అన్నపర్రు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అన్నపర్రు
—  రెవిన్యూ గ్రామం  —
అన్నపర్రు is located in ఆంధ్ర ప్రదేశ్
అన్నపర్రు
అక్షాంశరేఖాంశాలు: 16°04′22″N 80°19′46″E / 16.072778°N 80.329444°E / 16.072778; 80.329444
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం పెదనందిపాడు
ప్రభుత్వము
 - సర్పంచి కొల్లా ఉమామహేశ్వరి
జనాభా (2011)
 - మొత్తం 2,538
 - పురుషుల సంఖ్య 1,292
 - స్త్రీల సంఖ్య 1,246
 - గృహాల సంఖ్య 724
పిన్ కోడ్ 522 235
ఎస్.టి.డి కోడ్ 0863
ఉన్నత పాఠశాల
కీ.శే కొలసాని చిన వెంకయ్య చౌదరి

అన్నపర్రు, గుంటూరు జిల్లా, పెదనందిపాడు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 235., ఎస్.టి.డి, కోడ్ = 0863.

విషయ సూచిక

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

ఈ గ్రామము పెదనందిపాడు నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో వరగాణి నుండి పడమరగా, నక్కవాగు ఒడ్డున ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

10 సంవత్సరాల తరువాత, 18 జూలై-2014న, అన్నపర్రు గ్రామానికి బస్సు సౌకర్యం ప్రారంభించారు. చిలకలూరిపేట నుండి, అన్నపర్రు, కొప్పర్రు మీదుగా ఈ బస్సు, పెదనందిపాడుకు వెళుతుంది. [8]

గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]

కె.ఎస్.ఆర్.జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

 1. 1959లో ప్రారంభించిన ఉన్నత పాఠశాల చాలా సంవత్సరాలుగా చుట్టుపక్కల గ్రామాల పిల్లలు ఎక్కువ దూరం పోకుండా చదువుకోటానికి తోడ్పడింది. కొల్లా సుబ్బయ్య రాఘవమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, కొలసాని చినవెంకయ్య చౌదరి స్థాపించాడు. తన ఇంటిలోనే పేదపిల్లల వసతి గృహాన్ని నడిపి, చాలా మంది పిల్లలు ఉచితంగా చదువుకొనే ఏర్పాటు చేశాడు. తరువాతి కాలంలో ప్రభుత్వానికి ఈ వసతి గృహాన్ని అందజేశాడు. ఈ పాఠశాలకి ప్రధానోపాధ్యాయుడుగా పనిచేసిన వారిలో ముఖ్యంగా కొడాలి రాజా రామమోహన రావు తన వినూత్న పద్ధతులతో విద్యాప్రమాణాల్ని గణనీయంగా పెంచడానికి కృషి చేశాడు. 27, 28, పిభ్రవరి 2010 న ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవాలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ఈ పాఠశాల విద్యార్థులు, 3 సంవత్సరాల నుండి 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించి, గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. [5]

ఆర్.ఆర్.ప్రాథమిక పాఠశాల(ప్రభుత్వ పాఠశాల)[మార్చు]

 1. ఈ పాఠశాల, 1939లో 30 మంది విద్యార్థులతో ప్రారంభమైనది. ప్రస్తుతం 105 మంది పేద విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యనభ్యసించుచున్నారు. ఉపాధ్యాయుల పనితీరుకు, గ్రామస్తుల సహకారం తోడవటంతో, పాఠశాల ముందడుగు వేయుచున్నది. ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు 2500 మందిదాకా, దేశ, విదేశాలలో స్థిరపడినారు. ఈ పాఠశాల ఏర్పాటుకు దాత శ్రీమతి కోడపాటి సుబ్బాయమ్మ 20 సెంట్ల స్థలాన్ని విరాళంగా అందజేఇ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. శ్రీ పాలపర్తి పూర్ణచంద్రరావు, ఈ పాఠశాలకు తొలి ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పాఠశాల అభివృద్ధికి బహుధా కృషిచేసారు. దాతలు పలు సౌకర్యాలు కలుగజేశారు. 2014-15 సంవత్సరం నుండి, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాతలు విద్యా వలంటీర్ల సహకారంతో, ప్రత్యేక తరగతులు నిర్వహించుచున్నారు. ఈ పాఠశాలలో, 2013 నవంబరు 13 బుధవారం నాడు, సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ పాఠశాల 13-ఏప్రిల్,2014 నాడు, ప్లాటినం జూబిలీ ఉత్సవాలు, ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగినవి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రేక్షకులనలరించినవి. విద్యార్థుల తల్లిదండ్రులు. గ్రామస్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులను, దాతలను, ఘనంగా సత్కరించారు.[1][2] [6]
 2. ఈ పాఠశాలలో 5వ తరగతి చదివిన అన్నవరపు సంధ్య అను విద్యార్థిని, జవహర్ నవోదయ పాఠశాలలో ఆరవ తరగతి చదవడానికి అర్హత పరీక్షలో ఉత్తీర్ణురాలయినది. ఈమె ఇంటరు వరకు ఉచితంగా విద్యనభ్యసించే అవకాశం దక్కించుకున్నది. [9]

బి.సి.బాలుర వసతి గృహం[మార్చు]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

 1. నాగార్జునసాగర్ నీటి వసతి ఉంది.
 2. ఈ గ్రామములోని త్రాగునీటి చెరువులో చాలా సంవత్సరాల తరువాత, ఎన్నో ఏళ్ళ నుండి పేరుకుపోయిన పూడిక తీశారు. చెరువులోని పిచ్చి చెట్లు, నాచు, జమ్ము, తామర వగైరాలు తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థులు విరాళాలు సమకూర్చారు.[3]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలొ జరిగిన పంచాయతీ ఎన్నికలలో, సర్పంచిగా శ్రీమతి కొల్లా ఉమామహేశ్వరి ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ గంగా కాశీఅన్నపూర్ణా సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

2014, మే-26 సోమవారం నాడు, ఈ ఆలయ నవమ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాదిమందికి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో పరిసరప్రాంతాల భక్తులు గూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థులు, యువత తమవంతు సేవలందించారు. [7]

శ్రీ రణ ఆంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. [10]

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

 • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం*[4]
 • జనాభా 2595
 • పురుషుల సంఖ్య 1307
 • మహిళలు 1288
 • నివాసగృహాలు 670
 • విస్తీర్ణం 2798 హెక్టారులు
 • ప్రాంతీయ భాష తెలుగు
జనాభా (2011) - మొత్తం 2,538 - పురుషుల సంఖ్య 1,292 - స్త్రీల సంఖ్య 1,246 - గృహాల సంఖ్య 724

మూలాలు[మార్చు]

 1. ఈనాడు గుంటూరు సిటీ, 14 నవంబరు, 2013. 1వ పేజీ.
 2. ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014,మార్చ్-10; 2వ పేజీ.
 3. ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; జనవరి-6,2014; 2వ పేజీ.
 4. [భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు "భారత జనగణన జాలస్థలిలో గ్రామ గణాంకాలు"] Check |url= value (help). Retrieved 2014-03-11. 

వెలుపలి లింకులు[మార్చు]

[5] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014, మార్చి-12; 1వపేజీ. [6] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014, ఏప్రిల్-13&14; 1వపేజీ. [7] ఈనాడు గుంటూరు రూరల్/ప్రత్తిపాడు; 2014, మే-27; 2వపేజీ. [8] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014, జూలై-19; 1వపేజీ. [9] ఈనాడు గుంటూరు సిటీ; 2015, జూన్-25; 25వపేజీ. [10] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2017, మే-23; 1వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=అన్నపర్రు&oldid=2128826" నుండి వెలికితీశారు