Coordinates: 27°30′17″N 92°06′17″E / 27.50480843°N 92.10469818°E / 27.50480843; 92.10469818

సెలా కనుమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సెలా కనుమ
సె లా
2015 ఏప్రిల్‌లో సెలా కనుమ ద్వారం
సముద్ర మట్టం
నుండి ఎత్తు
4,170 metres (13,680 ft)
ప్రదేశంఅరుణాచల్ ప్రదేశ్, భారత దేశం
శ్రేణిహిమాలయాలు
Coordinates27°30′17″N 92°06′17″E / 27.50480843°N 92.10469818°E / 27.50480843; 92.10469818
సెలా కనుమ is located in Arunachal Pradesh
సెలా కనుమ
సెలా కనుమ is located in India
సెలా కనుమ

సెలా కనుమ లేదా సెలా పాస్ (సరైన మాట "సె లా". లా అంటే కనుమ అని అర్థం) అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తవాంగ్, వెస్ట్ కామెంగ్ జిల్లాల మధ్య ఉన్న కనుమ (కొండల మధ్య ఉండే సన్నటి దారి). ఇది సముద్ర మట్టానికి 4,170 మీ. ఎత్తున ఉంది. తవాంగ్ పట్టణాన్నీ దిరాంగ్, బోమ్‌దిలా పట్టణాలనూ కలిపే కనుమ ఇది. జాతీయ రహదారి 13 ఈ కనుమ గుండా పోతుంది. ఈ కనుమలో వృక్షసంపద తక్కువగా ఉంటుంది. కనుమలో కొంత భాగం ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. కనుమ కొన వద్ద ఉన్న సెలా సరస్సు టిబెటన్ బౌద్ధమతంలో పవిత్రమైన 101 సరస్సులలో ఒకటి. శీతాకాలంలో సెలా కనుమ వద్ద భారీగా మంచు కురుస్తుంది. కొండచరియలు విరిగి పడడం వలన గానీ, మంచు వలన గానీ తాత్కాలికంగా మూసివేస్తే తప్ప, ఈ కనుమ ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది.

2018 ఆగస్టులో సేలా పాస్

భౌగోళికం[మార్చు]

తవాంగ్ జిల్లాను భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి వేరుచేసే ఉపహిమాలయాల గుండా సెలా కనుమ పోతుంది. ఈ కనుమ 4170 మీ. ఎత్తులో ఉంది. ఇది తవాంగ్ నుండీ 78 కి.మీ. దూరంలోను, గువహాటి నుండి 340 కి.మీ. దూరం లోనూ ఉంది. ఏడాది పొడవునా కనుమను తెరిచి ఉంచడానికి భారత బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) పనిచేస్తుంది. అయితే, కొండచరియలు విరిగిపడడం వలన, భారీగా మంచు కురిసినపుడూ దీన్ని తాత్కాలికంగా మూసివేస్తారు. వేసవిలో మరీ చల్లగా ఉండదు గాని, శీతాకాలంలో మాత్రం ఉష్ణోగ్రత -10 డిగ్రీల సెల్సియస్ వరకూ తగ్గుతుంది. సేలా సరస్సు, కనుమకు ఉత్తరం వైపున 4,160 మీ. ఎత్తున ఉంటుంది. ఈ సరస్సు తరచుగా శీతాకాలంలో గడ్దకడుతూంటుంది. తవాంగ్ నదికి ఉపనది అయిన నూరనంగ్ నది లోకి సరస్సు నుండి నీళ్ళు పారతాయి. సరస్సు చుట్టూ పరిమితంగా వృక్షసంపద ఉంటుంది. వేసవిలో యాక్‌లకు మేతగా ఇవి ఉపయోగపడతాయి.

సొరంగం[మార్చు]

అన్ని కాలాల్లోనూ పనిచేసే రోడ్డు రహదారి సొరంగాన్ని నిర్మించేందుకు భారత ప్రభుత్వం సేలా సొరంగం నిర్మించడానికి తలపెట్టింది. 2018-19 బడ్జెట్‌లో దీన్ని ప్రకటించింది.[1] దీని నిర్మాణం 2019 జనవరిలో మొదలౌతుందని ప్రకటించింది. [2] ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భలూక్‌పాంగ్-తవాంగ్ రైల్వే లైను ఈ సొరంగం గుండా పోతుంది. ఈ రైల్వే లైను 2022 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.

ఆధ్యాత్మికం[మార్చు]

సేలా పాస్ టిబెటన్ బౌద్ధమతంలో ఒక పవిత్ర ప్రదేశం. పాస్ పరిసరాల్లో సుమారు 101 పవిత్ర సరస్సులు ఉన్నాయని బౌద్ధులు భావిస్తున్నారు. [3] [4]

చారిత్రికం[మార్చు]

1962 భారత చైనా యుద్ధంలో భారత సైన్యం యొక్క సిపాయి జస్వంత్ సింగ్ రావత్ సెలా కనుమ వద్ద చైనా సైనికులను ఒంటరిగా ఎదిరించి మరణించాడు. సింగ్ ధైర్యం, విధి పట్ల అంకిత భావం కారణంగా భారత ప్రభుత్వం అతడికి మరణానంతరం మహా వీర చక్ర బహూకరించింది. అతడి జ్ఞాపకార్థం భారత సైన్యం సెలా సరస్సుకు దగ్గరలో ఒక స్మారకాన్ని నిర్మించింది.

చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

  • ఈశాన్య భారతదేశంలో పర్యాటకం
  • తవాంగ్
  • తవాంగ్ మొనాస్టరీ
  • భలుక్పాంగ్-తవాంగ్ రైల్వే, నిర్మాణంలో ఉంది

మూలాలు[మార్చు]

  1. Sela pass tunnel, Economic Times, 1 Feb 2018.
  2. https://www.business-standard.com/article/pti-stories/work-for-construction-of-sela-tunnel-to-start-soon-dgbr-118112101081_1.html
  3. "Sela Pass". Pan India Internet Private Limited (PIIPL). arunachalonline.in. Archived from the original on 2013-06-22. Retrieved 2013-04-19.
  4. "High Altitude Sela Pass–Backbone of Tawang District". Sankara Subramanian C (www.beontheroad.com). beontheroad.com. Retrieved 2013-04-18.
"https://te.wikipedia.org/w/index.php?title=సెలా_కనుమ&oldid=3559488" నుండి వెలికితీశారు