Jump to content

అనంతబొట్ల వారి కండ్రిక.

వికీపీడియా నుండి
ఎబి.కండ్రిక
సాధనాల వారి పాలెం
ముద్దు పేరు: సాధనాల వారి పాలెం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం బోగోలు
ప్రభుత్వం
 - సర్పంచి సాధనాల మాధవ
 - సాధనాల సాధనాల పుల్లయ్య
 - గద్దె కొండయ్య
వైశాల్యము
 - మొత్తం 3.6 km² (1.4 sq mi)
కాలాంశం +5:30 (UTC)
పిన్ కోడ్ 524142
Area code(s) +91 0( )
ఎస్.టి.డి కోడ్ 08626 {{{blank_info}}}

ఎబి కండ్రిక నెల్లూరు జిల్లా బోగోలు మండలానికి చెందినగ్రామం. విలువైన 110 ఎకరాల మాన్యం భూమి ఉన్నా, ఆదరణ కరువైంది. స్థానికులే ఉద్యమం నడిపారు. అప్పుడు దేవాదాయ శాఖ 11 లక్షలు మంజూరు చేయగా, దాతలు పెద్ద ఎత్తున స్పందించి, చేయూతనివ్వగా జీర్ణోద్ధరణ పనులు దాదాపు పూర్తయినవి.2014 జనాభా లెక్కల ప్రకరం 619 మంది ఓటర్లు ఉన్నారు, వీరిలో 316 మంది పురుషులు, 303 మంది స్త్రీలు ఉన్నరు.ఈ గ్రామం పూర్తి పేరు అనంత బొట్ల వారి కండ్రిక.

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

ఈ గ్రామం సాధనాల వంశం వారు నిర్మించారు. ఇక్కడ కమ్మ కులస్థులు, యాదవ రాజు కులస్థులు ఎక్కువగా ఉన్నారు. అలాగే రెడ్డి ,కంసాలి,వైశ్య కులస్థులు బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా ఉన్నారు. ముస్లిం మతస్థులు, క్రైస్తవ మతస్థులు కూడా ఉన్నారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2005 - గ్రామ సర్పంచ్ గా బత్తల సీతయ్య

2009 - సర్పంచ్ గా డమ్ము రమణయ్య

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సాధనాల మాధవరావు, సర్పంచిగా ఎన్నికైనాడు. గ్రామంలో రోడ్ నిర్మాణాలు స్మశాన వాటికలు గ్రామ పంచాయతీ కార్యాలయం, వీధి దీపాల పునరుద్ధరణ , గ్రామ దేవస్థానాల పునరుద్ధరణ  ఇంకా ఎన్నో సేవ కార్యక్రమాలు చేసినారు.

గ్రామ విశేషాలు

[మార్చు]

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, పదేళ్ళనుండి అపరిశుభ్రంగా ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకు లోపలి భాగాన్ని, గ్రామ సర్పంచి శ్రీ సాధనాల మాధవ, శుద్ధిచేయించారు. తానుగూడా ట్యాంకు ఎక్కి, లోపలకు దిగడంతో, కూలీలు గూడా లోపలికి దిగేందుకు చొరవ చూపించారు. బ్లీచింగు పొడితో ట్యాంకు లోపల పేరుకుపోయిన వ్యర్ధాలను, శుభ్రపరచి, బయటకు పంపినారు.

పటం
Map

గ్రామ దేవాలయాలు


సీతాలాంబ ఆలయం

1. శ్రీ రామా ఆంజనేయ దేవస్థానం

2. శ్రీ సీతలాంబ దేవస్థానం

3. శ్రీ పోలేరమ్మ దేవస్థానం

4. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం

శాసనసభ నియోజకవర్గం

[మార్చు]

పూర్తి వ్యాసం కావలి శాసనసభ నియోజకవర్గంలో చూడండి.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రభుత్వ బడి కలదు.గ్రామంలో గల MLN విద్య సంస్థ 2002 లో శ్రీ సాధనా దామోదర్ గారి చే స్థాపించబడినది. తెలుగు, ఆంగ్ల బాషల యందు ఇక్కడ విద్య బోధన జరుగుతుంది.   పదవ తరగతి వరకు ఇక్కడ అందుబాటులో ఉంది . 2002 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మండలం లో గల విద్య సంస్థలలో ఇది మొదటి స్థానం లో ఉంది. ప్రస్తుతం ఇక్కడ 600 మంది పైగా విద్యార్థులు విద్య ను అభ్యసిస్తున్నారు.

వైద్య సౌకర్యం

[మార్చు]

బిట్రగుంటలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ, పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు
  • చెరువులు
  • కావలి కాలువ
  • సోమశిల డ్యామ్
  • బోరు వ్యవసాయం    

ఉత్పత్తి

[మార్చు]

బిట్రగుంటలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

వరి, ప్రత్తి, వేరుశెనగ

రవాణా సౌకర్యాలు

[మార్చు]

కావలి, నెల్లూరు వెళ్ళుటకు బస్సు ఆటో సౌకర్యం కలదు

మూలాలు

[మార్చు]