భారతీయ శిక్షాస్మృతి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
భారతీయ శిక్షాస్మృతి (Indian Penal Code: IPC) భారత ప్రభుత్వ ధర్మశాస్త్రం. భారతదేశంలో నేరాలు చేసిన వారికి దీనిని అనుసరించే శిక్ష వేస్తారు.
విషయ సూచిక |
చరిత్ర [మార్చు]
- ఇండియన్ పీనల్ కోడ్ (భారతీయ శిక్షాస్మృతి) 1860 - 6 అక్టోబర్ 1860 నాడు (1860 లో చేసిన 45 వ చట్టం) మొదలైంది.
- ఇండియన్ పీనల్ కోడ్ జమ్ము, కాశ్మీర్ లో కూడా అమలు లో ఉంది. కానీ, ఈ రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్ అనరు. రన్బీర్ పీనల్ కోడ్ (ఆర్.పి.సి) అని పిలుస్తారు.
- ఇండియన్ పీనల్ కోడ్ మూలాలు 1860 నాటి ఆంగ్లేయుల వలస పాలనలో (బ్రిటిష్ ఇండియా) ఉన్నాయి. 1860 నాటి బ్రిటిష్ ఇండియా చేసిన చట్టం ద్వారా ఇండియన్ పీనల్ కోడ్ అమలులోకి వచ్చింది. మొట్టమొదటి ఇండియన్ పీనల్ కోడ్ చిత్తుప్రతి 1860 లో, మొదటి లా కమిషన్ అజమాయిషి లో జరిగింది.మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 25 అక్టోబర్ 1800 మరణం 28 డిసెంబరు 1859)). (ఇతడే భారత దేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు). మొదటి ఇండియన్ పీనల్ కోడ్ 1862 సంవత్సరంలో, అమలులోకి వచ్చింది. నాటినుంచి ప్రపంచంలోను, భారతీయ సమాజాలలోను, విద్య పరంగా, వైజ్ఞానికంగా, సముద్రాలలో, సముద్ర గర్భాలలో, రోదసీ లోను, ప్రయాణ వాహనాలలోను,న్యాయపరంగా, వైద్యరంగంలోను, ఉద్యోగ రంగంలోను, బాంక్ లావాదేవీలు (ఏ.టి.ఎమ్), సెల్ ఫోన్లు, సైబర్ నేరాలు, కంప్యూటర్ రంగాలలో జరిగిన సమస్తమైన మార్పులను, మన భారతీయ శిక్షాస్మృతి అనేకమైన మార్పులు , చేర్పులకు గురి అవుతూ, నేటి రూపాన్ని పొందింది. గృహ హింస సెక్షన్ 498-ఎ ఒక ఉదాహరణ. మన భారతీయ శిక్షాస్మృతి లో 511 సెక్షన్లు ఉన్నాయి. వరకట్నం ఛట్టాలు మరో ఉదాహరణ. వరకట్న సమస్య, యూరప్, అమెరికా దేశాలలో లేదు కాబట్టి , వరకట్న చట్టాలు, శిక్షలు వారి శిక్షా స్మృతి లో లేవు.
- లార్డ్ మెకాలే, నాటి ఫ్రెంచి పీనల్ కోడ్, లివింగ్స్టోన్స్ కోడ్ ఆఫ్ లూసియానా అనే రెండు ప్రామాణిక గ్రంధాలను ఆదర్శంగా తీసుకుని, మన ఇండియన్ పీనల్ కోడ్ 'చిత్తుప్రతి' ని తయారుచేసాడు. భారతీయుల ప్రామాణిక గ్రంధాలైన మనుస్మృతి ని, యాజ్ఞవల్క్య స్మృతి ని , నాటి వైదిక పండితుల సలహా, సహాయం కూడా తీసుకున్నాడు. శిక్షల విషయంలో, ఆ నాటి పెద్దలు, పండితులు, రాజులు అభిప్రాయాలను కూడా లెక్కలోకి తీసుకున్నాడు. లార్డ్ మెకాలే మహా మేధావి అయినా, తన అభిప్రాయాలకంటే, నాటి భారత దేశ మత, సాంఘిక , సామాజిక వ్యవస్థలకు, ఆఛార వ్యవహారాలకు విలువ ఇచ్చి, వారి అభిప్రాయాలను గౌరవించి, తన మేధస్స్తు తో 'ఇండియన్ పీనల్ కోడ్' చిత్తుప్రతి తయారు చేశాడు. 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్ చిత్తుప్రతి, మూల రూపం, నేటికీ చెక్కు చెదరలేదు. దీనిమీద కొన్ని విమర్శలు ఉన్నప్పటీకీ, ఈ నాటికీ, న్యాయశాస్త్రంలో, దీనికి తిరుగు లేదు.
- పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత, ఇండియన్ పీనల్ కోడ్ ని యధాతధంగా పాకిస్తాన్ తన దేశంలో అమలు చేసింది. దాని పేరు పాకిస్తాన్ పీనల్ కోడ్ (పి.పి.సి). బంగ్లాదేశ్ కూడా బంగ్లాదేస్ పీనల్ కోడ్ పేరుతో అమలు చేసింది. బ్రిటిష్ వలస దేశాలైన, మియన్మార్ (నాటి బర్మా), శ్రీలంక (నాటి సిలోన్, మలేసియా, సింగపూర్, బ్రూనీ దేశాలు కూడా మన ఇండియన్ పీనల్ కోడ్ ని యధాతధంగా (మక్కికి, మక్కి) అమలు చేస్తున్నాయి.
- లార్డ్ మెకాలే తయారుచేశిన 'చిత్తుప్రతి' ని, నాటి ఛీఫ్ జస్టిస్ సర్ బార్నెస్ పీకాక్, కలకతా సుప్రీమ్ కోర్టు న్యాయాధిపతి (ఇతను నాటి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు కూడా) సునిశితంగా, సుదీర్ఘంగా, పరిశీలించి, పరీక్షించారడు. వారి పరిశీలన తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ 6 అక్టోబర్ 1860 నాడు చట్టసభ ఆమోదం పొందింది. దురదృష్టవశాత్తు, ఇండియన్ పీనల్ కోడ్ సృష్టికర్త లార్డ్ మెకాలే తన కృషి, చట్టమై , అమలు జరగటం ఛూడలేదు. కారణం మెకాలే 28 డిసెంబరు 1859 న, తన 59వ ఏట, మరణింఛాడు. ఇతను అవివాహితుడు.
- ఇండియన్ పీనల్ కోడ్ 1837 లోనే నాటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ - కౌన్సిల్ కి నివేదించినా, 1860 సంవత్సరం వరకూ అది వెలుగు చూడలేదు. 1830 కి ముందు, భారత దేశంలో, 'ది ఇంగ్లీష్ క్రిమినల్ లా', అనేక చట్ట సవరణలతో, నాటి ప్రెసిడెన్సీ టౌన్ లలో (బొంబాయి, కలకత్తా, మద్రాసు అమలు జరిగేది.
ఈ ఇండియన్ పీనల్ కోడ్ ప్రపంచమే కుగ్రామంగా మారినా, జీవితం వేగవంతమైనా, సమాజాలు మారుతున్నా, ప్రపంచమే మారిపోతున్నా కూడా, 150 సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా, ఉన్నది అంటే, మెకాలే దూరదృష్టి. అతని మేధస్సు అనితర సాధ్యం. మరో పది దేశాలకు కూడా తన గ్రంధం ఆయా దేశాలకు వేదం, బైబిల్, ఖురాను,జెండ్ అవెస్తా అయ్యింది.
కొన్ని సంస్కరణలు [మార్చు]
- 2003 సంవత్సరములో, మలిమత్ కమిటీ రిపోర్ట్ భారతీయ శిక్షా స్మృతి కి కొన్ని సంస్కరణలను ప్రభుత్వానికి 2003 మార్చి నెలలో ఇచ్చింది. నేర పరిశోధనను, ప్రాసిక్యూషన్ ను విభజించమని ( బ్రిటన్ లోని సి.పి.ఎస్.న్ వలె) దానివలన నేరాలు , శిక్షలు తొందరగా పరిష్కారం అవుతాయి. యూరోపియన్ క్రిమినల్ జస్టిస్ పద్ధతి ఈ రిపోర్ట్ కి ఆధారం. మలిమత్ కమిట్ సిఫార్సులు
మొత్తం నేరాల వర్గీకరణ - భారతీయ శిక్షాస్మృతి ప్రకారం (భా.శి.స్మృ) - ఇండియన్ పీనల్ కోడ్ (ఐ.పి.సి) [మార్చు]
ఇండియన్ పీనల్ కోడ్ (భారతీయ శిక్షాస్మృతి), 1860, నేరాల పరంపరను సేకరించి , వాటికి పడే శిక్షలకు అనుగుణంగా నేరాల విభజన (వర్గీకరణ)ను చేసింది. ఆ పట్టికను క్రింద చూడండి:
| ఛాప్టర్ | ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్ వరకు | నేరాల విభజన (వర్గీకరణ) |
|---|---|---|
| ఛాప్టర్ I | సెక్షన్లు 1 నుంచి 5 | పరిచయం |
| ఛాప్టర్ II | సెక్షన్లు 6 నుంచి 52 | న్యాయ శాస్త్రం లోని పదాల అర్ధాల వివరణ |
| ఛాప్టర్ III | సెక్షన్లు 53 నుంచి 75 | శిక్షలు గురించిన వివరణ |
| ఛాప్టర్ IV | సెక్షన్లు 76 నుంచి 106 | సాధారణమైన మినహాయింపులు
స్వీయ రక్షణ హక్కు నుంచి (సెక్షన్లు 96 నుంచి 106) |
| ఛాప్టర్ V | సెక్షన్లు 107 నుంచి 120 | అబెట్మెంట్, (నేరానికి సహకరించుట) |
| ఛాప్టర్ VA | సెక్షన్లు 120ఎ నుంచి 120బి | నేరపూరితమైన కుట్ర, చట్టము అతిక్రమించు కుట్ర
1913 లో చేర్చారు |
| ఛాప్టర్ VI | సెక్షన్లు 121 నుంచి 130 | దేశానికి వ్యతిరేకంగా (దేశ ద్రోహం) చేసే నేరాలు. |
| ఛాప్టర్ VII | సెక్షన్లు 131 నుంచి 140 | పదాతి దళం (ఆర్మీ), నౌకాదళం (నేవీ), వాయుసేనా దళం (ఏర్ ఫోర్స్), ఈ మూడు దళాలకి సంబదించిన నేరాలు. ("1917 లో నేవీ (నౌకాదళం), ఏర్ ఫోర్స్ (వాయుసేనా దళం) చేర్చారు") (సైన్య వ్యతిరేక నేరములు) |
| ఛాప్టర్ VIII | సెక్షన్లు 141 నుంచి 160 | ప్రజల శాంతి, భద్రతలకు భంగం కలిగించే నేరాలు. |
| ఛాప్టర్ IX | సెక్షన్లు 161 నుంచి 171 | ప్రజా సేవకులైన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన నేరాలు. ప్రభుత్వ ఉద్యోగులు చేసే నేరాలు. (సెక్షన్ 161 నుండి 165A వరకు తొలగించబడినవి) |
| ఛాప్టర్ IXA | సెక్షన్లు 171A నుంచి 171I | ఎన్నికలు వాటికి సంబంధించిన నేరములు |
| ఛాప్టర్ X | సెక్షన్లు 172 నుంచి 190 | కోర్టు ధిక్కరణ నేరాలు (కంటెంప్ట్స్ ఆఫ్ లాఫుల్ అథారిటి ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్). |
| ఛాప్టర్ XI | సెక్షన్లు 191 నుంచి 229 | తప్పుడు సాక్ష్యాలు, పబ్లిక్ జస్టిస్ కి వ్యతిరేకంగా చేసే నేరాలు. |
| ఛాప్టర్ XII | సెక్షన్లు 230 నుంచి 263 | నాణెములు (ప్రభుత్వ ధనము), ప్రభుత్వము ముద్రించే స్టాంపులు. |
| ఛాప్టర్ XIII | సెక్షన్లు 264 నుంచి 267 | తూనికలు మరియు కొలతలు - సంబంధించిన నేరాలు. |
| ఛాప్టర్ XIV | సెక్షన్లు 268 నుంచి 294 | ప్రజల ఆరోగ్యము, భద్రత, సౌకర్యము, మర్యాద, నీతి కి సంబంధించిన నేరాలు. |
| ఛాప్టర్ XV | సెక్షన్లు 295 నుంచి 298 | మతానికి సంబంధమైన నేరాలు. |
| ఛాప్టర్ XVI | సెక్షన్లు 299 నుంచి 377 | మానవ శరీరానికి హాని కలిగించే నేరాలు .
|
| ఛాప్టర్ XVII | సెక్షన్లు 378 నుంచి 462 | ఆస్తులకు సంబందించిన నేరాలు.
|
| ఛాప్టర్ XVIII | సెక్షన్లు 463 నుంచి 489 | ఆస్తిపత్రాలకు సంబంధించిన నేరాలు, ఆస్తుల (భూములు, ఇళ్ళు) హద్దులకు సంబంధించిన నేరాలు.
1958 లో చేర్చారు రిఫరెన్స్ సెక్షన్. 207 (వికీపీడియా (ఇం) లో పేర్కొన్నారు) |
| ఛాప్టర్ XIX | సెక్షన్లు 490 నుంచి 492 | క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ కంట్రాక్ట్స్ ఆఫ్ సర్వీస్. |
| ఛాప్టర్ XX | సెక్షన్లు 493 నుంచి 498 | పెళ్ళి (వివాహం) కి సంబంధించిన నేరాలు. |
| ఛాప్టర్ XXA | సెక్షన్ 498ఎ | భర్త, భర్త తాలూకు బందువుల హింస (కౄరత్వం). గృహ హింస.
1983 లో చేర్చారు |
| ఛాప్టర్ XXI | సెక్షన్లు 499 నుంచి 502 | డిఫమేషన్. |
| ఛాప్టర్ XXII | సెక్షన్లు 503 నుంచి 510 | క్రిమినల్ ఇంటిమిడేషన్, ఇన్సల్ట్ (అవమానించటం), అన్నొయాన్స్. |
| ఛాప్టర్ XXIII | సెక్షన్లు 511 | నేరాలు చేయటానికి ప్రయత్నింఛటం. |
సెక్షన్లు - వాటి వివరాలు [మార్చు]
ఇవి కూడా చూడండి [మార్చు]
- భారతీయ శిక్షాస్మృతి
- భారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 001 – 075
- భారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 076 – 120
- భారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 121 – 140
- భారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 141 – 160
- భారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 161 – 171
- భారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 172 – 190
- భారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 191 – 229
- భారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 230 - 267
- భారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 268 - 298
- భారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 299 - 377
- భారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 378 - 462
- భారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 463 – 489
- భారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 490 – 502
- భారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 503 – 510
- భారతీయ శిక్షాస్మృతి - సెక్షన్లు 511
- న్యాయవాద పదజాలము
- క్రిమినల్ ప్రొసీజర్ కోడ్
బయటి లింకులు [మార్చు]
- ఇండియన్ పీనల్ కోడ్ - వికీపీడియా (ఇం)
- భారతదేశపు చట్టాలు 1834 నుంచి - ప్రభుత్వ వెబ్్సైట్
- ఇండియన్ పీనల్ కోడ్
- ఇండియన్ పీనల్ కోడ్ గురించి
- ఇండియన్ పీనల్ కోడ్ - డిస్ట్రిక్ట్ కోర్ట్స్ : ఛండీగర్ (ఛండీగడ్) వెబ్సైట్.
- ఇండియన్ పీనల్ కోడ్ - నెట్ లా మేన్ వెబ్సైట్.
- ఇండియన్ పీనల్ కోడ్ - వకీల్ నెం.1 వెబ్సైట్.
- ఇండియన్ పీనల్ కోడ్ - ఇండియన్ లా సి.డి లు వెబ్సైట్.
- ఇండియన్ పీనల్ కోడ్ (పి.డి.ఎఫ్)
- భారత రాజ్యాంగం
- భారతదేశపు చట్టాలు 2245 ఇంగ్లీషు
- భారతదేశపు చట్టాలు 2245 తెలుగు
- ఛార్టర్ ఏక్ట్ (చార్టర్ చట్టం) 1833. దీనినే 'గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏక్ట్ (చట్టం) 1833' అంటారు.
- సుప్రీం కోర్టు తీర్పులకు 1902 సంవత్సరం నుంచి చూడు.
- భారతదేశంలోని హైకోర్టుల తీర్పులకు చూడు 1844 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం వరకు
- సుప్రీం కోర్టు, హైకోర్టుల తీర్పులు 2011 సంవత్సరంలో
- లా ఇన్ పెర్స్పెక్టివ్ - ఎందుకు - ఎలా
- లా కమిషన్ ఆఫ్ ఇండియా