విజయ
(విజయ (సంవత్సరం) నుండి దారిమార్పు చెందింది)
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1893-1894, 1953-1954లో వచ్చిన తెలుగు సంవత్సరానికి విజయ అని పేరు.
సంఘటనలు
[మార్చు]- 1713-1714: ఆశ్వయుజ శుద్ధ దశమి: విజయనగరం కోట నిర్మించబడింది.
- సా.శ. 1893 : ఆషాఢమాసములో తిరుపతి వేంకట కవులు ఏలూరు పట్టణంలో శతావధానము నిర్వహించారు.[1] అదే సంవత్సరం శ్రావణ భాద్రపద మాసములలో బందరులో అనేక శతావధాన అష్టావధానములు నిర్వహించారు.[2] మార్గశిరమాసములో చెన్నపట్టణములోని అడయారులో అనిబిసెంట్ సమక్షంలో అష్టావధానము నిర్వహించారు.
- సా.శ. 1894 : పుష్యమాసములో నెల్లూరులో అష్టావధానము చేశారు.[3] మాఘమాసములో వేంకటగిరిలో చెలికాని గోపాలరావుగారి వీరిచేత ద్విగుణితాష్టావధానమును చేయించారు.
జననాలు
[మార్చు]- 1893 ఆషాఢ శుద్ధ ఏకాదశి : చల్లా పిచ్చయ్యశాస్త్రి - శతావధాని, సంగీత విద్వాంసుడు. (మ.1959) [4]
- 1894 ఫాల్గుణ బహుళ త్రయోదశి:ఒద్దిరాజు రాఘవ రంగారావు - ఒద్దిరాజు సోదరులలో చిన్నవాడు. (మ.1973)
- 1952 కార్తీక బహుళ త్రయోదశి : మద్దూరి రామమూర్తి - అవధాని, ఆశుకవి.[5]
- 1953 ఆషాఢ శుద్ధ సప్తమి: పణుతుల రామేశ్వరశర్మ - అవధాని, ఉపన్యాసకుడు, పరిశోధకుడు, కవి, రచయిత.[6]
మరణాలు
[మార్చు]- 1833-34 - తూము లక్ష్మీనరసింహదాసు, వరద రామదాసు, రామభక్తులు.
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 12. Retrieved 26 June 2016.
- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 15. Retrieved 26 June 2016.
- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 25. Retrieved 27 June 2016.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 203.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 634.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 640.