మూస చర్చ:స్వాగతం/మూడో తరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూడో తరం మూస[మార్చు]

ఇప్పుడున్న సందేశాన్ని మళ్ళీ మారుతున్న అవసరాలకు, మనకు వస్తున్న ఫీడ్ బాక్ కు అనుగుణంగా మార్పులు చేర్పులు చెయ్యాల్సిన సమయం వచ్చింది.

మూసను వీలైనంతగా సరళీకరించి పెద్దగా వికీఫార్మాటింగు, పట్టికలు లేకుండా చేయ్యాలని నాకనిపించింది. ఏదైనా రాయాలని చర్చాపేజీ తెరిచినవాళ్ళకి 5 కేబీల క్లిష్టమైన వికీఫార్మాట్లో పట్టికలతో ఉన్న గందరగోళాన్ని చూసి జడుసుకుంటున్నారేమోనని నా అనుమానం.
ఇక ఈ మూడు లైన్ల వళ్ల పెద్ద ఉపయోగమేమీ లేదు. ఒక్కోదాని కింద వ్యాఖ్యానిస్తా. --వైజాసత్య 09:36, 9 ఆగష్టు 2007 (UTC)
నేను కొత్త మూసకు ఒక ప్రయత్నం ఇక్కడ ప్రారంభిస్తా. మీరూ మార్పులు చేర్పులు చెయ్యండి. మూస:స్వాగతం/మూడో తరం

ఒకటో లైను[మార్చు]

# వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. మీకు వికీపీడియా విధానాలపై ఏమయినా సందేహాలు ఉంటే గనక {{సహాయం కావాలి}} అనే సందేశాన్ని (బ్రాకెట్లతో సహా) మీ చర్చా పేజీలో చేర్చండి. చేర్చిన తరువాత అక్కడే మీ కొచ్చిన సందేహాన్ని అడగండి. కొంత సేపటికి వికీపీడియా విధానాలు తెలిసిన సభ్యులు వచ్చి మీ సందేహాలను తీరుస్తారు.

ఆశించినట్టుగా దీనికి ప్రతిస్పందన రాలేదు. సహాయము అవసరమైనవాళ్ళు కూడా ఇది ఉపయోగించట్లేదు. (మూసల కాన్సెప్ట్ కొత్త వాళ్ళకు కొరుకుడు పడట్లేదనుకుంటా)
అందరూ పెట్టిన వెంటానే ఉపయోగించేస్తారని లేదు కదా, అప్పుడప్పుడు కొంతమంది ఉపయోగిస్తున్నారు. __మాకినేని ప్రదీపు (+/-మా) 10:59, 9 ఆగష్టు 2007 (UTC)
అవునా, నేను చూడలేదు..వాడుతుంటే అలాగే ఉంచేద్దాం --వైజాసత్య 11:19, 9 ఆగష్టు 2007 (UTC)
ఒక ఉదాహరణ __మాకినేని ప్రదీపు (+/-మా) 11:48, 9 ఆగష్టు 2007 (UTC)


రెండో లైను[మార్చు]

# నాలుగు టిల్డె లతో ([[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 09:36, 9 ఆగష్టు 2007 (UTC)) - ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు జరిపారో తెలుపడానికే, కాని, వ్యాసాలలో చెయ్యరాదు సుమండీ.)

ఇప్పుడు లిప్యాంతరీకరణ స్క్రిప్టులో ~ కు ప్రత్యేకఅర్ధం ఉండటం వలన సంతకం ఐకాన్ ఉపయోగించి సంతకం చేస్తే తప్ప రాదు (టిల్డేను టైపు చెయ్యాలంటే ఇంగ్లీష్ కి మారి చెయ్యాలి). ఇక్కడో కొత్త సభ్యుని తికమిక చూడండి. కాబట్టి టిల్డేల బదులు సంతకం ఐకాన్నే పరిచయం చేస్తే కొత్తవాళ్ళకి సులువుగా ఉంటుందేమో
వెంటవెంటనే రెండు ~~ నొక్కినప్పుడు ़़ లను ~~ గా మ్యాపింగు పెడితే ఈ సమస్యకు కొంత పరిష్కారం లభిస్తుందేమో. __మాకినేని ప్రదీపు (+/-మా) 10:59, 9 ఆగష్టు 2007 (UTC)
మంచి ఐడియా!! (అమలుపరచటం చిటికెలో పని) --వైజాసత్య 11:19, 9 ఆగష్టు 2007 (UTC)

మూడో లైను[మార్చు]

# మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న పెట్టెలోని లింకులను అనుసరించండి, అవి కూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.

ఈ అధికారిక మెయిలింగు లిస్టు ఎవరూ ఉపయోగించట్లేదు. దాని బదులు కొంచెం ఆచరణాత్మకంగా తెవికీ గూగూల్ గుంపు మెయిల్ ఇస్తేనే బాగుంటుందేమో.
"అధికారిక" అనే పదం అక్కడ భయంగొలుపుతుందేమో. తెవికీ గూగూల్ గుంపు అయినా పరవాలేదు. __మాకినేని ప్రదీపు (+/-మా) 10:59, 9 ఆగష్టు 2007 (UTC)

మూడొ తరం స్వాగత సందేశం మీద మాటలబాబు సలహాలు సూచనలు[మార్చు]

కొద్దిగా మార్పులు

మొదటి లైను తెవికీ లొ సభ్యులైనందుకు అభినందనలు
రెండవ లైను తెవికీ విధివిధానాలు తెలుసుకొనేందుకు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి క్రింద లేదా ప్రక్కనున్న లింకులను అనుసరించండి. ఆ లింకులు మీ సందేహ నివృత్తి చేయలేకపోతే {{సహాయం కావాలి}} అనే సందేశాన్ని ( మీసాల బ్రాకెట్లతో సహా)మీసందేహం తో కలిపి వ్రాయండి.కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీసందేహ నివృత్తి చేస్తారు.
మూడవ లైను వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
నాల్గవ లైను నాలుగు టిల్డె లతో (~~~~)- ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు జరిపారో తెలుపడానికే, కాని, వ్యాసాలలో చెయ్యరాదు.)
ఐదవ లైను ఈవారం వ్యాసాలు ఇ-మైల్ ద్వారా తెప్పించుకోవడం , తెవికీ గూగుల్ లింకు ఇవ్వండి.

ఇవి నా సలహాలు. వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి. తీసేశా ఎందువలన అంటే ఓకసారి వికీ గురించి వారు తెలుసుకొంటే తమ పేర్లు తామే జత చేసుకొంటారు. ఇప్పటికి చూడండి, పుణ్య్ క్షేత్రాల ప్రాజెక్టులలొ మనిద్దరమే ఉన్నాం. ఆ లింకు వలన్ ఉపయఓగం కనిపించలేదు. --మాటలబాబు 12:21, 9 ఆగష్టు 2007 (UTC)

సూచనలు[మార్చు]

రెండో తరం మూస చర్చలలో చదువరి చేసిన సూచనలు

  • కొత్తవాళ్ళకి అన్నన్ని లింకులు చూపిస్తే తికమక పడతారేమోననిపిస్తోంది. దాని బదులు ఒకటో రెండో లింకులు ఇచ్చి నేర్చుకునేందుకు దోహదం చేస్తే బాగుంటుందేమో! ఉదాహరణకు.. పరిచయం, 5 నిమిషాల్లో వికీ -ఈ రెంటినీ ముందు చదవమందాం.
  • నవీన్, ప్రవీణ్ లు తయారు చేసిన సినిమా లాంటిది ఇక్కడ బహు ప్రయోజనకరం. సినిమా చూసి త్వరగా నేర్చుకోగలరు, ఆసక్తికరంగా కూడా ఉంటుంది.

ఆలోచించండి!! __చదువరి (చర్చ • రచనలు) 15:53, 18 జూన్ 2007 (UTC)

లింకులు[మార్చు]

కొన్ని ఉపయోగకరమైన లింకులు: వికిపీడియా 5 మూలస్థంబాలు5 నిమిషాల్లో వికీసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాలరచ్చబండసముదాయ పందిరిఇటీవలి మార్పులు

ఈ లింకుల్ల్లో ఏవేవి తీసెయ్యవచ్చు..ఏవి ఖచ్చితంగా ఉంచాలి? ఇంకా ఏమైనా కొత్తవి చేర్చాలా? --వైజాసత్య 12:13, 10 ఆగష్టు 2007 (UTC)
సహాయ సూచిక
5 నిమిషాల్లో వికీ
సముదాయ పందిరి ఖచ్చితంగా ఉండాలి. సహాయ సుచికలొ మరిన్ని లింకులున్నాయి. సముదాయ పందిరి లొ ఏ విధంగా సహకరించవచ్చో ఉన్నది. 5 నిమిషాల్లొ వికీ లొ తెవికి గురించి విపులంగా ఉన్నది. శైలి,మూల స్థంభాల గూర్చి రచనలు ప్రారంభిస్తే చెప్పడానికి మనమున్నాముగా,ఇటీవల మార్పులు,రచ్చబండ లింకు మార్గదర్శకత్వం లింకులొ ఎడమ వైపు ఎలాగు ఉండనే ఉన్నది. .--మాటలబాబు 12:23, 10 ఆగష్టు 2007 (UTC)


రచ్చబండ - ఇందులో చాలామటుకు దిద్దుబాట్లు చేసేవాళ్ళు చర్చించే విషయాలే ఉంటాయి (అందునా సూచికలో ఎలాగు లింకు ఉంది కాబట్టి తీసెయ్యాలి)
ఇటీవలి మార్పులు గజిబిజి గందరగోళంలా ఉంటుందేమో
వికిపీడియా 5 మూలస్థంబాలు మూలస్థంబాలు చిన్నదే ..ఇదొక కాన్స్టిట్యూషన్ ప్రీఆంబుల్ (రాజ్యంగ ప్రవేశిక) లాంటిది కానీ కొత్తవాళ్ళకి దీని ప్రాధాన్యత అర్ధం కాకపోవచ్చు.
మాటలబాబు అన్నట్టు సహాయసూచిక, 5 నిమిషాల్లో వికీ, సముదాయపందిరి బాగున్నాయి
ఇక సందిగ్ధంలో ఉన్నవి సహాయకేంద్రం, శైలి మాన్యువల్, ప్రయోగశాల --వైజాసత్య 12:41, 10 ఆగష్టు 2007 (UTC)


నేర్పడమనేది నేర్చుకోడమంత తేలిక కాదని మరోసారి తేలిపోయింది!:)
నా ఉద్దేశ్యం కూడా మిగతా వారు చెబుతున్నదే -సాధ్యమైనంత సరళంగా, వీలైనంత తక్కువ భయపెట్టేదిగా ఉండాలి. ఈ వికీ శిక్షణను రెండు మూడు భాగాలుగా చేస్తే ఎలా ఉంటుంది..
  1. ముందు వికీ ప్రాథమికాంశాల గురించి నేర్చుకోవాలి. ఇందులో వికీపీడియా:పరిచయము, వికీపీడియా:5 నిమిషాల్లో వికీ, వికీపీడియా:పాఠం ఉంటాయి. (అంటే వికీ రూపురేఖలు, ఏ లింకు నొక్కితే ఏం జరుగుతుంది, ఇక్కడ రాయడం ఎలాగా, సంతకం చెయ్యడం ఎలా.. వగైరాలు)
  2. ప్రయోగశాలలో పడి ఇష్టమొచ్చినట్టు ప్రయోగాలు చెయ్యడం
  3. వికీ శైలి గురించి, మార్కప్ గురించి మరింత లోతుగా తెలుసుకోవడం. (విభాగాలు చెయ్యడం, బొద్దు, వాలు అక్షరాలు ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి, వ్యాసాల పేర్లు ఎలా పెట్టాలి.. వగైరాలు)
  4. ఆ తరువాత వికీ కట్టుబాట్ల గురించి చెప్పాలి.. మూలస్థంభాలు, మర్యాద, సంప్రదాయం వగైరాలు.
కొత్తగా నేను చెప్పిందేమీ లేదు.. పైన వచ్చిన సూచనలనే క్రోడీకరించాను. ఈ పద్ధతి ఎలా ఉంది? __చదువరి (చర్చరచనలు) 17:19, 13 ఆగష్టు 2007 (UTC)