ఎన్.ఆర్. నారాయణ మూర్తి

వికీపీడియా నుండి
Merge-arrow.svg
ఈ వ్యాసము లేదా వ్యాస విభాగము ఎన్.ఆర్.నారాయణ_మూర్తి వ్యాసములో విలీనము చేయవలెనని ప్రతిపాదించబడినది. (చర్చించండి)

ఎన్.ఆర్.నారాయణ మూర్తి భారతదేశానికి చెందిన పారిశ్రామిక వేత్త మరియు సాఫ్టువేరు ఇంజనీరు మరియు ఇన్ఫోసిస్ వ్యస్థాపకుడు.

బాల్య జీవితం [మార్చు]

నారాయణ మూర్తి ఆగస్టు 20, 1946 వతేదీన కర్ణాటకలోని మైసూరులో ఒక కన్నడ మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ప్రాథమిక విద్య మరియు హైస్కూల్ విద్య ప్రభుత్వ పాఠశాలలోనే చదివాడు. తరువాత 1967లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పట్టా పుచ్చుకున్నాడు. 1969 ఐఐటీ కాన్పూర్ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు.

ఆయన మొదటి ఉద్యోగం ఐఐఎం అహ్మదాబాదు లో చీఫ్ సిస్టమ్స్ ప్రోగ్రామర్. అక్కడ ఆయన ఒక టైమ్ షేరింగ్ సిస్టమ్ మీద ECIL (ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్). కోసం BASIC కంప్యూటర్ భాషకై ఇంటర్‌ప్రెటర్ తయారు చేశాడు. ఆ తరువాత ఈయన పూణె చేరి, అక్కడ పట్ని అనే కంపనీలో చేరారు. అక్కడ ఉన్నప్పుడే సుధా అను అమ్మయితో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో ఈమె టాటా ఇంజినీరింగ్ అండ్ లొకోమోటీవ్ కొ. లిమిటెడ్ ( టాటా మోటార్స్) లో పనిచేసేవారు. ఆ తరువాత వీరి పరిచయం కాస్త పరిణయానికి దారి తీసింది.


కార్పొరేట్ జీవితం [మార్చు]

పూణెలో ఇన్ఫోసిస్ అనే కంపనీ ని 1981 వ సంవత్సరంలో స్థాపించారు. దీనికి అవసరమైన డబ్బును భార్య అయిన సుధా మూర్తి దగ్గర నుంచి 10,000 రూపాయలు తీసుకొని, ఆరుగురు కొత్త ఇంజనీర్ లను కంపనీలో చేర్చుకొని మొదలుపెట్టారు. తన కొత్త లొత్త ఆలోచనలతో, తన విద్యా సంపత్తిని ఉపయోగించి కంపెనినీ వృద్ధిలోకి తీసుకొచ్చారు. 21 సంవత్సరాలు నిర్విరామంగా ఈ కంపెనికి సి.ఇ.ఒ గా పనిచేసారు. 20 ఆగష్ట్ 2006 న ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ గా పదవీ విరమణ చేసారు. ఆ తరువాత కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా అదే కంపెనీకి తన సేవలను అందించారు.

పురస్కారాలు [మార్చు]

  • ఇతను 2000 సంవత్సరంలో పద్మ శ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు