పి.సి.శ్రీరామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పి.సి.శ్రీరామ్
జననం (1956-01-26) 1956 జనవరి 26 (వయసు 68)
చెన్నై, భారతదేశం
ఇతర పేర్లుపి.సి.
విద్యాసంస్థమద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
వృత్తిసినిమాటోగ్రాఫర్, చిత్ర దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1982 - ఇప్పటి వరకు
పిల్లలు2
బంధువులుపి. ఆర్. సుందరం అయ్యర్ (తాత)[1]
ప్రీతా జయరామన్ (మేనకోడలు)
పురస్కారాలునేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ సినిమాటోగ్రఫీ (1987)

పి.సి.శ్రీరామ్‌ (జననం 1956 జనవరి 26) భారతీయ సినిమాటోగ్రాఫర్, చిత్ర దర్శకుడు. అతను డిజిటల్ సినిమా టెక్నాలజీ కంపెనీ అయిన క్యూబ్ సినిమాస్‌కి ప్రెసిడెంట్ కూడా. అతను మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ పూర్వ విద్యార్థి. సినిమాటోగ్రాఫర్‌గా పని చేయడంతో పాటు పి.సి.శ్రీరామ్ తన దర్శకత్వం వహించిన కురుతిపునల్‌కు దేశంలోనే కాక అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నాడు. భారతదేశం 1996లో ఈ చిత్రం ఆస్కార్‌కి అధికారిక ఎంట్రీగా సమర్పించింది. భరతన్, మణిరత్నం, ఆర్ బాల్కీ, విక్రమ్ కుమార్‌లతో తను మంచి అనుబంధం కలిగి ఉన్నాడు. మగన్, మౌన రాగం, నాయకన్, చీనీ కమ్, అగ్ని నక్షత్రం, పా, గీతాంజలి, అలైపాయుతే, నేను, ప్యాడ్మాన్, ఓ కాదల్ కన్మణి, తిరుడా తిరుడా, ఇష్క్, రెమో. తేవర్ వంటి చిత్రాలలో చేసిన పనికి పి.సి.శ్రీరామ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇలా పి.సి.శ్రీరామ్ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో 30 చిత్రాలకు పైగా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. మూడు సినిమాలతో పాటు కొన్ని టీవీ వాణిజ్య ప్రకటనలకు దర్శకత్వం వహించాడు. ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్ (ISC) వ్యవస్థాపక సభ్యులలో ఆయన కూడా ఒకరు.

ప్రారంభ జీవితం, కుటుంబం[మార్చు]

1956 జనవరి 26న మద్రాసు (ప్రస్తుతం చెన్నై)లో పి.సి.శ్రీరామ్ జన్మించాడు. అక్కడే మైలాపూర్‌లోని విద్యా మందిర్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో చదువుకున్నాడు. తనకు చిన్ననాటి నుంచే సినిమాల పట్ల ఆసక్తి ఎక్కువ.[2] అతను సినిమాటోగ్రఫీలో కోర్సును అభ్యసించడానికి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో చేరాడు.[2][3][4] కమల్ హాసన్, సి. రుద్రయ్య, సంతాన భారతి, రాధారవి, ఆర్.సి. శక్తి, మణిరత్నం.. మరికొంత మందితో కూడిన సామ్‌కో (Samco) బృందం తరచూ కలుసుకునేవారు.

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సినిమాటోగ్రాఫర్‌గా[మార్చు]

Year Film Notes
1981 వా ఇంధ పక్కం తొలి తమిళ చిత్రం
1982 ఓరు వరిసు ఉరువగిరదు
1982 నంద్రి, మీఁడుఁ వరుగ
1985 మీండుమ్ ఒరు కాతల్ కథై
1985 కూడం తేది తొలి మలయాళ చిత్రం
1985 పూవే పూచూడ వా
1986 మౌన రాగం
1986 నీ తానా అంతా కుయిల్
1987 నాయకన్
1988 అగ్ని నక్షత్రం
1989 అపూర్వ సగోధరార్గల్
1989 గీతాంజలి తొలి తెలుగు సినిమా
1990 ఇధయ తామరై
1991 గోపుర వాసలిలే
1992 అమరన్
1992 తేవర్ మగన్
1993 తిరుడా తిరుడా
1994 మే మేడం
1995 శుభ సంకల్పం తెలుగు సినిమా
1998 శాంతి శాంతి శాంతి తొలి కన్నడ చిత్రం
1999 ముగం
1999 కధలర్ ధీనం
2000 ముగావారే
2000 అలైపాయుతే
2001 కుషీ తెలుగు సినిమా
2005 కంద నాల్ ముదల్
2006 వరాలారు ఒక పాట
2007 చీని కం హిందీ సినిమా
2008 ధామ్ ధూమ్
2009 13B హిందీ సినిమా
2009 యవరుం నలం
2009 పా హిందీ సినిమా
2012 ఇష్క్ తెలుగు సినిమా
2015 I
2015 షమితాబ్ హిందీ సినిమా
2015 ఓ కాదల్ కన్మణి
2016 కి & కా హిందీ సినిమా
2016 రెమో
2018 ప్యాడ్ మ్యాన్ హిందీ సినిమా
2018 నా... నువ్వే తెలుగు సినిమా
2018 ప్రాణ మలయాళ చిత్రం[5]
2020 సైకో
2020 పుతం పుదు కాళై
2021 నవరస నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్
2021 రంగ్ దే తెలుగు సినిమా
2022 థ్యాంక్యూ తెలుగు సినిమా

దర్శకుడిగా[మార్చు]

Year Film Notes
1992 మీరా దర్శకుడిగా తొలి సినిమా
1995 కురుతిపునల్
2004 వనం వాసప్పడుం

అవార్డులు[మార్చు]

సంవత్సరం ప్రతిపాదించిన విభాగం పురస్కారం ఫలితం
1987 నాయకన్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ సినిమాటోగ్రఫీ గెలుపు
1990 గీతాంజలి (1989 చిత్రం) ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా నంది అవార్డు గెలుపు
2000 అలైపాయుతే ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌ - సౌత్ గెలుపు [6]
2006 వరలారు విజయ్ అవార్డ్ ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ (స్పెషల్ జ్యూరీ) గెలుపు [7]
2013 ఇష్క్ (2012 చిత్రం) సినిమా అవార్డ్ ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గెలుపు
2013 CineMAA అవార్డు లైఫ్ టైమ్ కంట్రిబ్యూషన్ గెలుపు [8]
2013 ఇష్క్ (2012 చిత్రం) SIIMA అవార్డ్ ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌ (తెలుగు) ప్రతిపాదించబడింది

మూలాలు[మార్చు]

  1. S., Muthiah (15 May 2006). "Helping green Madras". The Hindu. Retrieved 15 May 2015.
  2. 2.0 2.1 Pain, Paromita (28 February 2004). "Beyond the future". The Hindu. Archived from the original on 30 December 2004. Retrieved 12 August 2012.
  3. "P C Sreeram – He can make pictures look real, pretty, stark". Sify. Archived from the original on 28 April 2014. Retrieved 12 August 2012.
  4. "P. C. Sriram" (PDF). cameraworking.raqsmediacollective. Archived from the original (PDF) on 2 డిసెంబరు 2012. Retrieved 15 August 2012.
  5. R, Manoj Kumar (20 February 2018). "Nithya Menen's Praana is a one-actor movie made in four languages". The Indian Express. Retrieved 16 September 2018.
  6. "Archived copy". Archived from the original on 6 September 2004. Retrieved 11 June 2020.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  7. "Winners: Reliance Mobile Vijay Awards 2006". starboxoffice.com. Archived from the original on 26 July 2008. Retrieved 15 March 2014.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  8. "CineMAA Awards 2013 Winners". Idlebrain.com. 16 June 2013. Archived from the original on 15 November 2017. Retrieved 11 June 2020.