కుసుమ

వికీపీడియా నుండి
కుసుమ
Safflower.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
(unranked) Eudicots
(unranked) Asterids
వర్గము: Asterales
కుటుంబము: ఆస్టరేసి
Tribe: Cynareae
ప్రజాతి: కార్థమస్
జాతి: C. tinctorius
ద్వినామము
Carthamus tinctorius
(Mohler, Roth, Schmidt & Boudreaux, 1967)

కుసుమ (ఆంగ్లం: సాఫ్లవర్) శాస్త్రీయ నామం కార్థమస్ టింక్టోరియస్. ఇది చాలా కొమ్మలు కలిగిన ఏకవార్షిక గుల్మం. దీని ఆకులు వాడిగా ఉన్న ముండ్లు కలిగిఉంటాయి. ఈ మొక్కలు 30 నుండి 150 సెం.మీ. ఎత్తు వరకూ పెరుగుతాయి. కుసుమ పూలు గుండ్రని ఆకారము కలిగి పచ్చటి పసుపు, నారింజ, ఎరుపు లేక తెలుపు రంగులలో ఉంటాయి. ఇవి ఒక్కో కొమ్మకు ఒకటి నుండి ఐదు చొప్పున వస్తాయి. ఒక్కో పువ్వులో 15-20 గింజలు ఉంటాయి. ఈ మొక్క యొక్క తల్లి వేరు దృఢంగా ఉండడం వలన కుసుమ మొక్క పొడి వాతావరణాన్ని బాగా తట్టుకోగలదు. కానీ కాండం పెరిగే దశ నుండి మొక్క పూర్తిగా ఎదిగే వరకూ మంచును ఎంత మాత్రం సహించలేదు.

కుసుమ ప్రధానంగా నూనె గింజ పంట అయినప్పటికీ, అనాదిగా కుసుమ పూరేకుల నుండి తీసిన రంగును ఆహార పదార్ధాలకు రంగునిచ్చే మూలకంగా, వస్త్రాలకు అద్దకపు రంగుగా విరివిగా వాడేవారు. కృత్రిమ రసాయన రంగులు అందుబాటులోకి వచ్చాక అద్దకపు రంగుగా కుసుమ వినియోగం తగ్గిపోయింది. ఇటీవల సహజ రంగులపై మక్కువ పెరుగుతున్న నేపధ్యంలో కుసుమ రంగుకు గిరాకీ పెరిగే అవకాశముంది.

[మార్చు] కుసుమ సాగు

ప్రంపంచంలో 650-700 వేల హెక్టరులలో కుసుమ పంత సూగు అవ్వుచున్నది. భారతదేశంలో 300-360 వేల హెక్టరులలో సాగు చెయ్యుచున్నారు. ప్రపంచంలో ఇండియా, అమెరిక, మెక్సికో, యిథోపియా, కజకిస్థాన్, అస్ట్రెలియా, అర్జెంటినా, యుజెకిస్థాన్, మరియు చైనాలో అధికంగా కుసుమ ఉత్పత్తి అగుచున్నది. రష్యా, పాకిస్థాన్‌, స్పైన్‌, టర్కి, కెనడా మరియు ఇజ్రాయిల్‌లో కూడ కుసుమను సాగు చెయ్యుచున్నారు. భారతదేశంలో ఎక్కువగా మహరాస్ట్ర, మరియు కర్నాటకలో కుసుమ సాగు జరుగుచున్నది. కుసుమ పండిచు మిగతా రాస్ట్రాలు, ఆంధ్ర, ఒడిస్సా, మధ్యప్రదేశ్‌, చత్తిస్‌గడ్‌, మరియు బీహరు.

"http://te.wikipedia.org/w/index.php?title=కుసుమ&oldid=698379" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు