అంథోని పీటర్ కిశోర్
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. (March 2015) |
ఫాదర్ డా. గుజ్జుల అంథోని పీటర్ కిశోర్, యస్.జె | |
---|---|
ఒక కళాశాల కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఫాదర్ కిశోర్ | |
జననం | ఫాదర్ డా. గుజ్జుల అంథోని పీటర్ కిశోర్, యస్.జె. 1965,ఫిబ్రవరి 1 కృష్ణా జిల్లా గుడివాడ |
నివాస ప్రాంతం | విజయవాడ |
ఇతర పేర్లు | ఫాదర్ కిశోర్ |
వృత్తి | యేసు సభ సభ్యులు ఆంధ్ర లొయోల కళాశాల, విజయవాడలో ప్రాచార్యులు (ప్రిన్సిపాల్) సమాజ సేవకులు |
పదవి పేరు | ఫాదర్, యస్.జె. |
ఫాదర్ డా. జి.ఏ.పి. కిశోర్, యస్.జె, ఫాదర్ కిశోర్ గా సుపరిచితులయిన ఫాదర్ డా. గుజ్జుల అంథోని పీటర్ కిశోర్ అధ్యాపకులు, బైబులు ఉపదేశకులు, సమాజసేవకులు. ఈయన యేసు సభ సభ్యులు. ప్రస్తుతం ఆంధ్ర లొయోల కళాశాల ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు. [1]. వీరు క్రైస్తవ సాహిత్యంలో కొన్ని రచనలు కూడా చేసారు.
బాల్యం[మార్చు]
ఫాదర్ కిశోర్ 1965 ఫిబ్రవరి 1న గుడివాడలో జన్మించారు. మరియమ్మ, ప్రసాదరావు వీరి తల్లిదండ్రులు, ఇద్దరూ ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసిన వారే. ఫాదర్ కిశోర్ కు ఒక తమ్ముడు, ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. 1965 మార్చి 14న గుడివాడలోని కలవపూడి అగ్రహారంలో బాప్తిజం పొందారు.
విద్యాభ్యాసం[మార్చు]
ఫాదర్ కిశోర్ ప్రాథమిక విద్యను కలవపూడి అగ్రహారంలోని పంచాయతీ సమితి ఎలిమెంటరీ స్కూలులో 1975లో పూర్తి చేసారు. అక్కడి నుండి హై స్కూల్ విద్య కోసం సెయింట్ జేవియర్స్ హై స్కూల్ ఏలూరుకు వచ్చి 1980లో పూర్తి చేసారు. ఇంటర్ ఎంపీసీ ఆంగ్ల మాధ్యమంలో 1982లో ఆంధ్ర లొయోల కళాశాల విజయవాడలో పూర్తి చేసారు. ఆపై యేసు సభలో చేరారు. యేసు సభలో చేరాక ఆంధ్రా లొయోల కళాశాల నుండి 1986-88 మధ్య తెలుగులో బీ.ఏ. మొదటి రెండు సంవత్సరాలు అభ్యసించారు, 1989లో మూడో సంవత్సరం బీ.ఏ. ఆంధ్ర క్రైస్తవ కళాశాల గుంటూరులో పూర్తి చేసారు. డిగ్రీలో విశ్వవిద్యాలయ స్థాయిలో బంగారు పతకం సాధించారు. 1991 లో తత్త్వశాస్త్రంలో ఎం.ఏ మద్రాసులోని సత్యనిలయంలో పూర్తి చేసారు. 1991-93 మధ్య హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఏ చేసారు. అక్కడ కూడా యూనివర్సిటీ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించారు. ఎం.ఏ పూర్తి చేసాక యూజీసీ వారి నెట్ పరీక్షలో ఉత్తీర్ణులై అధ్యాపకవృత్తికి అర్హత సాధించారు, ఇలా యేసు సభ నుండి నెట్ కు అర్హత సాధించిన వారిలో మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. మే 2009 లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి "తెలుగు, బైబులు సామెతలు : ఒక తులనాత్మక పరిశీలనం" అనే అంశానికి పీహెచ్‍డీ పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం పీహీచ్‍డీతో పాటు ఫాదర్ కిశోర్ ను బంగారు పతకంతో సత్కరించింది.
రచనలు[మార్చు]
- స్థానిక శ్రీ సభ (ప్రాంతీయ చర్చి గురించి) - 1988లో
- ఇగ్నేషియస్ లొయోల - 1991లో
- తెలుగులో దాదాపు 50 వరకూ క్రైస్తవ భక్తి గీతాలు.
- తెలుగు, బైబుల్ సామెతలు - పరిశీలన, మానవ నైజము, ఉపదేశ సారము ( మూడు సంపుటాలు)
మూలాలు[మార్చు]
- ↑ "ఆకడమిక్ ఆడిట్" (PDF). ap.gov.in. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. Archived from the original (PDF) on 1 నవంబర్ 2014. Retrieved 8 December 2014. Check date values in:
|archive-date=
(help)