అంకుర్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంకుర్
Ankur
దర్శకత్వంశ్యాం బెనగల్
రచనశ్యాం బెనగల్ (స్క్రీన్ ప్లే)
సత్యదేవ్ దూబే (సంభాషణలు)
నిర్మాతలలిత్ ఎం.బిజ్లానీ, ఫ్రెనీ వరైవా; బ్లేజ్ ఫిల్మ్ ఎంటర్ ప్రైజెస్
తారాగణంషబానా అజ్మీ
అనంత్ నాగ్
సాధూ మెహర్
ప్రియా తెండూల్కర్
ఖాదర్ అలీ
దలీప్ తహిల్
ఛాయాగ్రహణంగోవింద నిహ్లానీ
కామత్ ఘనేకర్[1]
సంగీతంవన్ రాజ్ భాటియా
విడుదల తేదీ
1974
సినిమా నిడివి
125 నిమిషాలు
దేశంభారత దేశం
భాషదక్కనీ

అంకుర్ (హిందీ: अंकुर, ఉర్దూ: اَنکُر, అనువాదం: అంకురం) 1974 నాటి హిందీ చలనచిత్రం. ప్రముఖ దర్శకుడు శ్యాం బెనగళ్ తీసిన మొదటి చలనచిత్రం, అలానే అనంత్ నాగ్, షబానా ఆజ్మీ వంటి నటీనటుల తొలి చిత్రం.

ఇతివృత్తం

[మార్చు]

పుట్టుకతో మాటలు రాని, వినిపించని కిష్టయ్య (సాధూ మెహర్) కుమ్మరి. అతని భార్య లక్ష్మి (షబానా అజ్మీ) ఊరి కామందు సూర్య (అనంత్ నాగ్) దగ్గర పనిచేస్తూంటుంది. కుండలు, ఇతర వస్తువులు మట్టితో తయారుచేసి అమ్ముకునే అతనికి అల్యూమినియం పాత్రలు మార్కెట్లోకి రావడంతో పని పోయింది. చేసే వృత్తి పాడైపోవడంతో తాగుడుకు బానిసగా మారిపోయిన భర్తను సరిజేసుకునేందుకు తన యజమానికి చెప్పి అతని వద్ద బండితోలే పనిలో పెడుతుంది లక్ష్మి. అప్పటికే తాగుబోతుగా తయారు కావడంతో రాబడికి మించి తాగుతూ, చివరకి కల్లు దొంగతనం చేస్తూ దొరికిపోతాడు కిష్టయ్య. దొంగతనం చేసినందుకు తల గొరిగి వదిలిపెట్టడంతో, ఆ అవమానంతో ఊళ్ళో తిరగలేక కిష్టయ్య ఊరొదిలి పారిపోతాడు.
భర్త వదిలిపెట్టిన స్త్రీ కావడం, అమాయకురాలు కావడం, వెనుకబడ్డ వర్గానికి చెందివుండడం వంటి కారణాలతో నిస్సహాయురాలైన లక్ష్మిని

సూర్య లొంగదీసుకుంటాడు. అతని వల్ల గర్భం రావడంతో తన మర్యాదకు భంగమౌతుందని భయపడి తీయించుకోమని బెదిరిస్తాడు. ఐతే ఆమె కడుపుతీపితో ఆ పనిచేయడానికి వ్యతిరేకించడంతో కోపగించుకుంటాడు. యజమాని భార్య కాపురానికి రావడంతో లక్ష్మిపై దొంగతనం నేరం మోపి పనిలోంచి తీసేస్తాడు. నిండు గర్భంతో ఉన్న లక్ష్మి తిండి, ఆలనా పాలనా చూసుకునే తోడు లేక ఒంటరిగా మిగిలిపోతుంది.
ఇంతలో హఠాత్తుగా కిష్టయ్య తిరిగి వస్తాడు. లక్ష్మి గర్భవతి కావడాన్ని చూసి చాలా సంతోషపడతాడు. భార్యని, పుట్టబోయే బిడ్డనీ చూసుకునేందుకు యజమానిని వేడుకుని బండి తోలే పని అడిగేందుకు బయలుదేరుతాడు. ఐతే వస్తున్న కిష్టయ్య చేతిలోని కర్ర, బిగించి కట్టిన తలపాగా, వచ్చే వేగం చూసి తాను అతనికి చేసిన ద్రోహానికి కొడదామనే వస్తున్నాడని యజమాని సూర్య అనుమానిస్తాడు. భయపడి అతని కన్నా ముందుగానే కొరడా తీసుకుని అతన్ని చావబాదుతాడు. ఇది లక్ష్మి, పాలేర్లు, ఆడుకుంటున్న పిల్లలు చూస్తున్నా వాళ్ళలో వాళ్ళు తిట్టుకుంటూ ఊరుకుంటారు. ఆఖరికి ఓ చిన్న పిల్లాడు చాటుగా రాయి తీసుకుని, యజమాని ఇంటిమీదికి విసురుతాడు. ఆ ఇంటి కిటికీ అద్దం భళ్ళున బద్దలవడంతో సినిమా ముగుస్తుంది.[2]

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

బెనగళ్ళ శ్యామసుందరరావు అసలు పేరు శ్యాం బెనగళ్, తెలంగాణాకు చెందిన తెలుగువాడు. ఆయన 1950ల్లో తెలంగాణా ప్రాంతంలో జరిగినట్టుగా చెప్పుకున్న కథను ఆధారం చేసుకుని ఈ కథ రాసుకున్నారు బెనగళ్. సినిమాకు తెలంగాణా ప్రాంతం నేపథ్యం కావడంతో సినిమా స్క్రిప్ట్ లో సంభాషణలు దక్కనీ భాషలో రాసుకున్నారు. ఎప్పుడో రాసుకున్న స్క్రిప్ట్ సినిమాగా తీయడానికి అవకాశాల దొరకకపోవడంతో, యాడ్ ఫిల్మ్స్ తీసే కంపెనీలో చేరి పనిచేశారు. కొన్ని డాక్యుమెంటరీలు కూడా చిత్రీకరించారు. కొన్నాళ్ళకు కంపెనీ లాభాల్లోకి వచ్చాకా, పై అధికారులను ఒప్పించి ఐదు లక్షల బడ్జెట్ మంజూరుచేయగా సినిమా తీశాడు.[2]

నటీనటుల ఎంపిక

[మార్చు]

బెనగళ్ మొదట లక్ష్మి పాత్రకు సుచిత్రా సేన్‌ను తీసుకుందామని భావించారు. ఆమెకు పాత్ర నచ్చినా, సినిమా అంతా దక్కనీ భాషలో ఉండడంతో తాను సౌకర్యంగా నటించలేనంటూ సినిమా అంగీకరించలేదు. పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చదువుకుని, యాడ్ లలో పనిచేస్తున్న షబానా అజ్మీని కథానాయకగా తీసుకున్నారు. మరో ప్రధాన పాత్రకు అప్పటి ప్రఖ్యాత రంగస్థల నటుడు అనంత్ నాగ్‌ను తీసుకున్నారు. తర్వాతి కాలంలో ప్రసిద్ధ నటులైన వీరిరువురికీ ఇదే తొలి చిత్రం.[2]

చిత్రీకరణ

[మార్చు]

సినిమాలో ఏ కొద్ది భాగాన్ని కూడా స్టూడియోల్లో తీయకుండా, అంతా తెలంగాణా జిల్లాల్లోని ఔట్ డోర్ లోనే చిత్రీకరించారు. సినిమాకు ఛాయాగ్రాహకునిగా గోవింద్ నిహలానీ పనిచేశారు.[2]

ప్రాచుర్యం

[మార్చు]

1973లో అంకుర్, గరంహవా సినిమాలు విడుదల కావడంతో భారతీయ పారలల్ సినిమాల చరిత్రలో మైలురాయిగా నిలిచింది. భారతీయ పార్లల్ సినిమాలను గొప్ప స్థానానికి తీసుకువెళ్ళిన సినిమాగా ప్రఖ్యాతి చెందింది.

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Ankur (1974) - Cast and Credits New York Times.
  2. 2.0 2.1 2.2 2.3 మహమ్మద్, ఖదీర్ బాబు (2010). "వ్యవస్థ గర్భంలో చైతన్యబీజం అంకుర్". బాలీవుడ్ క్లాసిక్స్ (1 ed.). హైదరాబాద్: కావలి ప్రచురణలు. pp. 56–58.
  3. అంకుర్ - పురస్కారాలు ఇంటర్నెట్ మూవీ డేటాబేస్.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు