తూప్రాన్
| ?తూప్రాన్ మండలం మెదక్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | తూప్రాన్ |
| జిల్లా(లు) | మెదక్ |
| గ్రామాలు | 34 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
53,332 (2001) • 27100 • 26232 • 54.51 • 68.35 • 40.16 |
తూప్రాన్ (ఆంగ్లం: Toopran), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలము. హైదరాబాదుకు సుమారు 55 కి.మీ. దూరంలో 7 వ నెంబరు జాతీయ రహదారిలో ఇది ఉంది. ఇక్కడికి దగ్గరలోని నాచారం నరసింహస్వామి దేవస్థానం చాలా ప్రసిద్ధి. ఈ గ్రామంలో ప్రాచీన రామాలయము, మహంకాళి దేవాలయము, బాలాంజనేయ స్వామి దేవాలయము కలవు. ఈ గ్రామానికి ఈ పేరు రావడానికి గల కారణము ఈ గ్రామం తూర్పుకు రాణి వంటిది కావున తూర్పురాణి అని పిలిచేవారు. కాలక్రమంలో తూర్పురాణి కాస్త తూపురానీగా తరువాత తూప్రాన్గా మారింది.
విషయ సూచిక |
చరిత్ర, సంస్కృతి [మార్చు]
- ఈ గ్రామం కాకతీయుల కాలము నాటిదని ప్రశస్తి. ఈ గ్రామం తదనంతర కాలంలో దొంతి సంస్థానములో భాగంగా ఉండేది. దొంతి సంస్థానముకు మరియు వడ్డేపల్లి సంస్థానముకు సరిహద్దు గ్రామముగా విలసిల్లింది. ఆ కాలంలోనే మంచి వ్యాపార కేంద్రంగా భాసిల్లింది .
- హిందు ముస్లిం సమైక్యత, హోలి నాడు జరిగే సంబరాల్లో పిడి తాడు లాగే సంప్రదాయం ఉంది. మహంకాలి జాతర తెలంగాణలో మొత్తము ముగిసిన తరువాత శ్రావణ మాసంలో ఘనంగా జరుగుతుంది, కుల, మత భేద రహితంగా అన్ని మతాల వారు ఇందులో పాల్గొంటారు. గ్రామములోని స్వయంభువు రామాలయములో ఏటా రామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి.
సదుపాయాలు [మార్చు]
- ఒక ప్రాధమిక పాఠశాల, ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల బాలికలకు ప్రత్యేకంగా కలదు ఒక ప్రభుత్వ గురుకుల పాఠశాల కలదు.
- సుమారు 15 ప్రయివేటు పాఠశాలలు కలవు. ఒక ప్రభుత్వ జునియర్ కళాశాల, 3 ప్రయివేటు జునియర్ కళాశాలలు, 2 ప్రయివేటు డిగ్రి కళాశాలలు, ఒక ప్రయివేటు బిఎడ్, ఒక ప్రయివేటు బిఫార్మసి, 3 ప్రయివేటు పిజి కళాశాలలు కలవు
- ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రము 8 ప్రయివేటు వైద్యశాలలు కలవు. ఒక ప్రభుత్వ గ్రంధాలయము, పోస్టాఫీసు, బస్సు సౌకర్యం కలదు. హైదరాబాదు నుండి, హైదరాబాదుకు ప్రతి 15 నిముషాలకు ఒకసారి బస్సులు కలవు. సమీపాన 2 రైల్వేస్టేషన్లు కలవు.
- వివిధ రంగాలకు సంబందించిన బహు వ్యాపార సంస్థలు కలవు. 1 సినిమా హాలు కలదు.
సమస్యలు [మార్చు]
- ట్రాఫిక్ స్థిరీకరణ లెకపొవడం
- పారిశుధ్య నిర్వహణ లోపం
ఆర్థికం [మార్చు]
- గ్రామానికి ప్రధాన నీటి వనరు పెద్ద చెరువు, ఇదే కాక మేడక్క చెరువు, కొత్త చెరువు, వీటితో పాటు గ్రామానికి కిలోమీటరు దూరంలోని పసుపులేరు వాగుకు వెళ్ళె లింక్ కాల్వ కూడా వ్యవసాయానికి, త్రాగునీటికి ప్రధాన జల వనరులు, వరి, చెరుకు, మొక్కజొన్న ప్రధాన పంటలు, కూరగాయల సాగు కుడా జరుగుతుంది. సాధారణ గ్రామీణ వృత్తులు అన్ని యధావిధిగా కొనసాగుతున్నాయి. అదే విదంగా ప్రొ ఆగ్రొ, టాటా కాఫీ కంపెనిలు కలవు మరియు కాళ్ళకళ్ పెద్ద పారిశ్రామిక వాడ, పాడి పరిశ్రమ చాలా పెద్దది, సుగుణ కోళ్ళ దాణా కేంద్రము ఆసియాలోనే పెద్దది .
ఆలయాలు [మార్చు]
- ప్రాచీన రామాలయం ఊరికి చివర కలదు, ఉజ్జయిని మహంకాళీ దేవాలయం కూడా ప్రాచీనమైనదే. అయితే ఉజ్జయని మహంకాళీ దేవాలయంకు ఒక ప్రాముఖ్యత ఉంది. పట్టణానికి 55 కి.మీ. దూరంలో ఉన్న హైదరబాద్ లస్కర్ ఉజ్జయిని మహంకాళీ దేవాలయంలో అమ్మవారి ప్రతిష్ఠ గురించి అప్పటి పూజారులు మహారాష్ట్ర ఉజ్జయని పట్టణం నుంచి గంఢ ద్వీపాన్ని తీసుకువస్తుండగా మార్గమధ్యంలో తూప్రాన్ పట్టణానికి చేరుకొగానే చీకటి పడడంతో వారు ఆ ద్వీపాన్ని, అక్కడ ద్వీపాన్ని వెలిగించి మరుసటి రోజు హైదరబాద్‌కు చేరుకున్నారు. గ్రామంలోని శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయం 500 సంవత్సరాల నాటిది. ప్రాచీన బాలాంజనేయ స్వామి దేవాలయమును 1994లో పునర్నిర్మాణము చేయడము జరిగింది. కప్పర నరసింహ స్వామి దేవాలయం కలదు. ఇవేకాక 2 హనుమాన్ దేవాలయాలు, ఒక శివాలయము, ఒక అయ్యప్ప దేవాలయం, ఒక సాయి బాబ దేవాలయం, ఒక గీతా మందిరం కలదు.
చర్చిలు, మసీదులు [మార్చు]
- గ్రామంలో 3 చర్చిలు, 3 మసీదులు కలవు .
ప్రముఖులు [మార్చు]
శ్రీ రాముని గారి సత్యనారాయణ గౌడ్ గారు వీరు స్వాతంత్ర్య సమరయోధులు మరియు గ్రామ మొదటి సర్పంచ్. వీరు 30 ఏళ్ళ పాటు ఏకచత్రాదిపత్యాముగా గ్రామాన్ని పాలించారు చీదు గోపాల్ రెడ్డి, రాముని గారి రామస్వామి మొదలగు వారు భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గోన్నారు ప్రజా నాట్య మండలి వ్యవస్థాపకుడు, ప్రజా గాయకుడు గుమ్మడి విఠల్(గద్దర్) మొదలగు వారు గ్రామానికి చెందిన పుర ప్రముఖులు
ఇతర విశేషాలు [మార్చు]
1998-2004 కాలంలో చెక్ డ్యాంల నిర్మాణము జరిగింది. గ్రామము అంతటా సిసి రోడ్లు వేయడము జరిగింది .బైర్రాజు ఫౌండేషన్ వారి సహకారంతో మినరల్ వాటర్ ఫ్లాంట్‌ను గ్రామ పంచాయతి వారు నిర్మించడం జరిగింది. రీడ్స్ అనే స్వచ్చంద సంస్థ బాల కార్మికుల విద్యాభీవృద్దికై ఒక పాఠశాలను నిర్వహిస్తోంది .
- తూప్రాన్‌కు సరిహద్దులుగా తూర్పున నాచారం లక్ష్మినరసింహ స్వామి వారు
- పశ్చిమాన దొంతి వేణుగోపాల స్వామి వారు
- దక్షిణాన బొజ్జమ్మ గుట్ట రాజరాజెశ్వర స్వామి వారు
- ఉత్తరాన రామప్ప గుట్ట రామలింగేశ్వర స్వామి వార్లు వెలసి ఉన్నారు.
- కాళ్ళకల్ వనదుర్గా మాత ఆలయము కలదు ,
- వెంకటాపురము(పిటి)లో లలితా పరమేశ్వరి దేవాలయం నిర్మాణంలో కలదు
- గజ్వెల్ నియోజకవర్గములో తూప్రాన్ అతి పెద్ద మండలం
- తూప్రాన్ మండలం క్రింద 132 పల్లెలు ఉన్నాయి
మండలంలోని గ్రామాలు [మార్చు]
- వత్తూరు
- జాండపల్లి
- నాగులపల్లి
- ఇస్లాంపూర్
- వెంకటరత్నాపురం
- దాతార్‌పల్లి
- గుండారెడ్డిపల్లి
- మల్కాపూర్
- కోనాయిపల్లి (పత్తిబేగంపేట)
- వెంకటాయిపల్లి
- కిష్టాపూర్
- యావాపూర్
- హుస్సేన్‌పూర్
- తూప్రాన్
- పదలపల్లి
- బ్రాహ్మణపల్లి (తూప్రాన్ మండలం)
- వెంకటాపూర్ @ పత్తితూప్రాన్
- రావెల్లి
- ఘన్పూర్
- ఇమ్మాపూర్
- అల్లాపూర్
- లింగారెడ్డిపేట
- పాలత్
- రామాయిపల్లి
- వెంకటాపూర్ అగ్రహారం
- ధర్మరాజుపల్లి
- చాట్ల గౌరారం
- కోనాయిపల్లి (పత్తి తూప్రాన్)
- మనోహరాబాదు
- జీడిపల్లి
- కూచారం
- కల్లకల్
- ముప్పిరెడ్డిపల్లి
- రంగాయిపల్లి
- కొండాపూర్
మెదక్ జిల్లా మండలాలు
మనూరు | కంగిటి | కల్హేరు | నారాయణఖేడ్ | రేగోడు | శంకరంపేట (ఎ) | ఆళ్ళదుర్గ | టేక్మల్ | పాపన్నపేట | కుల్చారం | మెదక్ | శంకరంపేట (ఆర్) | రామాయంపేట | దుబ్బాక | మీర్‌దొడ్డి | సిద్దిపేట | చిన్న కోడూరు | నంగనూరు | కొండపాక | జగ్దేవ్ పూర్ | గజ్వేల్ | దౌలతాబాదు | చేగుంట | యెల్దుర్తి | కౌడిపల్లి | ఆందోళ్ | రైకోడ్ | న్యాల్కల్ | ఝారసంగం | జహీరాబాద్ | కోహిర్ | మునుపల్లి | పుల్కల్లు | సదాశివపేట | కొండాపూర్ | సంగారెడ్డి | పటాన్ చెరువు | రామచంద్రాపురం | జిన్నారం | హథ్నూర | నర్సాపూర్ | శివంపేట | తూప్రాన్ | వర్గల్ | ములుగు
|
|
|
|---|---|
| వత్తూరు · జాండపల్లి · నాగులపల్లి · ఇస్లాంపూర్ · దాతార్‌పల్లి · గుండారెడ్డిపల్లి · మల్కాపూర్ · కోనాయిపల్లి (పత్తిబేగంపేట) · వెంకటాయిపల్లి · కిష్టాపూర్ · యావాపూర్ · హుస్సేన్‌పూర్ · తూప్రాన్ · పదలపల్లి · బ్రాహ్మణపల్లి (తూప్రాన్ మండలం) · వెంకటాపూర్ @ పత్తితూప్రాన్ · రావెల్లి · ఘన్పూర్ · ఇమ్మాపూర్ · అల్లాపూర్ · లింగారెడ్డిపేట · పాలత్ · రామాయిపల్లి · వెంకటాపూర్ అగ్రహారం · ధర్మరాజుపల్లి · చాట్ల గౌరారం · కోనాయిపల్లి (పత్తి తూప్రాన్) · మనోహరాబాదు · జీడిపల్లి · కూచారం · కల్లకల్ · ముప్పిరెడ్డిపల్లి · రంగాయిపల్లి · కొండాపూర్ |