పిన్‌కోడు
వికీపీడియా నుండి
ఫైలు:PIN code of India.svg
Example of a PIN: మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని పిన్‌కోడు.
పిన్ కోడు (ఆంగ్లం : Postal Index Number లేదా PIN లేదా Pincode) తపాలా సూచిక సంఖ్య. ఈ విధానము, భారత తపాలా సంస్థ వారిచే 1972 ఆగస్టు 15 న ప్రవేశపెట్టబడినది. దీని సంఖ్య ఆరు అంకెలతో కూడి ఉంటుంది.
విషయ సూచిక |
[మార్చు] నిర్మాణం
ఫైలు:India Pincode Map.gif
భారత్ లో తపాలా కోడ్ ల విభజన.
భారత్ లో ప్రధానంగా 8 పిన్‌కోడు ప్రాంతాలు గలవు. పిన్‌కోడు లోని మొదటి అంకె తపాలా కార్యాలయం గల 'ప్రాంతాన్ని'; రెండవ అంకె 'ఉప-ప్రాంతాన్ని'; మూడవ అంకె 'జిల్లాను'; ఆఖరి మూడు అంకెలు 'వ్యక్తిగత తపాలా కార్యాలయాల సంఖ్యను' సూచిస్తాయి. భారత్ లో 9 పిన్‌కోడు ప్రాంతాలు గలవు, ఇవి భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తాయి.
- 1 - ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీరు, చండీఘర్
- 2 - ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్
- 3 - రాజస్థాన్, గుజరాత్, డామన్ మరియు డయ్యు, దాద్రా నాగర్ హవేలీ
- 4 - ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా
- 5 - ఆంధ్రప్రదేశ్, కర్నాటక, యానాం (పుదుచ్చేరి జిల్లా)
- 6 - కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి (యానాం తప్పించి), లక్షద్వీపాలు
- 7 - పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అండమాన్ మరియు నికోబార్ దీవులు
- 8 - బీహార్, జార్ఖండ్
- 9 - ఆర్మీ పోస్ట్ ఆఫీసు (APO) మరియు ఫీల్డ్ పోస్ట్ ఆఫీసు (FPO)
| పిన్‌కోడులో గల మొదటి 2 అంకెలు | తపాలా సర్కిల్ |
|---|---|
| 11 | ఢిల్లీ |
| 12 and 13 | హర్యానా |
| 14 to 16 | పంజాబ్ |
| 17 | హిమాచల్ ప్రదేశ్ |
| 18 to 19 | జమ్మూ & కాశ్మీరు |
| 20 to 28 | ఉత్తరప్రదేశ్ |
| 30 to 34 | రాజస్థాన్ |
| 36 to 39 | గుజరాత్ |
| 40 to 44 | మహారాష్ట్ర |
| 45 to 49 | మధ్యప్రదేశ్ |
| 50 to 53 | ఆంధ్రప్రదేశ్ |
| 56 to 59 | కర్నాటక |
| 60 to 64 | తమిళనాడు |
| 67 to 69 | కేరళ |
| 70 to 74 | పశ్చిమ బెంగాల్ |
| 75 to 77 | ఒరిస్సా |
| 78 | అస్సాం |
| 79 | ఈశాన్య భారత్ |
| 80 to 85 | బీహారు మరియు జార్ఖండు |