గంగువారి సిగడాం
| ?గంగువారిసిగడాం మండలం శ్రీకాకుళం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | గంగువారిసిగడాం |
| జిల్లా(లు) | శ్రీకాకుళం |
| గ్రామాలు | 42 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
55,087 (2001) • 27860 • 27227 • 47.41 • 59.53 • 35.03 |
గంగువారి సిగడాం లేదా జి.సిగడాం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. ఇది విజయనగరం జిల్లా సరిహద్దులలో ఉన్నది. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోను, బొబ్బిలి పార్లమెంటరీ నియోజకవర్గంలోను ఉన్నది. రాజాం పట్టణానికి ఇది 8 కి.మీ. దూరంలో ఉంది.
పంటల తక్కువ దిగుబడి, అనావృష్టి పరిస్థితులు వల్ల ఈ ప్రాంతం బాగా వెనుకబడిన ప్రాంతాలలో ఒకటి అనవచ్చును. పనికోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళడం ఇక్కడ సాధారణం. గంగువారి సిగడాం మండలంలో సిగడాం, బారువా అనేవి రెండు రైల్వే స్టేషనులు హౌరా-చెన్నై మార్గంలో ఉన్నాయి. . గ్రామంలో ఒక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఉంది. దానిని 20 పడకల అసుపత్రిగా పెంచారు. ఒక పోస్టాఫీసు ఉంది. ఇక్కడ ముఖ్యమైన వృత్తులు వ్యవసాయం, బట్టలకు రంగులు అద్దడం.
విషయ సూచిక |
దేవాలయం [మార్చు]
ఈ గ్రామంలో ప్రసిద్ధమైన శ్రీరంగనాథస్వామి దేవాలయం ఉన్నది. 1992లో దేవాలయ పునరుద్ధరణ జరిగి నిత్యపూజాదికాలు జరుగుతున్నవి. హి మ్య్ నమె ఇస్ పునీత్
మండలంలోని గ్రామాలు [మార్చు]
- సర్వేశ్వరపురం
- ముషినివలస
- దళెంరాజువలస
- నాయుడువలస
- ఉల్లివలస
- పున్నం
- బటువ
- జాడ
- జగన్నాధవలస
- ఎండువపేట
- వెంకయ్యపేట
- గంగువరసిగడం
- గొబ్బూరు
- మెట్టవలస
- పలఖండ్యం
- గేదెలపేట
- మర్రివలస
- నాగులవలస
- పెంత
- నక్కపేట
- తంకలదుగ్గివలస
- జగన్నాధపురం
- సీతారాంపురం
- సంతవురితి
- ఆనందపురం
- ఆబోతులపేట
- వడ్రంగి
- నిద్దం
- మధుపం
- చెట్టుపోడిలం
- చంద్రయ్యపేట
- నడిమివలస
- ఎస్.పి.రామచంద్రపురం
- ఎండువ
- నరసింహాపురం
- గెద్దకంచరం
- సీతుభీమవరం
- పెనసం
- గంగన్నదొరపాలెం
- వెలగడ
- కప్పరం
- దేవరవలస
ప్రముఖులు [మార్చు]
- రెడ్లం శ్రీరాములు (1931 - 1977) ప్రముఖ వ్యాపారవేత్త. ఇతడు శ్రీకాకుళం జిల్లా గంగువారి సిగడాం నుండి వ్యాపారరీత్యా శ్రీకాకుళం పట్టణానికి వచ్చి స్థిరపడ్డాడు. ఇతని తల్లిదండ్రులు రెడ్లం సత్యనారాయణ మరియు వెంకాయమ్మ. శ్రీరాములు కృష్ణార్జున డైయింగ్ వర్క్స్ అనే సంస్థను స్థాపించి నూలుకు రంగులు (Fabric dyeing) వేసి విక్రయించేవాడు. దీని ద్వారా ఎందరికో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాడు. ఎందరికో చదువు చెప్పించి, ఉద్యోగాలిప్పించి ఆర్ధికంగా సహాయం చేశాడు.
శ్రీకాకుళం జిల్లా మండలాలు
వీరఘట్టం | వంగర | రేగిడి ఆమదాలవలస | రాజాం | గంగువారిసిగడాం | లావేరు | రణస్థలం | ఎచ్చెర్ల | పొందూరు | సంతకవిటి | బూర్జ | పాలకొండ | సీతంపేట | భామిని | కొత్తూరు | హీరమండలం | సరుబుజ్జిలి | ఆమదాలవలస | శ్రీకాకుళం మండలం | గార | పోలాకి | నరసన్నపేట | జలుమూరు | సారవకోట | పాతపట్నం | మెళియాపుట్టి | టెక్కలి | కోటబొమ్మాళి | సంతబొమ్మాళి | నందిగం | వజ్రపుకొత్తూరు | పలాస | మందస | సోంపేట | కంచిలి | కవిటి | ఇచ్ఛాపురం | లక్ష్మీనరసుపేట