వికీపీడియా:ఈ వారపు వ్యాసం

వికీపీడియా నుండి

Blue check.png ఈ పేజీ వికీపీడియా మార్గదర్శకాలలో ఒకటి. సర్వామోదం పొందిన ప్రమాణాలను వివరించే పేజీ ఇది. చాలామంది వీటిని ప్రామాణికంగా స్వీకరించారు. అయితే ఇవి శిలాక్షరాలేమీ కాదు. ఈ పేజీలో మార్పులు అవసరమని భావిస్తే చొరవగా ముందుకు వచ్చి తగు మార్పులు చెయ్యండి. కాకపోతే, ఆ మార్పులు విస్తృతంగా ఆమోదిస్తారని మీరు భావిస్తేనే చెయ్యండి. సందేహాస్పదంగా ఉంటే, ముందుగా ఆ మార్పులను చర్చా పేజీ లో ప్రస్తావించండి.

తెలుగు వికీపీడియాలో ఉన్న మంచి మంచి వ్యాసాలను వెలికితీసి, పదిమందికీ చూపించాలనేదే "ఈ వారపు వ్యాసాల" లక్ష్యం.

[మార్చు] ఈ వారపు వ్యాసంగా పరిగణించటానికి వ్యాసాలను ఎంపిక చేయటం

తెలుగు వికీపీడియాలో ఏదయినా వ్యాసాలు మీకు నచ్చితే వాటి చర్చా పేజీలలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} అని చేర్చటం ద్వారా ఇతర సభ్యులు కూడా ఈ వ్యాసాలను చూసి వాటిని మెరుగుపరుస్తూ ఉంటారు. ఆ సమయంలో ఈ వ్యాసాలను ఈ వారం వ్యాసం పరిగణనలు అనే వర్గంలో చూసుకోవచ్చు. ఆ వర్గములో మొదటి పేజీలోని ఈ వారం వ్యాసం శీర్షికలో మున్ముందు ప్రదర్శించటానికి పరిగణింపబడుతున్న వ్యాసాలు. వ్యాసాన్ని ఈ పరిగణన జాబితాలో చేర్చేముందు ఈ క్రింది సూచనలు పాటించండి.

  • వ్యాసం కనీసం పది కిలోబైట్లకు మించి ఉండాలి. 15-20 కిలోబైట్లకు మించి ఉంటే ఇంకా మంచిది.
  • వ్యాసము శీర్షిక కు సంబంధించిన విషయాలు స్పృశించి ఉండాలి.
  • వ్యాసం గతంలో ఎపుడైనా విశేష వ్యాసముగాగానీ, ఈ వారం వ్యాసంగా కానీ ప్రదర్శింపబడి ఉండరాదు (ఇది వరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శించబడినా, ఆ తరువాత కాలములో వ్యాసం యొక్క నాణ్యత గణనీయంగా పెరిగి ఉన్నా, లేదా విశేష వ్యాసం స్థాయికి చేరుకొని ఉన్నా, ఈ నియమానికి వెసలుబాటు ఇవ్వవచ్చు).
  • వ్యాసంలో అనువదించవలసిన భాగాలు ఉండరాదు. ఒకవేళ కొన్ని చిన్న చిన్న అనువాదాలు చేయవలసి ఉండీ పరిగణలో చేర్చినా, మొత్తం వ్యాసం అనువదించే వరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శింపబడదు. సాధారణంగా అనువాదము చేయవలసిన భాగాలున్న వ్యాసాలను జాబితాలో చేర్చకండి.
  • వ్యాసంలో కనీసం ఒక సంబంధిత బొమ్మ అయినా ఉండాలి.
  • తెలుగు వికీపీడియా రాశి, వాసి పెరిగే కొలది సభ్యులు చర్చించి అదనపు నియమాలను ప్రకటించవచ్చు.

[మార్చు] ఈ వారం వ్యాసంగా ఎంపిక చేయటం

కొన్ని రోజుల తరువాత వ్యాసానికి మంచి రూపు వచ్చిందని అనుకున్నప్పుడు, ఆ వ్యాసాన్ని ఏ వారం రోజులు ప్రదర్శించాలో నిర్ణయించాలి.

అలా నిర్ణయించిన తరువాత, వ్యాస చర్చా పేజీలలో {{ఈ వారం వ్యాసం|వారం=ప్రదర్శించేవారం|సంవత్సరం=ప్రదర్శించేసంవత్సరం}} అనే మూసను చేర్చాలి.

మూసను చేర్చిన తరువాత, వ్యాసాలు వాటి తేదీ వచ్చిన వెంటనే, ఈ వారం వ్యాసాలు అనే వర్గంలోకి వచ్చి చేరిపోతాయి. వాటి సమయం రానంత వరకూ మాత్రం ఈ వారం వ్యాసం పరిగణనలు అనే వర్గంలోనే ఉంటాయి.

[మార్చు] ఇవి కూడా చూడండి

పేజీకి సంభందించిన లింకులు