మందాకిని ఆమ్టే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మందాకిని ఆమ్టే
జాతీయతభారతీయురాలు
విద్యఎంబిబిఎస్
అనస్థీషియాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా
విద్యాసంస్థప్రభుత్వ వైద్య కళాశాల (నాగ్‌పూర్)
వృత్తిసామాజిక కార్యకర్త
క్రియాశీల సంవత్సరాలు1973 - ప్రస్తుతం వరకు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
లోక్ బిరాదారి ప్రకల్ప్
జీవిత భాగస్వామిప్రకాష్ ఆమ్టే
పిల్లలుదిగంత్ ఆమ్టే
అనికేత్ ఆమ్టే
ఆర్తి ఆమ్టే
పురస్కారాలురామన్ మెగసెసే అవార్డు 2008
వెబ్‌సైటుwww.lokbiradariprakalp.org www.lbphemalkasa.org.in
మహాబలేశ్వర్ సమావేశంలో ఆమ్టే కుటుంబం: ప్రకాష్ ఆమ్టే, అతని భార్య మందాకిని ఆమ్టే, వారి కుమారులు దిగంత్, అనికేత్, వారి భార్యలు, దిగంత్ కుమారుడు అర్నవ్ (చేతిలో ఉన్నాడు) మొదలగువారు

మందాకిని ఆమ్టే - మహారాష్ట్రకు చెందిన వైద్యురాలు. సామాజిక కార్యకర్త. ఆమె తన భర్త డాక్టర్ ప్రకాష్ ఆమ్టేతో కలసి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో మాదియా గోండుల మధ్య లోక్ బిరాదారి ప్రకల్పం రూపంలో చేసిన దాతృత్వానికి 2008లో 'కమ్యూనిటీ లీడర్‌షిప్' మెగసెసే అవార్డును అందుకుంది.[1]  ప్రముఖ సంఘసేవకుడు బాబా ఆమ్టేకు ఆమె కోడలు.[1][2][3][4]

ప్రారంభ జీవితం[మార్చు]

మందాకిని ఆమ్టే అసలు పేరు మందాకిని దేశ్‌పాండే. ఆమె తన ఎంబిబిఎస్ పూర్తి చేసిన తర్వాత నాగ్‌పూర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో అనస్థీషియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని నిర్ణయించుకుంది.[1] ప్రకాష్ ఆమ్టే అక్కడ సర్జన్. ఒకే ఆపరేషన్ థియేటర్‌లో కలసి పనిచేశారు.[1] వారి విలువలు సరిపోలాయి. అలా భార్యాభర్తలవ్వడమే కాక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

కానీ ప్రకాష్ ఆమ్టేతో ఆమె వివాహాన్ని వ్యతిరేకిస్తూ ఆమె తండ్రి చనిపోయాడు. ఆమె కుష్టురోగుల మధ్య జీవించవలసి వస్తుందని అతనికి భయం వేసింది. మురళీధర్ దేవదాస్ ఆమ్టే (బాబా ఆమ్టే) ఆమెను ఆనందవన్‌కి పిలిచి, జీవితాంతం అడవుల్లో ప్రకాష్‌ ఆమ్టేతో కలసి జీవించడానికి నువ్వు సిద్ధమా అని అడిగారు. ఆమె బాబా ఆమ్టేకు హామీ ఇచ్చి వివాహం చేసుకుంది.[5]

మెగసెసె అవార్డు[మార్చు]

డా. మందాకిని ఆమ్టే ఆమె భర్త డా. ప్రకాష్‌ ఆమ్టే.. సంయుక్తంగా 2008లో కమ్యూనిటీ నాయకత్వానికి మెగసెసే అవార్డును అందుకున్నారు.[1][6][7]

గుర్తింపు[మార్చు]

1995లో మొనాకో ప్రిన్సిపాలిటీ డా. ప్రకాష్ ఆమ్టే, డా. మందాకిని ఆమ్టేల కృషికి గౌరవసూచకంగా ఒక తపాలా స్టాంపును విడుదల చేసింది. 1955లో మొదటి సారి డాక్టర్ ఆల్బర్ట్ ష్వైట్జర్‌ స్టాంప్ విడుదల చేయగా రెండవసారి మొనాకో వారి మానవతా పనికి విదేశీయులకు గౌరవార్థం ఒక స్టాంప్‌ను విడుదల చేసింది.

1950ల ప్రారంభంలో డాక్టర్ ఆల్బర్ట్ ష్వైట్జర్‌తో కలసి పనిచేసిన ఫ్రెంచి జంట మిస్టర్ గై, డాక్టర్ గ్రీట్ బార్తెలెమీ 1992లో ప్రాజెక్ట్‌ను సందర్శించారు. హేమల్కాసా, ఆఫ్రికాలో డాక్టర్ ఆల్బర్ట్ ష్వైట్జర్‌ ఉన్న పరిస్థితుల సారూప్యతను చూసి వారు చలించిపోయారు. ఈ ఫ్రెంచ్ జంట తిరిగి వెళ్లి మొనాకో ప్రిన్స్ రైనర్ IIIకి ఆమ్టేస్ గౌరవార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేయమని విజ్ఞప్తి చేశారు, ఇది 1995లో జరిగింది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 Pandey, Kirti (1 December 2020). "Family tree of Baba Amte: Sons Prakash and Vikas Amte; who was Sheetal Amte and her role at Anandwan" (in ఇంగ్లీష్). www.timesnownews.com. Retrieved 5 March 2021.
  2. "My father was against our marriage". dnaindia.com. Diligent Media Corporation Ltd. Retrieved 29 February 2016.
  3. "Prakash & Mandakini Amte". outlookindia.com. Outlook: The Web Edition. Retrieved 29 February 2016.
  4. "Event at the Hilt – Meet the Real Heroes: Doctor Prakash Amte and Doctor Manda Amte". chandlersfordtoday.co.uk/. Chandler's Ford Today. Retrieved 4 March 2016.
  5. "My father was against our marriage". dnaindia.com. Diligent Media Corporation Ltd. Retrieved 14 March 2016.
  6. "Amte, Prakash | CITATION". rmaf.org.ph. © Ramon Magsaysay Award Foundation. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 27 February 2016.
  7. "Magsaysay award for Amte couple". hindustantimes.com. HT Media Limited. Retrieved 4 March 2016.

వెలుపలి లంకెలు[మార్చు]