Jump to content

అనురాగ దేవత

వికీపీడియా నుండి
(అనురాగదేవత నుండి దారిమార్పు చెందింది)
అనురాగ దేవత
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం నందమూరి హరికృష్ణ
తారాగణం నందమూరి తారక రామారావు,
జయసుధ,
శ్రీదేవి,
నందమూరి బాలకృష్ణ
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ రామకృష్ణ సినీ స్టుడియోస్
విడుదల తేదీ జులై 1, 1982
భాష తెలుగు

ఇది 1980లో విడుదలైన తెలుగు చిత్రం. జీతేంద్ర, రీనారాయ్, తాళ్ళూరి రామెశ్వరి నటించిన హిందీ చిత్రం 'ఆశా' ఆధారంగా ఎన్.టి.ఆర్ సొంతంగా నిర్మించిన సినీమా. ఈ సినిమాకు పరుచూరి సోదరులు రచన చేశారు (ఎన్.టి.ఆర్ కు తొలిసారిగా)

చిత్ర కథ

[మార్చు]

ఎన్.టి.ఆర్ లారీ ద్రైవర్. శ్రీదేవి పేరున్న గాయకురాలు. వారిరువురికి పరిచయం కలుగుతుంది. శ్రీదేవి అతన్ని ప్రేమిస్తుంది. ఐతే ఆ డ్రైవర్ కు అప్పటికే పెళ్లైపోయి ఉంటుంది (జయసుధ తో). ఒక ప్రమాదం వల్ల వారిరువురూ విడిపోతారు. జయసుధను ప్రమాదం నుండి బాలకృష్ణ కాపాడుతాడు. డ్రైవరు పట్ల ఆశ పెంచు కున్న శ్రీదేవి చివరలో రామారావు, జయసుధ కలవడంతో వంటరిగా మిగిలిపోతుంది.

నటవర్గం

[మార్చు]
  • ఎన్.టి.రామారావు
  • జయసుధ
  • శ్రీదేవి
  • బాలకృష్ణ
  • నూతన్ ప్రసాద్
  • అల్లు రామలింగయ్య
  • ఋష్యేంద్రమణి
  • కవిత
  • గుమ్మడి
  • అన్నపూర్ణ
  • రామతులసిగా అనురాధ శ్రీరామ్ (బాల నటి)

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  • చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా ( షీశా హో యా దిల్ హో ఆఖిర్ టూట్ జాతా హై) రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం. పి సుశీల
  • నీ ఆట నాపాట పదిమంది చూడాలీపూట , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • అందాల హృదయమా రచన: వేటూరి సుందర రామమూర్తి ,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • ఆడవే గోపికా , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
  • ముగ్గురమ్మల రచన:వేటూరి సుందర రామమూర్తి గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,పి సుశీల
  • ముగ్గురమ్మల కన్న , రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం.పి సుశీల.