వాడుకరి చర్చ:W.Pawana

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

W.Pawana గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

W.Pawana గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:Rajasekhar1961 గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు Rajasekhar1961 గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Rajasekhar1961 (చర్చ) 06:20, 6 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీ వికీ కృషిపై సూచనలు[మార్చు]

@W.Pawana గారు, తెవికీలో మీరు సభ్యత్వం తీసుకొని కృషి ప్రారంభించినందులకు అభివందనాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లో ఒక వాక్యానికి మీరు నిజమా అని బ్రాకెట్లలో చేర్చారు. దానిని మెరుగుగా {{tl|fact}} అనే మూస వాడిచేస్తే అటువంటి వ్యాసాలు నిర్వహణ వర్గాలలో చేరి తెవికీ అభివృద్ధికి తోడ్పడతాయి. మీరు వికీపీడియా వ్యాసాలన్నీ తప్పులు అనే అభిప్రాయం సవరణ సారాంశంలో వ్యక్తం చేశారు. తెలుగు వికీ స్వచ్ఛందంగా చేసే సభ్యుల కృషి వలన తయారవుతున్నది. కావున అన్ని వ్యాసాల నాణ్యత ఒకే స్థాయిలో వుండదు. ఉదాహరణకు మొదటిపేజీలో ఈ వారం వ్యాసంగా ప్రదర్శించిన వ్యాసం కాస్త మెరుగైన నాణ్యతతో వుంటుంది. మీకు దోషాలు కనబడినప్పుడు, వాటిని మీరు సవరించవచ్చు. భాషా దోషాలు సులభంగా సరిదిద్దండి. ఇతర దోషాలకు మీకు తెలిసిన మెరుగైన మూలాలు చేర్చి సరిచేయండి. అలా చేయటంలో మీకు సహాయం కావల్సివస్తే లేక ఇతర సభ్యులతో చర్చించదలిస్తే ఆ వ్యాస చర్చాపేజీలో వ్యాఖ్య చేర్చి{{సహాయం కావాలి}} అనే మూసను కూడా చేర్చండి. అప్పుడు ఇతర సభ్యులు మీకు సహాయపడ్తారు. తెలుగు వికీగురించి మరింత తెలుసుకోవడానికి పై స్వాగత సందేశంలో విలువైన వివరాలను అధ్యయనం చేయండి. అర్జున (చర్చ) 00:05, 9 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అక్షర దోషాలతో కూడిన మార్పులు[మార్చు]

W.Pawana గారు, ఈ లింకులో మీరు చేసిన మార్పులు రద్దు చేశాను. ఎందుకంటే మీరు రాసిన దాంట్లో అక్షర దోషాలున్నాయి. పంటలు పండుతున్నాయి అని రాయాల్సింది పంతలు పందుతున్నాయి అని రాశారు. ముందుగా మీరు తెలుగు టైపింగు నేర్చుకోవడం మీద దృష్టి పెట్టండి. తర్వాత వ్యాసాల్లో మార్పులు చేస్తే బాగుంటుంది. - రవిచంద్ర (చర్చ) 08:37, 12 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అక్షర దొషాల కంటె ముఖ్యమైనది వాక్యంలొని తపులు. అది నెర్చుకొండి. పావన. అన్ని తప్పులు తప్పులు రాసి మాకు వెధవలుగ చెస్తె ఎత్ల. ఈ విధనం నసించాలి. పావని.

పావని గారూ, వికీపీడియాలో నిరంతరం సమాచారం వచ్చి చేరుతూ ఉంటుంది. కాబట్టి అన్ని వేళలా అంతా ఖచ్చితమైన సమాచారం ఉంటుందని గ్యారంటీ లేదు. కొంత మంది సభ్యులు వ్యాసాల్లో జరిగే మార్పులు గమనించి తప్పులు దిద్దుతున్నప్పటికీ అన్ని వేళలా సాధ్యం కాదు. మీ దృష్టికి వచ్చిన తప్పులు ఎత్తి చూపుతున్నారు. సంతోషం. కానీ వాటితో పాటు అక్షర దోషాలు లేకుండా రాయడమూ ముఖ్యమే. లేకపోతే సరైన విషయం రాసిన అర్థాలే మారిపోతాయి. గమనించండి. - రవిచంద్ర (చర్చ) 10:05, 12 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు వ్యాసంలో సమస్యలు ప్రస్తావిస్తూ వ్యాసంలోనే రాసేస్తున్నారు. అది కూడా అక్షర దోషాలతో. నేను ప్రస్తుతానికి వాటిని రద్దు చేస్తున్నాను. వాటిని రాయాల్సిన చోటు వేరే ఉంది. అది ప్రతి వ్యాసానికీ ఓ చర్చా పేజీ ఉంటుంది. అక్కడ రాయాలి. మీరు ఎత్తి చూపిన సమస్యలు నిజమైనవే అయితే అవి ఎవరైనా సభ్యులు చూసి పరిష్కరిస్తారు. లేదా మీరైనా అక్షర దోషాలు లేకుండా టైపు నేర్చుకుని సరిదిద్దండి. రవిచంద్ర (చర్చ) 10:09, 12 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వనిపెంట వ్యాసంలో మార్పులు[మార్చు]

W.Pawana గారు, వనిపెంట వ్యాసంలో మీ మార్పు రద్దుచేశాను. కారణం సవరణ సారాంశంలో చూడవచ్చు. అదే ఇక్కడ కూడా ప్రస్తావిస్తున్నాను. వనిపెంటగురించి మీరు స్థానికులైతే, తప్పుసమాచారాన్ని తొలగించండి. కొత్త సమాచారం వ్రాయాలంటే మూలాలతో రాయండి.--అర్జున (చర్చ) 00:55, 15 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీ కృషి పై మరల సూచన[మార్చు]

@W.Pawana గారు, వికీపీడియాగురించి అవగాహన లేకుండా మీరు సవరణలు చేస్తున్నారు కాబట్టి మీ సవరణలు చాలావరకు, ఇతర నిర్వాహకులు, నేను రద్దు చేశాము. మీ చర్చాపేజీలో సూచనలు చేసినప్పటికి వాటిని మీరు పట్టించుకోకుండా సవరణలు కొనసాగిస్తున్నారు. మీరు ఇలాగే కొనసాగితే, మీ సవరణలు దుశ్చర్యలగా పరిగణించవలసివస్తుంది. అప్పుడు మీపై తాత్కాలిక నిరోధం తప్ప మిగతా చర్యలకు నిర్వాహకులకు ఆస్కారం వుండదు. కావున వ్యాసంగురించిన సందేహాలను వాటి చర్చాపేజీలో వ్రాయండి. ఇతర సందేహాలను ఈ పేజీలో తెలపండి. వికీలో అనుభవమున్న వారి సూచనలను పాటించండి. మీరు వికీగురించి మరింతగా తెలుసుకొని, వికీ అభివృద్ధి చేయాలని కోరుకుంటూ. అర్జున (చర్చ) 04:18, 16 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఎస్సేలలో చాల తప్పులున్నాయ్ అని నేను సూచనలు ఇస్తే ఎవరైనా పత్తించుకున్నారా? తప్పులను తీస్తే కోపమా? -- పావన 2021-04-16T10:30:29‎ W.Pawana
పావని గారూ మీరు చూపించిన వ్యాసాలలో తప్పులను సవరించాను. మీరు గమనించలేదేమో. కానీ మీరు చేస్తున్న మార్పుల పట్ల మేం చేస్తున్న సూచనలు మీరు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. వ్యాసంలో సమస్యలు అక్కడే రాయకూడదు. చర్చా పేజీల్లో రాయాలి అంటున్నా మీరు పట్టించుకోకుండా మళ్ళీ అలాగే చేస్తున్నారు. అసలు చర్చా పేజీ ఏమిటి, ఎందుకు అనైనా మమ్మల్ని అడుగుతున్నారా? మీ ధోరణిలో మీరు మార్పులు చేస్తూనే వెళ్ళిపోతున్నారు. అది పద్ధతి కాదు కదా. పైన మేం చెబుతున్నది మీపై కోపంతో కాదు. మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టడం కోసమే. - రవిచంద్ర (చర్చ) 05:45, 16 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@W.Pawana గారు, మీరు చెప్పినవి గమనించి, మీ సూచనలు కొన్ని ఎలా చేయాలో ఇంతకు ముందల విభాగంలో చేసి తెలిపాము కదా. ఇతర సూచనలు చేశాం కదా. వికీపీడియాలో కొత్తగా కృషి చేసేవారిని స్వాగతిస్తాం. తప్పులు నిరంతరం సభ్యులు దిద్దుతుంటారు. ఇతర విధాలగా మెరుగు పరుస్తుంటారు. ఇటీవలి మార్పులలో ఇతరులు ఎలా కృషి చేస్తున్నారో గమనించండి. కొత్తవారు సూచనలు పట్టించుకోకుండా, వికీపీడియాలో ప్రస్తుత నాణ్యతను దెబ్బతీసే సవరణలు చేస్తే, వాటిని రద్దుచేయటం, వారిపై ఇతర చర్యలు తీసుకుంటామని గమనించండి. --అర్జున (చర్చ) 06:14, 16 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నా పై ఎమి చర్యలు తిసుకుంతారు. జైలుకు పంపిస్తారా? ఉరిసిక్ష వేస్తారా? తప్పులు రాసినోల్లపై ముందు చర్యలు తీసుకొంది. తప్పులు ఉన్నాయని చెప్పినొల్లపై కాదు.