హైదరాబాదులో ప్రదేశాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదరాబాదు నగరంలో ఒక భాగం

హైదరాబాదు నగరంలో ఉన్న వివిధ ప్రదేశాల గురించి ఈ వ్యాసంలో చదువవచ్చును. హైదరాబాదులో చాలా ప్రదేశాలకు చివరన ఆబాద్ అని, గూడ అన్న పదాలు వస్తాయి. భాగ్యనగరం, అత్రఫ్-ఎ-బల్దా [ఆధారం చూపాలి]లు నగరానికి పూర్వపు పేర్లు. మొఘల్‌ చక్రవర్తి ఔరంగాజీబు నియామకం చేసిన మొదటి సుబేదారు ముబారెజ్‌ఖాన్‌ హయాంలో... హైదరాబాద్‌ నగరం చుట్టూ ప్రాకారం నిర్మించాడు. దానిని హైదరాబాదు సరిహద్దు గోడ అని పిలుస్తారు.

బిర్లా మందిరం
మోజంజాహి మార్కెట్
నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్
హైదరాబాద్. నిజాం పాలెస్ ముఖ ద్వార
హైదరాబాద్. మక్కా మస్జిద్.
తెలంగాణ శాసనసభ

గ్రేటర్‌ హైదరాబాదు వార్డులు

[మార్చు]
సిటికాలేజ్
పబ్లిక్ గార్డెన్లో పురావస్తుశాఖ మ్యూజియం
రవీంద్రభారతి.
చార్మీనార్
శాసనసభ భవనము
టాంకు బండు వద్ద వివేకానంద విగ్రహము

వార్డుల సంఖ్య - 150

  • ఎస్టీ (జనరల్‌) - 1
  • ఎస్టీ (మహిళ) - 1
  • ఎస్సీ (జనరల్‌) - 8
  • ఎస్సీ (మహిళ) - 4
  • బీసీ (జనరల్‌) - 33
  • బీసీ (మహిళ) - 17
  • మహిళ (జనరల్‌) - 28
  • ఇతరులకు - 58

ఉప్పల్‌అసెంబ్లీ నియోజకవర్గం
కాప్రా
చర్లపల్లి
మల్లాపూర్‌
నాచారం
హబ్సిగూడ
రామంతాపూర్‌
ఉప్పల్‌

ఎల్‌.బి.నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం
కొత్తపేట
మన్సూరాబాద్‌
హయత్‌నగర్‌
వనస్థలిపురం
కర్మన్‌ఘాట్‌
చంపాపేట్‌
సరూర్‌నగర్‌
పీఅండ్‌టీ కాలనీ

మహేశ్వరం అసెంబ్లీనియోజకవర్గం
రామకృష్ణాపురం
గడ్డిఅన్నారం

మలక్‌పేట్‌ అసెంబ్లీనియోజకవర్గం
ముసారాంబాగ్‌
సైదాబాద్‌
ఛావుణి
అక్బర్‌బాగ్‌
సలీమ్‌నగర్‌
ఓల్డ్‌మలక్‌పేట
అజంపురా
డబీర్‌పురా

యాకుత్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం
ఐఎస్‌సదన్‌
సంతోష్‌నగర్‌
రెయిన్‌ బజార్‌
కుర్మగూడ
తలాబ్‌ చంచలం
గౌలిపురా

చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం
రియాసత్‌నగర్‌
కంచన్‌భాగ్‌
బార్కాస్‌
చాంద్రాయణగుట్ట
జంగంమెట్‌
ఉప్పుగూడ
లలితాబాగ్‌

చార్మినార్‌ అసెంబ్లీ నియోజకవర్గం
నూర్‌ఖాన్‌ బజార్‌
పత్తర్‌ఘట్టి
మొఘల్‌పురా
ఆలియాబాద్‌
శాలిబండ
హుస్సేని ఆలం
ఘాన్సీ బజార్‌
పురానాపూల్‌

బహుదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం
ఫలక్‌నుమా
నవాబ్‌సాహెబ్‌కుంట
జహనుమా
ఫతేదర్వాజా
దూద్‌బౌలి
కిషన్‌బాగ్‌
రామ్నాస్‌పురా

గోషామహల్‌ అసెంబ్లీ నియోజకవర్గం
బేగంబజార్
గోషామహల్‌
ధూల్‌పేట
దత్తాత్రేయనగర్‌
మంగళ్‌హాట్‌
జాంబాగ్‌
గన్‌ఫౌండ్రీ
సుల్తాన్‌బజార్‌

రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం
శివరాంపల్లి
మైలార్‌దేవ్‌పల్లి
రాజేంద్రనగర్‌
అత్తాపూర్‌

కార్వాన్‌ అసెంబ్లీ నియోజకవర్గం
కార్వాన్‌
జియాగూడ
గుడిమల్కాపూర్‌
లంగర్‌హౌస్‌
టోలీచౌకీ
నానల్‌ నగర్‌

నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం
ఆసిఫ్‌నగర్
మురాద్‌నగర్‌
మెహిదీపట్నం
అహ్మద్‌నగర్‌
విజయనగర్‌ కాలనీ
చింతల్ బస్తీ
మల్లేపల్లి
రెడ్‌హిల్స్‌

ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం
హిమాయత్‌నగర్‌
బర్కత్‌పురా
ఖైరతాబాద్‌
పంజాగుట్ట
సోమాజీగూడ
శ్రీనగర్‌ కాలనీ
బంజారాహిల్స్‌

అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం
కాచిగూడ
గోల్నాక
అంబర్‌పేట
బాగ్‌ అంబర్‌పేట
విద్యానగర్
నల్లకుంట

ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం
బాగ్‌ లింగంపల్లి
అడిక్‌మెట్‌
రామ్‌నగర్‌
ముషీరాబాద్‌
భోలక్‌పూర్‌
గాంధీనగర్‌
కవాడిగూడ
దోమల్‌గూడ

సనత్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం
అమీర్‌పేట
బల్కంపేట
సనత్‌నగర్‌
పద్మారావునగర్‌
బన్సీలాల్‌పేట
బేగంపేట

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గం
ఎర్రగడ్డ
వెంగళరావునగర్‌
యూసఫ్‌గూడ
రహమత్‌నగర్‌
బోరబండ
జూబ్లీహిల్స్‌
షేక్‌పేట

శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం
గచ్చిబౌలి
శేరిలింగంపల్లి
హఫీజ్‌పేట
చందానగర్‌
వివేకానందనగర్‌ కాలనీ
హైదర్‌నగర్‌

పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం
రామచంద్రాపురం
పటాన్‌చెరు

కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం
కేపీహెచ్‌బీ కాలనీ
మూసాపేట
మోతీనగర్‌
ఫతేనగర్‌
ఓల్డ్‌బోయిన్‌పల్లి
కూకట్‌పల్లి

కుత్బుల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం
గాజులరామారం
జగద్గరిగుట్ట
చింతల్‌
షాపూర్‌నగర్‌
సూరారం కాలనీ
జీడిమెట్ల
కుత్బుల్లాపూర్‌

మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం
అల్వాల్‌
మచ్చ బొల్లారం
యాప్రాల్‌
డిఫెన్స్‌కాలనీ
మౌలాలీ
సఫిల్‌గూడ
గౌతమ్‌నగర్‌
ఓల్డ్‌ మల్కాజిగిరి

సికింద్రాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం
తార్నాక
మెట్టుగూడ
సీతాఫల్‌మండి
బౌద్దనగర్‌
చిలకలగూడ
అడ్డగుట్ట

కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గం
రాంగోపాల్‌పేట
మారెడ్‌పల్లి

అమీర్‌పేట

[మార్చు]
అమీర్‌పేట లోని ఆదిత్యా ఎంక్లేవ్ లో నేర్పబడే సాఫ్టువేరు కోర్సులు

ఒకప్పుడు నిజాం పరిపాలనలో అధికారులుగా పనిచేసిన వారు. జాగీర్థారులు ఇక్కడ నివసించేవారు. అమీర్‌ అంటే సంపన్నులని అర్థం దీంతో ఈ ప్రాంతానికి అమీర్‌పేట అని పేరు వచ్చింది. రాష్ట్రంలోనే అధికంగా సిక్కులు నివసిస్తున్న ప్రాంతం కూడా ఇదే. ఎందరో ఐటీ నిపుణులను తయారు చేస్తున్న సుమారు ఐదొందలపైగా సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ శిక్షణ సంస్థలు ఇక్కడ ఉండటం విశేషం. అమెరికాలో కూడా అమీర్‌పేట్‌ పేరు తెలియని ఐటీ నిపుణులుండరంటే అతిశయోక్తికాదు. తెల్లవారు జాము నుంచి చీకటి పడేవరకు విద్యార్థుల రద్దీతో అమీర్‌పేట్‌, మైత్రీవనం రహదారులు కిటకిటలాడుతుంటాయి. ప్రధాన కాలనీలు:శివబాగ్‌కాలనీ, ధరమ్‌కరమ్‌రోడ్‌, అమీర్‌పేట్‌ కుమ్మరిబస్తీ, గురుద్వారా బస్తీ, హరిజనాభాస్తీ, లీలానగర్‌, సంజీవరెడ్డినగర్‌ కాలనీ, అంకమ్మబస్తీ, ఈస్ట్‌ శ్రీనివాసనగర్‌కాలనీ, మైత్రీవనం, గాయత్రినగర్‌, గంగుబాయిబస్తీ, బీజేఆర్‌నగర్‌ పేస్‌-||, ఎస్‌.ఆర్‌.టి, 2 ఆర్‌టి, 3ఆర్‌టి క్వార్టర్లు.

  • ఎక్కువ ట్రాఫిక్‌ సమస్య ఉన్న వార్డు ఇదే.
  • రాజా ధరమ్‌కరమ్‌ పేరుపై ఏర్పాటైన వీధి
  • మూడు ఐదు నక్షత్రాల హోటళ్లు, శ్రీ గురుగోవింద్‌సింగ్‌ మల్టీపర్పస్‌ స్డేడియం
  • సిక్కు గురుద్వారా, ఆదిత్య ఎంక్లేవ్, మైత్రీ వనము, చాలా హాస్టళ్ళు నెలకొని ఉన్నాయి. రెడ్డీస్ ల్యాబ్స్, ఢిల్లీ మిఠాయి వాలా, మినర్వా హోటల్ ఇక్కడే ఉన్నాయి.

సంజీవరెడ్డినగర్ (ఎస్. ఆర్. నగర్)

[మార్చు]

సంజీవరెడ్డి నగర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఐ.పీ.ఎస్ అధికారి ఉమేశ్ చంద్ర నక్సలైట్ల చేతిలో ప్రాణాలని కోల్పోయింది ఈ కూడలి లోనే. అతని జ్ఞాపకార్థం అతని విగ్రహం ఇక్కడ స్థాపించారు.

ఎస్.ఆర్.నగర్

సోమాజీగూడ

[మార్చు]

సోమాజీగూడ హైదరాబాదులోని ఒక ప్రాంతం. సోమాజీ అనే నిజాం కాలం రెవెన్యూ విభాగం ఉద్యోగి హైదరాబాద్ ప్రాంతపు గూడెంలో నివసించేవాడు…ఆయన పేరుతో ఆ గూడెం కాస్తా సోమాజిగుడాగా మారింది. ముఖ్యమంత్రి నివాసం ఉండే చోటు. కీర్తిలాల్ జ్యువెలర్స్, పుల్లారెడ్డి నేతి మిఠాయిల దుకాణము, యశోద ఆసుపత్రి, నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) ఇక్కడ ఉన్నాయి.

ఎర్రగడ్డ

[మార్చు]

ఎర్రగడ్డ అనగానే చాలామందికి గోకుల్‌టాకీస్‌, మెంటల్‌ ఆసుపత్రి గుర్తుకొస్తాయి.ఎర్రగడ్డ ఖైరతాబాద్‌, సనత్‌నగర్‌, బాలానగర్‌ మండలాల పరిధిలో విస్తరించింది. వార్డు పరిధిలోని బస్తీలు:ఎర్రగడ్డ, ప్రేంనగర్‌, ఆనంద్‌నగర్‌, న్యూ ప్రేంనగర్‌, ఛత్రపతి శివాజీనగర్‌, బంజారానగర్‌, సుల్తాన్‌నగర్‌, ఓల్డు సుల్తాన్‌నగర్‌, లక్ష్మీ కాంప్లెక్స్‌, సీతారామయ్య టవర్స్‌, శాస్త్రినగర్‌, హేమవతినగర్‌, న్యూ శాస్త్రినగర్‌, శంకర్‌లాల్‌నగర్‌, నేతాజీనగర్‌, నటరాజ్‌నగర్‌, కళ్యాణ్‌నగర్‌ వెంచర్‌-3, ప్రభాత్‌నగర్‌, గౌతంపురి కాలనీ, సంజయ్‌నగర్‌, నందన్‌నగర్‌, వికాస్‌పురి కాలనీ, గుల్షన్‌నగర్‌, వెంకటేశ్వర కాలనీ.

  • ఆదివారం సంత సందర్భంగా ట్రాఫిక్‌ చిక్కులు, ఈ సంతలో కూరగాయలు, కోళ్లు, మేకలు మొదలుకుని ఎలక్ట్రిక్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు కూడా లభిస్తాయి.
  • మొట్టమొదటి మోడల్‌ రైతుబజార్‌ ఎర్రగడ్డ

ఇ ఎస్ ఐ

[మార్చు]

ఈ ప్రదేశంలో ESI ఆసుపత్రి కలదు

అబిడ్స్

[మార్చు]
అబీడ్స్ లో ఉన్న జనరల్ పోస్టు ఆఫీసు
జనరల్ పోష్టాపీసు. అబిడ్స్
అబీడ్స్ లో ఉన్న తాజ్ మహల్ హోటల్
తాజ్ మహల్ హోటల్, అబిడ్స్

ఈ ప్రదేశంలో అబీదు అనబడు ఒక మధ్యప్రాచ్య వ్యాపారవేత్త ఉండేవాడు. అరుదైన, విలువైన రాళ్ళను కోఠీలో ఉన్న నవాబుకి బహుమతులుగా ఇచ్చేవాడు. అందుకే ఈ ప్రదేశానికి అబీడ్స్ అనే పేరు వచ్చింది. ఇక్కడ ప్రభుత్వ తపాలా ప్రధాన కార్యాలయం ఉంది. ఇంకనూ పుల్లారెడ్డి మిఠాయిల దుకాణము, బిగ్ బజార్, సిటీ సెంట్రల్ మాల్, తాజ్ మహల్ హోటల్, బ్రాండ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ పుస్తకాలు ఎక్కువగా అమ్మబడు ప్రదేశం.

గన్‌ఫౌండ్రి

[మార్చు]

నిజాం నవాబులు యుద్ధంలో ఉపయోగించే ఫిరంగిలో వాడే మందు పౌడర్‌ను ఇక్కడ తయారు చేస్తుండేవారు. ఈ ప్రాంతాన్ని 'తోప్‌-కా-సాంచా'గా పిలిచేవారు. కాలక్రమేణా గన్‌ఫౌండ్రిగా మారిపోయింది. డివిజన్‌లోని ప్రాంతాలు: అగర్వాల్‌ చాంబర్స్‌, పూల్‌బాగ్‌, బ్యాండ్‌లైన్‌ బస్తీ, కట్టెలమండి, ఆదర్శ్‌ నగర్‌, నేతాజీనగర్‌, మురళీధర్‌బాగ్‌, మహేశ్‌నగర్‌, చిరాగ్‌అలీ లేన్‌, బషీర్‌బాగ్‌, గన్‌ఫౌండ్రి తదితర ప్రాంతాలు. ఎల్‌బీ స్టేడియం, దూర్‌ సంచార్‌భవన్‌, ఎస్‌బీహెచ్‌ ప్రధాన కార్యాలయం, వ్యవసాయ శాఖ కమిషనరేట్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌, ఎస్‌ఎస్‌సీ బోర్డు, రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌, ఆగాఖాన్‌ ఫౌండేషన్‌, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, దేశోద్ధారక భవన్‌, పరిశ్రమల భవన్‌, బిర్లామందిర్‌, షక్కర్‌ భవన్‌, హాకా భవన్‌, నిజాం కళాశాల, లేపాక్షి ఎంపోరియం, టెలిఫోన్‌ భవన్‌ (సూర్యలోక్‌ కాంప్లెక్స్‌), గగన్‌విహార్‌, జనరల్‌ పోస్టాఫీసు, చంద్రవిహార్‌, మానవ హక్కుల కమిషన్‌, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం, భారతీయ విద్యాభవన్‌ తదితర కార్యాలయాలన్నీ ఈ డివిజన్‌ పరిధిలో ఉన్నాయి. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా సెల్‌ఫోన్‌ మార్కెట్‌కు ప్రసిద్ధిగాంచిన చిరాగ్‌ అలీలేన్‌, ప్రముఖ బంగారు దుకాణాలు కూడా ఈ డివిజన్‌లో ఉన్నాయి. బ్రిటీషు కాలం నుంచి ఉన్న మిషనరీ స్కూళ్లు, నిజాం హయాంలో స్థాపించిన స్కూళ్లు గన్‌ఫౌండ్రి డివిజన్‌లోనే ఉన్నాయి. క్రైస్తవుల ప్రార్థనాలయాలు ఈ డివిజన్‌లోనే అధికం. లిటిల్‌ ఫ్లవర్‌, ఆల్‌ సెయింట్స్‌, రోజరీ కాన్వెంట్‌, సుజాత పాఠశాల‌, స్టాన్లీ, గ్రామర్‌ పాఠశాల‌తో పాటు స్లేట్స్‌ పాఠశాల‌, తదితర క్రైస్తవ మిషనరీ స్కూళ్లన్నీ ఇక్కడే. అదే విధంగా నిజాం హయాంలో ఏర్పాటు చేసిన మహబూబియా, ఆలియా విద్యాసంస్థలు, నిజాం కళాశాలలు ఈ డివిజన్‌ పరిధిలోకి వస్తాయి. మెథడిస్ట్‌, సెవెంత్‌ సెంటినరీ, క్యాథలిక్‌, రాక్‌ చర్చి తదితర క్రైస్తవ ప్రార్థన మందిరాలు ఇక్కడే ఉన్నాయి.

కోఠి

[మార్చు]

1798-1805 కాలంలో అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ ఆఫీసర్ జేమ్స్ అఖిలీస్ కర్క్‌పాట్రిక్ నివాసంగా ఇక్కడ పెద్ద భవనం కట్టారు. "కోటి" అంటే "ప్రాసాదం" అన్న పేరునుండి ఈ ప్రాంతానికి "కోఠి" అన్న పేరు వచ్చింది. తరువాత ఆ భవనాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళాకళాశాలగా 1949లో మార్చారు.

మహిళా కళాశాల, ఉస్మానియా వైద్య కళాశాల, గోకుల్ ఛాట్ భండార్ ఉన్నాయి. ప్రక్కనే ఉన్న సుల్తాన్ బజార్ అన్ని రకాల దుకాణాలకి పేరు పొందినది. ఫస్ట్ హ్యాండ్ పుస్తకాలతో బాటు, సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కూడా దొరుకుతాయి. నగరంలో దాదాపు ప్రతి ప్రదేశానికీ ఇక్కడినుండి సిటీబస్సులు ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలో ఉన్న ప్రదేశాలు - ఇమ్లీబన్ బస్ స్టేషను (రాష్ట్రంలో అతిపెద్ద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ స్టేషను), చాదర్ ఘాట్, ఆబీడ్స్, నారాయణగూడ (సినిమా థియేటర్లకు, విద్యా సంస్థలకు ప్రసిద్ధి చెందినది). సుల్తాన్ బజార్ అతి ముఖ్య వ్యాపార కేంద్రంగా ఉండేది. కాని ఇపుడు వ్యాపారం అన్ని ప్రదేశాలకు విస్తరించిన కారణంగా సుల్తాన్ బజార్ ప్రాముఖ్యత కొంతవరకు తగ్గింది. గిరిరాజ్ వీధి ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వస్తువుల వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. ఈ విధిలోనే ఒక పాతకాలపు కృష్ణమందిరం ఉంది. హోల్ సేల్ దుకాణాలు సమీప ంలోని ఇందర్‌బాగ్‌లో ఉన్నాయి.

ఈ ప్రాంతంలో శ్రీత్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, తెలంగాణ వైద్య విధాన పరిషత్తు వైద్యశాలలు కూడా ఉన్నాయి.

కోఠి నుండి వెడలే అనేక రోడ్లలో ఆబిడ్స్ వైపు వెళ్లే రోడ్డును "బ్యాంక్ స్ట్రీట్" అంటారు. ఇక్కడ అనేక బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాలున్నాయి. ఆ వీధి చివరిలో యాబిడ్స్ వద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయం ఉంది.

సుల్తాన్‌బజార్ ‌

[మార్చు]

1933లో రెసిడెన్సీ బజార్ పేరుతో కొనసాగుతున్న ఆసియాలోనే అతిపెద్ద బజార్ సుల్తాన్ బజార్గా మారింది. గోషామహల్‌ నియోజకవర్గంలోని ఎనిమిది మున్సిపల్‌ డివిజన్లలో సుల్తాన్‌బజార్‌ డివిజన్‌ ఒకటి. వ్యాపార కేంద్రంగా రాష్ట్రంలోనే సుల్తాన్‌బజార్‌కు ప్రత్యేక పేరుంది. ప్రతి రోజు కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు సాగుతాయి. మార్వాడీలు ఇక్కడ అధికంగా ఉన్నారు. డివిజన్‌లోని

కోఠి కూడలిలో వున్న అమర వీరుల స్మారక స్థూపము.
విక్టరీ ప్లేగ్రౌండు వద్ద వున్న ప్రపంచ యుద్ధ వీరుల స్మారక స్థూపం

ప్రాంతాలు... -సుల్తాన్‌బజార్‌, కందస్వామిలేన్‌, కాపాడియా లేన్‌, జగన్నాథ్‌జీరా, గాఢీఖానా, హనుమాన్‌టేక్డీ, బొగ్గులకుంట, కింగ్‌కోఠి, ఛౌదరీబాగ్‌, కృపారాంబాగ్‌, రాంకోఠి, బడీచౌడి, కోఠి, బ్యాంక్‌స్ట్రీట్‌, పుత్లీబౌలి చౌరస్తా, రంగ్‌మహల్‌, ట్రూప్‌బజార్‌, గుజరాతీగల్లి, గిరిరాజ్‌లేన్‌, ఇందర్‌బాగ్‌, ఇసామియాబజార్‌, పోచమ్మబస్తీ, కుత్భిగూడ, రెసిడెన్సీక్వార్టర్స్‌, టి.వి.హోటల్‌లేన్‌, ఆగ్రాహోటల్‌లేన్‌, రంగ్‌మహల్‌ చౌరస్తా, పుత్లీబౌలి, ఎం.జే.మార్కెట్‌, గౌలిగూడ, రాంమందిర్‌లేన్‌, గ్రీన్‌హోటల్‌లేన్‌-సుల్తాన్‌బజార్‌, కోఠి, బ్యాంక్‌స్ట్రీట్‌, గుజరాతీగల్లి, గిరిరాజ్‌లేన్‌, ఇందర్‌బాగ్‌, హరిదాస్‌ మార్కెట్‌, పుత్లిబౌలి, ట్రూప్‌బజార్‌, హస్మత్‌గంజ్‌, జైన్‌మందిర్‌లేన్‌, బడీచౌడి, బొగ్గులకుంట, గౌలిగూడ బస్టాండ్

  • సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి, ఈఎన్‌టీ ఆసుపత్రి., కోఠి మహిళా కళాశాల, ఉస్మానియా వైద్య కళాశాల. డిఎంహెచ్‌ఎస్‌ క్యాంపస్‌..., కేంద్రీయ సదన్‌..సీబీఐ, ఇంటలిజెన్స్‌ కార్యాలయాలు, బ్యాంక్‌స్ట్రీట్‌..
  • కోఠి మహిళా కళాశాలలోని చారిత్మాతకమైన దర్భార్‌ హాల్‌. కోఠిలోని ఆంధ్రాబ్యాంక్‌ చౌరస్తా వద్ద గల అమరవీరుల స్థూపం.- సుల్తాన్‌బజార్‌లోని క్లాక్‌టవర్‌.

చాధర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌ వద్ద గల స్థూపం. కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రి భవనం. కోఠిలోని గాంధీజ్ఞాన్‌ మందిర్‌. సుల్తాన్‌బజార్‌లోని జైన్‌ మందిరం. హస్మత్‌గంజ్‌లోని ఖబూతర్‌ఖానా. కోఠిలోని విశ్వహిందూ పరిషత్‌ కార్యాలయం.

షాలిబండ

[మార్చు]

ఏనుగుల వీరాస్వామయ్య ఈ ప్రాంతాన్ని 1830లో సందర్శించి కాశీయాత్ర చరిత్రలో ఈ ప్రాంతంలో అప్పటిస్థితిగతుల గురించి వ్రాశారు.

దోమల్ గూడ

[మార్చు]

ఇద్దరు మల్ల యోధులు నివాసం ఉండటం వలన దీనికి ఈ పేరు వచ్చింది. (దోమల గూడ కాదు, దో మల్ గూడ) ఈ ప్రాంతంలో రామకృష్ణ మఠం, ఉంది.

బల్కంపేట

[మార్చు]

అమీర్‌పేట డివిజన్‌ నుంచి కొన్ని బస్తీలు వేరుచేసి బల్కంపేటను ఏర్పాటు చేశారు. ఉన్నత చదువుల కోసం వచ్చే వారు ఎక్కువగా ఈ ప్రాంతంలో అద్దెలకు ఉంటారు.ప్రధాన కాలనీలు:బల్కంపేట, బీజే ఆర్‌నగర్‌, ప్రశాంత్‌నగర్‌, బీకేగూడలోని కాలనీలు, బస్తీలు, లింగయ్యనగర్‌, సుభాష్‌నగర్‌, సాయిబాబానగర్‌, శామలకుంట, రాజరాజేశ్వరీనగర్‌, ఉదయ్‌నగర్‌, మోడల్‌కాలనీ, సుందర్‌నగర్‌, ఈఎస్‌ఐ క్వార్టర్స్‌, రేణుకానగర్‌, నీమ్‌కార్‌నగర్‌, బాపూనగర్‌, దాసారంబస్తీ, జయప్రకాష్‌నగర్‌, కైలాష్‌నగర్‌, మజీద్‌బస్తీ.

  • బీకేగూడ, ఎస్‌ఆర్‌టీ, ఇడబ్ల్యూఎస్‌ కాలనీల మధ్య చెత్త డంపింగ్‌ యార్డు
  • రేణుకా ఎల్లమ్మ ఆలయం
  • స్వాతంత్య్రానికి ముందు నుంచి ఉన్న బాపూనగర్‌ బస్తీ

హఫీజ్‌పేట

[మార్చు]

గ్రేటర్‌ పరిధిలో 113వ డివిజన్‌.హైటెక్‌సిటీ చెంతనే ఉంది.డివిజన్‌ పరిధిలోని కాలనీలు:హఫీజ్‌పేట, కొండాపూర్‌ ప్రాంతంలోని హనుమాన్‌నగర్‌, భిక్షపతినగర్‌, ఇజ్జత్‌నగర్‌, శిల్పాపార్కు, ఖానామెట్‌, చంద్రనాయక్‌తాండ, సుభాష్‌చంద్రబోస్‌నగర్‌, ఆదిత్యనగర్‌, సాయినగర్‌, యూత్‌కాలనీ, ఆర్టీసీ కాలనీ, హుడాకాలనీ, మదీనాగూడ, బి.హెచ్‌.ఈ.ఎల్‌ హెచ్‌ఐజీ, మైత్రీనగర్‌, ఆల్వీన్‌కాలనీ, జనప్రియనగర్‌, జనప్రియ, ప్రజయ్‌సిటీ, గంగారం, ఇంజనీర్స్‌ ఎన్‌క్లేవ్‌, గోకుల్‌ప్లాట్స్‌, అంబేద్కర్‌నగర్‌, రాజారాంనగర్‌

  • స్వతంత్ర సమరయోధులు నివాసముండే ప్రతిష్ఠాత్మకమైన సీ.ఆర్‌.ఫౌండేషన్‌, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు నిర్వహించే హైటెక్స్‌, హెచ్‌ఐసీసీ కేంద్రాలు, ఐదునక్షత్రాల హోటల్‌ నవోటల్‌, చార్మినార్‌ను తలపించే అతిపెద్ద హైటెక్స్‌ కమాన్‌ ముఖద్వారం, నిరుద్యోగులకు నిర్మాణరంగంలో శిక్షణ ఇచ్చే న్యాక్‌, కొండాపూర్‌ ఆర్టీయే కార్యాలయం

నెక్లెస్ రోడ్

[మార్చు]
హుసేన్ సాగర్ తీరంలో మూడవ అతిపెద్ద జాతీయపతాకం

హుసేన్ సాగర్ తీరం వెంబడి సాగిపోయేది నెక్లెస్ రోడ్ రోడ్డు ఇది. పచ్చదనంతో కళకళ లాడుతూ చూపరులను ఆకట్టుకుంటుంది.

పంజాగుట్ట

[మార్చు]

పంజాగుట్ట వార్డు పరిధిలోని కాలనీలు, బస్తీలు:హిందీనగర్‌, ద్వారకాపురికాలనీ, మార్కెట్‌బస్తీ, బాలాపురబస్తీ, బంజారాఎవెన్యూ, ఎర్రమంజిల్‌, ఆజామ్‌జా బహుదూర్‌నగర్‌, రామకృష్ణానగర్‌, తబేలా బస్తీ, హిల్‌టాప్‌కాలనీ, పద్మావతీనగర్‌కాలనీ, వెంకటరమణకాలనీ, నవీన్‌నగర్‌కాలనీ, తాతానగర్‌, ఆనంద్‌నగర్‌కాలనీ ఎక్సెటెన్సన్‌ బస్తీ, రవీంద్రనగర్‌, ఆనంద్‌నగర్‌కాలనీ, ప్రేమ్‌నగర్‌, చింతలబస్తీ, తుమ్మలబస్తీ, బెస్తబస్తీ, టెలిఫోన్‌కాలనీ, ఎ.సి. గార్డ్స్‌, మోహిదీపంక్షన్‌హాల్‌, అహ్మద్‌మీర్జా కాంపౌండ్‌

హైదరబాద్ సెంట్రల్ మాల్

లకిడీ కా పూల్

[మార్చు]

లకిడీ కా పూల్ కర్రతో చేసిన వంతెన అని అర్థం. నగరానికి నడి బొడ్డు. నగర కూడళ్ళలో ఇది ప్రధానమైనది. పోలీసు కంట్రోలు కార్యాలయము, అశోక హోటల్, రవీంద్ర భారతి ఇక్కడ ఉన్నాయి. (తమాషా ఏంటంటే ఒకప్పుడు ఇక్కడ ఎ.సి. గార్డ్స్ దగ్గర పిక్చర్ ప్యాలెస్ అనే సినిమా హాలు కట్టబోతున్నారని తెలిసి దీనిని పిక్చర్ ప్యాలెస్ గానే వ్యవహరించేవారు. కానీ, అనివార్య కారణాల వలన దానిని నిర్మించలేదు. తర్వాత కూడా చాలాకాలం అదే పేరుతో వ్యవహరించబడేది. ఇప్పుడున్న గంగా-జమునా కేఫ్ యే ఆ ప్రదేశం.)

లకిడీ కా పుల్ నుండి ఖాన్ లతీఫ్ ఖాన్ ఎస్టేట్, ఇందులోనే ప్రముఖ ఉర్దూ పత్రిక, ది మున్సిఫ్ కలదు
లకిడీ కా పుల్ లో ఒక బస్ స్టాండు వద్ద "రాయలసీమ రుచులు" హోటల్ ప్రకటన

బేగంపేట

[మార్చు]

బేగంపేట అటు ఎయిర్‌పోర్ట్‌, ఇటు హుస్సేన్‌సాగర్‌ నడుమ సర్దార్‌పటేల్‌ (ఎస్పీరోడ్డు) ఇరువైపులా చిన్న కాలనీలు, బస్తీలు కలసి దాదాపు ఆరు కిలోమీటర్లు పోడవునా విస్తరించి ఉంది. బేగంపేట రైల్వేస్టేషను‌ మొదలుకొని ప్యాట్నీ సెంటరు వరకు డివిజన్‌ విస్తరించి ఉంది.రైల్వేస్టేషను‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు ఇరువైపులా ఉన్న డివిజన్‌ పరిధి అక్కడ నుంచి రోడ్డుకు కుడివైపు మాత్రమే ప్యాట్నీ సెంటర్‌ వరకు ఉంది.ఈ డివిజన్‌లో సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, బాలనగర్‌ మూడు ఎమ్మార్వో కార్యాలయాల పరిధి ఉంది. అంతే కాక సనత్‌నగర్‌, కూకట్‌పల్లి రెండు నియోజక వర్గాలు వస్తాయి. సికింద్రాబాద్‌, మల్కాజిగిరి రెండు పార్లమెంట్‌ స్థానాల పరిధి కూడా వస్తుంది.నిజాం నవాబు పైగా రాజులకు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు. నవాబులకు చెందిన వికార్‌మంజిల్‌లో సినిమా షూటింగ్‌లు జరుగుతుంటాయి. నిజాం ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల పిల్లలు చదువుకునేందుకు 160 ఎకరాల్లో ఏర్పాటైన జాగీర్ధార్‌ కళాశాల ప్రస్తుత హైదరాబాద్‌ పబ్లిక్‌ పాఠశాల‌.నగరంలో మొదటి మేయర్‌ బేగంపేట నుంచే వచ్చారు. గతంలో బేగంపేట, ప్రకాష్‌నగర్‌ రెండు మున్సిపల్‌ వార్డులుగా ఉండేవి. ప్రధాన ప్రాంతాలు: బేగంపేట బస్తీ, బ్రాహ్మవాడి, మాతాజీనగర్‌, అల్లంతోటబావి, మయూరిమార్గ్‌, ద్వారకాదాస్‌కాలనీ, చికోటీగార్డెన్‌, శ్యాంలాల్‌ బిల్డింగ్స్‌, తాతాచారి కాలనీ, భగత్‌సింగ్‌నగర్‌, మోతీలాల్‌ నెహ్రునగర్‌, భగవంతపూర్‌, గగన్‌విహార్‌, ప్రకాష్‌నగర్‌, వికార్‌నగర్‌, ఎన్‌బీటీనగర్‌, పాటిగడ్డ, సిందికాలనీ, ఎల్లమ్మబండ, దనియాలగుట్ట శ్మశానవాటిక, ఫతేనగర్‌ బ్రిడ్జి, స్వామిరామానందతీర్థ, స్వామి సచ్చిదానంద ఆశ్రమం, పుష్పగిరి శంకరాచార్య ఆధ్యాత్మిక ఆశ్రమం, స్వామి యోగానంద కార్యాలయం, కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయం, కేసరి హనుమాన్‌, ప్రకాష్‌నగర్‌ హనుమాన్‌ దేవాలయం, మ్యాక్సీవిజన్‌ నేత్ర చికిత్స ఆసుపత్రి, బేగంపేట మహిళా కళాశాల, వెస్లీ కళాశాల, భూ ఖనిజాల పరిశోధనశాల, బేగంపేట రైల్వేస్టేషను‌, సంజీవయ్య పార్కు రైల్వేస్టేషన్లు, పైగా ప్యాలెస్‌, మలానీ బిల్డింగ్‌, చిరాన్‌పోర్టు, షాపింగ్‌ మాల్స్‌ పాంథలూన్‌, షాపర్స్‌స్టాప్‌, రిలయన్స్‌ ట్రెండ్స్‌, ఫుడ్‌వరల్డ్‌, బిగ్‌ఎఫ్‌ఎం, రేడియోమిర్చి, ఐసీఐసీఐ రాష్ట్ర ప్రధాన కార్యాలయం, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ల ప్రధాన కార్యాలయాలు, హోటల్‌ ఫార్ట్యూన్‌ మనోహర్‌ అయిదు నక్షేత్రాల హోటల్‌, కామత్‌లింగాపూర్‌ మూడు నక్షేత్రాల హోటల్‌, సెలబ్రెటీ బోటిక్యూ, చిరాన్‌పోర్టు క్లబ్‌, ఫ్యామీలీ వరల్డ్‌, బాటిల్స్‌ అండ్‌ చిమ్నీ పబ్‌, పైగా, బేగంపేట, సెంచరీ గార్డెన్స్‌ ఫంక్షన్‌హాల్స్‌, సత్యం, పొలారీస్‌, జీఈ, విప్రొ, సొనాటా, ఇన్‌టెల్లీగ్రాఫ్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, నాలుగు ప్త్లెఓవర్లు.

బంజారా హిల్స్

[మార్చు]

ఒకప్పుడు బంజారా జాతీయులు అధికంగా ఉండే ప్రాంతమిది. కాలక్రమేణా అత్యధిక ధనికులుండే నివాసంగా మారింది. బంజారాహిల్స్‌లో 1930 దాకా, అంతక్రితం వరకు బంజారా జాతీయులు ఇక్కడున్న కొండ ప్రాంతాల్లో అధికంగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని బంజారాహిల్స్‌గా పిలుస్తున్నారు. నేటికీ అదేపేరుతో ప్రాచుర్యం పొందింది. సినిమా తారలు, రాజకీయవేత్తలు ఉండే ఖరీదైన ప్రదేశం. తాజ్ బంజారా హోటల్, జి వి కే వన్ మాల్ ఇక్కడ ఉన్నాయి. స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, మాన్స్ టర్ ఇండియా కూడా ఇక్కడే ఉన్నాయి. అబీడ్సు లోని సిటీ సెంటర్ కన్నా ఈ ప్రదేశంలో ఉన్న సిటీ సెంటర్ కే ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఇక్కడ జలగం వెంగళరావు ఉద్యానవనం ఉంది.

జూబిలీ హిల్స్

[మార్చు]

బంజారా హిల్స్ ని ఆనుకుని ఉన్న మరొక ప్రదేశము. సంపన్నులు ఉండే ప్రదేశం.

హైటెక్ సిటీ

[మార్చు]

హైదరాబాద్ లోని సాఫ్ట్‌వేర్ సంస్థలకు ప్రధాన కేంద్రం. ఇక్కడ ఉన్న సైబర్ టవర్స్, సైబర్ పెర్ల్, సైబర్ గేట్‌వే, రహేజా మైండ్‌స్పేస్ మొదలైన ఐటి పార్కుల్లో దేశ విదేశాలను చెందిన అనేక కంపెనీలు కొలువై ఉన్నాయి. ఒకప్పుడు కొండలు గుట్టలతో నిండి ఉన్న ఈ ప్రదేశం సాఫ్ట్‌వేర్ సంస్థల పుణ్యమా అని హైదరాబాదు కే తలమానికంగా మారింది.

చందానగర్‌

[మార్చు]

భెల్‌ పరిశ్రమకు అత్యంత దగ్గరగా ఉండటంతో చందానగర్‌ ప్రాంతంలో అభివృద్ధి శరవేగంగా జరిగింది. డివిజన్‌ పరిధిలోని కాలనీలు:చందానగర్‌, మదీనాగూడ, ఆర్‌బీఆర్‌, సీబీఆర్‌, ప్రశాంత్‌నగర్‌, ఎంఏనగర్‌, స్టాలిన్‌నగర్‌, పీఏనగర్‌, హెచ్‌ఎంటీ స్వర్ణపురి, మక్తమహబూబ్‌పేట గ్రామం, జేపీఎన్‌నగర్‌, బీకే, డీకే ఎన్‌క్లేవ్‌, ప్రజయ్‌షెల్టర్‌, మియాపూర్‌ విలేజ్‌, ప్రగతినగర్‌, మయూరినగర్‌, ఎఫ్‌సీఐ కాలనీ, న్యూకాలనీ, లక్ష్మినగర్‌, నడిగడ్డతాండ, ఎస్‌ఎంఆర్‌, ఇందిరానగర్‌, శివాజీనగర్‌, రైల్‌విహార్‌, హుడాట్రేడ్‌ సెంటర్‌, శాంతినగర్‌, లింగంపల్లి సిటిజెన్‌కాలనీ, రాజీవ్‌నగర్‌, శంకర్‌నగర్‌, భవానీపురం, వేమనకాలనీ, వేముకుంట, సురక్షఎన్‌క్లేవ్‌, ధర్మపురి క్షేత్రం, దీప్తీశ్రీనగర్‌లో ఇండోర్‌ స్టేడియం, రెడ్డీస్‌ పరిశోధన కేంద్రం, తారానగర్‌లో కూరగాయల మార్కెట్‌, హుడా ట్రేడ్‌ సెంటర్‌.

మాదాపూర్

[మార్చు]
మాధాపూర్ లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్

శిల్పారామం

[మార్చు]
శిల్పారామం ముఖద్వారం
పొలం దున్నుతున్న రైతు

శిల్పారామం ఇక్కడ హస్త కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శింప బడతాయి.

చర్లపల్లి

[మార్చు]

చర్లపల్లి అనేది కాప్రా సర్కిల్లో అతి పెద్ద డివిజన్‌. డివిజన్‌లోని కాలనీలు.: పెద్ద చర్లపల్లి, చిన్న చర్లపల్లి, చర్లపల్లి పారిశ్రామికవాడ, పుక్కట్‌నగర్‌, భరత్‌నగర్‌, మింట్‌కాలనీ, మహాలక్ష్మీనగర్‌, రైల్వే ఎంప్లాయిస్‌ కాలనీ, ఈసీనగర్‌, రైల్‌విహార్‌ కాలనీ, బీఎన్‌రెడ్డినగర్‌, హెచ్‌సీఎల్‌కాలనీ పార్ట్‌, డీఏఈ కాలనీ, నార్త్‌ కమలానగర్‌, కుషాయిగూడ, పారిశ్రామికవాడ, కుషాయిగూడ గ్రామం, హన్మాన్‌నగర్‌, భాగ్యనగర్‌, వీఎన్‌రెడ్డినగర్‌, సుభాష్‌నగర్‌, సాయికృష్ణా ఎన్‌క్లేవ్‌, సాయినగర్‌, కృష్ణారెడ్డినగర్‌, నాగార్జుననగర్‌, శివసాయినగర్‌, ఇందిరానగర్‌, లక్ష్మీనర్సింహనగర్‌, శుభోదయనగర్‌, మీనాక్షీనగర్‌, వాసవీ శివానగర్‌, చక్రీపురం, టీచర్స్‌కాలనీ, భగవాన్‌కాలనీ, మారుతీనగర్‌, సీతారాంనగర్‌, కృష్ణానగర్‌, హన్స్‌ ఎన్‌క్లేవ్‌, పరిమళానగర్‌, సుబ్రహ్మణ్యనగర్‌, మార్కండేయ నగర్‌, శ్రీనగర్‌, విరాట్‌నగర్‌, అశోక్‌ మనోజ్‌నగర్‌, జైజవాన్‌, జైకిసాన్‌కాలనీ, జమ్మిగడ్డ, జీఆర్‌రెడ్డి నగర్‌, ఆదర్శనగర్‌. ఈసీఐఎల్‌, హెచ్‌సీఎల్‌, విమ్టా ల్యాబ్స్‌, గ్రీన్‌ఫీల్డ్‌ ఇరిగేషన్‌ లిమిటెడ్‌, కేఎల్‌ఆర్‌ రిగ్స్‌, సీపెట్‌ కాలేజ్‌, సీమెట్‌ ప్రయోగశాల, హెచ్‌పీసీఎల్‌, ఇండియన్‌ గ్యాస్‌ సంస్థలు ఈ డివిజన్‌ పరిధిలోనివే. ఖైదీల వ్యవసాయ క్షేతం (ఓపెన్‌ ఎయిర్‌ జైల్‌), రైల్వే స్టేషన్లు ఉన్నాయి. డీఏఈ కాలనీ, ఈసీనగర్‌, రైల్‌విహార్‌, రైల్వే ఎంప్లాయిస్‌ కాలనీ, మింట్‌కాలనీ, హెచ్‌సీఎల్‌ టౌన్‌షిప్‌ ఉన్నాయి.

మల్లాపూర్ ‌

[మార్చు]

మల్లాపూర్ కాలనీలు:ఎ.పి.హెచ్‌.బి.కాలనీ ఫేజ్‌-1, ఎ.పి.హెచ్‌.బి.కాలనీ ఫేజ్‌-2, మంగాపురం, ఇందిరానగర్‌ కాలనీ ఫేజ్‌-1, ఇందిరానగర్‌కాలనీ ఫేజ్‌-2, లక్ష్మీనగర్‌, వెంకటేశ్వరనగర్‌, తిరుమలనగర్‌, కృష్ణానగర్‌, రాజీవ్‌నగర్‌, బక్షిగూడ, కైలాసగిరి, నవోదయనగర్‌, మల్లాపూర్‌ ఓల్డ్‌ విలేజి పార్టు, నెహ్రూనగర్‌, హెచ్‌.సి.ఎల్‌కాలనీ పార్టు, నర్సింహనగర్‌, ఎన్టీఆర్‌నగర్‌, న్యూ నర్సింహనగర్‌, ఓల్డ్‌మీర్‌పేట, శాంతినగర్‌, అన్నపూర్ణకాలనీ (మీర్‌పేట), అశోక్‌నగర్‌, మర్రిగూడ.

  • హెచ్‌.బి.కాలనీ విగ్రహాలకు ప్రతీతి. కాలనీలోని రెండు ప్రధాన మార్గాల్లోనూ మహాత్మాగాంధీ, స్వామి వివేకానంద, ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజు, ఇందిరాగాంధీ, జగ్జీవన్‌రామ్‌, మహాత్మా బసవేశ్వర, రాజీవ్‌పార్కులో రాజీవ్‌గాంధీ, రాజీవ్‌నగర్‌లో అంబేద్కర్‌, రాజీవ్‌గాంధీ విగ్రహాలున్నాయి..
  • కైలాసగిరి మల్లికార్జునస్వామి, మంగాపురంలో శ్రీవెంకటేశ్వర స్వామి, ద్వారకామయి షిరిడీ సాయిబాబా, వెంకటేశ్వరనగర్‌లో సాయిబాబా సంస్థాన్‌ ట్రస్టు ఆలయాలతో పాటు ప్రసన్నాంజనేయస్వామి ఆలయం కాలనీలో ప్రసిద్ధి చెంది ఉన్నాయి.

నాచారం

[మార్చు]

తార్నాక-ఉప్పల్‌ ప్రధాన రహదారిపై హబ్సిగూడ చౌరస్తా నుంచి ఎన్‌.ఎఫ్‌.సి వెళ్లే ప్రధాన రహదారికి రెండు వైపులా నాచారం విస్తరించి ఉంటుంది. డివిజన్‌ పరిధిలోని కాలనీలు...: రాఘవేంద్రనగర్‌, రవీంద్రనగర్‌, అన్నపూర్ణకాలనీ, శాంతిగార్డెన్స్‌, ఇందిరానగర్‌, బాపూజీనగర్‌, హెచ్‌ఎంటీనగర్‌, జహీర్‌నగర్‌, సైంటిస్ట్స్‌కాలనీ, నాగేంద్రనగర్‌, సాయి ఎన్‌క్లేవ్‌, స్నేహపురికాలనీ, వీఎస్‌టీకాలనీ, సాయిదుర్గాగార్డెన్‌, శ్రీనగర్‌, భవానీనగర్‌, కార్తికేయనగర్‌, రాజీవ్‌నగర్‌, నాచారం ఓల్డ్‌విలేజి, అంబేద్కర్‌నగర్‌, ఎర్రకుంట, శ్రీరాంనగర్‌, గాంధీనగర్‌, కౌండిన్యనగర్‌, వీరారెడ్డికాలనీ, ఈఎస్‌ఐ క్వార్టర్స్‌, సావర్కర్‌నగర్‌, రాంరెడ్డినగర్‌, జనప్రియనివాస్‌, బాబానగర్‌, దుర్గానగర్‌, సింగంచెరువు, కె.ఎల్‌.రెడ్డినగర్‌, జనప్రియ టౌన్‌షిప్‌, మేఫ్లవర్‌ పార్క్‌, లింగమయ్యనగర్‌, అన్నపూర్ణకాలనీ (మల్లాపూర్‌), మల్లాపూర్‌ ఓల్డ్‌విలేజి పార్టు, చండియానగర్‌, సుభాష్‌నగర్‌, నాగలక్ష్మీనగర్‌, బ్రహ్మపురికాలనీ, సూర్యానగర్‌, చాణిక్యపురి, దత్తాత్రేయనగర్‌, గోకుల్‌నగర్‌, మల్లికార్జుననగర్‌, శక్తిసాయినగర్‌.

  • ఈఎస్‌ఐ ఆసుపత్రి, రామకృష్ణ సినీ స్టూడియో, స్నేహపురి, ఐఐసీటీ, సీసీఎంబీ సంస్థలు, రెండు మహిళా పి.జి.కళాశాలలున్నాయి.

కొత్తపేట

[మార్చు]

కాలనీలు..:సీటీఓకాలనీ, మోహన్‌నగర్‌, శృంగేరికాలనీ, కొత్తపేట, ఎస్‌ఆర్‌ఎల్‌ కాలనీ, న్యూమారుతీనగర్‌, గౌడ్స్‌కాలనీ, ఫణిగిరికాలనీ, మారుతీనగర్‌, ఇందిరానగర్‌, చైతన్యపురి, విద్యుత్తునగర్‌, న్యూ దిల్‌సుఖ్‌నగర్‌, మున్సిపల్‌కాలనీ, గణేష్‌పురి, నాగోలు, న్యూనాగోలు, వెంకటరమణకాలనీ, సాయినగర్‌, ఆదర్శనగర్‌, స్నేహపురికాలనీ, సమతాపురి, నువ్వులబండ, జైపురికాలనీ.

  • మూసీ పరీవాహక ప్రాంతం సుమారు 6 కి.మీ. వరకు ఉన్న వార్డు
  • మూసీ నీటిని శుద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన 172 ఎం.ఎల్‌.డి. సామర్థ్యం ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రం
  • రాష్ట్రంలో అంధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'బ్త్లెండ్స్‌ కాలనీ'
  • రాష్ట్రంలో అతి పెద్ద గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌
  • గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను పెద్దఅంబర్‌పేటకు తరలించి, దాంట్లో దిల్‌ షుక్ నగర్‌ డిపోను ఏర్పాటు చేసే ప్రతిపాదన
  • దేశంలోనే అతిపెద్ద డ్రైవింగ్‌ పరీక్షా కేంద్రం

మన్సూరాబాద్ ‌

[మార్చు]

ఒకప్పటి 'మేజర్‌' గ్రామ పంచాయతీ.వార్డు పరిధిలోని కాలనీలు..: బండ్లగూడ, అజయ్‌నగర్‌, కృషీనగర్‌, ఆనంద్‌నగర్‌, ఇంద్రప్రస్థకాలనీ, ఫతుల్లాగూడ, త్యాగరాయనగర్‌, మల్లికార్జుననగర్‌, సౌత్‌ఎండ్‌పార్కు, మన్సూరాబాద్‌, వీకర్‌సెక్షన్‌కాలనీ, ఆర్టీసీకాలనీ, రాజీవ్‌గాంధీనగర్‌, శివగంగనగర్‌, చంద్రపురికాలనీ, సరస్వతీనగర్‌, చింతల్‌కుంట, సహారాస్టేట్స్‌, విజయశ్రీకాలనీ.

  • ఫతుల్లాగూడ నుంచి ఆటోనగర్‌ వరకు 4 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం
  • భూవైజ్ఞానికసర్వేక్షణా సంస్థ (జీఎస్‌ఐ) బండ్లగూడలో ఉంది.
  • మన్సూరాబాద్‌లోని కుమ్మరి పనివారు
  • త్యాగరాయనగర్‌లోని 250 మంది నాదస్వర, డోలు విద్వాంసులు
  • మన్సూరాబాద్‌లోని పది పడకల ఆస్పత్రి, కామినేనికార్పొరేటు ఆస్పత్రి
  • అతిపెద్ద గేటెడ్‌ కమ్యూనిటీ సహారా ఎస్టేట్స్‌

తలాబ్‌ చంచలం

[మార్చు]

చార్మినార్‌కు అతి సమీప ంలో భాగమతి సమాధులు, నిజాం కాలం నాటి అనేక మసీదులు, ఉన్నాయి. సమాధుల చెంతనే చెరువు ఉండటం వల్ల ఈ ప్రాంతానికి తలాబ్‌ చంచలం అనే పేరు వచ్చింది. డివిజన్‌ పరిధిలోని ప్రాంతాలు:అమ్మన్‌నగర్‌, తలాబ్‌కట్ట, రైల్వే ట్రాక్‌, ఓల్డ్‌ సిటీ వాల్‌, భవాని నగర్‌, సుల్తాన్‌షాహి, జంక్షన్‌, బండిఅడ్డా .

గౌలిపురా

[మార్చు]

డివిజన్‌ పరిధిలోని ప్రాంతాలు:గౌలిపురా, లాల్‌దర్వాజా, బాలాగంజ్‌, మగ్దూంపురా, కుమ్మరివాడి, గౌలిపురా కబేళా, మేకలమండి, సీఐబీ క్వార్టర్స్‌, ఉప్పుగూడ హనుమాన్‌నగర్‌, ఉప్పుగూడ అంబికానగర్‌, పటేల్‌నగర్‌, ఉప్పుగూడ దానయ్యనగర్‌, వివేకానందనగర్‌, ఎస్‌ఆర్‌టీ కాలనీ, ఛత్రినాక, రామస్వామి గంజ్‌, అయోధ్యనగర్‌, తొవ్వలబావి, రామస్వామిగంజ్‌, అచ్చయ్యనగర్‌, శ్రీరాంనగర్‌ కాలనీ

  • లాల్‌దర్వాజా శ్రీసింహవాహినీ మహంకాళీ దేవాలయం, గౌలిపురా భారతమాత మహంకాళీ దేవాలయం, కోటమైసమ్మ దేవాలయం, ఉప్పుగూడ మంగళముఖి హనుమాన్‌ దేవాలయం, హనుమాన్‌నగర్‌ బంగారుమైసమ్మ దేవాలయం, నవదుర్గ ఆలయం, శ్రీరాంనగర్‌ అయ్యప్ప స్వామి దేవాలయం, గౌలిపురా కోదండ రామస్వామి దేవాలయం, జట్‌పట్‌దర్గా

జంగమ్మెట్‌

[మార్చు]

గ్రేటర్‌లో ఎస్టీ మహిళకు రిజర్వు అయిన ఏకైక డివిజన్‌.డివిజన్‌ పరిధిలోని ప్రాంతాలు :జంగమ్మెట్‌, జంగమ్మెట్‌ మార్కెట్‌, రవీంద్రనాయక్‌ కాలనీ, బుడుగ జంగాల కాలనీ, ఫలక్‌నుమా స్టేషను‌రోడ్డు, యాదగిరినగర్‌, ముదిరాజ్‌నగర్‌, నాగులబండ, చాంద్రాయణగుట్ట, ఘాజీమిల్లత్‌ కాలనీ, అల్‌సరూర్‌ కాలనీ, నిమ్రాకాలనీ, సాదత్‌నగర్‌, జి.ఎం.చావునీ, కందికల్‌గేట్‌, బోయిగూడ, భట్‌జీనగర్‌, శివగంగానగర్‌, హమాంబౌలి, లక్ష్మీనగర్‌, జయప్రకాశ్‌నగర్‌, ఛత్రినాక, లాల్‌దర్వాజా ఓంనగర్‌, పూల్‌బాగ్‌, రాజన్నబావి, శివాజీనగర్‌, ఖాద్రీచమన్‌, మున్సిపల్‌ కాలనీ .

  • పూల్‌బాగ్‌ వేకటేశ్వరస్వామి దేవాలయం, ఛత్రినాక లక్ష్మణేశ్వరస్వామి దేవాలయం, రాజన్నబావి భవానీ శంకర ఆలయం, చిత్రగుప్త దేవాలయం, భట్‌జీబాపూ మందిర్‌, శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాలు.

అడిక్‌మెట్ ‌

[మార్చు]

అడిక్‌మెట్ డివిజన్ లో కాలనీలు, బస్తీలు:లలితానగర్‌కాలనీ, బాలాజీనగర్‌, గణేష్‌నగర్‌, ఎస్‌ఆర్‌టీ కాలనీ, ఈస్ట్‌ పార్సిగుట్ట మున్సిపల్‌కాలనీ, ఈడబ్ల్యూఎస్‌ క్వార్టర్స్‌, అడిక్‌మెట్‌, వడ్డెరబస్తీ, పోచమ్మబస్తీ, అంజయ్యనగర్‌, రాంనగర్‌రామాలయం వీధి, మేడిబావిబస్తీ, బహుద్దూర్‌నగర్‌, దీన్‌దయాళ్‌నగర్‌, రాంనగర్‌గుండు, కట్టంబాయి అడిక్‌మెట్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ) .సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యాలయం

రాంనగర్ ‌

[మార్చు]

రాంనగర్‌ డివిజన్‌లోకాలనీలు, బస్తీలు:జెమినికాలనీ, హరినగర్‌, రిసాలగడ్డ, దాయారా మార్కెట్‌, బాకారం, కృష్ణానగర్‌, ఎస్సార్టీ క్వార్టర్స్‌, అంబేద్కర్‌నగర్‌, పద్మశాలిసంఘం, శాస్త్రీనగర్‌, మోహన్‌నగర్‌, మేదరబస్తీలున్నాయి. డివిజన్‌ పునర్విభజనలో కొత్తగా ముషీరాబాద్‌ డివిజన్‌ నుంచి జాంబవీనగర్‌, వినోభనగర్‌, చేపల మార్కెట్‌, ఫ్రెండ్స్‌కాలనీ, బీఎస్‌ఎన్‌ఎల్‌ జోనల్‌ కార్యాలయం, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి), రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఆర్టీసీ) ప్రధాన కార్యాలయం, ఆర్టీసీ ఎండీ కార్యాలయం, ముషీరాబాద్‌ ఆర్టీసీ బస్‌డిపో, నిర్మల్‌ పరిశ్రమలు, ఐటీఐ, సంధ్య 35 ఎంఎం, సంధ్య 70 ఎంఎం సినిమా ధియేటర్లు, ఆజామాబాద్‌ పారిశ్రామికవాడ, బస్‌భవన్‌, జిల్లా పరిశ్రమల కేంద్రం, సీటీఓ జోన్‌ ఆఫీస్‌, వజీర్‌ సుల్తాన్‌ టోబాకో (వీఎస్టీ), చార్మినార్‌ సిగరెట్‌ కంపెనీ సీపీఎం నగర కార్యాలయం, సీఐటీయూ కార్మిక సంఘం ప్రధాన కార్యాలయం, ఎస్‌డబ్ల్యుఎఫ్‌, ఎన్‌ఎంయూ, ప్రజానాట్య మండలి కార్యాలయాలు

ఉప్పుగూడ

[మార్చు]

డివిజన్‌లోని బస్తీలు: ఉప్పుగూడ, శివాజీనగర్‌, సిఖ్‌చావునీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కాలనీ, తూంబండ, హరిజనాభాస్తీ, అశోక్‌నగర్‌, భానోదయ సంఘం, కందికల్‌, రెడ్డిబస్తీ, నిర్కిపూల్‌బాగ్‌, సాదత్‌నగర్‌, నిమ్రాకాలనీ, తాళ్లకుంట, గుల్షన్‌ ఎక్బాల్‌ కాలనీ, యూసుఫియన్‌కాలనీ, సాయిబాబానగర్‌, రాజీవ్‌గాంధీనగర్‌, పార్వతీనగర్‌, క్రాంతినగర్‌, నాయక్‌నివాస్‌ నగర్‌, భరత్‌నగర్‌, శివసాయినగర్‌ .

  • ఉప్పుగూడ శ్రీ మహంకాళీ దేవాలయం, శ్రీ కాళికామాత దేవాలయం, చాంద్రాయణగుట్ట శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం, సాయిబాబానగర్‌ సాయిబాబా దేవాలయం, గుల్షన్‌ ఎక్బాల్‌ కాలనీ, నిర్కిపూల్‌బాగ్‌ మసీదులు..

లలితాబాగ్ ‌

[మార్చు]

డివిజన్‌ పరిధిలోని ప్రాంతాలు:ఈదిబజార్‌, కుమ్మరివాడి, గ్రంథాలయం, ఫతేషాహినగర్‌, మోయిన్‌బాగ్‌, జమాల్‌కాలనీ, పండిత నరేంద్రనగర్‌, నరహరినగర్‌, రాఘవేంద్రస్వామినగర్‌, ఉప్పుగూడ తానాజీనగర్‌, మారుతీనగర్‌, లలితాబాగ్‌, మల్లికార్జుననగర్‌, కాళికానగర్‌, అరుంధతీకాలనీ, శంకర్‌బాగ్‌

  • లలితాబాగ్‌ లలితాంబ దేవాలయం, మల్లికార్జునస్వామి దేవాలయం, అరుంధతీకాలనీ చర్చి, ఈదిబజార్‌, మొయిన్‌బాగ్‌ మసీదులు

నూర్‌ఖాన్‌బజార్ ‌

[మార్చు]
హైదరాబాద్, దారుల్ షిఫా వద్ద వున్న ఆజాఖాన భవనము

షియా తెగకు చెందిన నూర్‌ఖాన్‌ అనే ప్రముఖుని పేరిట ఏర్పడిన బస్తీ .ప్రధాన బస్తీలు.. : నూర్‌ఖాన్‌బజార్‌, రావురంభదేవిడి, కాళీకబర్‌, పొన్నమ్మ పాఠక్‌, సుల్తాన్‌పురా, కోమటివాడి, డబీర్‌పురా, దాఋషిఫా, నల్లపోచమ్మ బస్తీ, సిద్ధిపేట్‌ బస్తీ .

  • నిజాం హయాంలో తొలి వైద్యశాల దాఋషిఫాలో వెలిసింది.
  • దాఋషిఫా, ఆజాఖానా జహహరా, చాదర్‌ఘాట్‌ ఆర్య సమాజ్‌ పాఠశాల.
  • చాదర్‌ఘాట్‌, దర్బార్‌ మైసమ్మ. ఓల్డ్‌ బల్దియా కార్యాలయం, కులీకుతుబ్‌షా పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయం

అలియాబాద్ ‌

[మార్చు]

అలియాబాద్ డివిజన్‌లోని బస్తీలు.: లాల్‌దర్వాజా మోడ్‌, అలియాబాద్‌, ఇంజన్‌బౌలి, ఖాద్రీచమన్‌ రోడ్‌, ఫలక్‌నుమా జూనియర్‌ కళాశాల, రాజన్నబావి, పూల్‌బాగ్‌, లాల్‌దర్వాజా, బాలాగంజ్‌, గౌలిపురా, సుధాధియేటర్‌, కాల్వగడ్డ, షంషీర్‌గంజ్‌, శ్రీరాంనగర్‌, పార్దీవాడ, గాంధీనగర్‌, పంచలింగాల బస్తీ, పూల్‌బాగ్‌, పత్తర్‌కీదర్గా, మేకలబండ, పూలబండ, పంచముఖి హనుమాన్‌, నాగులచింత, మురాద్‌మహల్‌, గౌలిపురా మార్కెట్‌

  • కుతుబ్‌షాహీల కాలంలో నగరం చుట్టూ నిర్మించిన కుడ్యం ఆనుకుని వెలసిన పురాతన బస్తీ అలియాబాద్‌.
  • లాల్‌దర్వాజా శ్రీ పంచముఖి హనుమాన్‌ దేవాలయం, శాలిబండ జగదీష్‌ మందిర్‌, దత్తాత్రేయ మందిరం, మహదేవ పాతాళేశ్వర స్వామి దేవాలయం, కాల్వగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయం, రామాలయం, పత్తర్‌కీ దర్గా, జాలీకి మసీద్‌.

ఘాన్సీ బజార్ ‌

[మార్చు]

మార్వాడీలు అధికంగా ఈ డివిజనులో ఉన్నారు. వెండిబంగారు ఆభరణాలు తయారు చేసే స్వర్ణకార వృత్తితో జీవనం సాగించే బెంగాలీ కార్మికులు మార్వాడీల అనంతరం రెండో స్థానాన్ని ఆక్రమించారు. గుల్జార్‌హౌజ్‌ డివిజను స్థానంలో కొత్తగా ఘన్సీబజార్‌ డివిజను ఏర్పడింది. వెండి, బంగారు వస్త్ర వ్యాపారాలు గుల్జార్‌హౌజ్‌, పటేల్‌ మార్కెట్‌, మదీనా ప్రాంతాలో కొనసాగుతున్నాయి. డివిజన్‌ పరిధిలోని ప్రాంతాలు: ఘాన్సీబజార్‌, గుల్జార్‌హౌజ్‌, పెట్లబుర్జు, గులాబ్‌సింగ్‌బౌలి, సిటీకాలేజి లోహర్‌ఖానా, హైకోర్టు, పటేల్‌మార్కెట్‌, మామజుమ్లాపాటక్‌, శక్కర్‌కోట, ఉర్దూగల్లీ, బండ్లఅడ్డా, చెలాపురా, ఆనందర్‌గల్లీ, మెహందీ, పంచిబురాక్‌, గొల్లగల్లీ, మిట్టికాషేర్‌, చార్‌కమాన్‌, లాడ్‌బజార్‌

  • చార్మినార్‌ దగ్గర గాజుల మార్కెట్‌ లాడ్‌బజార్‌
  • రాష్ట్ర హైకోర్టు ఘన్సీబజార్‌లో ఉంది. సిటీకాలేజ్‌, కులీకుతుబ్‌షా స్టేడియం, పోలీసు ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్‌ (పీటీఓ),
  • హైదరాబాద్‌ బిర్యానీకి ప్రసిద్ధి చెందిన షాదాబ్‌, మదీన హోటళ్లు, పాత వస్తువులను వేలం వేసి విక్రయించే అర్రాస్‌ఖానా మదీన, బాద్‌షా ఆషూర్‌ఖానాలు.

పురానాపూల్ ‌

[మార్చు]

భాగమతి ప్రేమకు చిహ్నం పురానాపూల్‌.నగర తొలి వంతెన ఉన్న డివిజన్‌ ఇది.మూసీపై ఆరేడు వంతెనలు ఉన్నాయి. వీటిలో కుతుబ్‌షాహీల కాలంలో తొలిసారి నిర్మించిన వంతెనగా 'పురానాపూల్‌' (పాత వంతెన) ప్రసిద్ధిగాంచింది. గతంలో ఉన్న చార్‌మహల్‌ డివిజన్‌ సరిహద్దు ప్రాంతాలుగా పురానాపూల్‌ ఏర్పాటైంది. వంతెనకు మరో పక్కన మరొకటి నిర్మించడంతో... పాత వంతెన కూరగాయల విక్రయ కేంద్రంగా మారింది.డివిజనులోని బస్తీలు, కాలనీలు: పురానాపూల్‌, కబుతర్‌ఖానా, చిన్నబజార్‌, సిప్లిగంజ్‌, బారగల్లీ, ఫాతిమానగర్‌, కోకతట్టి గల్బవీధి, గొల్లకిడికి, చంద్రికాపూర్‌, స్వామి వివేకానందనగర్‌, పార్థీవాడ, దర్గా మూసాఖాద్రీ, గులాబ్‌సింగ్‌బౌలి, పెట్లబుర్జు, శివనగర్‌

  • 1908లో భాగ్య నగరాన్ని మూసీ వరదలు అతలాకుతలం చేశాయి. పోటెత్తిన వరదను వంతెన ఎత్తు ఆధారంగా కొలిచారు. గోల్కొండ ఖిల్లాకు... పాతనగరానికి మధ్య వారధిగా నిలిచిన వంతెనను, గోల్కొండ ఆవాసంగా పాలిస్తున్న కుతుబ్‌షాహీలు నిర్మించారు. కులీకుతుబ్‌షాహీ అయిదో రాజు మూసీకి దక్షిణం వైపునున్న పాతబస్తీ చంచలం ప్రాంతంలో నివసించే భాగమతి ప్రేమలో పడ్డారు. ఆయన తన ప్రేయసి వద్దకు రాకపోకలు సాగించేందుకు ఈ వంతెనను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
  • కుతుబ్‌షాహీ కాలంనాటి మూసాఖాద్రీ దర్గా

కార్వాన్‌

[మార్చు]

ఒకప్పుడు కార్వాన్‌ ప్రాంతంలో వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారట. గుజరాతీ వజ్ర వ్యాపారస్థులు వజ్రాలను ఇక్కడే పోసి విక్రయించేవారని ప్రతీతి. వ్యాపారస్థులకు 'సాహుకారి' అని పేరుండేది. ఈ ప్రాంతాన్ని సాహుకారి కార్వా అని కూడా పిలిచేవారు. కోహినూర్‌ వజ్రాన్ని సానపట్టినది కార్వాన్‌లోనేనని స్థానిక పెద్దలు చెప్తారు. కార్వా అంటే వ్యాపారం కోసం వచ్చీపోయే కూడలి అని అర్థం. అలా వజ్రాలు, ముత్యాల వర్తకుల కూడలిగా సాహుకారి కార్వా, కార్వాన్‌గా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతమిది. 1908లో మూసి వరదల తాకిడికి ఈ ప్రాంతం బాగా దెబ్బ తినడంతో ఇక్కడి వ్యాపారులు క్రమేణా కోఠిలోని ప్రస్తుత గుజరాతీ గల్లీ ప్రాంతానికి తరలివెళ్లారని కథనం.

దూద్‌బౌలీ

[మార్చు]

రోజు కూలీల నిలయం దూద్‌బౌలీ.ఉబ్బసం వ్యాధి నయం చేస్తుందనే చేపమందు పంపిణీ దూద్‌బౌలిలో శతాబ్దంన్నర నుంచి ఏటా మృగశిర కార్తె రోజున జరుగుతుంది.డివిజనులోని బస్తీలు..: దూద్‌బౌలి, ఉందాబజార్‌, చటక్నిపురా, కామాటిపురా, ఉస్మాన్‌బాగ్‌, ఖైరికామఠ్‌, మురిళీనగర్‌, దేవీబాగ్‌, బహదూర్‌పురా, పాలంరోడ్డు, వీరాసింగ్‌బంగ్లా, మహరాజ్‌గంజ్‌ బస్తీలతోపాటు రమ్నాస్‌పురా, గొల్లకిడికి, ఫత్తేదర్వాజా, చందులాల్‌బారాదరి

మంగళ్‌హాట్ ‌

[మార్చు]

లోథ్‌ క్షత్రియులు, మరాఠీలు, గుడంబా తయారీయే జీవనాధారంగా కొనసాగిస్తూ వస్తున్నారు. సోమవంశీయ సహస్తార్జున్‌ క్షత్రియులు మాత్రం రాఖీలు, మొలతాడులు, పూసల చైన్‌లు తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ముస్లిం కుటుంబాల్లో ఎక్కువ శాతం మంది ఆటో రిక్షా డ్రైవర్లు, తోపుడు బండ్లు వ్యాపారం నిర్వహిస్తున్నారు. ప్రాంతాలు..: మంగళ్‌హాట్‌, పూసలబస్తీ, అమర్‌నగర్‌కాలనీ, బోయిగూడకమాన్‌, శివమందిర్‌, రాజ్‌ధార్‌ఖాన్‌, పేట, కిస్తీ చమన్‌, అల్లాబండా, సీతారాంబాగ్‌, అజీజ్‌బాగ్‌, గుఫానగర్‌, ఇందిరానగర్‌, దిలావర్‌గంజ్‌, గండీహనుమాన్‌, మగ్రా, ఆంధ్రాకాలనీ, గంగాబౌలీ, శివలాల్‌నగర్‌, బంగ్లాదేశ్‌, అప్పర్‌ ధూల్‌పేట, బాబా బాలక్‌దాస్‌మట్‌, బలరాంగల్లీ, ఆరామ్‌ఘర్‌కాలనీ, జాలీహనుమాన్‌, మోహన్‌దాస్‌మట్‌, రహీంపురా, పురానాపూల్‌ గాంధీవిగ్రహం, సత్తెన్నగల్లీ, కాగాజీగూడ పోలీస్‌ ఔట్‌పోస్టు..

  • సుమారు మూడు వందల అడుగులు ఎత్తు కలిగిన అల్లాబండా కొండలు

అత్తాపూర్ ‌

[మార్చు]

పాతనగరానికి ఆనుకొని ఉన్న అత్తాపూర్ డివిజన్‌లో పురాతన కట్టడాలు సైతం ఉన్నాయి. అంతమవుతున్న జంతువుల అభివృద్ధి కోసం పరిశోధనలు జరిపే సీసీఎంబీ కూడా ఇక్కడ ఉంది.వార్డు పరిధిలోని కాలనీలు:అత్తాపూర్‌, రాంబాగ్‌, ముష్కిమహాల్‌, హుడాకాలనీ, శిక్‌ఛావనీ, మహమూద్‌బాద్‌, ఎంఎంపహాడి, శివాజీనగర్‌, నౌనెంబర్‌, మారుతీనగర్‌, భూపాల్‌రెడ్డి, ఇమాద్‌నగర్‌, సులేమాన్‌నగర్‌, ఖయ్యూంనగర్‌, పాండురంగానగర్‌, చింతల్‌మెట్‌. రాంబాగ్‌లో 500 సంవత్సరాల చరిత్ర కల పురాతన శివాలయం ఉంది. అక్కన్న, మాదన్నల కాలంలో దీన్ని నిర్మించినట్లు చెబుతారు.ముష్కీమహల్‌లో పురాతనకోట ఉంది. నవాబుల కాలంలో గోల్కొండ నవాబు ఈ కోటకు వచ్చి కొంతకాలం గడిపేవాడని పెద్దలు చెబుతారు.

గుడిమల్కాపూర్ ‌

[మార్చు]

రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన జాంసింగ్‌ వేంకటేశ్వర దేవాలయం గుడిమల్కాపూర్‌ డివిజన్‌లో నెలకొంది. నిజాం నవాబు సికందర్‌-3 వద్ద అశ్వదళాది పతిగా 1803-1829 వరకు పనిచేసిన జాంసింగ్‌ గుర్రాలు కొనుగోలు చేయాల్సిన ధనంతో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర దేవాలయం నిర్మించాడని చరిత్ర చెబుతోంది.[2] ప్రాంతాలు:దర్బార్‌మైసమ్మ ఆలయం, ఆర్యసమాజ్‌, ఉప్పర్‌బస్తీ, రాంసింగ్‌పురా, జాఫర్‌గూడ, తాళ్లగడ్డ, భగవాన్‌దాస్‌బాగ్‌, శివబాగ్‌, గుడిమల్కాపూర్‌ కూరగాయల మార్కెట్‌, హీరానగర్‌, అల్లూరి సీతారామరాజునగర్‌, సాయినగర్‌, కనకదుర్గానగర్‌, మొఘల్‌నగర్‌-1, మొఘల్‌నగర్‌-2, బాలాజీనగర్‌, సత్యనారాయణనగర్‌, లక్ష్మినగర్‌, ఖాదర్‌బాగ్‌, ఇందిరానగర్‌, ఫ్లోర్‌మిల్‌, మారుతినగర్‌, జ్యోతినగర్‌, నేతాజీనగర్‌, డిఫెన్సుకాలనీ, ఆశంనగర్‌, బాపునగర్‌.

  • పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌ వే (మెహిదీపట్నం రింగురోడ్డు) మొదటి ర్యాంపులు లక్ష్మినగర్‌లో ఉన్నాయి. శంషాబాద్‌ ఏయిర్‌ పోర్టుకు వెళ్లే ప్రయాణికులు ఇక్కడి నుంచి ఎక్కి, దిగే వీలుంటుంది.
  • లంగర్‌హౌస్‌ పోలీసుస్టేషను‌, గోల్కొండ ఎక్సైజు పోలీసు స్టేషను‌, లంగర్‌హౌస్‌ సబ్‌స్టేషను‌, గోల్కొండ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం, గుడిమల్కాపూర్‌ కూరగాయల మార్కెట్‌, లంగర్‌హౌస్‌ మిలటరీ ఆస్పత్రి
గోల్కొండ కోట ఒక దృశ్యం

గోల్కొండ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన గోల్కొండ కోట. దీని నిర్మాణ శైలి, రక్షణాత్మకమైన కట్టడం సందర్శకులను అబ్బుర పరుస్తాయి. దీనిని హైదరాబాదు నవాబు కులీ కుతుబ్ షా నిర్మించాడు.

గోల్కొండ నవాబుల కాలంలో లంగర్‌ఖానాగా పిలిచిన ప్రాంతం కాలక్రమేణా లంగర్‌హౌస్‌గా రూపాంతరం చెందింది. నవాబుల జమానాలో సైనికుల కోసం ఇక్కడ భోజనశాల ఉండేది. గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు. కాలక్రమేణా ఈ లంగర్‌ఖానా కాస్త లంగర్‌హౌస్‌గా మారింది. ప్రధాన ప్రాంతాలు:లంగర్‌హౌస్‌, ఇబ్రహీంబాగ్‌, రాందేవ్‌గూడ, హీరాఖానా, రేతిగల్లి, ఫతేదర్వాజ, బాపుఘాట్‌, ఖాజీగల్లి, తకత్‌బౌలి, ప్రశాంత్‌నగర్‌, బాపునగర్‌.

  • దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక బాపుసమాధి బాపుఘాట్‌ ఇక్కడే ఉంది.
  • పర్యాటకశాఖ తారామతి బారాదారి

మెహిదీపట్నం

[మార్చు]

నాటి గోరింటాకు వనాలే..నేటి మెహిదీపట్నం.కులికుతుబ్ షా వంశంలోని రాణులు మెహిదీ (గోరింటాకు) ని అలంకరణ కోసం ఉపయోగించేవారు. ఇందు కోసం పెద్ద ఎత్తున మెహిదీ మొక్కలు పెంచారు. దీంతో ఈ ప్రాంతానికి మెహిదీ (గోరింటాకు) పట్టణంగా పేరు వచ్చింది.పాంతాలు:మెహిదీపట్నం, ఎంఐజీకాలనీ, శ్రీరాంనగర్‌కాలనీ, ఎల్‌ఐసీకాలనీ, అంబాగార్డెన్‌ కాలనీ, ఇన్‌కం ట్యాక్సుకాలనీ, హుడాకాలనీ, సంతోష్‌నగర్‌కాలనీ, దిల్‌షాద్‌నగర్‌కాలనీ, అయోధ్యనగర్‌కాలనీ, రేతిబౌలి, గుడిమల్కాపూర్‌ నవోదయకాలనీ, పద్మనాభనగర్‌కాలనీ, పీఅండ్‌టీ కాలనీ, మందులగూడ, సాయినగర్‌, హరిజనాభాస్తీ బీజీగార్డెన్‌, అంబేద్కర్‌నగర్‌ భోజగుట్ట రిజర్వాయర్‌ పుష్పగిరి మహాసంస్థానం, పద్మనాభనగర్‌కాలనీ గణపతి దేవాలయం, రాజరాజేశ్వరీ ఆలయం, హుడాకాలనీ నల్లపోచమ్మ దేవాలయాలు అయోధ్యనగర్‌కాలనీ గుమ్మజ్‌ మసీదు, భోజగుట్ట దర్గా, గుడిమల్కాపూర్‌ మెథడిస్టు చర్చీ.


మెహిదీ నవాజ్ జంగ్ అనే ఓ పెద్దాయన పేరిట మెహిదీపట్నం ఏర్పడింది. ఈయన నిజాం ఏలుబడిలోనూ, దరిమిలా బూర్గుల ప్రభుత్వంలోనూ పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. లోక్ సభకు ఎన్నికయ్యారు. గుజరాత్ గవర్నరుగా బాధ్యతలు నిర్వహించారు. పంజాగుట్ట చౌరస్తా నుంచి మాసాబ్ ట్యాంకు వెళ్ళే పెద్ద రోడ్డు (బంజారా హిల్స్ రోడ్-1) పేరు మెహిదీ నవాజ్ జంగ్ రోడ్. పంజాగుట్ట చౌరస్తాను వెడల్పు చేయడానికి ముందు పోలీసు స్టేషను పక్కన ఆ పేరుగల శిలాఫలకం ఉండేది. ఓ నవాబుగారికి చెందినవి బంజారా కొండలు. ఆ నవాబ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఎవరినీ అర్థించేవాడు కాదు. దాంతో మెహిదీయే పూనుకుని తాను కొంత, మరికొందరితో మరికొంత చొప్పున కొనిపించి ఆ నవాబును చిక్కుల్లోనుంచి బయటపడేశాడు. నవాబ్ సహాయార్థం పరోపకారంకోసం చేసిన కొనుగోళ్ళు మాత్రమే అవి. ఈ రోజున ఆ కొండలు బంగారంలా మారాయి.

చార్మినార్

[మార్చు]

చార్మినార్ అంటే నాలుగు మినార్లు కలది అని అర్థం. కలరా నిర్మూలనకి జ్ఞాపకార్థంగా నిర్మించబడిన కట్టడం.

గచ్చీబౌలి

[మార్చు]

గచ్చిబౌలి నగర రణగొణ ధ్వనులకి దూరంగా, ప్రశాంతంగా ఉండే ప్రదేశం. హిల్ రిట్జ్ స్ప్రింగ్స్ హోటల్, విప్రో టెక్నాలజీస్, మైక్రోసాఫ్ట్, పొలారిస్, డెలాయిట్ వంటి బహుళ జాతీయ సంస్థలు నింగిని తాకే ఆకాశహర్మ్యాలలో ఉన్నాయి. 2012లో ఇక్కడ బయోడైవర్సిటీ పార్కు నిర్మించబడింది.

ఇమ్లీబన్

[మార్చు]

మహాత్మా గాంధీ బస్ స్టేషను ఉండే చోటు. ఆసియాలోనే అతి పెద్ద బస్ స్టేషనులలో ఒకటి.

బేగంపేట నుండి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తరలించిన చోటు. జీ ఎం ఆర్ (గ్రంధి మల్లికార్జున రావు) గ్రూపు ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ నాణ్యతలతో నిర్మించింది.

చాదర్ ఘాట్

[మార్చు]

మూసీ నదిని ఆనుకొని ఉన్న ప్రదేశం. నది పై కట్టబడిన వంతెనకి ఒక వైపు కోఠి ఉండగా మరొక వైపు మలక్ పేట ఉంది. ఇమ్లీబన్, ఎసామియా బజార్, కాచిగూడ దీనికి పరిసర ప్రదేశాలు

కాచిగూడ

[మార్చు]

డివిజన్‌లో కాలనీలు:కుత్బిగూడ, మేతర్‌బస్తీ, చప్పల్‌బజార్‌, ఆర్టీసీ క్వార్టర్స్‌, రైల్వే క్వార్టర్స్‌, నెహ్రూనగర్‌, సుందర్‌నగర్‌, కాచిగూడ కబేళా, కృష్ణానగర్‌, శ్యాంనగర్‌, అర్రాస్‌పెంట, నింబోలిఅడ్డ, ఖాజాగరీబ్‌నగర్‌, సంజయ్‌గాంధీనగర్‌, కామ్‌గార్‌నగర్‌, మోతీమార్కెట్‌, కాచిగూడ రైల్వేస్టేషను‌, వైశ్య, మున్నూరు కాపు, అరె కటిక విద్యార్థి వసతి గృహాలు బద్రుకా కామర్స్‌ కళాశాల

బాగ్‌అంబర్‌పేట

[మార్చు]

బాగ్ అంబర్ పేట నిజాం కాలంలో తోటలకు నిలయంగా అంబర్‌పేట ఉండేది. తోట అంటే ఉర్దూలో బాగ్‌ అని అర్థం. తోటలకు నిలయంగా ఉండటంతో దీనిని బాగ్‌అంబర్‌పేటగా పిలిచేవారు. ఇందులోని బస్తీలు, కాలనీలు:మల్లికార్జుననగర్‌ నార్త్‌, వినాయకనగర్‌, తురాబ్‌నగర్‌, ఎరుకలబస్తీ, భరత్‌నగర్‌, కుమ్మర్‌వాడి, గజానంద్‌గడ్డా, పాములబస్తీ, అంబేద్కర్‌నగర్‌, పోచమ్మబస్తీ, జంజంమసీదు, శారదానగర్‌, బతుకమ్మకుంట, బుర్జుగల్లీ, వడ్డబస్తీ, సిద్దిఖీ అషూర్‌ఖానా, కుర్మబస్తీ, మున్సిపల్‌కాలనీ, అనంతరామ్‌నగర్‌ .

  • ఈ డివిజన్‌లో ప్రస్తుతం ఉన్న బస్తీలన్నీ ఏదో ఒక కులవృత్తి, కులం పేరుతో సంబంధం ఉన్నవే కుమ్మరిబస్తీ, కుర్మబస్తీ, వడ్లబస్తీ, మందులబస్తీ, పాములబస్తీ...
  • నిజాం నవాబుల కాలంలో శత్రువులను ఎదుర్కోవడానికి, వారి రాకను కనిపెట్టడానికి ఒక బురుజును ఇక్కడ నిర్మించారు.ఈ బుర్జుఉన్న ప్రాంతాన్ని బుర్జుగల్లీ అంటున్నారు.

మొజం జాహీ మార్కెట్

[మార్చు]

పళ్ళు, అత్తర్లు అమ్మబడు ప్రదేశం. కోట వలె ఉన్న ఈ కట్టడం చూపరులని ఇట్టే ఆకట్టుకొంటుంది. దీని ప్రక్కనే ఉన్న క్రాంతి, విక్రాంతి థియేటర్లు ఇప్పుడు రేస్ కోర్స్ క్లబ్బుగా మార్చబడ్డాయి. ప్రఖ్యాత కరాచీ బేకరీ ఈ కూడలిలోనే మొజంజాహీ మార్కెట్టుకు మూలేదురుగా ఉంది.


చౌమహల్లా పాలస్

[మార్చు]
ఆఫ్తాబ్ మహల్ నుండి చౌమహల్లా పాలస్ దృశ్యం.

చౌమహల్లా పాలస్ (Chowmahalla Palace) (నాలుగు మహాళ్ళు అని అర్థం) హైదరాబాదు రాష్ట్రం లోని నిజాం నివాసము. ఆసఫ్ జాహి వంశపు పరిపాలనా రాజధాని హైదరాబాదు యందు నిజాం నివాస స్థలం. ఈ భవనం బర్కత్ అలీ ఖాన్ ముకర్రం జాహ్ ఆస్తిగా పరిగణింప బడుచున్నది.

పర్షియన్ భాషలో "చహర్" అనగా నాలుగు, అరబీ భాషలో "మహాలత్" అనగా సౌధాలు (బహువచనం), అలా దీనికి చౌమహల్లా అనే పేరు పెట్టబడింది.

ఫలక్‌నుమా ప్యాలెస్

[మార్చు]

ఫలక్ కుమా ప్యాలస్: అందులోని ఒక అద్దం విలువ నేడు రూ. 35 కోట్లకు పైగా ఉంది.ఈ భవనాన్ని మూడు వందల ఎకరాల్లో నిర్మించారు. ఫలక్‌నుమా అంటే 'ఆకాశ దర్పణం' అని అర్థం. దీన్ని 'పైగా' వంశానికి చెందిన హైదరాబాద్‌ ప్రధాని సర్‌ వికారుల్‌ ఉమ్రా ఇక్బాల్‌ దౌలా బహదూర్‌ నిర్మించారు. చిన్న కొండపై నిర్మించిన ఈ భవనం మీద నుంచి తిలకిస్తే కనుచూపు మేర నగర అందాలు కనువిందు చేస్తాయి. ఈ భవనానికి 1884 మార్చి 3వ తేదీన పునాది వేయించారు.1892-93 నాటికి నిర్మాణం పూర్తి చేయించారు. అప్పట్లో ఈ ప్యాలెస్‌ నిర్మాణానికి రూ. 40 లక్షలు ఖర్చయినట్లు తెలుస్తోంది. ఆరో నిజాం మహబూబ్‌ అలీ పాషాకు ఈ భవనమంటే ఎంతో మక్కువ. 1895లో నిర్మాణం ఖర్చులు చెల్లించి వికార్‌ నుంచి దీనిని కొనుగోలు చేశాడు.కింగ్‌ ఎడ్వర్డ్స్‌, వైస్‌రాయ్‌ లార్డ్‌ వేవెల్‌, తొలి భారతీయ గవర్నర్‌ జనరల్‌ సి.రాజగోపాలాచారి, భారత తొలి రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ గతంలో ఈ ప్యాలెస్‌లో విడిది చేశారు.

పాయిగా ప్యాలెస్

[మార్చు]

115 ఏళ్ల క్రితం రెండున్నర ఎకరాల్లో సువిశాలంగా నిర్మించిన చారిత్రక భవనం పాయిగా ప్యాలెస్‌. ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ ఆలీఖాన్‌ హయాంలో ఈ భవన నిర్మాణానికి పునాదిరాయి పడింది. ఆలీఖాన్‌ ప్రభుత్వంలో దేవిడీ ఇక్బాల్‌ ఉద్దౌలా ప్రధాన మంత్రిగా ఉండేవారు. ఆయన పాయిగా వంశానికి చెందిన వాడు. ఆయన నిర్మించినదే పాయిగా ప్యాలెస్‌. ఓ సందర్భంలో ఆ భవనాన్ని చూసి నిజాం ముచ్చపడటంతో ప్రధానమంత్రి ఉద్దౌలా దానిని కాస్తా ఆయనకు బహుమతిగా ఇచ్చాడు. నగరంలో అమెరికన్‌ కాన్సులేట్‌ ఏర్పాటు కోసం 2007లో ప్రభుత్వం గచ్చిబౌలి వద్ద స్థలాన్ని కేటాయించి అక్కడ భవన నిర్మాణానికి అనుమతించింది. అంతవరకు తాత్కాలిక ఆవాసం కోసం పాయిగా ప్యాలెస్‌ను వారికి అప్పగించింది.అమెరికా కాన్సులేట్‌ భద్రత పేరుతో అక్కడున్న 62 వృక్షాలను నరికేశారు.

నాంపల్లి

[మార్చు]

కుతుబ్‌షాహీల కాలంలో నాంపల్లి ఒక చిన్న కుగ్రామం. మెయజ్‌-ఇ-నాంపల్లిగా పిలిచేవారు. ప్రస్తుతం నాంపల్లిగా రూపాంతరం చెందింది. నగరంలో రద్దీ కేంద్రాలలో ఒకటి. నిజాం రాష్ట్రంలో 1670 AD సమయంలో దివాన్ ఆఫ్ నిజాంగా పనిచేసిన రజా అలీ ఖాన్ కు రాసిచ్చిన జాగీర్ పై ఆయన పేరు నేక్ నామ్ ఖాన్ అని ఉంది. చివరాకరుకు ఆ పేరు నేక్ నాంపల్లిగా, చివరకు నాంపల్లిగా స్థిరపడింది.

బషీర్‌బాగ్ ‌

[మార్చు]

సర్ ఉస్మాన్ జా, భషీర్ ఉద్దులా పైగా నోబుల్ పేర్లపై ఉన్న ఓ గార్డెన్ పేరుతో బషీర్‌బాగ్ పేరు పుట్టుకువచ్చింది. పాయిగా ప్రభువు సర్‌ ఆస్మాన్‌జా బషీర్‌ ఉద్‌ దౌలా బహదూర్‌ ఈ ప్రాంతంలో ఒక అందమైన గార్డెన్స్‌, ప్యాలెస్‌ను నిర్మించాడు. నేడు ఆ ప్యాలెస్‌లు, పూదోటలు నామమాత్రంగానైనా కన్పించకపోయినా స్థానిక ప్రజలు నేటికీ బషీర్‌బాగ్‌గానే ఆనాటి తీపిగుర్తుగా పిలుస్తున్నారు.

గోషామహల్ ‌

[మార్చు]

గోషామహల్ అబ్దుల్లా కుతుబ్‌షా కాలంలో ఆనాటి రాణులు, ఇతర రాజమందిరానికి చెందిన మహిళల కోసం ఒక వినోద కేంద్రంగా గోషామహల్‌ ప్యాలెస్‌ను నిర్మించారు. ప్యాలెస్‌ నిర్మించిన అసలు ఆశయం ఏనాడో చెదిరిపోయినా పేరు మాత్రం చెరిగిపోలేదు. ప్యాలెస్‌లోని ఒక ప్రాంతాన్ని నేడు క్రీడా ప్రాంగణంగా అభివృద్ధి చేశారు.

మాసాబ్‌ట్యాంకు

[మార్చు]

'మా-సాహెబా' కాస్తా మాసాబ్‌ట్యాంక్‌ అయింది. నాల్గవ కులీ కుతుబ్‌షాహీ ప్రభువు మహ్మద్‌ కుతుబ్‌షాహీ భార్య పేరు హయ్యత్‌ బక్షీ బేగం. ఈమెను 'మా-సాహెబా' అని గౌరవంగా పిలిచేవారు. ఈ ప్రాంతంలో కుతుబ్‌షాహీ ప్రభువులు తవ్వించిన చెరువును మాసాహెబా పేరున స్థానికులు గౌరవంగా పిలిచేవారు. అయితే నేడు ఆ చెరువు లేదు. దాని స్థానంలోనే చాచా నెహ్రూ పార్కు ఏర్పాటైందని చెప్తారు. అటు ఇటు ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అయినా ఆ కాలం నాటి మీరు మాసాహెబా ప్రాంతంగానే స్థానికులు పిలుస్తూ వచ్చారు. కాలక్రమేణా అది మాసాబ్‌ట్యాంక్‌గా రూపాంతరం చెందిందని చరిత్రకారుల అభిప్రాయం.

సైదాబాద్

[మార్చు]

సైదాబాద్ డివిజన్‌లోని కాలనీలు, బస్తీలు:గడ్డిఅన్నారం బస్తీ, రెవెన్యూబోర్డు కాలనీ, ఆంధ్రా బ్యాంకు కాలనీ, వెంకటాద్రినగర్‌, రెవెన్యూబోర్డుకాలనీ, తిరుమలాహిల్స్‌, ఏపీఏయు కాలనీ, జీఏకాలనీ, సాయిరాంనగర్‌, కళ్యాణ్‌నగర్‌, డీకేనగర్‌, లోక్‌యుక్తకాలనీ, ఇంద్రప్రస్తకాలనీ, సైదాబాద్‌కాలనీ, ఎస్‌బీహెచ్‌కాలనీ, జయనగర్‌, న్యూ సైదాబాద్‌ హౌసింగ్‌బోర్డుకాలనీ, భూలక్ష్మినగర్‌, హమాలీబస్తీ, గాంధీనగర్‌, పూసలబస్తీ, ఏకలవ్యనగర్‌. పర్యాటక ప్రాంతంగా పురావస్తుశాఖ అధీనంలో ఉన్న రెమాండ్‌టూంబ్స్‌ కూడా ఇక్కడే ఉన్నాయి. తిరుమలాహిల్స్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ప్రసిద్ధి చెందింది.

అక్బర్‌బాగ్‌

[మార్చు]

అక్బర్‌బాగ్‌లో 1960 సంవత్సరంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకంగా క్వార్టర్లు నిర్మించారు.డివిజన్‌లోని కాలనీలు, బస్తీలు: మలక్‌పేట ప్రభుత్వ క్వార్టర్స్‌, ఆనంద్‌నగర్‌, దయానంద్‌నగర్‌, పల్టాన్‌, అస్మాన్‌ఘడ్‌, మాధవనగర్‌, సపోటబాగ్‌, అక్బర్‌బాగ్‌, జడ్జస్‌కాలనీ.మెట్రోరైలు వస్తే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ క్వార్టర్స్‌ ప్రాంతంలో స్టేషను‌ను ఏర్పాటు చేయనున్నారు. టీవీటవర్‌ కూడా ఈ డివిజన్‌లోకే వస్తోంది. రాష్ట్రంలోనే మొదటిసారి వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన పార్కు కూడా ఇదే డివిజన్‌లో ఉంది.

శివరాంపల్లి

[మార్చు]

శివరాంపల్లి పైగా డివిజన్‌లో కాలనీలు:ఎన్టీఆర్‌నగర్‌, మహమూద్‌నగర్‌, జబ్‌-లే-నూర్‌, హసన్‌నగర్‌, మదీనా మసీద్‌, హసన్‌నగర్‌ ప్రధాన గ్రామం, హసన్‌నగర్‌ ఐస్‌ఫ్యాక్టరీ, శివరాంపల్లి మెయిన్‌ విలేజ్‌, శివరాంపల్లి దళితబస్తీ, మోహన్‌రెడ్డినగర్‌, సాయిబాబానగర్‌, ఆదర్శకాలనీ, అన్సారీరోడ్డు, దానమ్మహట్స్‌, రిజ్వాన్‌కాలనీ, ముస్తఫానగర్‌హిల్స్‌, రాఘవేంద్రకాలనీ, ఏక్తాకాలనీ, రషీద్‌కాలనీ, శాస్త్రిపురం, మహ్మదీయకాలనీ, సైఫీకాలనీ

  • సర్దార్‌వల్లభాయి జాతీయ పోలీసు అకాడమీ
  • చారిత్రక జలాశయం బంరుక్‌నుద్దౌలా
  • ఆసియాలోనే అతి పెద్దదైన పదకొండున్నర కిలోమీటర్ల పొడవైన పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే ఫ్త్లెఓవర్‌
  • దారుల్‌ఉలూం అరబిక్‌ కాలేజి

శ్రీనగర్ కాలనీ

[మార్చు]

పంజాగుట్ట, అమీర్ పేట ల మధ్య ఉన్న కాలనీని శ్రీనగర్ కాలనీ అని పిలుస్తారు. వార్డు పరిధిలో ప్రాంతాలు: శ్రీనగర్‌కాలనీ, నాగార్జుననగర్‌ కాలనీ, ఇంజినీర్స్‌కాలనీ, ఎల్‌ఐసీ కాలనీ, యస్‌బీహెచ్‌ కాలనీ, నవోదయ కాలనీ, శ్రీకృష్ణదేవరాయనగర్‌, శాలివాహన నగర్‌, ఎల్లారెడ్డిగూడ, జయప్రకాష్‌నగర్‌, సంజయ్‌గాంధీనగర్‌, వడ్డేరబస్తీ, సుభాష్‌నగర్‌, ఇమాంగూడ, అలీనగర్‌, తవ్వకల్‌నగర్‌, హబీబ్‌భాగ్‌, కమలాపురీకాలనీలోని కొంత భాగం, ఆర్‌బీఐ క్వార్టర్స్‌, పంజాగుట్ట ఉప్పరబస్తీ, కేశవ్‌నగర్‌.శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం, శ్రీసత్యసాయి నిగమాగమం (కల్యాణ మండపం), మార్బుల్స్‌ మార్కెట్‌.

  • మనపార్టీ రాష్ట్ర కార్యాలయం, సమైక్యాంధ్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యాలయాలు
  • ఐటీ ప్రొషెషనల్స్‌, సినిమా, టీవీ రంగాలకు చెందిన జూనియర్‌ ఆర్టిస్టులు ఈ కాలనీలో ఎక్కువగా ఉన్నారు.

సికిందరాబాదు

[మార్చు]

బ్రిటిష్ వారు మూడవ నిజాం అయిన సికిందర్ జా పరిపాలన కాలంలో హైదరాబాదులో కంటోన్ మెంట్ ప్రాంతాన్ని స్థాపించారు. ఇతని జ్ఞాపకార్ధం దీనికి "సికింద్రాబాదు" అని పేరుపెట్టారు. సికింద్రాబాదుని 1948 వరకు బ్రిటీషువారు పాలించగా, హైదరాబాదులో నిజాం రాజుల పాలన ఉండేది. తొలుత ఓ ప్రత్యేక కార్పొరేషన్‌గా ఆవిర్భవించి ఆపై హైదరాబాద్‌లో అంతర్భాగంగా మారింది.

పద్మారావునగర్‌

[మార్చు]

పద్మారావునగర్ లోని ప్రధాన కాలనీలు: అభినవనగర్‌కాలనీ, బ్రూక్‌బాండ్‌కాలనీ, వెంకట్రావ్‌నగర్‌కాలనీ, వాకర్‌టౌన్‌, ఐడిహెచ్‌ కాలనీ, కృష్ణానగర్‌కాలనీ, అమ్ముగూడ, బొక్కలగూడ, సున్నంబట్టి, ముస్లిం వక్ఫ్‌బోర్డు స్లమ్‌, హమాలీబస్తీ, గాంధీ ఆసుపత్రి, స్కంధగిరి, సాయిబాబా దేవాలయాలు, మేకలమండి, సర్దార్‌ వల్లభాయి పటేల్‌ పీజీ కళాశాల ప్రాంతాలు.

మూసాపేట

[మార్చు]

మూసాపేట 118వ డివిజన్‌లో ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నాయి. డివిజన్‌ పరిధిలోని కాలనీలు:కేపీహెచ్‌బీ కాలనీలోని 15-31ఆర్‌టీపీఏసీ/4 నుంచి 15-31వీఏం/16 వరకు, 15-31వీహెచ్‌-1/1 నుంచి వీహెచ్‌-9/144 వరకు, హెచ్‌.ఐ.జి-1 నుంచి 183 వరకు, కూకట్‌పల్లిలోని బాలాజీనగర్‌, పాత బాలాజీనగర్‌, న్యూ బాలాజీనగర్‌, వివేక్‌నగర్‌ వీకర్‌ సెక్షన్‌, హౌసింగ్‌ బోర్డు బాలాజీనగర్‌, మూసాపేట, జనతానగర్‌, ప్రగతినగర్‌, ముస్కీపేట, ఆంజనేయనగర్‌, కైత్లాపూర్‌, సేవాలాల్‌నగర్‌, కూకట్‌పల్లిలోని శివానంద రిహాబిలిటేషన్‌ బ్లాక్‌ ఏ నుంచి బ్లాక్‌ ఈ వరకు, మోతీనగర్‌ పరిధిలోని సప్ధర్‌నగర్‌, వివేకానంద్‌నగర్‌.

  • రాష్ట్రంలోని అతిపెద్ద గూడ్స్‌షెడ్‌, కూకట్‌పల్లి సర్కిల్‌ కార్యాలయం, గోద్రెజ్‌ చౌరస్తా సమీప ంలో ఉన్న 64 ఎకరాల 'హుడా ట్రక్కు పార్కు', 18 అంతస్తుల గృహ సముదాయం

సూరారం

[మార్చు]

ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడల్లో ఒకటైన జీడిమెట్ల పారిశ్రామికవాడ ఈ డివిజన్‌లోనే ఉంది.ఈ ప్రాంత వాసులు నిత్యం కాలుష్య సమస్యతో సతమతమవుతున్నారు.డివిజన్‌ పరిధిలోని ప్రాంతాలు:సూరారం కాలనీ, దయానంద్‌నగర్‌, ప్రియాంకనగర్‌, కృషికాలనీ, సంతోషినగర్‌, సూరారం వీకర్‌సెక్షన్‌కాలనీ, షిర్డిసాయిబాబానగర్‌, సుభాష్‌చంద్రబోస్‌నగర్‌, ఆనంద్‌నగర్‌, సిద్ధార్థనగర్‌, సుభాష్‌నగర్‌, రాంరెడ్డినగర్‌, ఇండిస్ట్రీయల్‌ఫేజ్‌-4, ఎస్‌.ఆర్‌.నాయక్‌నగర్‌, జనప్రియ, మోడీబిల్డర్స్‌, అపురూపకాలనీ, ఇండస్ట్రీయల్‌ఫేజ్‌-3, ఎస్‌వీ కో-ఆపరేటివ్‌సొసైటీ, ఫేజ్‌-1, భగత్‌సింగ్‌నగర్‌ (రాళ్లకంచె), శివాలయనగర్‌, అల్లూరిసీతారామరాజునగర్‌, డి.పి.కాలనీ.

అల్వాల్

[మార్చు]

డివిజన్‌ పరిధిలోని ప్రాంతాలు:వాసవినగర్‌నగర్‌ (భాగం), భారతినగర్‌, ప్రశాంతి ఎన్‌క్లేవ్‌ (భాగం), సాయినగర్‌కాలనీ, మాధవినగర్‌, అసిఫ్‌నగర్‌, దినకర్‌నగర్‌, వెంకటరావుపేట, రాంచంద్రనగర్‌, ఆదర్స్‌నగర్‌, చిత్తరయ్యకాలనీ, ఇందిరానగర్‌కాలనీ, లక్ష్మినగర్‌కాలనీ, భూదేవినగర్‌, యాదమ్మనగర్‌, సత్యసాయిఎంక్లేవ్‌, గ్రీన్‌ఫీల్డ్స్‌కాలనీ, టెలికాంకాలనీ, ప్రుడిన్షియల్‌బ్యాంకుకాలనీ, లక్ష్మినారాయణకాలనీ, సాయికృష్ణఎంక్లేవ్‌, వేద్‌విహార్‌ కాలనీ, ఆర్టీసీకాలనీ, బోరాముస్లిం కాలనీ, ఎం.ఇ.ఎస్‌. కాలనీ, జోషీనగర్‌, రాంనగర్‌, రాజీవ్‌నగర్‌, వెంకటరమణకాలనీ, మారుతినగర్‌, ఇందిరానగ్‌ వీకర్‌ సెక్షన్‌ కాలనీ, అంబేద్కర్‌నగర్‌, రాజీవ్‌నగర్‌, కానాజిగూడ, శివనగర్‌, సుభాష్‌నగర్‌, గొల్లగూడ, అశోక్‌నగర్‌, కొత్తబస్తీ, వెంకటాపురం, లోతుకుంట, యాదమ్మనగర్‌బస్తీ

డిఫెన్స్‌కాలనీ

[మార్చు]

135వ డివిజన్.సైనికుల కోసం ఏర్పడింది.‌:మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో 1965లో ఇక్కడ మాజీ సైనికుల కోసం 100 ఎకరాలపైన ప్రభుత్వ స్థలం కేటాయించారు. దీనికి డిఫెన్స్‌ కో- ఆపరేటివ్‌ సొసైటీ కూడా ఉంది. ఈ పేరు మీదే డిఫెన్స్‌ కాలనీ ఏర్పడింది. డివిజన్‌ పరిధిలోని ప్రాంతాలు:డిఫెన్స్‌కాలనీ, బ్యాంకుకాలనీ, కాకతీయనగర్‌, అంబేద్కర్‌నగర్‌, జేజేనగర్‌, వాయుపురీ, వినోభానగర్‌, వాజ్‌పేయినగర్‌, దీనదయాళ్‌నగర్‌, శ్రీసాయినగర్‌, గోకుల్‌నగర్‌, వెంకటేశ్వర ఆఫీసర్స్‌కాలనీ, భగత్‌సింగ్‌నగర్‌, హిల్‌కాలనీ, మధురానగర్‌, రేణుకానగర్‌, రోహిణీకాలనీ, శివానగర్‌, శివసాయినగర్‌, బాలాజీకాలనీ, సంతోష్‌కాలనీ, శక్తినగర్‌, భరణీకాలనీ, జీకేకాలనీ, సప్తగిరికాలనీ, అంతయ్యకాలనీ, జెకెకాలనీ, వివేకానందపురం, బృందావన్‌కాలనీ, ఆకులనారాయణకాలనీ, కేశవనగర్‌, టెలికంకాలనీ

మౌలాలి

[మార్చు]

మౌలాలి 136వ డివిజన్‌. మౌలాలి గుట్టపై ఉన్న హజ్రత్‌అలీ అలహిసలాం దర్గా (బార్‌గ్‌యే అమిరుల్‌ మోమినీన్‌), సమీపంలోని కద్మే రసూల్‌గుట్ట పై ఉన్న మహ్మద్‌ ముస్తఫా అలహిసలామ్‌ స్మారక చిహ్నాలు, మరోగుట్టపై ఉన్న కూహెబుతూల్‌ స్మారకాలు 400 ఏళ్ల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలు. మౌలాలి ప్రధాన రహదారిపై ఉన్న కమాన్‌ (అబ్బన్‌సాబ్‌కమాన్‌) 230 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. డివిజన్‌లోని కాలనీలు: ఓల్డ్‌మౌలాలి, చందాబాగ్‌, మహాత్మాగాంధీనగర్‌, మారుతీనగర్‌, గాయత్రీనగర్‌, మెహదీజంగ్‌కాలనీ, ప్రగతినగర్‌, ఎస్‌.పి.నగర్‌, ఏపిహెచ్‌బికాలనీ (ప్రశాంత్‌నగర్‌), హనుమాన్‌నగర్‌, కృష్ణానగర్‌, ఆర్టీసీకాలనీ, వినాయక్‌నగర్‌లో కొంత భాగం, గీతానగర్‌, గోకుల్‌నగర్‌, సాయినాథపురం, ఈస్ట్‌చంద్రగిరికాలనీ.

మెట్టుగూడ

[మార్చు]

రైల్వేకు చెందిన వర్క్‌షాపులు, కార్యాలయాలు, వసతిగృహాలు మధ్యన వెలిసిందే మెట్టుగూడ డివిజన్‌.డివిజన్‌ పరిధిలో విజయపురి కాలనీ, కేశవనగర్‌ కాలనీలున్నాయి. ఈ ప్రాంతంలో ఆంగ్లో ఇండియన్లు ఎక్కువ.

అడ్డగుట్ట

[మార్చు]

అడ్డాకూలీలు అభివృద్ధి చేసుకున్నప్ర్రాంతం అడ్డగుట్ట.అతిపెద్ద మురికివాడ.ఎత్త్తెన గుట్టలపై కూడా చిన్న ఇళ్లను నిర్మించుకొని వాటి పైకి చేరుకొనేందుకు మెట్లతో మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు.దీని పరిధిలోని కాలనీలు:తుకారాంగేట్‌, నందానగర్‌, బుద్ధానగర్‌, సాయినగర్‌.గుడిసెవాసులందరికీ పట్టాలను ఇప్పించి అప్పటి న్యాయవాది జి.ఎం.అంజయ్య ఈ బస్తీ ఆవిర్భావానికి కృషి చేశారు.ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా తెదేపా గతంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రూ. రెండు కిలో బియ్యం పథకాన్ని అడ్డగుట్ట నుంచే ప్రారంభించారు.చంద్రబాబు ముఖ్యమంత్రి యువశక్తి పథకాన్ని అడ్డగుట్ట నుంచే ప్రారంభించారు.వర్షాలకు అడ్డగుట్ట కమ్యూనిటీ హాల్‌, లోహియానగర్‌, వడ్డెరబస్తీ, మాంగరోడిబస్తీలు జలమయం అవుతాయి.మెగా రిజర్వాయర్‌ నిర్మాణం పనులు సాగుతున్నాయి.

ఈ ప్రాంతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. డివిజన్‌ పరిధిలోని కాలనీలు...:నెహ్రూ నగర్‌, టీచర్స్‌ కాలనీ, మారేడుపల్లి, తాతాచారి కాంపౌండ్‌, సుభాష్‌ రోడ్‌, సెకెండ్‌ బజార్‌, శివాజీనగర్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు యశోదా, కేర్‌, విజయ హెల్త్‌కేర్‌, షెనాయ్‌, బసంత్‌ సహానీ, సికింద్రాబాద్‌ నర్సింగ్‌ హోం, సలూజ నర్సింగ్‌ హోం సికింద్రాబాద్‌కు సంబంధించిన మున్సిపల్‌ జోనల్‌ కమిషనర్‌ కార్యాలయం, సర్కిల్‌, జలమండలి, కంటోన్మెంట్‌ బోర్డు, డి.సి.పి, సికింద్రాబాద్‌ కోర్టు

దిల్ సుఖ్ నగర్

[మార్చు]

ఒకప్పుడు దిల్ షుక్ నగర్ నగర శివారు ప్రాంతం: 1965 ప్రాంతంలో దిల్ సుక్ రాం అనే వ్వక్తి ఇక్కడ వున్న తన భూములను ఇళ్ల స్థలాల ప్లాట్లుగా వేసి దానికి దిల్ సుక్ నగర్ అని పేరు పెట్టి అమ్మాడు. ఆ తర్వాత అతని పేరుతోనే ఇది స్థిర పడి పోయింది. ప్రస్తుతం ఇదొక అతి పెద్ద వ్వాపార కేంద్రం, విద్యాలయాలకు కూడా ఇది ముఖ్య కేంద్రం.

బేగం బజార్

[మార్చు]

హైదరాబాద్ వ్యాపారులపై ఎందుక దయ కలిగిందో కానీ నిజాం గారి సతీమణి హందాబేగం ఓ ప్రాంతాన్ని రాసిచ్చేసింది…దాని పేరు బేగం బజారుగా నిలిచిపోయింది. 1830లో తన కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్ర చరిత్రలో వ్రాసుకున్నారు. ఆయన వివరించిన దాని ప్రకారం షావుకార్ల కొట్లు ఉండేవి. అది నగరం కన్నా నివాసయోగ్యం.[3]

అఫ్జల్‌గంజ్

[మార్చు]

అయిదవ నిజాం అఫ్జలుద్ దౌలా ధాన్యం గింజల వ్యాపారులకు బహుమతిగా ఇచ్చిన భూమి కాలక్రమేణా అఫ్జల్‌గంజ్గా మారింది.

హిమాయత్‌నగర్‌

[మార్చు]

ఏడవ నిజామ్ పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ పేరుతో హిమాయత్‌నగర్‌గా స్థిరపడింది.

హైదర్ గూడ

[మార్చు]

మొదటి తాలుఖ్ దార్ ( జిల్లా కలెక్టర్) హైదర్ అలీ పేరుతో హైదర్ గుడా వచ్చింది.

మలక్ పేట్

[మార్చు]

గోల్కొండ రాజు అబ్దుల్లా కుతుబ్ షా వద్ద పనిచేసే మాలిక్ యాకూబ్ ఇంటి పరిసరాలు ఆయన పేరుతో మలక్ పేట్ గా మారింది. ఆస్మాన్‌గఢ్‌లోని ఎత్తయిన కొండపై 180 అడుగుల పొడవు, 85 అడుగుల వెడెల్పు గద్దెపై 23 అడుగుల ఎత్తు రేమండ్స్‌ స్తూపం నిర్మించబడింది.

నయాపూల్

[మార్చు]

నయాపూల్ హైదరాబాదులోని ఒక ప్రాంతం.

ఇవి కూడా చూడండి

[మార్చు]
హైదరాబాదు పారిశ్రామిక ప్రదర్శనశాల లోపటి దృశ్యం

హైదరాబాదుకు సంబంధించిన కొన్ని వ్యాసాలు

మూలాలు

[మార్చు]
  1. "India outrage at minister's $7.3m house with bullet-proof bathroom". BBC News. 25 November 2016. Retrieved 5 June 2019.
  2. సాక్షి, ఫీచర్స్ (6 February 2015). "మతసామరస్య ప్రతీక". మల్లాది కృష్ణానంద్. Archived from the original on 2 July 2015. Retrieved 28 May 2019.
  3. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.

బయటి లింకులు

[మార్చు]