నొనకోసేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నొనకోసేన్
Skeletal formula of nonacosane
పేర్లు
Preferred IUPAC name
Nonacosane[1]
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [630-03-5]
పబ్ కెమ్ 12409
యూరోపియన్ కమిషన్ సంఖ్య 211-126-2
కెగ్ C08384
వైద్య విషయ శీర్షిక nonacosane
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:7613
SMILES CCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCC
బైల్ స్టెయిన్ సూచిక 1724922
ధర్మములు
C29H60
మోలార్ ద్రవ్యరాశి 408.80 g·mol−1
స్వరూపం White, opaque, waxy crystals
వాసన Odorless
సాంద్రత 0.8083 g cm−3
ద్రవీభవన స్థానం 62 to 66 °C; 143 to 151 °F; 335 to 339 K
బాష్పీభవన స్థానం 440.9 °C; 825.5 °F; 714.0 K
log P 15.482
సంబంధిత సమ్మేళనాలు
Related {{{label}}} {{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

నొనకోసేన్ చాలా మొక్కల మైనపు పదార్థాలలో లభించె ప్రధాన పారాఫిన్ ఆల్కేన్.[2]నొనకోసేన్ అనేది 29 కార్బన్ పరమాణువులతో కూడిన సరళ శృంఖల ఆల్కేన్. ఇది మొక్కల మెటాబోలైట్ మరియు అస్థిర నూనె భాగం వలె పాత్రనుపనిచెస్తుంది.ఇది 1,590,507,121 బిన్న సౌష్టవ ఐసోమర్‌లను కలిగి ఉంది.[3]అనేక ఆవశ్యక నూనెలలో నోనాకోసేన్ గుర్తించబడింది. దీన్ని సింథటిక్‌గా కూడా తయారు చేసుకోవచ్చు.రసాయన సూత్రంC29H60సాధారణ నొనకోసేన్ నిర్మాణ సూత్రం CH3(CH2)27CH3ఇది ఓర్గియా ల్యూకోస్టిగ్మా యొక్క ఫెరోమోన్‌లో ఒక భాగం అని నివేదించబడింది మరియు ఆడ అనాఫిలిస్ స్టెఫెన్సీ (దోమ)తో సహా అనేక కీటకాల రసాయన సమాచార ప్రసార పాత్ర పోషిస్తుందని ఆధారాలు సూచిస్తున్నాయి.[3]

లభ్యత[మార్చు]

నోనాకోసేన్ అనేది వనిల్లా మడగాస్కారియెన్సిస్, ఎచినాసియా అంగుస్టిఫోలియా మరియు ఇతర జీవులలో లభించే సహజమైన ఉత్పత్తి.[4] అపోసైనమ్ వెనిటమ్ ఆకులలో,అవకాడో పండు,బేరిపండు నూనె,బిల్బెర్రీ ఆకు,బ్రాసికా ఒలేరాసియా, బ్రోకలీ ఆస్పరాగస్ బ్రోకలీ ఆకు,బ్రస్సెల్ మొలక ఆకు,క్యాబేజీ ఆకు,కోకో బీన్,ఏలకులు విత్తనం,క్యారెట్ సీడ్ ,ద్రాక్ష పండు ఇలా చాలా వాటిల్లో నొనకోసేన్ లభిస్తుంది.[5]ఇది సిజిజియం జీలకర్ర చెట్టు యొక్క ఆకు నూనెలో ముఖ్యమైన భాగం గా లభిస్తుంది.[6]

భౌతిక గుణాలు[మార్చు]

ఇది సాధారణ ఉష్ణోగ్రతలొ ఘన రూపంలో వుండును.మండే స్వభావం కలది.నీటిలో కరగదు.[7]ఇథనాల్, ఈథర్, అసిటోన్‌లో చాలా కరుగుతుంది; బెంజీన్‌లో కరుగుతుంది; క్లోరోఫామ్‌లో కొద్దిగా కరుగుతుంది.[8]

లక్షణం/గుణం మితి/విలువ
అణు రసాయన సూత్రం C29H60[9]
అణు భారం 408.797 గ్రా/మోల్[9]
ద్రవీభవన ఉష్ణోగ్రత 62.00 నుండి 64.00°C [5]
మరుగు స్థానం 440.00నుండి 441.00 °C[5]
సాంద్రత 0.8±0.1 గ్రా/ఘన సెం.మీ[9]
వక్రీభవన గుణకం 1.4529,20 °C/Dవద్ద[8]
బాష్ఫిభవన గుప్తోష్ణం 147.10 కి.జౌల్స్/మోల్[10]

ఉపయోగాలు[మార్చు]

  • ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ అల్సర్జెనిక్ లక్షణాలను కలిగి ఉంది.[6]
  • ఘన n-ఆల్కనేలు (పారాఫిన్ మైనపులు) వివిధ రకాల అనువర్తనాల్లో ఉపయోగించబడతాయి, ఉదా., ఆక్సీకరణ అలాగె క్లోరినేషన్ ప్రతిచర్యలులలో ఉపయోగిస్తారు.[11][8]

దుష్పలితాలు[మార్చు]

అగ్ని ప్రమాదం[మార్చు]

  • ఇది అల్కేన్ సమూహానికి చెందినది కావున అగ్ని ప్రమాదం జరిగే అవకాశం వున్నది.అగ్ని ప్రమాదం జరిగినపుడు అర్పుటకు వాటర్ స్ప్రే, ఆల్కహాల్-రెసిస్టెంట్ ఫోమ్, డ్రై కెమికల్ లేదా కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించవలెను.[12][8]

ఆరోగ్య సమస్యలు[మార్చు]

  • కళ్ళకు మరియు చర్మం చికాకు కలిగించవచ్చు.[13]

ఇవి కూడా చదవండి[మార్చు]

ఆల్కేన్

మూలాలు[మార్చు]

  1. "nonacosane - Compound Summary". PubChem Compound. USA: National Center for Biotechnology Information. 16 September 2004. Identification and Related Records. Retrieved 2 January 2012.
  2. "Nonacosane". sigmaaldrich.co. Retrieved 2024-05-01.
  3. 3.0 3.1 "nonacosane". ebi.ac.uk. Retrieved 2024-05-01.
  4. "Nonacosane". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-05-01.
  5. 5.0 5.1 5.2 "nonacosane". thegoodscentscompany.com. Retrieved 2024-05-01.
  6. 6.0 6.1 Neutral components in the leaves and seeds of Syzygium cumini Kumar.A, et al.African Journal of Pharmacy and Pharmacology, 3(11), 560-561 (2009)
  7. Haynes, W.M. (ed.). CRC Handbook of Chemistry and Physics. 95th Edition. CRC Press LLC, Boca Raton: FL 2014-2015, p. 3-420
  8. 8.0 8.1 8.2 8.3 "n-Nonacosane". pubchem.ncbi.nlm.nih.go. Retrieved 2024-05-01.
  9. 9.0 9.1 9.2 "Nonacosane". chemspider.com. Retrieved 2024-05-01.
  10. "Chemical Properties of Nonacosane". chemeo.com. Retrieved 2024-05-01.
  11. Schmidt R et al; Hydrocarbons. Ullmann's Encyclopedia of Industrial Chemistry 7th ed. (1999-2016). NY, NY: John Wiley & Sons. Online Posting Date: November 24, 2014
  12. Sigma-Aldrich; Safety Data Sheet for Nonacosane. Product Number: 284246, Version 3.4 (Revision Date 06/25/2014). Available from, as of October 28, 2016: https://www.sigmaaldrich.com/safety-center.html
  13. Bingham, E.; Cohrssen, B.; Powell, C.H.; Patty's Toxicology Volumes 1-9 5th ed. John Wiley & Sons. New York, N.Y. (2001)., p. V4 72