Coordinates: 15°57′21″N 80°45′09″E / 15.955733°N 80.752494°E / 15.955733; 80.752494

గరువుపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గరువుపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
గరువుపాలెం is located in Andhra Pradesh
గరువుపాలెం
గరువుపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°57′21″N 80°45′09″E / 15.955733°N 80.752494°E / 15.955733; 80.752494
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం నిజాంపట్నం
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి మేరీ వరదానం
పిన్ కోడ్ 522262
ఎస్.టి.డి కోడ్

గరువుపాలెం , బాపట్ల జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మేరీ వరదానం, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా బొప్పా లక్ష్మయ్య ఎన్నికైనారు

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలోని విశేషాలు[మార్చు]

గరువుపాలెంలలో చదువుకొన్నవారు బాగా ఎక్కువ. గరువపాలెంలో దాదాపు ప్రతికుటుంబంనుండి ఒక్కొక్క ప్రభుత్వోద్యోగి ఉన్నారు. ప్రధానంగా పోలీసు కానిస్టేబుల్, ఉపాధ్యాయ వృత్తులలో చాలామంది ఉన్నారు. 1602 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో, ఇంటికి ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వందమందివరకూ వివిధ ప్రాంతాలలో ఉపాధ్యాయులుగా పనిచేయుచున్నవారుండగా, మరో 50 మంది విశ్రాంత ఉపాధ్యాయులున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు ఉపాధ్యాయినులను ఎంపికచేసుకొని వివాహం చేసుకున్న వారున్నారు. గ్రామానికి చెందిన శ్రీ కొలసాని వెంకటసుబ్బారావు గుంటూరు మండల విద్యాశాఖాధికారిగా ఉన్నారు. శ్రీ కొలసాని హరిబాబు వేమూరు ఎం.ఈ.ఓ. శ్రీ మత్తి మాణిక్యాలరావు చందోలు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాలుగా ఉన్నారు. శ్రీ బండారు రాజేంద్రప్రసాదు హైదరాబాదులో ఒక ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాలుగా ఉన్నారు. పదిహేనుమంది స్కూలు అసిస్టెంట్లు, మరో 60 మంది సెకండరీ గ్రేడు ఉపాధ్యాయులు ఉన్నారు.

ఈ గ్రామానికి చెందిన శ్రీ గాదె నాగేంద్రరావు, 2017, మార్చి-25న, నాగపూర్ నగరంలో నిర్వహించిన, ఐ.వో.ఎఫ్.ఎస్ (ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీసెస్) కార్యక్రమంలో ఉత్తమ శిక్షకులుగా పురస్కారం అందుకున్నారు. వీరి తండ్రి శ్రీ గాదె శేషగిరిరావు, కూచినపూడి గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేసారు.