అమరావతి (స్వర్గం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పురాణాలలో దేవతల ముఖ్య పట్టణం, అనగా స్వర్గలోకంలో ఇంద్రుని రాజధాని పేరు అమరావతి.. ఇది మేరు పర్వతము మీద ఉన్నది. ఇందు దేవతలు, అప్సరసలు, కిన్నరులు, యజ్ఞ యాగాదులు చేసిన మానవులు ఉంటారు. ఇక్కడ ఉండే వారికి ఆకలి, దప్పిక, నిద్ర, ముసలితనము, చావు ఉండవు.


ఈ నగరంలో "నందన వనము" అనే అందాల తోట, అద్భుతమైన ఇంద్ర సభ ఉంటాయి. భారతము సభాపర్వము, 2వ అధ్యాయము (తెలుగు భారతంలో 1వ ఆశ్వాసము)లోను, కాశీఖండం 10వ అధ్యాయం (తెలుగులో 1వ అధ్యాయం)లోను అమరావతి గురించిన వర్ణనలు ఉన్నాయి.

వనరులు[మార్చు]