హొరనాడు
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| ?హొరనాడు కర్ణాటక • భారతదేశం |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| జిల్లా(లు) | చిక్‌మగళూరు జిల్లా |
| కోడులు • పిన్‌కోడు • టెలిఫోను |
• 577 181 • +08269 |
హొరనాడు (Horanadu) (కన్నడ : ಹೊರನಡು) కర్ణాటక రాష్ట్రములోని చిక్‌మగళూరు జిల్లాలో చికమగళూరుకు నైఋతి దిశగా 100 కి.మీల దూరంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రము. ప్రకృతి రమణీయ సౌందర్యాలు వెల్లువిరిసిన పశ్చిమ కనుమలలో ఉన్న ఈ గ్రామంలో ప్రసిద్ధమైన అన్నపూర్ణేశ్వరి దేవి దేవాలయం ఉన్నది. అన్నపూర్ణేశ్వరీ దేవి విగ్రహాన్ని 1973లో ప్రతిష్టించారు.
[మార్చు] అన్నపూర్ణేశ్వరి దేవాలయం
హొరనాడు అన్నపూర్ణేశ్వరి దేవాయల సందర్శనకు విచ్చేసిన భక్తులకు జాతి, మత, ప్రాంత మరియు భాషా విభేదాలేవీ లేకుండా పప్పుతో చేసిన ప్రసాదముతో పాటు ముప్పూటలా శాఖాహార భోజనము పెడతారు. ఆలయాన్ని సందర్శించే మగ భక్తులు తమ భక్తికి, వినమ్రతకు నిదర్శనముగా చొక్కాలు విడిచి పైభాగాన్ని కండువా లేదా శాలు కప్పుకొంటారు.
అమ్మవారి మూలవిరాట్టు బంగారంతో చేయబడిన విగ్రహం. ఈ అమ్మవారిని దర్శిస్తే జీవితంలో అన్నపానాలకు లోటుండదని భక్తుల విశ్వాసం.