
కొలంబో, శ్రీలంక
సేవాఆసియా
సభ్యులు25 సభ్యులు
అధికారిక భాషఇంగ్లీషు
అధ్యక్షుడుజై షా
ఉపాధ్యక్షుడుపంకజ్ ఖిమ్జీ

ఆసియా క్రికెట్ కౌన్సిల్, 1983లో స్థాపించిన క్రికెట్ సంస్థ. ఇది ఆసియాలో క్రికెట్ క్రీడను ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికీ ఏర్పాటైంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు అధీనంలో ఉండే ఈ కౌన్సిల్, ఆసియా ఖండం లోని ప్రాంతీయ పరిపాలనా సంస్థ. దీనిలో ప్రస్తుతం 25 సభ్య సంఘాలున్నాయి. జయ్ షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రస్తుత అధ్యక్షుడు. [1] [2] దీని ముఖ్య కార్యాలయం కొలంబోలో ఉంది.

చరిత్ర[మార్చు]

1983 సెప్టెంబరు 19 న భారతదేశంలోని న్యూ ఢిల్లీలో ఆసియా క్రికెట్ కాన్ఫరెన్స్‌ పేరుతో ఈ కౌన్సిల్ ఏర్పడింది, ఇందులో తొలి సభ్యులు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మలేషియా, శ్రీలంక, సింగపూర్. 1995లో దాని పేరును ప్రస్తుతమున్న రూపం లోకి మార్చారు. 2003 వరకు, కౌన్సిల్ ప్రధాన కార్యాలయం అధ్యక్షు, కార్యదర్శుల స్వదేశాలలో రెండేళ్ళకోసారి మారుతూ ఉండేది.

సభ్య దేశాలలో కోచింగ్, అంపైరింగ్, స్పోర్ట్స్ మెడిసిన్ ప్రోగ్రామ్‌లకు మద్దతు ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాన్ని కౌన్సిల్ నిర్వహిస్తుంది. దీనికి నిధులను ఆసియా కప్, అండర్-19 ఆసియా కప్, మహిళల ఆసియా కప్ తదితర టోర్నమెంట్‌ల సమయంలో సేకరించిన టెలివిజన్ ఆదాయం నుండి సమకూర్చుకుంటుంది.

ఎసిసి సభ్యులు[మార్చు]

ఆసియా క్రికెట్ కౌన్సిల్ సభ్యులు
No. దేశం అస్ళోసియేషను ICC సభ్యత్వ హోదా ICC సభ్యత్వం ఎప్పటినుండి ఎసిసి
సభ్యత్వం ఎప్పటినుండి
ఐసిసిలో పూర్తి సభ్యత్వం ఉన్న ఎసిసి సభ్య దేశాలు (5)
1  India బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా పూర్తి సభ్యులు 1926 1983
2  పాకిస్తాన్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పూర్తి సభ్యులు 1952 1983
3  శ్రీలంక శ్రీలంక క్రికెట్ పూర్తి సభ్యులు 1981 1983
4  బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పూర్తి సభ్యులు 2000 1983
5  ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు పూర్తి సభ్యులు 2017 2001
ఐసిసిలో అసోసియేట్ సభ్యత్వం ఉన్న ఎసిసి సభ్యులు (18)
6  నేపాల్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ అసోసియేట్ (వన్‌డే హోదా) 1996 1990
7  ఒమన్ ఒమన్ క్రికెట్ బోర్డు అసోసియేట్ (వన్‌డే హోదా) 2014 2000
8  UAE ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అసోసియేట్ (వన్‌డే హోదా) 1990 1984
9  థాయిలాండ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్ అసోసియేట్ 2005 1996
10  బహ్రెయిన్ బహ్రెయిన్ క్రికెట్ అసోసియేషన్ అసోసియేట్ 2017 2003
11  భూటాన్ భూటాన్ క్రికెట్ కౌన్సిల్ బోర్డు అసోసియేట్ 2017 2001
12  కంబోడియా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ కంబోడియా అసోసియేట్ 2022 2012
13  చైనా చైనీస్ క్రికెట్ అసోసియేషన్ అసోసియేట్ 2017 2004
14  హాంగ్‌కాంగ్ క్రికెట్ హాంకాంగ్ అసోసియేట్ 1969 1983
15  ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ క్రికెట్ అసోసియేషన్ అసోసియేట్ 2017 2003
16  కువైట్ కువైట్ క్రికెట్ అసోసియేషన్ అసోసియేట్ 2005 2005
17  మలేషియా మలేషియా క్రికెట్ అసోసియేషన్ అసోసియేట్ 1967 1983
18  మాల్దీవులు మాల్దీవుల క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అసోసియేట్ 2017 1996
19  మయన్మార్ మయన్మార్ క్రికెట్ ఫెడరేషన్ అసోసియేట్ 2017 2005
20  ఖతార్ ఖతార్ క్రికెట్ అసోసియేషన్ అసోసియేట్ 2017 2000
21  సౌదీ అరేబియా సౌదీ అరేబియా క్రికెట్ ఫెడరేషన్ అసోసియేట్ 2016 2003
22  సింగపూర్ సింగపూర్ క్రికెట్ అసోసియేషన్ అసోసియేట్ 1974 1983
23  తజికిస్తాన్ తజికిస్థాన్ క్రికెట్ ఫెడరేషన్ అసోసియేట్ 2021 2012
ఐసిసిలో సభ్యత్వం లేని ఎసిసి సభ్యులు (2)
24  Chinese Taipei Chinese Taipei Cricket Association 2012
25  బ్రూనై Brunei Darussalam National Cricket Association 1996

గమనిక[మార్చు]

  • మంగోలియా (2021లో) & ఉజ్బెకిస్తాన్ (2022లో) లు ఐసిసిలో అసోసియేట్ సభ్యులుగా చేరాయి. కానీ ఇంకా ఏ ప్రాంతీయ సంస్థ లోనూ సభ్యత్వం పొందలేదు. అయితే, ఆసియా దేశాలైనందున, అవి ఎసిసిలో చేరాల్సి ఉంది.

ఆసియా క్రికెట్ కౌన్సిల్ మాజీ సభ్యులు[మార్చు]

మాజీ ఎసిసి సభ్యులు ICC తూర్పు ఆసియా-పసిఫిక్‌లో భాగమయ్యారు
నం. దేశం అసోసియేషన్ ICC సభ్యత్వం
స్థితి (ఆమోద తేదీ)
ICC
సభ్యత్వం
ఎసిసి
సభ్యత్వం
1  ఫిజీ ఫిజీ క్రికెట్ అసోసియేషన్ అసోసియేట్ 1965 1996
2  జపాన్ జపాన్ క్రికెట్ అసోసియేషన్ అసోసియేట్ 1989 1996
3  పపువా న్యూగినియా క్రికెట్ PNG అసోసియేట్ 1973 1996

ఇటీవల, ACC ఎగ్జిక్యూటివ్ బోర్డు జపాన్, ఇండోనేషియా తూర్పు ఆసియా పసిఫిక్ లను ACC పాత్‌వే టోర్నమెంట్‌లలో పాల్గొనడానికి ఆహ్వానితులుగా ఆమోదించింది [3]

మ్యాప్[మార్చు]

ఆసియా అంతటా ఎసిసి సభ్యులు
  ICC పూర్తి సభ్యత్వంతో ఎసిసి సభ్యులు (5)
  ICC (18) అసోసియేట్ సభ్యత్వంతో ఎసిసి సభ్యులు
  ICC సభ్యత్వం లేని ఎసిసి సభ్యులు (2)   ఆసియాలోని ICC సభ్యులు ఎసిసిలో భాగం కాదు (2)  ICC ఈస్ట్-ఆసియా పసిఫిక్ సభ్యులు  ఎసిసి యేతర సభ్యులు

ఎసిసి ఈవెంట్‌లు[మార్చు]

ప్రస్తుత టైటిల్ హోల్డర్లు :

టోర్నమెంట్ సంవత్సరం ఛాంపియన్స్ రన్నర్స్-అప్ తదుపరి ఎడిషన్
ఎసిసి పురుషుల ఆసియా కప్ 2023  India  Sri Lanka 2025
ఎసిసి మహిళల ఆసియా కప్ 2022  India  Sri Lanka 2024
ఎసిసి పురుషుల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023  Pakistan A  India A 2024
ఎసిసి మహిళల ఎమర్జింగ్ టీమ్ ఆసియా కప్ 2023 ఇండియా బంగ్లాదేశ్ 2024
ఎసిసి అండర్-19 ఆసియా కప్ 2021  India  Sri Lanka 2023
ఎసిసి పురుషుల ప్రీమియర్ కప్ 2023  Nepal  United Arab Emirates 2024
ఎసిసి పురుషుల ఛాలెంజర్ కప్ 2023  సౌదీ అరేబియా  బహ్రెయిన్ 2024
ఎసిసి పురుషుల U16 వెస్ట్ జోన్ కప్ 2023  United Arab Emirates  Qatar 2024
ఎసిసి పురుషుల U16 ఈస్ట్ జోన్ కప్ 2023  Nepal  Malaysia 2024

రద్దైన టోర్నీలు[మార్చు]

  • ఆఫ్రో-ఆసియా కప్
  • ఎసిసి ఛాంపియన్‌షిప్
  • ఆసియా టెస్ట్ ఛాంపియన్‌షిప్
  • ఎసిసి ప్రీమియర్ లీగ్
  • ఎసిసి ట్రోఫీ
  • ఎసిసి ట్వంటీ20 కప్
  • ఎసిసి ఈస్టర్న్ రీజియన్ T20
  • ఎసిసి వెస్ట్రన్ రీజియన్ T20

అధికారులు[మార్చు]

ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు[మార్చు]

ఎసిసి ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు [4]
పేరు జాతీయత బోర్డు పోస్ట్ చేయండి
జై షా  India భారతదేశంలో క్రికెట్ నియంత్రణ బోర్డు అధ్యక్షుడు
పంకజ్ ఖిమ్జీ  Oman ఒమన్ క్రికెట్ ఉపాధ్యక్షుడు
జాకా అష్రఫ్  Pakistan పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు
షమ్మీ సిల్వా  Sri Lanka శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు
నజ్ముల్ హసన్  Bangladesh బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు
మిర్వాయిస్ అష్రఫ్  Afghanistan ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు
రవి సెహగల్  Thailand క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు
ఖలీద్ అల్ జరూనీ  United Arab Emirates ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు
మహ్మద్ ఫైసల్  Maldives మాల్దీవుల క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు
యాష్లే డి సిల్వా  Sri Lanka శ్రీలంక క్రికెట్ మాజీ ఉద్యోగి; CEO, SLC
అరుణ్ సింగ్ ధుమాల్  India బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా మాజీ ఉద్యోగి; CEO, BCCI
ఫైసల్ హస్నైన్  Pakistan పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఉద్యోగి; CEO, PCB
నిజాం ఉద్దీన్ చౌదరి  Bangladesh బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాజీ ఉద్యోగి; CEO, BCB
నసీబ్ ఖాన్  Afghanistan ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఎక్స్-అఫీషియో, CEO, ACB

ఎసిసి ఎగ్జిక్యూటివ్ కమిటీ[మార్చు]

ఎసిసి ఎగ్జిక్యూటివ్ కమిటీ [4]
పేరు జాతీయత బోర్డు పోస్ట్ చేయండి
అమితాబ్ చౌదరి  India బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఛైర్మన్, ఎగ్జిక్యూటివ్ కమిటీ
నజ్ముల్ హసన్ పాపోన్  Bangladesh బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు
కమల్ పద్మసిరి  Sri Lanka శ్రీలంక క్రికెట్ సభ్యుడు
ఎహసాన్ మణి  Pakistan పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సభ్యుడు
అజీజుల్లా ఫజ్లీ  Afghanistan ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సభ్యుడు
తుసిత్ పెరీరా  Sri Lanka శ్రీలంక క్రికెట్ కన్వీనర్, GM – ఫైనాన్స్ & ఆపరేషన్స్

అభివృద్ధి బృందం[మార్చు]

అభివృద్ధి కమిటీ[మార్చు]

ఎసిసి అభివృద్ధి కమిటీ [4]
పేరు జాతీయత బోర్డు పోస్ట్ చేయండి
కమల్ పద్మసిరి  Sri Lanka శ్రీలంక క్రికెట్ చైర్మన్
నజ్ముల్ హసన్ పాపోన్  Bangladesh బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు
మహింద వల్లిపురం  Malaysia మలేషియా క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు
నదీమ్ నద్వి  Saudi Arabia సౌదీ క్రికెట్ సెంటర్ సభ్యుడు
మంజూర్ అహ్మద్  Qatar ఖతార్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు
సుల్తాన్ రానా  Pakistan పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కన్వీనర్ – ఈవెంట్స్ అండ్ డెవలప్‌మెంట్ మేనేజర్ [5]

రిసోర్స్ సిబ్బంది (అంపైరింగ్)[మార్చు]

గత అధ్యక్షులు[మార్చు]

క్ర.సం. నం పేరు దేశం పదవీ కాలం
1 NKP సాల్వే  India 1983–85 [6]
2 గామిని దిసానాయకే  Sri Lanka 1985–87
3 లెఫ్టినెంట్ జనరల్ GS బట్  Pakistan 1987
4 లెఫ్టినెంట్ జనరల్ జాహిద్ అలీ అక్బర్ ఖాన్ 1988–89
5 అనిసుల్ ఇస్లాం మహమూద్  Bangladesh 1989–91
6 అబ్దుల్‌రహ్మాన్ బుఖాతీర్  UAE 1991–93
7 మాధవరావు సింధియా  India 1993
8 IS బింద్రా 1993–97
9 ఉపాలి ధర్మదాసు  Sri Lanka 1997–98
10 తిలంగ సుమతిపాల 1998–99
11 ముజిబుర్ రెహమాన్  Pakistan 1999-99
12 జాఫర్ అల్తాఫ్ 1999-00
13 లెఫ్టినెంట్ జనరల్ తౌకిర్ జియా 2000–02
14 మహ్మద్ అలీ అస్గర్  Bangladesh 2002–04
15 జగ్మోహన్ దాల్మియా  India 2004–05
16 శరద్ పవార్ 2006-06
17 జయంత ధర్మదాసు  Sri Lanka 2006–07
18 అర్జున రణతుంగ 2008-08
19 డా. నాసిమ్ అష్రఫ్  Pakistan 2008-08
20 ఇజాజ్ బట్ 2008–10
21 ముస్తఫా కమల్  Bangladesh 2010–12
22 ఎన్. శ్రీనివాసన్  India 2012–14
23 జయంత ధర్మదాసు  Sri Lanka 2014–2015
24 తిలంగ సుమతిపాల 2015–2016
25 షెహ్రేయార్ ఖాన్  Pakistan 2016–2016
26 ఎహసాన్ మణి 2016–2018
27 నజ్ముల్ హసన్  Bangladesh 2018–2021
28 జై షా  India 2021–ప్రస్తుతం

ఎసిసి ఆసియా XI అనేది 2005 వరల్డ్ క్రికెట్ సునామీ అప్పీల్ కోసం ఏర్పాటు చేసిన జట్టు. 2004 హిందూ మహాసముద్రం భూకంపం, దాని ఫలితంగా ఏర్పడిన సునామీ తరువాత స్వచ్ఛంద సంస్థల కోసం నిధులను సేకరించేందుకు ఒక మ్యాచ్ ఆడింది. ఇది ఆఫ్రికన్ క్రికెట్ అసోసియేషన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ కోసం నిధుల సమీకరణగా రూపొందించబడిన ఆఫ్రికా XIతో ఒక సాధారణ ఆఫ్రో-ఆసియా కప్‌లో కూడా పోటీపడింది. ఆఫ్రో-ఆసియా కప్ 2005లో ప్రారంభమైంది. రెండవ టోర్నమెంట్ 2007లో జరిగింది.

ఇవి కూడా చూడండి[మార్చు]

  • ఆసియా క్రీడల్లో క్రికెట్
  • ఆసియా XI ODI క్రికెటర్ల జాబితా

మూలాలు[మార్చు]

  1. Sportstar, Team. "Jay Shah takes over as the president of Asian Cricket Council". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2021-01-30.
  2. "BCCI secretary Jay Shah appointed Asian Cricket Council president". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-02-28.
  3. "Asian Cricket Council Executive Board Meeting".
  4. 4.0 4.1 4.2 "ACC Executive Board Members". Asian Cricket Council. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "ACC Board Members" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  5. "Sultan Rana to join Asian Cricket Council". ESPNCricinfo. Retrieved 12 August 2012.
  6. "NKP Salve, who brought '87 world cup to sub-continent, passes away in Delhi". India Today. 2 April 2012.