Jump to content

అనుష్క శంకర్

వికీపీడియా నుండి
అనుష్క శంకర్
అనుష్క శంకర్
జననంఅనుష్క శంకర్
జూన్‌ 9 1981
ఇతర పేర్లుఅనుష్క శంకర్
ప్రసిద్ధిసితార విధ్వాంసురాలు
తండ్రిరవి శంకర్‌
తల్లిసుకన్యా రాజన్‌

అనుష్క శంకర్ భారతీయ ప్రముఖ సితార కళాకారుడు పండిట్ రవిశంకర్ కుమార్తె. ఈమె కూడా సితార విద్వాంసురాలు. ఈమె కూడా దేశ, విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చి మంచి పేరు తెచ్చుకున్నది. ఆమె గాయకుడు నోరా జోన్స్‌తో కలిసి గ్రామీ అవార్డును అందుకొని ఎంతో ప్రజాదరణ, గుర్తింపు (పాపులారిటీ) సంపాదించింది. ఈ ప్రఖ్యాత కళాకారిణి కొందరు ప్రముఖులతో కలిసి పాన్‌ ఏషియన్‌ గర్ల్‌ బ్యాండ్‌ (Pan Asian Girl Band)ను రూపొందించేందుకు నడుం బిగించింది. ఈ బృందం(బ్యాండ్‌)లో చైనా, జపాన్‌, కొరియా, ఫిలిప్పీన్స్‌తో పాటు భారతదేశము నుంచి ఒక్కొక్క పాప్‌ కళాకారులను (ఆర్టిస్ట్‌ను) ఎంపికచేయనున్నారు.

జీవిత విశేషాలు

[మార్చు]

గ్రామీ అవార్డు విజేత అనౌష్క శంకర్‌ 1981 జూన్ 9 న జన్మించింది.[1] ఆమె ప్రసిద్ధ సితార్‌ కళాకారుడు రవి శంకర్‌, బ్యాంక్‌ ఉద్యోగిని అయిన సుకన్యా రాజన్‌ దంపతులకు జన్మించింది. ఆమె లండన్‌లో జన్మించగా కొంతకాలం లండన్‌లో, మరికొంతకాలం ఢిల్లీలో ఆమె బాల్యం గడిచింది. టీనేజీ వయస్సులో ఆమె క్యాలిఫోర్నియాలో ఉంటూ సాన్‌ డిగిటో మ్యూజిక్‌ అకాడమీలో సంగీతంలో శిక్షణ పొందింది. తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకున్న అనౌష్కకు చిన్నతనం నుంచే సంగీతమంటే ప్రాణం. ఆమె తన తండ్రి పండిత్‌ రవిశంకర్‌ వద్ద సితార్‌ వాయించడాన్ని నేర్చుకున్నది. 13 సంవత్సరాల వయస్సులోనే ఆమె సంగీత ప్రదర్శనలను (మ్యూజిక్‌ షోలను) నిర్వహించడం విశేషం.

ఆ తర్వాత 16 సంవత్సరాల వయస్సులో మొదటి రికార్డు ఒప్పందం (కాంట్రాక్ట్‌)పై సంతకం చేసింది. 1998లో విడుదలైన తన మొదటి మ్యూజిక్‌ ఆల్బమ్‌ అనౌష్కతో ఆమె ఎంతో ప్రజాదరణ, గుర్తింపు సంపాదించింది. అనంతరం 2000 సంవత్సరం ఫిబ్రవరిలో కోల్‌కతాలోని రామకృష్ణ సెంటర్‌లో సంగీత ప్రదర్శనిచ్చిన మొదటి మహిళగా పేరు తెచ్చుకున్నది. నేడు సంగీత ప్రపంచంలో సితార్‌ వాయిద్యకారిణిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది అనౌష్క. తండ్రి సంగీత వారసత్వాన్ని పుణికిపుచ్చు కొని సంగీతకారిణిగా పేరుతెచ్చుకున్నది.

పాప్‌ సంగీతంతో ఒకప్పుడు యువతను ఉర్రూతలూగించింది సైపస్ గర్ల్స్. అనంతరం కొంతకాలానికి విడిపోయిన ఈ గర్ల్స్ బ్యాండ్‌ తన సంగీతంతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యాండ్‌ ఏర్పాటుకు కృషిచేసిన కొందరు ప్రముఖులతో కలిసి ప్రఖ్యాత సితార్‌ కళాకారిణి అనౌష్క శంకర్‌ పాన్‌ ఏషియన్‌ గర్ల్‌ బృందాన్ని ఏర్పాటుకు కృషిచేస్తుండడం విశేషం. ఆసియా ఖండంలోని భారతదేశముతో పాటు చైనా, జపాన్‌, కొరియా, ఫిలిప్పీన్స్‌ల నుంచి ఒక్కొక్క పాప్‌ కళాకారులను వారు ఎంపికచేయనున్నారు. ఇక భారత దేశము నుంచి ప్రతిభ ఉన్న పాప్‌ కళాకారులను ఎంపిక చేసే బాధ్యతను అనౌష్క శంకర్‌కు చెందిన సంస్థ 'ఆల్‌కెమిస్ట్‌ టాలెంట్‌ సొల్యూషన్‌' తీసుకుంది.

16 సంవత్స రాల నుంచి తాను సితార్‌ కళాకారిణిగా దేశ, విదేశాల్లో సంగీత ప్రదర్శనలిస్తున్నాననీ కానీ తనకు ఎక్కడా పాప్‌ సంగీత రంగంలో ప్రజాదరణ, గుర్తింపు సంపాదించుకున్న భారతదేశ అమ్మాయిలు కనిపించలేంచలేదని అనౌష్క అన్నది. దీంతో తాను కొందరు ప్రముఖులు కలిసి ఏర్పాటు చేస్తున్న 'పాన్‌ ఏషియన్‌ గర్ల్‌ బ్యాండ్‌' ఏర్పాటులో భాగంగా భారతదేశము నుంచి గుర్తింపు పొందిన కళాకారులను తాను ఎంపిక చేయనున్నట్టు చెప్పింది. ఈ బృందంలో గాయకులుగా భారతదేశ అమ్మాయిలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకునే అవకాశం ఉందని తెలిపింది. భారతదేశ కళాకారులనుప్రోత్స హించడమే తమ లక్ష్యమన్నది.

దేశం గర్వించదగ్గ సితార్‌ విద్వాంసుడు మా నాన్న. అయినా నాకూ వేధింపులు తప్పలేదు. చిన్నప్పుడు ఎన్నోసార్లు శారీరక, మానసిక వేధింపులకు గురయ్యాను. ఎవరికి చెప్పాలో, ఎలా వాటిని ఎదుర్కోవాలో తెలియక మౌనంగా భరించాను. మా కుటుంబానికి ఎంతో సన్నిహితుడైన ఓ పెద్దమనిషే అలా చేసేవాడు' అని పండిట్‌ రవిశంకర్‌ కూతురు, సితార్‌ కళాకారిణి అనౌష్క శంకర్‌ చెప్పింది. ప్రేమికుల రోజున మహిళలపై హింసకు వ్యతిరేకంగా 'వన్‌ బిలియన్‌ రైసింగ్‌' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె 'ఒకటి, రెండుసార్లు కాదు, ఏళ్ల తరబడి ఆ వేధింపులు కొనసాగాయి. రాత్రిళ్లు బయటకు రావాలంటే భయం కలిగేది. బాగా తెలిసిన వాళ్లను కూడా నమ్మలేకపోయేదాన్ని. ఎన్నో ఏళ్లు గడిచినా చిన్నప్పటి చేదు జ్ఞాపకాలు ఇంకా నన్ను వదల్లేదు' అని చెప్పుకొచ్చింది. మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలంటోన్న అనౌష్క ఢిల్లీలోని కళాశాలలకు వెళ్లి విద్యార్థులను చైతన్య పరుస్తోంది. మహిళా ట్యాక్సీ డ్రైవర్లు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొంది.

మూలాలు

[మార్చు]
  1. "Anoushka Shankar Biography". musicianguide.com. Archived from the original on 3 February 2009. Retrieved 20 January 2009.

బయటి లింకులు

[మార్చు]