అరుణా రాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరుణ రాయ్
అధ్యక్షురాలు, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్
అంతకు ముందు వారుడా. ఎ. సర్దామోని
వ్యక్తిగత వివరాలు
జననం (1946-06-26) 1946 జూన్ 26 (వయసు 77)
చెన్నై
జాతీయతఇండియన్
జీవిత భాగస్వామిబంకర్ రాయ్ (వివాహం 1970)
కళాశాలఢిల్లీ విశ్వవిద్యాలయం
వృత్తిసామాజిక కార్యకర్త
పురస్కారాలు2000లో రామన్ మెగసెసే అవార్డు; 2010లో లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పురస్కారం

అరుణా రాయ్, (జననం 1946 జూన్ 26 ) ఈమె ఒక భారతీయ రాజకీయ కార్యకర్త, సామాజిక వేత్త. ఆమె శంకర్ సింగ్, నిఖిల్ డే, లాంటి వారితో కలిసి మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ స్థాపించారు. సమాచార హక్కు కోసం ఉద్యమం నడిపిన వ్య్హక్తిగా అరుణా రాయ్ ప్రసిద్ధి చెందారు.[1] సమాజంలోని బలహీన వర్గాల కోసం ఆమె కృషి చేసారు. ఆమె సోనియా గాంధీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు జాతీయ సలహా మండలిలో సభ్యురాలుగా చాలా కాలం పాటు కొనసాగారు.ఆమె నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ సంస్థకు అధ్యక్షురాలు.

విద్య, ఉద్యోగం[మార్చు]

అరుణా రాయ్ ఢిల్లీలో పెరిగింది. అక్కడ ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. ఆమె ఢిల్లీ యూనివర్సిటీలోని ఇంద్రప్రస్థ కళాశాలలో ఆంగ్ల సాహిత్యాన్ని అభ్యసించింది.[2][3] ఆమె 1968, 1974 సంవత్సరాల మధ్య కాలంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో, భారత పౌరసేవల ఉద్యోగిగా పనిచేసింది.

మజ్దూర్ కిసాన్ శక్తి సంగతన్[మార్చు]

అరుణా రాయ్ సివిల్ సర్వీసెస్‌కు రాజీనామా చేసి పేదలు, అట్టడుగు వర్గాలకు సంబంధించిన సమస్యలపై పోరాడింది. రాజస్థాన్‌లోని తిలోనియా లోని సోషల్ వర్క్ అండ్ రీసెర్చ్ సెంటర్ (SWRC)లో చేరింది.[4][5] ఆమె నిఖిల్ డే, శంకర్ సింగ్,.ఇతరులతో కలిసి 1987లో మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్‌ (MKSS)ను స్థాపించారు.[6]

కార్మికులకు న్యాయమైన వేతనాల కోసం మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్‌ ద్వారా ఆమె పోరాడడింది. ఇది భారతదేశ సమాచార హక్కు చట్టం అమలు కోసం పోరాటంగా రూపుదిద్దుకుంది. అరుణా రాయ్ నాయకురాలుగా ఎం.కె.ఎస్.ఎస్, నేషనల్ క్యాంపెయిన్ ఫర్ పీపుల్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ (NCPRI) ద్వారా భారతదేశంలో సమాచార హక్కు ఉద్యమానికి దారితీసింది. ఇది 2005లో సమాచార హక్కు చట్టం ఆమోదంతో చివరకు విజయవంతమైంది.[7]

ఉద్యమాలు[మార్చు]

పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం చేసే అనేక ఉద్యమాలలో అరుణా రాయ్ ముందంజలో ఉంటుంది. వీటిలో ప్రముఖంగా సమాచార హక్కు, పని చేసే హక్కు (NREGA),[8] ఆహార హక్కు[9] చెప్పుకోవచ్చు. ఇటీవల పెన్షన్ పరిషత్, NCPRI సభ్యురాలుగా[10][11] అసంఘటిత రంగ కార్మికులకు సార్వత్రిక, నాన్-కంట్రిబ్యూటరీ పెన్షన్ కోసం విజిల్‌బ్లోయర్ ప్రొటెక్షన్ లా, గ్రీవెన్స్ రిడ్రెస్ యాక్ట్ ఆమోదం, అమలు కోసం ఆమె ఉద్యమాలు సాగించింది.[12][13]

గుర్తింపు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Aruna Roy Speaks on Managing Dissent".
  2. "Aruna Roy (Indian activist) -- Encyclopædia Britannica". Encyclopædia Britannica. 30 January 2013.
  3. "DU has a lot on its ladies special platter". India Today. 3 June 2009.
  4. Menon, Ritu (2002). Women Who Dared. National Book Trust, India. ISBN 81-237-3856-0. pp 169-170.
  5. Aruna Roy National Resource Center for Women, Govt. of India.
  6. MKSS As a Role Model Archived 22 ఫిబ్రవరి 2014 at the Wayback Machine, Civil Society Online. Jan 2012
  7. Blacked out: government secrecy in the information age, by Alasdair Scott Roberts. Cambridge University Press, 2006.
  8. "Matersfamilias | Saba Naqvi | Aug 24,2015". www.outlookindia.com. Retrieved 2015-08-27.
  9. "Right to Food- A Fundamental Right". National Human Rights Commission, India. Retrieved 10 March 2020.
  10. "Pension Parishad calls off strike". The Hindu. 2013-12-21. ISSN 0971-751X. Retrieved 2015-08-27.
  11. "Forgotten Brethren | Harsh Mander | Apr 20,2015". www.outlookindia.com. Retrieved 2015-08-27.
  12. "Aruna Roy seeks early passage of grievance redress, whistleblower bills". 19 December 2013. Retrieved 2015-08-27.
  13. Roy, Aruna. "The Fate of RTI After One Year of Modi is a Bad Omen". The Wire. Archived from the original on 18 October 2015. Retrieved 2015-08-27.
  14. "NAC reconstituted". The Hindu. 4 June 2005. Archived from the original on 1 March 2006.
  15. "Daughter Of The Dust | Urvashi Butalia | Oct 16,2006". www.outlookindia.com. Retrieved 2015-08-27.
  16. "Ramon Magsaysay Award Citation". Archived from the original on 7 May 2012. Retrieved 7 May 2009.
  17. Thehindu.com
  18. Thottam, Jyoti (2011-04-21). "The 2011 Time 100". Time. ISSN 0040-781X. Retrieved 2015-08-27.
  19. Anjali Bisaria (7 September 2017). "11 Human Rights Activists Whose Life Mission Is To Provide Others With A Dignified Life/". Times Internet.
  20. "Professor of Practice Profile: Aruna Roy". ISID (in ఇంగ్లీష్). Retrieved 2020-11-17.
  21. "Professors of Practice in Global Governance". ISID (in ఇంగ్లీష్). Archived from the original on 2021-03-30. Retrieved 2020-11-17.
  22. "New book on RTI an ode to unknown soldiers of the struggle". The Week (in ఇంగ్లీష్). Retrieved 2020-11-17.
  23. "Book review | 'The RTI Story: Power to the People' a memoir-cum-textual tome". The New Indian Express. Retrieved 2020-11-17.
  24. Raman, Anuradha (2018-05-12). "'The RTI Story: Power to the People' review: Towards transparency". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-11-17.
  25. Ahluwalia, Sanjeev (2018-04-27). "Book Review: Read it to know the pain and joy of activism". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2020-11-17.

వెలుపలి లంకెలు[మార్చు]