సరూర్‌నగర్
| ?సరూర్‌నగర్ మండలం రంగారెడ్డి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | సరూర్‌నగర్ |
| జిల్లా(లు) | రంగారెడ్డి |
| గ్రామాలు | 8 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
3,91,358 (2001) • 202926 • 188432 • 79.14 • 85.44 • 72.34 |
సరూర్‌నగర్ (ఆంగ్లం: Saroornagar), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము. ఇది హైదరబాదు నగరం యొక్క ఆగ్నేయ శివార్లలోని మండలం.సరూర్‌నగర్ మండలంలోని 13గ్రామ పంచాయితీలలో ఇప్పటికే అర్బన్ ప్రాంతమంతా గ్రేటర్‌లోనే ఉంది. మీర్‌పేట, అల్మాస్‌గూడ, బడంగ్ పేట, నాదర్‌గూల్, బాలాపూర్ గ్రామ పంచాయతీలను గ్రేటర్‌లో కలుపుతారు.
విషయ సూచిక |
[మార్చు] భౌగోళికం
సరూర్ నగర్ హైదరాబాదుకు తూర్పు దిక్కున సముద్ర మట్టం నుండి సుమారు 487 మీటర్ల (1601 అడుగులు) ఎత్తులో ఉన్నది..[1]
[మార్చు] మండలంలోని పట్టణాలు
- హైదరాబాదు (మహానగరపాలిక +og) (పాక్షికం)
- గడ్డి అన్నారం (నగరంలో భాగం)
- లాల్ బహదూర్ నగర్ (నగరపాలిక +og) (పాక్షికం)
- లాల్ బహదూర్ నగర్ (నగరపాలిక)
- మీర్పేట్ (నగరంలో భాగం)
[మార్చు] ఆసక్తికరమైన ప్రదేశాలు
సరూర్ నగర్ చెరువు - 16వ శతాబ్దంలో కులీ కుతుబ్‌షా పాలనాకాలంలో, పంటపొలాలకు నీరందించేందుకు ఈ చెఱువు కట్టించబడినది. ఒక చదరపు కిలోమీటరు వైశ్యాల్యం కలిగిన ఈ చెరువు ఇటీవలి కాలంలో భూమి కబ్జాల వల్లను చుట్టుపక్కల నెలక్కొన్న ఆవాసాల వల్లను కుంచించుకుపోయింది. స్వాతంత్ర్యం తర్వాత హైదరాబాదు నగరం యొక్క పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు ఆవాస యోగ్యమైన భూమి కొరకై చెఱువు చుట్టపక్కల వ్యవసాయభూమిని ఇండ్ల స్థలాలుగా మార్చేశారు. 90వ దశకంలో చెఱువు కట్టను విస్తరించి, చెఱువు పరిసరాలను తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
సరూర్ నగర్ క్రీడా ప్రాంగణం - విజయవాడ జాతీయరహదారిపై నెలక్కొన్న ఇండోర్ క్రీడా ప్రాంగణమిది. 2002లో హైదరాబాదులో జరిగిన 32వ జాతీయ క్రీడల సందర్భంగా దీన్ని నిర్మించారు. ఈ ప్రాంగణం 2,000 ప్రేక్షకులు తిలకించగల సామర్ధ్యం కలిగి ఉన్నది.
సరూర్ నగర్ పాలస్ లేదా విక్టోరియా స్మారక అనాథాశ్రమం - ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ తన కుటుంబానికి వేట విడిదిగానూ, వేసవి విడిదిగానూ ఉపయోగించేందుకు నిర్మించిన ఈ మహల్ సరూర్ నగర చెఱువుకు సమీపంలో 65 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్నది. నిజాంకు ఈ మహలు కలిసిరాకపోవటం వళ్ళ అశుభసూచకంగా భావించి దాన్ని అనాథశరణాలయంగా మార్చేందుకు ఆదేశించాడు. అప్పటి బ్రిటీషు రెసిడెంటు విన్నపం ప్రకారం దాన్ని విక్టోరియా రాణి స్మారకార్ధంగా నామకరణం చేశారు.
అవేర్ హాస్పిటల్ ను అవేర్ అనే స్వఛ్ఛందసంస్థ యొక్క ఛైర్మన్ పి.కె.ఎస్.మాధవన్, ఆ సంస్థ యొక్క రజతోత్సవ సందర్భంగా స్థాపించాడు. ఇది నాగార్జున సాగర్ రోడ్డుపైన బైరాముల్‌గూడాలోని శాంతివనంలో ఉంది. ఇది ఆధ్యాత్మిక దృష్టితో, పర్యావరణానికి అనుగుణంగా రూపొందించబడింది. 50 స్పెషాల్టీ శాఖలున్న ఈ 300 పడకల ఆసుపత్రి అత్యంత ఆధునిక సాంకేతి, పరికరాలతో 24 గంటలు సేవలు అందజేస్తున్నది.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- మేడిబౌలి
- అల్మాస్‌గూడ
- బడంగ్పేట్
- చింతలకుంట
- జాల్‌పల్లి
- మామిడిపల్లి(సరూర్ నగర్)
- కుర్మల్‌గూడ
- నాదర్గుల్ (గ్రామీణ)
[మార్చు] మూలాలు
|
|||||||