ఫిరోజ్ ఖాన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మూస:This

Feroz Khan
జననం (1939-09-25)సెప్టెంబరు 25, 1939
మరణం 2009(2009-04-27) (వయసు 69)
Bengalore, Karnataka, India
క్రియాశీలక సంవత్సరాలు 1960-2007
భార్య/భర్త Sundari (1965-1985)
Filmfare Awards
Best Debut: Didi (1960)

ఫిరోజ్ ఖాన్ (హిందీ: फ़िरोज़ ख़ान, ఉర్దూ: فېروز خان) S(25 సెప్టెంబర్ 1939–27 ఏప్రిల్ 2009) ఒక భారతీయ నటుడు, మరియు హిందీ చలనచిత్ర రంగంలో చిత్ర సంపాదకుడు, నిర్మాత మరియు దర్శకుడు. కౌబాయ్ లక్షణాలు మరియు సిగరెట్ పైకి విసిరి పట్టుకోవటం వంటి హంగులతో కూడిన తనదైన విలక్షణ రీతితో, సాంప్రదాయ బాలీవుడ్ నాయకుడి తీరులో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చాడు, అతను క్లింట్ ఈస్ట్ వుడ్ ఆఫ్ ది ఈస్ట్ గా పిలవబడ్డాడు మరియు పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు.[1][2][3]

అతను 1970 మరియు 1980లలో 50 కన్నా ఎక్కువ చిత్రాలలో నటించాడు, మరియు 1980లో గొప్ప విజయాన్ని సాధించిన చిత్రం కుర్బానీ లో అతని పాత్రతో భారత దేశంలో అత్యంత ప్రీతిపాత్రమైన నాయకులలో ఒకడయ్యాడు, ఆ చిత్రానికి అతను దర్శకత్వం కూడా వహించాడు. దయావాన్ (1988) మరియు జాన్బాజ్ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించటం ద్వారా బహుముఖ ప్రజ్ఞను సాధించాడు (1986).[3][4] అతను 1970 లో ఆద్మీ ఔర్ ఇన్సాన్ చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడి పురస్కారం గెలుచుకున్నాడు, మరియు 2000 సంవత్సరంలో ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్(జీవిత కాల సాఫల్యత) పురస్కారం అందుకున్నాడు.[5]

ప్రారంభ జీవితం[మార్చు]

ఫిరోజ్ ఖాన్ భారతదేశంలోని బెంగుళూరులో జన్మించాడు. అతని తండ్రి సాదిక్ ఆలీ ఖాన్ తనోలి, ఆయన ఆఫ్ఘనిస్తాన్ పరగణా అయిన ఘజనికి చెందిన ఒక ఆఫ్ఘన్[6][7][8] మరియు అతని తల్లి(ఫాతిమా) ఇరాన్ నుండి వచ్చారు. అతను బెంగుళూరులో పెరిగి పెద్దవాడై విద్యాభ్యాసం చేసాడు. అతనికి సంజయ్ ఖాన్, షారూక్ ఖాన్ (వ్యాపారవేత్త)సమీర్ ఖాన్ మరియు అక్బర్ ఖాన్ (దర్శకుడు) అనే సోదరులు ఉన్నారు. అతనికి దిల్షాద్ బిబి అనే సోదరి ఉంది. బెంగుళూరులో విద్యాభ్యాసం తర్వాత, అతను ముంబై వచ్చాడు, అక్కడే అతను 1960 లో దీదీ అనే చిత్రంలో సహ నాయకుడిగా రంగప్రవేశం చేసాడు.

వృత్తి[మార్చు]

ఆ తర్వాతి ఐదు సంవత్సరాలలో, అతను తను నటించిన చాలా చిత్రాలలో సహ నాయకుడుగా కానీ లేదా చిన్న పాత్ర కానీ పోషించవలసి వచ్చింది. 1960 మరియు 1970ల ప్రధమార్ధంలో, అతను వర్ధమాన తారలతో తక్కువ ఖర్చుతో విజయవంతమైన చిత్రాలు తీసాడు. 1962లో, అతను టార్జాన్ గోస్ టు ఇండియా అనే ఆంగ్ల చిత్రంలో సిమి గరేవాల్ తో కలిసి నటించాడు. ఫణి మజుందార్ యొక్క ఊంఛే లోగ్ 1965లో అతని మొదటి పెద్ద విజయం, అక్కడే అతను వెండితెర వేల్పులైన రాజ్ కుమార్ మరియు అశోక్ కుమార్ లతో తలపడ్డాడు, అయినప్పటికీ అతను చెప్పుకోదగిన రీతిలో సున్నితంగా నటించాడు[9]. తిరిగి, అదే సంవత్సరం సాధన నటించిన అతి సంగీతభరిత చిత్రం ఆర్జూ లో ఒక త్యాగమూర్తి అయిన ప్రేమికుడి పాత్ర పోషించాడు. దీనితో, ఖాన్ సహనాయకుల A-లిస్టు(జాబితా)లో స్థానం సంపాదించాడు. ఆద్మీ ఔర్ ఇన్సాన్ (1969) చిత్రంతో, ఖాన్ మొదటిసారి ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ పురస్కారం అందుకున్నాడు. అతను తన సోదరుడైన సంజయ్ ఖాన్ తో కలిసి ఉపాసన (1967), మేళా (1971), మరియు నాగిన్ (1976) వంటి విజయవంతమైన చిత్రాలలో నటించాడు.

తన వృత్తి అవకాశాలను మెరుగుపరచుకోనే దిశగా తను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం అపరాధ్ తో అతను 1971 లో విజయవంతమైన నిర్మాత మరియు దర్శకుడు అయ్యాడు, ఇది జర్మనీ లోని కారు పందేలను చూపించిన మొదటి భారతీయ చిత్రం మరియు ఈ చిత్రంలో ముంతాజ్ అతని సహ-నటి. 1975 లోని చలనచిత్రం ధర్మాత్మ లో నటించటంతో పాటు, దానికి నిర్మాత మరియు దర్శకత్వ బాధ్యతలు వహించాడు, ఇది ఆఫ్ఘనిస్తాన్ లో చిత్రీకరించబడిన మొదటి చిత్రం మరియు నిర్మాత, దర్శకుడు మరియు నటుడిగా అతనికి అతిగొప్ప విజయాన్ని అందించిన మొదటి చిత్రం, మరియు ఈ చిత్రంలోనే హేమ మాలిని ఒక ఆకర్షణీయమైన రూపంలో కనిపించింది.[10] ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం ది గాడ్ ఫాదర్ నుండి ప్రేరణ పొందింది.

1970 మరియు 1980ల మొత్తం, అతను తన చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ మరియు వాటిలో నటిస్తూ, ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడిగా ఉన్నాడు. అతను భగత్ ధన్న జాట్ (1974) అనే పంజాబీ చిత్రంలో నటించాడు. జీనత్ అమన్ నటించిన 1980 నాటి చిత్రం కుర్బాని అతని వృత్తి జీవితంలోనే గొప్ప విజయాన్ని సాధించింది, మరియు పాకిస్తానీ పాప్ గాయని నజియా హస్సన్ కు, ఆమె సుప్రసిద్ధ ట్రాక్ 'ఆప్ జైసా కోయి' ద్వారా గాయనిగా వృత్తి జీవితానికి నాంది పలికింది.[9] 1986లో, అతను జాన్బాజ్ కు దర్శకత్వం వహించి అందులో నటించాడు, అది బాక్స్-ఆఫీసు విజయాన్ని అందుకొంది.[11] దీనిని కొందరు అతని ఉత్తమ చిత్రాలలో ఒకటిగా పరిగణిస్తారు, ఇందులో భారీ తారాగణం, గొప్ప పాటలు మరియు అద్భుతమైన సినిమాటోగ్రఫి ఉన్నాయి. 1988 లో, అతను దయావాన్ అనే చిత్రానికి దర్శకత్వం వహించి అందులో నటించాడు, ఇది నాయగన్ అనే ఒక దక్షిణ భారత చిత్రం యొక్క పునర్నిర్మాణము. యాల్గార్ (1992)కు దర్శకత్వం వహించి అందులో నటించిన తర్వాత, 11 సంవత్సరాల పాటు అతను నటన నుండి సుదీర్ఘ విరామం తీసుకున్నాడు.

అతను 1988లో ప్రేమ్ అగన్ చిత్రంతో తన కుమారుడు ఫర్దీన్ ఖాన్ ను చిత్ర రంగానికి పరిచయం చేసాడు, అయితే, అది బాక్స్-ఆఫీసు వద్ద విఫలమైంది. 2003 లో, అతను తన నటజీవితాన్ని తిరిగి ప్రారంభించి జనషీన్ కు నిర్మాత, దర్శకుడుగా వ్యవహరించాడు, ఇందులో అతని కుమారుడు ఫర్దీన్ కూడా నటించాడు. అతను తన చిత్రాలలో ఎల్లప్పుడూ జంతువుల చేత నటింపచేసేవాడు—జనషీన్ లో ఒక చింపాంజీ మరియు ఒక సింహం నటించాయి, కానీ పీపుల్ ఫర్ యానిమల్స్ (PFA) హర్యానా -[1] అధ్యక్షుడు నరేష్ కద్యాన్ ఫరిదాబాద్ లోని న్యాయస్థానంలో జంతు హింస క్రింద అతనిపై ఫిర్యాదు చేసాడు మరియు నిర్మాత, దర్శకుడు మరియు నటుడిపై చట్టబద్దమైన చర్య తీసుకున్నారు. అతను ఏక్ ఖిలాడి ఏక్ హసీనా (2005)లో తిరిగి తన కుమారునితో కలిసి నటించాడు మరియు వెల్ కం (2007) అతను నటించిన ఆఖరి చిత్రం.

ఫిరోజ్ ఖాన్ తన విలక్షణ నటనా శైలితో తన సమకాలీకుల కన్నా ఒక అడుగు ముందు ఉన్నాడు, అది అతని సినిమాలలోను మరియు సంగీతంలోను ప్రతిబింబిస్తుంది. కుర్బానీ, ధర్మాత్మ వంటి అతని చిత్రాలు హిందీ సినిమాలో నూతన ఒరవడిని సృష్టించాయి. అతను సూపర్ స్టార్(పెద్ద నటుడు)గా పరిగణించబడనప్పటికీ, అతను రాబోయే అనేక సంవత్సరాలలో చిరంజీవిగా నిలిచిపోతాడు.

మే 2006 లో, ఫిరోజ్ ఖాన్ తన సోదరుడి చిత్రం, తాజ్ మహల్ గురించి ప్రచారానికి పాకిస్తాన్ వెళ్ళినప్పుడు, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ అతనిపై నేరారోపణ చేస్తూ అతనిని బహిష్కరించారు. ముషర్రఫ్ కు సమర్పించిన ఒక నివేదిక ప్రకారం, అతను బాగా మధ్యం సేవించి పాకిస్తానీ గాయకుడైన ఫకర్-ఎ-ఆలంను అవమానించాడు మరియు ఆ దేశాన్ని ఈ విధంగా విమర్శించాడు:

"నేను భారతీయుడిని అవటం వల్ల గర్వపడుతున్నాను. భారతదేశం ఒక లౌకిక దేశం. పాకిస్తాన్ లో లాగా కాకుండా అక్కడి ముస్లింలు చాలా అభివృద్ధి సాధిస్తున్నారు. మా దేశాధ్యక్షుడు ఒక ముస్లిం మరియు మా ప్రధాని ఒక సిక్కు. పాకిస్తాన్ ఇస్లాం పేరుతొ ఏర్పరచబడింది, కానీ ఇక్కడ ముస్లింలు వారిని వారే ఎలా చంపుకుంటున్నారో చూడండి."

ఆ తర్వాతి రోజు ఫిరోజ్ ఖాన్ ఆ విషయాన్నంతటినీ త్రోసిపుచ్చాడు.

తను ఎన్నడూ ఆ విధమైన విమర్శలు చేయలేదని వాదించి, తాజ్ మహల్ ను గొప్ప ఉత్సాహంతో ఆదరించినందుకు పాకిస్తాన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసినప్పటికీ, భారతదేశం మరియు విదేశాలలోని పాకిస్తాన్ హై కమీషన్(ఉన్నతాధికారులు) మరియు అంతర్గత మంత్రివర్గాలు భవిష్యత్తులో ఖాన్ కు వీసా ఇవ్వకుండా ఉండేట్లు ఆదేశించబడ్డాయి.[12]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఫిరోజ్ ఖాన్ కు ఫర్దీన్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. అతనికి లైలా ఖాన్ అనే కుమార్తె కూడా ఉంది, ఆమె వివాహం రంజీత్ సింగ్ తో జరిగింది.

పురస్కారాలు మరియు ప్రతిపాదనలు[మార్చు]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

మరణం మరియు అంత్యక్రియలు[మార్చు]

ఏప్రిల్ 2009 లో కాన్సర్ వ్యాధితో జరిపిన పోరాటంలో అతను ఓడిపోయాడు. అతను వ్యాధితో ఉన్న సమయంలో బెంగుళూరులో ఉన్న తన ఫాంహౌస్ లో విశ్రాంతి తీసుకోవటానికి తిరిగి వచ్చాడు.

అతని పార్ధివ శరీరం అతనికి అత్యంత ప్రియమైన బెంగుళూరులో హోసూర్ రోడ్ లోని షియా కబరిస్తాన్ లో ఉన్న తన తల్లి సమాధి పక్కనే ఉంచబడింది, అతని ఉత్తరక్రియలకు దగ్గరి బంధువులు, ఆప్త మిత్రులు, మరియు భారత చలన చిత్ర రంగానికి చెందిన ప్రముఖులు అనేకమంది వేల సంఖ్యలో హాజరయినారు. అతను సినిమా రంగానికి చేసిన సేవలకు మరియు దానిలో సాధించిన విజయాలతో చిరకాలం జ్ఞాపకం ఉంటాడు.[4]

ఉపప్రమాణాలు[మార్చు]

  1. "Feroz Khan". The Daily Telegraph. 27 April 2009]]. "..one of Bollywood's biggest stars; with his swagger and tough-guy styling he was compared to American leading men like Clint Eastwood or Steve McQueen." 
  2. ఫిరోజ్ ఖాన్, బాలీవుడ్ పథనిర్దేశకుడు సమాధి చేయబడ్డాడు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా.
  3. 3.0 3.1 'ఫిరోజ్ ఖాన్ ఒక భారతీయ విలక్షణ నటుడు' R G విజయసారథి బెంగళూరు నుండి, Rediff.com, 27 ఏప్రిల్ 2009.
  4. 4.0 4.1 బాలీవుడ్ నటుడు ఫిరోజ్ ఖాన్ మరణించారు BBC న్యూస్, సోమవారం, 27 ఏప్రిల్ 2009
  5. బాలీవుడ్ విలక్షణ నటుడు ఫిరోజ్ ఖాన్ మరణించారు ది ఎకనామిక్ టైమ్స్, 27 ఏప్రిల్ 2009
  6. 'బాలీవుడ్ యొక్క క్లింట్ ఈస్ట్ వుడ్' ఫిరోజ్ ఖాన్ మరణించారు
  7. బాలీవుడ్ యొక్క ఫిరోజ్ ఖాన్ 69 సంవత్సరాల వయసులో కన్నుమూసారు
  8. 'బాలీవుడ్ యొక్క క్లింట్ ఈస్ట్ వుడ్' ఫిరోజ్ ఖాన్ 69 సంవత్సరాల వయసులో కన్నుమూసారు
  9. 9.0 9.1 ఫిరోజ్ ఖాన్ రాజాలాగా జీవించాడు ది టైమ్స్ ఆఫ్ ఇండియా 27 ఏప్రిల్ 2009.
  10. ఫిరోజ్ ఖాన్ ఒక్కడే నన్ను పాప అని సంబోధించాడు: హేమ మాలిని హిందూస్తాన్ టైమ్స్, 28 ఏప్రిల్ 2009.
  11. http://www.hindu.com/mp/2003/12/01/stories/2003120101690400.htm
  12. http://www.dnaindia.com/world/report_musharraf-says-no-entry-to-feroz_1030084
  13. 1953 మొదటి ఫిలింఫేర్ పురస్కారాలు
  14. http://bollywoodlens.blogspot.com/2009/02/stardust-awards-2009.html
  15. http://www.bollywoodhungama.com/features/2009/02/16/4855/index.html

వెలుపటి వలయము[మార్చు]

మూస:Bollywood మూస:FilmfareBestSupportingActorAward