Jump to content

అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా

వికీపీడియా నుండి
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా
బెల్లా విస్టా (ఏఎస్‌సిఐ భవనం)
రకంపౌర సేవారంగ శిక్షణ సంస్థ
స్థాపితం1956
చైర్మన్కె. పద్మనాభయ్య[1]
స్థానంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
కాంపస్పట్టణ, 9 ఎకరాలు (0.036 కి.మీ2)
దినపత్రికఏఎస్‌సిఐ జర్నల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, బెల్లా విస్టా టైమ్స్
జాలగూడుhttp://www.asci.org.in/

అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సిఐ), తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కళాశాల. పౌర సేవల అభివృద్ధి రంగంలో శిక్షణ ఇవ్వడానికి 1956లో భారత ప్రభుత్వం, పరిశ్రమ ప్రతినిధులు సంయుక్తంగా దీనిని ప్రారంభించారు.[2] హైదరాబాద్ రాజ్య వారసుడు, బేరార్ యువరాజు నివసించిన రాజభవనమైన బెల్లా విస్టాలో ఈ కళాశాల ఉంది.[3][4]


ప్రారంభం

[మార్చు]

బ్రిటన్‌లో ఒక కళాశాలను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం భావించింది. 1948లో హెన్లీలో మొదటి సెషన్ కూడా ప్రారంభమైంది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీని భారతదేశంలో ఏర్పాటు చేయాలని 1953లో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కమిటీ సిఫార్సు చేసింది. 1954లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సందర్శన నుండి తిరిగి వస్తూ మిస్టర్ హాల్ భారత ప్రభుత్వ అతిథిగా ఢిల్లీకి వచ్చి, ప్రణాళిక కమిటీ సమావేశాలకు హాజరయ్యాడు. ఆ సమావేశంలో కమిటీ ముందుకు సాగాలనే నిర్ణయం తీసుకోబడింది. 1956లో మొదటి కమిటీ ఏర్పాటు చేయబడింది. మాజీ కేంద్ర ఆర్థికమంత్రి డాక్టర్ జాన్ మత్తాయ్ అధ్యక్షతన ఏర్పడిన 18మంది సభ్యుల కమిటీలో అనేకమంది సీనియర్ సివిల్ సర్వెంట్లు, వ్యాపార, విద్యా సంఘాల నాయకులు ఉన్నారు. హైదరాబాదులో కళాశాలను స్థాపించాలని నిర్ణయించినందున, బెరార్ యువరాజు పూర్వపు రాజభవనమైన బెల్లా విస్టా ప్రాంగణం అందుబాటులోకి వచ్చింది.

1956, మే 18న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద సొసైటీగా నమోదు చేయబడింది. జనరల్ ఎస్.ఎం. శ్రీనాగేష్ ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా పదవీ విరమణ చేసిన తరువాత కాలేజీకి మొదటి ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యాడు. 1957, మే 8న ఇంగ్లాండ్‌లోని హెన్లీ-ఆన్-థేమ్స్ కాలేజీలో ఆరువారాల పాటు ఉండి సంస్థ పని విధానం, కోర్సుల వివరాలు అధ్యయనం చేశాడు. 1957, అక్టోబరు 6న (ప్రతి సంవత్సరం ఏఎస్‌సిఐ ఫౌండేషన్ డేగా జరుపుకుంటారు) విద్యా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కొద్దికాలంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా మారింది.[5]

కార్యకలాపాలు

[మార్చు]

అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అనేది కార్పోరేట్, ప్రభుత్వ రంగాల పౌర సేవకుల శిక్షణ నిర్వహణలో అత్యుత్తమ, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ.[6] ప్రభుత్వ, వ్యాపార సంస్థల నిర్వహణలో నిపుణుల సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యాలతో కూడిన స్వయంప్రతిపత్తి, స్వయం సహాయక, ప్రజా ప్రయోజన సంస్థ. 1973లో ఫోర్డ్ ఫౌండేషన్ సహాయంతో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా పరిశోధన, కన్సల్టెన్సీ కార్యకలాపాలు ప్రారంభించింది. 1976 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి ఆర్.హెచ్. ఖ్వాజా 2017, జనవరి 1న దీని డిజీగా బాధ్యతలు స్వీకరించాడు.[7]

కెపాసిటీ బిల్డింగ్, అప్లైడ్ రీసెర్చ్ అసైన్‌మెంట్‌లకు ఈ సంస్థ పేరుగాంచింది. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, సాంకేతిక, నియంత్రణ, మానవ, సంస్థాగత, పర్యావరణ అంశాలను దాని నిర్వహణ శిక్షణ, యాక్షన్-పరిశోధన కార్యక్రమాలలో ప్రభుత్వం, పరిశ్రమకు సంబంధించిన ప్రస్తుత సమస్యలను పరిష్కరించడం ఇది కృషి చేస్తోంది. విధానం, వ్యూహం, నిర్వహణ, పాలన, నియంత్రణ, సామాజిక-ఆర్థిక ప్రభావ అధ్యయనాలపై దృష్టి సారించి శిక్షణ, పాలసీ, సలహా, సహాయ సేవలపై నాలెడ్జ్ ఇన్‌పుట్‌లు, సమాచార సలహాలు, ఉత్తమ అభ్యాసం, వినూత్న ఆలోచనలు వంటి విధానాల్లో పరిణితిని తెస్తుంది. భారతదేశం, విదేశాల పరిశ్రమలలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖలకు స్థిరమైన విధానాలను అభివృద్ధి చేయడానికి, వ్యూహాలను రూపొందించడానికి, మెరుగైన ఆర్థిక పనితీరు, మానవ అభివృద్ధి, సామాజిక పురోగతికి బలమైన ప్రణాళికలను అమలు చేయడానికి అవకాశాలను అందిస్తుంది.[8]

అభివృద్ధి కార్యక్రమాలు

[మార్చు]

వివిధ రకాల ఫంక్షనల్ మేనేజ్‌మెంట్ ప్రాంతాలు, థీమ్-నిర్దిష్ట డొమైన్‌లు, సెక్టోరల్ విభాగాలపై ప్రతి ఏటా 200లకు పైగా మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు నిర్వహించబడతాయి. ప్రతి సంవత్సరం దాదాపు 4,500 మంది ఈ కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందుతారు. ఇప్పటివరకు దాదాపు 1,40,000 కంటే ఎక్కువమంది ఇక్కడ శిక్షణ పొందారు. 46 దేశాలలోని 100 సంస్థల నుండి 250 మంది అంతర్జాతీయంగా ఈ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆసియాలోని చైనా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, వియత్నాం దేశాలలోని, యూరప్లోని ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్లోవేనియా, స్విట్జర్లాండ్ దేశాలలోని, యుఎస్‌ లోని అగ్రశ్రేణి సంస్థల శాశ్వత భాగస్వామ్యాలతో అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.[8]

మూలాలు

[మార్చు]
  1. "Governance". Administrative Staff College of India. 2016. Retrieved June 24, 2016.
  2. "ASCI — A college that moulds administrative mandarins". Archived from the original on 2012-09-22. Retrieved 2011-07-16.
  3. "Princess Dürrühsehvar of Berar". The Telegraph. Retrieved 3 February 2012.
  4. Bilquis Jehan Khan. "A Song of Hyderabad". thefridaytimes.com. Archived from the original on 22 February 2014. Retrieved 28 January 2012.
  5. "History – ASCI" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-10.
  6. "World Bank Helps Train New Breed of Professional Urban Managers". Archived from the original on 2011-10-01. Retrieved 2011-07-16.
  7. "RH Khwaja takes charge as ASCI DG". indtoday.com. 3 January 2017.
  8. 8.0 8.1 "Introduction – ASCI" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-10.

బయటి లింకులు

[మార్చు]