బొప్పాయి: కూర్పుల మధ్య తేడాలు
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
|||
పంక్తి 80: | పంక్తి 80: | ||
* పులియబెట్టిన బొప్పాయి నుంచి పపైన్ ఆయింట్‌మెంట్ తయారుచేస్తారు. |
* పులియబెట్టిన బొప్పాయి నుంచి పపైన్ ఆయింట్‌మెంట్ తయారుచేస్తారు. |
||
* నొప్పి నివారిణిగానూ( పెయిన్‌కిల్లర్) పపైన్ గొప్పదే. అందుకే నరాలమీద ఒత్తిడిని తగ్గించేందుకూ వెన్నుపూసలు జారినప్పుడూ దీన్ని ఇంజెక్ట్ చేస్తారు. |
* నొప్పి నివారిణిగానూ( పెయిన్‌కిల్లర్) పపైన్ గొప్పదే. అందుకే నరాలమీద ఒత్తిడిని తగ్గించేందుకూ వెన్నుపూసలు జారినప్పుడూ దీన్ని ఇంజెక్ట్ చేస్తారు. |
||
* బొప్పాయి హెమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది <ref>[http://www.momjunction.com/articles/papaya-pregnancy-weighing-benefits-risks_00305/ బొప్పాయి ఉపయొగాలు]</ref>. |
|||
+ తెలుగు నాట పచ్చి బొప్పయి కాయ తో వంటలు అంతగా ఇష్ట పడరు గాని ఈశాన్య భారతం లో వంటలకు ఈ కాయను విరివిగా వాడతారు. మిగతా కూరగాయలైన వంకాయ, బీరకాయ, సొరకాయల్లాగానె బొప్పాయి కాయిని కూర గాయగా పరిగణించి విరివిగా అమ్ముతారు. |
+ తెలుగు నాట పచ్చి బొప్పయి కాయ తో వంటలు అంతగా ఇష్ట పడరు గాని ఈశాన్య భారతం లో వంటలకు ఈ కాయను విరివిగా వాడతారు. మిగతా కూరగాయలైన వంకాయ, బీరకాయ, సొరకాయల్లాగానె బొప్పాయి కాయిని కూర గాయగా పరిగణించి విరివిగా అమ్ముతారు. |
||
13:06, 15 డిసెంబరు 2014 నాటి కూర్పు
బొప్పాయి | |
---|---|
పచ్చి కాయలతో ఉన్న చెట్టు పైభాగం | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | కా. పపయా
|
Binomial name | |
కారికా పపయా |
చరిత్ర
మన దేశంలోకి బొప్పాయి (Papaya) 400 ఏళ్ల క్రితమే ప్రవేశించింది. మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయి అనేక ఇతర ఉష్ణమండలాల్లో ప్రాచుర్యం పొందింది. మనదేశంలో బొప్పాయిని ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు. 2007 నాటికి ఆంధ్రప్రదేశ్ లో 3 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతున్నట్లు అంచనా. ముఖ్యంగా కడప, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. బొప్పాయి తక్కువ కాలంలో కోతకు వచ్చే ముఖ్యమైన పండ్లతోట. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో పరందపుకాయ, పరమాత్ముని కాయ, మదన ఆనపకాయ అని అని కూడా బొప్పాయిని పిలుస్తుంటారు.[1]
వైద్య పరమైన ఉపయోగములు
బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్ "ఏ", విటమిన్ "బీ", విటమిన్ "సీ", విటమిన్ "డీ"లు తగుమోతాదులోనున్నాయి. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం ఉదరమే. ఆ జబ్బులను మటుమాయం చేసేందుకు తరచూ బొప్పాయి పండును ఆహారంగా సేవించాలంటున్నారు వైద్యులు. ఉదరంలోని పేగులు శుభ్రమైతే శరీరం పూర్తిగా శుభ్రంగానున్నట్లే లెక్క. దీంతో శరీరం ఉల్లాసంగా తయారై తనపని తాను చేసుకుంటూ పోతుంటుంది.
అనువైన వాతావరణం
బొప్పాయి ఉష్ణమండలపు పంట. సముద్ర మట్టం నుంచి 1000 మీ. ఎత్తువరకు పెంచవచ్చు. వేసవిలో 32 డిగ్రీల సెం.గ్రే. నుంచి 38 డిగ్రీల సెం.గ్రే వరకు తట్టుకుంటుంది. చలికాలంలో 5 డిగ్రీల సెం.గ్రే.కి తక్కువ ఉండరాదు. బొప్పాయి సాగుకు సారవంతమైన ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు అనుకూలం. వీటితోపాటు తేలికగా నీరు ఇంకిపోయే రేగడి నేలల్లో కూడా సాగుచేయవచ్చును. నీరు నిలిచే నేలలు, అధిక చౌడు, ఆమ్ల భూములు, సున్నపురాయి గల నేలలు బొప్పాయి పంటకు పనికిరావు. బొప్పాయికి అధిక గాలుల నుంచి రక్షణ అవసరం.
రకాలు
బొప్పాయిలో అనేక రకాలున్నాయి. వీటిలో ముఖ్యంగా రెండు రకాలు
డయీషియస్
ఇవి ఆడ, మగ పుష్పాలు వేరువేరుగా పూసే చెట్ల రకాలు. వీటిలో గుజ్జు పసుపురంగులో ఉంటుంది. ఈ జాతిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ రకాలు
- వాషింగ్టన
- కో-4
- కో-6
- హానీడ్యూ
గైనో డయీషియస్
ఇవి ఆడపుష్పాలు, ఆడపుష్పాలతోపాటు ద్విలింగ పుష్పాల రకాలు. వీటిలో గుజ్జు ఆరంజి రంగులో తియ్యగా ఉంటుంది. ఈ జాతిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ రకాలు
- కూర్గు హనీడ్యూ
- సోలో
- కో-3
- పూసా డెలీషియస్
- రెడ్ లేడీ (786)
ప్రస్తుతం పండ్ల కోసం భారతదేశంలో ఈ రకాలే ప్రాచుర్యంలో ఉన్నాయి.
ఇతర రకాలు
- బొప్పాయి కాయల నుంచి పాలు సేకరించి పపైన్ (Papain) తయారీకోసం కో-2, కో-5 రకాలు సాగుచేస్తున్నారు.
- పచ్చికాయలు కూరకోసం పూసాజెయింట్ రకం అనువుగా ఉంటుంది.
- పూసా మెజెస్టీ, రెడ్ లేడీ రకాలు ఎక్కువ రోజులు నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండటంతోపాటు దూర ప్రాంతాల రవాణాకు అనుకూలం.
- పెరటి తోటల్లోనూ, ఇంటి ఆవరణలోనూ అందంగా పెంచుకోవటానికి పూసాడ్వార్ఫ్ రకం అనుకూలం.
- నీటి ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో నాటుకోవటానికి పూసా నానా రకం అనుకూలంగా ఉంటుంది.
- రంగు, రుచి కలిగిన చిన్న కాయల కోసం 'సోలో', ఆర్క సూర్య రకాలు సాగు చేయవచ్చు.
పోషక విలువలు
Nutritional value per 100 గ్రా. (3.5 oz) | |
---|---|
శక్తి | 163 కి.J (39 kcal) |
9.81 g | |
చక్కెరలు | 5.90 g |
పీచు పదార్థం | 1.8 g |
0.14 g | |
0.61 g | |
విటమిన్లు | Quantity %DV† |
విటమిన్ - ఎ | 7% 55 μg3% 276 μg |
థయామిన్ (B1) | 3% 0.04 mg |
రైబోఫ్లావిన్ (B2) | 4% 0.05 mg |
నియాసిన్ (B3) | 2% 0.338 mg |
విటమిన్ బి6 | 8% 0.1 mg |
విటమిన్ సి | 74% 61.8 mg |
ఖనిజములు | Quantity %DV† |
కాల్షియం | 2% 24 mg |
ఇనుము | 1% 0.10 mg |
మెగ్నీషియం | 3% 10 mg |
ఫాస్ఫరస్ | 1% 5 mg |
పొటాషియం | 5% 257 mg |
సోడియం | 0% 3 mg |
| |
†Percentages are roughly approximated using US recommendations for adults. |
- కెరోటిన్, ఎ, బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్ ఆమ్లాలు, పీచు.వంటి పోషకాలు[1] బొప్పాయిపండులో పుష్కలం.
- మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీనితోపాటు బి1, బి2, బి3, సి-విటమిన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి.
- కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్ (2020 ఐ.యూ.) తోడ్పడుతుంది.
- బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి (40 మి.గ్రా.) దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది.
- విటమిన్ బి (రైబోఫ్లెవిన్ 250 మైక్రోగాములు) నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది.
- బొప్పాయి 'కాయ' జీర్ణానికి తోడ్పడితే, 'పండు' పోషకాలనిస్తుంది.
- బొప్పాయి పండును చిన్న పిల్లలకు గుజ్జుగా చేసి నాలుగో నెలనుంచి తినిపించవచ్చు. యుక్తవయస్సులో ఉన్నవారు దోరగా పండిన పండును తినవచ్చు.
- 100 గ్రాముల బొప్పాయి ముక్కల్లో లభించేవి
40 క్యాలరీలు
1.8గ్రా. పీచు
9.8గ్రా కార్బోహైడ్రేట్లు
0.6గ్రా ప్రోటీన్లు
10మి.గ్రా. మెగ్నీషియం
257మి.గ్రా. పొటాషియం
3 మి.గ్రా. సోడియం
24మి.గ్రా. కాల్షియం
61.8 మి.గ్రా. విటమిన్-సి
విటమిన్ ఎ(6%)
బీటా కెరోటిన్(3%)
విటమిన్ బి1(3%)
బి2(3%)
బి3(2%)
బి6(8%)
ఉంటాయి.[1] - కొలెస్ట్రాల్ అంటే కొవ్వు లేదు, క్యాలరీలూ తక్కువే. అందుకే స్థూలకాయులు సైతం హాయిగా బొప్పాయిని తినొచ్చు
ఇతర ఉపయోగాలు
బొప్పాయి మంచి సౌందర్యసాధనం కూడా పనిచేస్తుంది.
- బొప్పాయిలోని తెల్లని గుజ్జుని మొహనికి రాయడంవల్ల మంచి మెరుపు వస్తుంది.మొటిమలూ తగ్గుతాయి.
- బొప్పాయి ఫేస్‌ప్యాక్ జిడ్డుచర్మానికి ఎంతో మంచిది. అందుకే సబ్బులు, క్రీముల్లో కూడా ఎక్కువగా వాడుతున్నారు.
- బొప్పాయి పండు తింటే హృద్రోగాలూ, కోలన్ క్యాన్సర్లూ రావు. పండులోని బీటా కెరోటిన్ క్యాన్సర్‌నీ రాకుండా నిరోధిస్తుంది.[1]
- ఆస్తమా, కీళ్లవ్యాధుల వంటివి రాకుండా నిరోధిస్తుంది.
- మలబద్ధకానికి బొప్పాయి పండు మంచి మందు.[1]
- ఆకలిని పుట్టించి నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది.
- బొప్పాయిపండులోని పీచు మొలల్నీ రానివ్వదు.
- బొప్పాయిపండు తినడంవల్ల జలుబు, ఫ్లూ, చెవినొప్పి... వంటివీ తగ్గుతాయి.
- బొప్పాయిపండు తామర వ్యాధిని తగ్గిస్తుంది.
- పచ్చికాయ అధిక రక్తపోటుని (హై బీపీ) నియంత్రిస్తుంది.
- శృంగారప్రేరితంగానూ పనిచేస్తుంది.
- గింజల్లో యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంథెల్‌మింటిక్ గుణాలు మెండు. అందుకే కడుపునొప్పికీ ఫంగల్ ఇన్ఫెక్షన్లకీ వీటిని మందుగా వాడతారు.
- కొన్నిచోట్ల ఆకుల రసాన్ని హృద్రోగాలకు ఔషదంగా ఉపయోగిస్తారు.
- బొప్పాయి ఆకుల రసాన్ని డెంగ్యూ జ్వరము వచ్చినపుడు వాడితే ప్లేట్లెట్లు కౌంటు పెరగడానికి పనిచేస్తుంది.
- డయాబెటిస్ కారణంగా వచ్చే హృద్రోగాల్ని పచ్చి బొప్పాయి తగ్గిస్తుంది.
- బొప్పాయిలోని పపైన్‌ను ట్యాబ్లెట్‌గా రూపొందించి జీర్ణసంబంధ సమస్యలకు మందుగా వాడుతున్నారు.
- ఈ పపైన్ గాయాల్ని మాన్పుతుంది. ఎలర్జీల్ని తగ్గిస్తుంది. అందుకే గాయాలమీదా పుండ్లపైనా బొప్పాయి పండు గుజ్జుని ఉంచి కట్టుకడితే అవి త్వరగా తగ్గిపోతాయి.
- పులియబెట్టిన బొప్పాయి నుంచి పపైన్ ఆయింట్‌మెంట్ తయారుచేస్తారు.
- నొప్పి నివారిణిగానూ( పెయిన్‌కిల్లర్) పపైన్ గొప్పదే. అందుకే నరాలమీద ఒత్తిడిని తగ్గించేందుకూ వెన్నుపూసలు జారినప్పుడూ దీన్ని ఇంజెక్ట్ చేస్తారు.
- బొప్పాయి హెమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది [2].
+ తెలుగు నాట పచ్చి బొప్పయి కాయ తో వంటలు అంతగా ఇష్ట పడరు గాని ఈశాన్య భారతం లో వంటలకు ఈ కాయను విరివిగా వాడతారు. మిగతా కూరగాయలైన వంకాయ, బీరకాయ, సొరకాయల్లాగానె బొప్పాయి కాయిని కూర గాయగా పరిగణించి విరివిగా అమ్ముతారు.
జాగ్రత్తలు
బొప్పాయి కాయలు గర్భస్రావాన్ని కలుగజేస్తాయి. దీనికి ముఖ్యకారణం అందులో ఉండే 'పపైన్' (పాలు). ఇది గర్భాశయంలో ప్రారంభదశలో ఉన్న అభివృద్ధి చెందుతున్న పిండం చుట్టూ ఉండే ప్రొటీనులను కరిగించివేస్తుంది. అందువల్ల గర్భిణిస్త్రీలు, పాలిచ్చు తల్లులు బాగా పండిన బొప్పాయి పండు తినటం మంచిది.
- బొప్పాయి పాలు దురదకు కారణమవుతాయి.[1] అందుకే పచ్చి బొప్పాయి కోసేటప్పుడు ఒంటికి తగలనివ్వకూడదు.
- పండు, గింజలు, ఆకులు, పాలల్లో కారైశ్బన్ అనే యాంథెల్‌మింటిక్ ఆల్కలాయిడ్ ఉంటుంది.[1] ఇది ఎక్కువయితే ప్రమాదకరం.
- క్యారెట్ మాదిరిగానే బొప్పాయిని ఎక్కువగా తింటే కెరటెనిమియా వ్యాధి వస్తుంది[1]
అపోహలు
బొప్పాయి పండ్ల వినియోగంపై గ్రామీణ, పట్టణ వాసులకు కూడా అనేక అపోహలున్నాయి. బొప్పాయి తింటే వేడి చేస్తుందని, గర్భిణి స్త్రీకి గర్భస్రావం అవుతుందని, పాలిచ్చే తల్లి తింటే బిడ్డకు అజీర్తి చేస్తుందని, బహిస్టు సమయంలో స్త్రీలు తింటే రక్తస్రావం ఎక్కువ అవుతుందని, ముసలివారికి, పిల్లలకు అజీర్ణం చేస్తుందని ఇలా ఎన్నో అపోహలున్నాయి. వీటిలో నిజం లేదని శాస్త్రీయంగా రుజువయ్యింది. అంతేకాకుండా బొప్పాయిలో లభ్యమయ్యే అనేక పోషకాలు మన ఆరోగ్య పరిరక్షణకు చాలా అవసరం.
విశేషాలు
- ఆసియా దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో బొప్పాయి పండులోని గింజల్ని ఎండబెట్టి మిరియాలకు బదులుగా వాడతారు[1]
- బొప్పాయి ఆకుల్ని ఉడికించి పాలకూరలా తింటుంటారు
- శ్రీలంక, భారత్, పాకిస్థాన్... వంటి దేశాల్లో గర్భనిరోధానికీ, గర్భస్రావానికీ బొప్పాయిని వాడతారు
- ప్రస్తుతం బొప్పాయిని హవాయ్‌లో ఎక్కువగా పండిస్తున్నారు.
- మెక్సికన్లు దీన్ని ట్రీ మెలన్ అనీ పాపా అనీ పిలుస్తారు.
- పలకబారిన కాయల్ని గది ఉష్ణోగ్రత దగ్గర ఐదారు రోజులపాటు ఉంచితే బాగా పండుతాయి.[1]
- మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలోని ఉత్తరభాగంలో,మెక్సికోలో ఎక్కువగా పండే బొప్పాయి స్పానిష్, పోర్చుగీస్ యాత్రికుల ద్వారా ఇతర ప్రాంతాలకు పరిచయమైంది
- గతంలో బొప్పాయి పండ్లను తినడానికి గాని, వాటిని పెంచ డానికి గాని ప్రజలు/ రైతులు అంతగా ఇష్ట పడే వారు కాదు. ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా తింటున్నందున పందిస్తున్నారు.
.[1]
- ఎండబెట్టిన బొప్పాయి మొక్కలని కుక్కలు ఇష్టంగా తింటాయి.
వనరులు
-
బొఫ్పాయి ఆకు
-
బొప్పాయి పండ్లు
-
చెట్టు, కోసిన పండు Koehler's Medicinal-Plants (1887)
-
హవాయి బొప్పాయి