Coordinates: 20°45′32″N 73°41′19″E / 20.7588°N 73.6886°E / 20.7588; 73.6886

డాంగ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సపుతర సమీపంలో నది దృశ్యం
దక్షిణ గుజరాత్ జిల్లాలు

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో డాంగ్స్ జిల్లా (హిందీ:) ఒకటి. ఆహ్వా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 1,764. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 226,769.[1] 2011 గణాంకాలను అనుసరించి గుజరాత్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా డాంగ్ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో ... గుర్తించబడింది. జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది..[2] ప్లానింగ్ కమిషన్ నివేదికలను అనుసరించి డాగ్స్ జిల్లా అత్యంత వెనెబడిన జిల్లాగా గుర్తించబడుతుంది.[3] జిల్లా సపుతర, వాఘై గ్రామాలు ప్రధానమైనవిగా భావిస్తున్నారు. .

చరిత్ర[మార్చు]

స్వాతంత్ర్యానికి ముందు డాంగ్‌కు సంబంధించిన 5 గిరిజన రాజులకు బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య పలు యుద్ధాలు జరిగాయి. డాంగ్ చరిత్రను అనుసరించి లష్కారియా అంబా వద్ద జరిగిన యుద్ధం పెద్దదిదిగా భావించబడింది. ఈ యుద్ధంలో గత డాంగ్ గిరిజనరాజులు కలిసి ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ నుండి రక్షించారు. బ్రిటిష్‌వారు దెబ్బతిని గిరిజన రాజులతో రాజీకి కుదుర్చుకున్నారు. 1842 కురుచుకున్న ఒప్పందం తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ఈ ప్రాంతంలోని అరణ్యంలో సహజసంపదను ఉచితంగా వాడుకోవడం ప్రారంభించారు. అంతకు ముందు బ్రిటిష్ ప్రభుత్వం ఇలా వాడుకోవడానికి గిరిజన ప్రభువులకు 3,000 వెండినాణ్యాలు కప్పం ఇస్తూ వచ్చారు. ఈ రాజులు ప్రస్తుతం భారతప్రభుత్వం నుండి రాజభరణం అందుకుంటున్నారు. 1970లో రాజభరణాలు రద్దు చేయబడినప్పటికీ వీరికి మాత్రం భరణం ఇపాటికీ అందించబడుతుంది. రాజభరణం రాజకుటుంబాల ప్రధాన ఆదాయపు వనరుగా ఉంది. బ్రిటిష్ ప్రభుత్వ ఒప్పందాన్ని భారతప్రభుత్వం రద్దు చేసింది. ప్రతిసంవత్సరం గిరిజన రాజులు బ్రిటిష్ ప్రభుత్వం నుండి కప్పం అందికోవడానికి అలంకృత రథాలలో గిరిజన నృత్యబృందాలతో అహ్వా వద్ద సమావేశమౌతారు. పురాతన భారతీయ శిశాసనాలలో డాంగ్‌ను దండ్ అరణ్యక (వెదురు అరణ్యం) అని పిలిచేవారు.

  • దహేర్, లింగ, గడ్వి, వసుమ, పింపి.
సంస్థానం జనసంఖ్య (000);[4] అదాయం (1881, రూ) పాలకుని బిరుదు. వివరణ
డంగ్ పింప్రి 3,6 3106 388 చ.కి.మీ
డాంగ్ వధ్వన్ 0,253 147 ca. 12 చ.కి.మీ వధ్వన్ రాజాస్థానం వధ్వన్ కాదు
డాంగ్ కేతక్ కదుపద 0,218 155
డాంగ్ అమ్ల 5,3 2885; 1891: 5300 రాజా Raja. 307 చ.కి.మీ
డాంగ్ చించి 1,67; 1891: ca. 1,4 601 ca. 70చ.కి.మీ
డాంగ్ పింప్లదేవి 0,134 120 ca. 10 చ.కి.మీ
డాంగ్ పాలాస్బిషర్ (పలాస్విహిర్) 0,223 230 ca. 5 చ.కి.మీ
డాంగ్ ఔచర్ ca. 500 201 < 21చ.కి.మీ
డాంగ్ డెర్భౌతి 4,891; 1891: ca. 5 3649 రాజ. 196 చ.కి.మీ
డాంగ్ గధ్వి (గధి) 6,309 5125 రాజా
డాంగ్ షివ్బర 0,346 422 ca. 12 చ.కి.మీ
డాంగ్ కిర్లి (కిరలి) 0,167 512 31 చ.కి.మీ
డాంగ్ వసుమ 6,177 2275
డాంగ్ ధుడే (బిల్బరి) 1,45; 1891: 1418 85 < 5 చ.కి.మీ
డాంగ్ సుర్గంగ 14 11469
మచ్చలి 1.1; 4745 35

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో డాంగ్స్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[5] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[5]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 226,769, [2]
ఇది దాదాపు. వనుయతు దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 587వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 129 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21.44%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 1007:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 76.8%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

సరిహద్దులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-25. Retrieved 2014-11-13.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. "Governance in Gujarat Under Modi - A Critique"
  4. Hunter, W. W.; Imperial Gazetteer of India; London ²1885, Vol. IV, S 115-6
  5. 5.0 5.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Vanuatu 224,564 July 2011 est.

వెలుపలి లింకులు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

20°45′32″N 73°41′19″E / 20.7588°N 73.6886°E / 20.7588; 73.6886