జమ్మి చెట్టు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జమ్మి చెట్టు
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
విభాగం: మాగ్నోలియోప్సిడా
తరగతి: మాగ్నోలియోఫైటా
క్రమం: Fabales
కుటుంబం: ఫాబేసి
జాతి: ప్రోసోపిస్
ప్రజాతి: P. cineraria
ద్వినామీకరణం
Prosopis cineraria
(లిన్నేయస్.) Druce

శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు (లాటిన్ Prosopis) ఫాబేసి కుటుంబానికి చెందినది. ఇది పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచిన స్థలం.


లక్షణాలు[మార్చు]

  • వేలాడే శాఖలతో ముళ్ళున్న మధ్యరకంగా పెరిగే వృక్షం.
  • సన్నగా దీర్ఘవృత్తాకారంగా గురు అగ్రంతో పత్రకాలున్న ద్విపిచ్ఛాకార సంయుక్త పత్రాలు.
  • సన్నటి పొడుగాటి కంకులలో అమర్చబడిన పసుపురంగు పుష్పాలు.
  • లోతైన నొక్కులు గల ద్విదారక ఫలం.

జమ్మిచెట్టు పూజ[మార్చు]

పాండవులు అరణ్యవాసం వెళ్ళేప్పుడు వారి యొక్క ధనస్సు విల్లంబులు, గద మొదలగు ఆయుధములను వెళ్ళే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్ళి తిరిగి వచ్చె వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు, అలా అరణ్యవాసం ముగియగానే విజయ దశమి రోజున, అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చెసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు. తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాదించి రాజ్యాధికారం సాధిస్తారు.

ఈ విధముగా తమకు విజయాలు వరించాలని విజయ దశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి, ఆ చెట్టు ఆకులను తీసుకు వచ్చి, పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు. వాహనదారులు , మరియు ఇతర అన్ని రకాల వృత్తుల వారు వారి వారి పనిముట్లను సంబందిత వస్తువులను శుభ్రపరచి, వాటికి పూజలు చేయడం ఆనవాయితి.


శమీ శమయితే పాపం శమీ శతృ వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనీ


అనే శ్లోకం చదువుతారు.

  • వినాయక చవితి రోజు జమ్మిచెట్టు ఆకులను వినాయక వ్రత కల్ప విధానము లోని గణేశ పత్రపూజలో ఉపయోగిస్తారు.
జమ్మి చెట్టు (Prosopis cineraria)

బయటి లింకులు[మార్చు]