Jump to content

సుజాత (నటి)

వికీపీడియా నుండి
సుజాత (నటి)
సుజాత (నటి)
జననం(1952-12-10)1952 డిసెంబరు 10
శ్రీలంక
మరణం2011 ఏప్రిల్ 6(2011-04-06) (వయసు 58)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1968–2006
జీవిత భాగస్వామిజయకర్
పిల్లలుసాజిత్, దివ్య

సుజాత (డిసెంబర్ 10, 1952ఏప్రిల్ 6, 2011). ఒక మలయాళ నటి. ఈమె శ్రీలంకలో పుట్టి పెరిగింది. జన్మస్థలం కేరళ లోని మరదు. తెలుగు, కన్నడ, తమిళం, మళయాలం, హిందీ భాషల చలనచిత్రాలలో నటించిన ఒక ప్రసిద్ధ దక్షిణ భారత నటి. కొంతకాలం అనారోగ్యంతో బాధపడ్డ తరువాత ఆమె 58 ఏళ్ళ వయసులో చెన్నైలోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు.

సినిమాలు

[మార్చు]

సుజాతను దాసరి నారాయణరావు గారు తెలుగులో గోరింటాకు (1979 సినిమా) చిత్రంద్వారా పరిచయం చేసారు. ఆ చిత్రం విజయవంతంకావడంతో పలు చిత్రాలలో, అగ్రకథానాయలతో నటించే అవకాశాలు వచ్చాయి. తపస్య హిందీ సినిమా ఆధారంగా తయారయిన సంధ్య (కోదండరామిరెడ్డి తొలి చిత్రం) చిత్రంలో హిందీలో రాఖీ నటించిన పాత్రలో ఈమె రాణించారు. అంతులేని కథ తమిళ వెర్షన్ లో సుజాత నటించారు.

గోరింటాకు, సూత్రధారులు, శ్రీరామదాసు ఆమెకు బాగా పేరు తెచ్చిన చిత్రాలు. 1997లో వచ్చిన పెళ్ళి (సినిమా) చిత్రానికి గాను నంది అవార్డు వచ్చింది. తమిళంలో ప్రతిష్ఠాత్మక కలైమామణి అవార్డు అందుకున్నారు.

సినిమాలు

[మార్చు]

కుటుంబం

[మార్చు]

ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా శ్రీలంకలో స్థిరపడటంతో ఆమె అక్కడే పుట్టి పెరిగింది. ఆయన పదవీ విరమణ చేయడంతో మళ్ళీ కేరళకు వచ్చేశారు. పద్నాలుగేళ్ల వయసులోనే తబస్విని చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాని తరువాత సినిమా అవకాశాలు చుట్టుముట్టాయి. ఏడేళ్ల వ్యవధిలో 40 చిత్రాలు చేసి తిరుగులేని నాయికగా ఎదిగింది. కె.బాలచందర్‌ దర్శకత్వం వహించిన అవళ్‌ ఒరు తొడర్‌ కథై (తెలుగులో అంతులేని కథ )తో నటిగా వెలిగిపోయింది. సుజాతది ప్రేమ వివాహం. తమ ఇంటి యజమాని వాళ్లబ్బాయి జయకర్‌ హెన్రీని ప్రేమించింది. పెద్దలు ఒప్పుకోకపోయినా ఎదిరించి పెళ్ళిచేసుకొంది. ఆ తరువాత అమెరికా వెళ్లిపోయింది. అయితే అక్కడి సంప్రదాయాలు సుజాతకు నచ్చలేదు. కాన్పు కోసం ఇండియాకి వచ్చి మళ్లీ వెళ్లలేదు. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.[1]

మూలాలు

[మార్చు]
  1. డాక్టర్ శేషగిరిరావు టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్ నుంచి లంకె