అమర్ శరద్రరావు కాలే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమర్ శరద్రరావు కాలే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు రాందాస్ తదాస్
నియోజకవర్గం వార్థా

పదవీ కాలం
(2004-2009), (2014 – 2019)
ముందు శరదరావు కాలే
తరువాత దాదారావు కేచే
నియోజకవర్గం అర్వి

వ్యక్తిగత వివరాలు

జననం (1973-08-13) 1973 ఆగస్టు 13 (వయసు 51)
అర్వి , మహారాష్ట్ర , భారతదేశం
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) (2024-ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ (2024 వరకు)
తల్లిదండ్రులు శరదరావు కాలే, అనురాధ
జీవిత భాగస్వామి మయూర అమర్ కాలే
మూలం [1]

అమర్ శరద్రరావు కాలే (జననం 13 ఆగస్టు 1973) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వార్థా నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అమర్ శరద్రరావు కాలే కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి ఆర్వీ శాసనసభ నియోజకవర్గం నుండి 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఓడిపోయి తిరిగి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

అమర్ శరద్రరావు కాలే 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్నికలో ఓడిపోయి లోక్‌సభ ఎన్నికలకు ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) పార్టీలో చేరి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వార్థా నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ (ఎస్‌పీ) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాందాస్ తదాస్పై 81648 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  2. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  3. The Times of India (4 June 2024). "Amar Sharadrao Kale, Nationalist Congress Party (Sharadchandra Pawar) Representative for Wardha, Maharashtra - Candidate Overview | 2024 Lok Sabha Elections" (in ఇంగ్లీష్). Retrieved 29 October 2024.
  4. TV9 Bharatvarsh (4 June 2024). "वर्धा लोकसभा चुनाव परिणाम 2024: NCP के अमर शरदराव काले जीते, BJP के रामदास ताड़स को मिली हार". Retrieved 29 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)