ఉస్మాన్ ఆలీ ఖాన్

వికీపీడియా నుండి

ఉస్మాన్ ఆలీ ఖాన్ (1886 - 1967) మహబూబ్ ఆలీ ఖాన్ రెండవ కుమారుడు. క్రీ.శ. 1911లో నిజాం మరణించడంతో ఇతడు ఏడవ అసఫ్ జా బిరుదుతో నైజాం పదవిని అలంకరించాడు. ఈయనే అసఫ్ జాహీ పాలకులలో చివరివాడు.

ఇతడు ఏప్రిల్ 6, 1886లో హైదరాబాదులోని పురాణా హవేలీ లో జన్మించాడు.

టైమ్ పత్రిక 1937 సంవత్సరం నిజాం ను ప్రపంచంలోని అత్యంత ధనవంతునిగా ప్రచురించింది.

ఆగష్టు 15, 1947న భారతదేశం స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాదును స్వతంత్ర రాజ్యం చేయడానికి నిజాం ప్రయత్నించాడు. నిజాం తో అనేక సంప్రదింపులు జరిపిన భారత ప్రభుత్వం చివరకు సెప్టెంబరు 13, 1948న ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్య జరిపి హైదరాబాదు సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసింది. 1956లో జరిగిన భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వలన నిజాం రాజ ప్రముఖ్ పదవి కోల్పోయాడు.

ఇతడు 1957 మరియు 1962 సార్వత్రిక ఎన్నికలలో అనంతపురం మరియు కర్నూలు నియోజకవర్గాల నుండి భారత పార్లమెంటుకు రెండు సార్లు ఎన్నికయ్యారు.

ఇతడు 1967 సంవత్సరం ఫిబ్రవరి 24 తేదీన మరణించాడు.

హైదరాబాదులో చేపట్టిన అభివృద్ధి పనులు [మార్చు]