రాయగడ
వికీపీడియా నుండి
| ?రాయగడ ఒరిస్సా • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
• 207 మీ (679 అడుగులు) |
| జిల్లా(లు) | రాయగడ జిల్లా |
| జనాభా | 57 (2001) |
రాయగడ (Rayagada) ఒరిస్సా రాష్ట్రంలో తెలుగు వారు నివసిస్తున్న ప్రదేశం, జిల్లా కేంద్రం మరియు పురపాలసంఘం. ఇది తూర్పు కోస్తాలోని విజయనగరం జిల్లాకు దగ్గరలో ఉన్నది.
పర్యాటక ప్రదేశాలు [మార్చు]
- మజ్జి గైరమ్మ దేవాలయం (Maa Majhighariani temple) - ఈ గ్రామ దేవత చాలా శక్తివంతమైనదిగా ఒరిస్సా మరియు ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చే భక్తులచే కొలవడుతున్నది. కొండరాతి మీద మీద వెలసిన అమ్మవారి ముఖం మాత్రమే భక్తులకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.
- హతీ పత్తర్ (Hatipathar) - జిల్లా కేంద్రం నుండి 3 కి.మీ.దూరంలో ప్రకృతి సుందరమైన ప్రదేశం రెండు జలపాతాలు నాగావళి నది ప్రవాహంలో ఏర్పడి కనులవిందు చేస్తాయి. ఇక్కడి రెండు కొండ రాళ్ళు ఏనుగుల వలె కనిపించడం వలన ఈ పేరు వచ్చింది.
- లక్ష్మీనారాయణ దేవాలయం (Laxminarayan temple) - ఇక్కడ జగన్నాధస్వామి, బలభద్రుడు, సుభద్ర సహితంగా పూజింపబడుతున్నాడు. ఇది తెరువళి (Therubali) ప్రాంతంలో ఉన్నది. ఇక్కడ పూరీ లోవలె రథాయాత్ర జరుగుతుంది.
- పాయకపాడు (Paikapada) - తెరువళి ప్రాంతంలోనే ఇదొక పవిత్రమైన శివక్షేత్రం. ఇది మహాభారత యుద్ధం అనంతరం పరశురాముడు ప్రతిష్టించిన పంచలింగ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిచెందినది. ఇక్కడ శివుడు పాయకేశ్వర స్వామిగా భక్తులచే కొలవబడుచున్నాడు.
- చిత్రకోన (Chatikona) - ఇవి కొండలు మరియు లోయలతో సుందరమైన ప్రదేశము. ఇక్కడి మహాదేవుని ఆలయం ప్రసిద్ధిచెందినది.
- దేవగిరి (Devagiri) - ఇక్కడ గుహలో శివలింగం ప్రసిద్ధిచెందినది. కొండపైకి చేరడానికి మెట్లదారి ఉన్నది. చదునైన కొండ పైన త్రివేణి సంగమం ఉన్నది.
- పదంపూర్ (Padampur) - ఇక్కడ ప్రాచీనమైన మణికేశ్వరి శివాలయం ప్రసిద్ధిచెందినది. ఇది 7వ శతాబ్దపు బౌద్ధ ప్రముఖుడైన ధర్మకీర్తి నివసించిన ప్రాంతం.