జాతీయ రహదారి 43
వికీపీడియా నుండి
జాతీయ రహదారి 43 (ఆంగ్లం: National Highway 43) భారతదేశంలోని ప్రధానమైన రహదారి.[1]
ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని నాతవలస వద్ద ప్రారంభమై తూర్పు కనుమలు గుండా ప్రయాణించి చత్తీస్ గఢ్ రాజధాని పట్టణమైన రాయపూర్ ను కలుపుతుంది. ఈ రహదారి పొడవు సుమారు 551 కిలోమీటర్లు (చత్తీస్ గఢ్ - 316, ఒరిస్సా - 152 మరియు ఆంధ్ర ప్రదేశ్ - 83)
దారి [మార్చు]
- ఈ రహదారి ఆంధ్ర ప్రదేశ్ లో విజయనగరం జిల్లాలోని విజయనగరం, గజపతినగరం, రామభద్రపురం మరియు సాలూరు పట్టణాల ద్వారా ప్రయాణిస్తుంది.
- ఈ రహదారి ఛత్తీస్ గఢ్ లో జగదల్ పూర్, బస్తర్, కొండాగాం, పరాస్గాం, కేస్కల్, కంకర్, చరమ, డోక్లా, ధంతరీ మరియు మరోడ్ పట్టణాల ద్వారా ప్రయాణిస్తుంది.