అమికా శైల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమికా శైల్
జననం
గీతశ్రీ షిల్

(1992-11-12) 1992 నవంబరు 12 (వయసు 31)
ఉత్తరపర, హుగ్లీ, పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, గాయని

అమికా శైల్ (ఆంగ్లం: Amika Shail; జననం 1992 నవంబరు 12) భారతీయ గాయని, నటి.[1][2] ఆమె హిందీ భాషా సినిమా, వెబ్ సిరీస్, వెబ్ ఫిల్మ్‌లు, టెలివిజన్‌లలో తన ప్రతిభకు ప్రసిద్ధి చెందింది.[3] ఆమె బల్వీర్ రిటర్న్స్‌లో వాయు పరి పాత్రను పోషించింది.[4]

ప్రారంభ జీవితం[మార్చు]

అమికా శైల్ పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని ఉత్తరపారాలో జన్మించింది.[5] అయితే, ప్రస్తుతం ఆమె ముంబైలో నివసిస్తున్నది. ఆమె 9 ఏళ్ల వయసులో స రే గ మ ప లిటిల్ చాంప్స్ సింగింగ్ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా వెండితెరపై తన కెరీర్‌ను ప్రారంభించింది.[6]

ఆమె తన తల్లి వద్ద 5 సంవత్సరాల వయస్సులో సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది. ఆమె బెంగాలీ వెర్షన్ "స రే గ మ ప"లో కూడా పాల్గొంది. ఆ తర్వాత, ఆమె ఇతర సింగింగ్ రియాలిటీ షోలు - స రే గ మ ప నేషనల్ టాలెంట్ హంట్, ఇండియన్ ఐడల్, స్టార్ వాయిస్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా రేడియో షోలలో పాల్గొంది.[7]

హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఆమె సంగీత విశారద్‌గా ఉత్తీర్ణత సాధించింది.[8] డాబర్, కోల్‌గేట్, సంతూర్, ఉజాలా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ వంటి బ్రాండ్‌ల టెలివిజన్ వాణిజ్య ప్రకటనలకు ఆమె తన గాత్రాన్ని అందించింది.[9]

ముంబైలో ఆమె మ్యూజిక్ టీచర్‌గానూ కొంతకాలం ఉద్యోగం చేసింది.[10]

నటిగా[మార్చు]

ఉడాన్‌’తో ఆమె నటిగా కెరీర్‌లో పురోగతి సాధించింది. ఆ తరువాత, ఆమె 'దివ్య దృష్టి', 'బల్వీర్ రిటర్న్స్' మొదలైన టెలివిజన్ సోప్‌లలో నటించింది.

ఆమె 'మేడమ్ సర్', 'లాల్ ఇష్క్', 'షాదీ కే సియాపే' 'గుణ', 'అభయ్' వంటి టెలివిజన్ ధారావాహికలలో కూడా భాగమైంది.[11]

ఆమె ఎవల్యూషన్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ అని పిలువబడే దక్షిణాఫ్రికా బ్రాండ్ ఎవల్యూషన్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ (ఈఎస్ఎన్) కి భారతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది.[12] దేశంలో కోవిడ్-19 లాక్‌డౌన్ తర్వాత, నటిగా వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కోసం వెబ్ షోలను మాత్రమే చేస్తోంది, దీంతో టెలివిజన్ రంగం నుండి తాత్కాలికంగా విరామం తీసుకున్నట్టయింది.[13][14]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

టెలివిజన్[మార్చు]

సంవత్సరం ధారావాహిక / కార్యక్రమం పాత్ర ఛానల్
2014-19 ఉడాన్ జ్యోతి[15] కలర్స్ టీవీ
2019-20 దివ్య దృష్టి ట్వింకిల్ షెర్గిల్ స్టార్ ప్లస్
2021 బల్వీర్ రిటర్న్స్ వాయు పరి / విధి[16] సోనీ సబ్
2019 షాదీ కే సియాపే ప్రాచీ[17] & టీవీ
2018 లాల్ ఇష్క్ బహుళ పాత్రలు[18] & టీవీ
2020 మేడం సార్ నాగిన్ సోనీ సబ్

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర
2023 బాంద్రా ఐటమ్ సాంగ్[19]

వెబ్ సీరీస్[మార్చు]

సంవత్సరం టైటిల్ పాత్ర ప్లాట్ ఫామ్ మూలాలు
2019 అభయ్ ఆఫీస్ గర్ల్ జీ5 [20]
2019 గుణః ప్రియాంక యూట్యూబ్ [21]
2020 లక్ష్మి అంకిత జైన్ డిస్నీ+హాట్‌స్టార్ [22]
2020 మీర్జాపూర్ బార్ సింగర్ అమెజాన్ ప్రైమ్ వీడియో [23]
2020 మాస్క్ మ్యాన్ అదితి రాబిట్ [24]
2020 ట్రాప్డ్ మానసికరుగ్మత గల హంతకురాలు రాబిట్ [25]
2021 నాచనియా నాచనియా తమాషా
2021 చత్తీస్ ఔర్ మైనా ధని డిస్నీ+హాట్‌స్టార్ [26]
2021 విడియో కాల్ కోమల్ సినీ ప్రైమ్ [27]
2021 ఖున్నాస్ రష్మీ ఉల్లు [28]
2021 ఇంటెన్షన్ ప్రాంజల్ నిర్ణయించలేదు [29]
2021 హాయ్ తౌబ్బా లీనా ఆల్ట్ బాలాజీ [30]
2021 ఖుద్రాంగ్ ఇషు సినీ 7
2021 దుల్హన్ ఆర్తి సినిమా బాక్స్
2021 గుడ్ నైట్ చంపా ఉల్లు [31]
2021 హై డోస్ నేత్ర నిర్ణయించలేదు
2022 డాగ్ సంజన నిర్ణయించలేదు [32]
2022 12 ఎ.ఎమ్. నేహా సినీ బాక్స్
2022 పేరులేని ప్రాజెక్ట్ అమీ సోనీలివ్ [33]
2022 మంథన్ అవంతిక ఈఓఆర్ టీవి
2023 బిల్డర్స్ ఫాతిమా అమెజాన్ ప్రైమ్ వీడియో [34]
2023 బెకాబూ 3 రసిక ఆస్థాన ఆల్ట్ (Altt)

మూలాలు[మార్చు]

 1. "Amika Shail: My birthday was on Dhanteras so it was a double celebration - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 12 November 2020. Retrieved 2021-10-08.
 2. "Interview: Singer-Actress Amika Shail On Her Journey" (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-09-02. Retrieved 2022-11-09.
 3. "ఎన్నోసార్లు ఫెయిల్‌..కానీ ఇప్పుడు సింగర్‌గా, నటిగా రాణిస్తోంది | After All The Struggles Amika Shail Taken Lead In Her Career - Sakshi". web.archive.org. 2024-03-19. Archived from the original on 2024-03-19. Retrieved 2024-03-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 4. "Actress Amika Shail's showbiz tryst began with 'Little Champs', will next feature in Akshay Kumar's 'Laxmmi Bomb'". Zee News (in ఇంగ్లీష్). 2020-07-23. Retrieved 2021-10-08.
 5. "Amika Shail Goes From 'Li'l Champs' to 'Laxmmi Bomb'". India West (in ఇంగ్లీష్). Archived from the original on 2021-10-09. Retrieved 2021-10-08.
 6. "Naagin 5: Excited to work with Ekta Kapoor for the first time, says Amika Shail". Mumbai Mirror (in ఇంగ్లీష్). Retrieved 2021-10-08.
 7. Yalala, Sridhar. "Being the Amika ble actress & singer that she is". The Pynr (in ఇంగ్లీష్). Archived from the original on 2021-10-09. Retrieved 2021-10-08.
 8. "Make way for Amika Shail in Mirzapur 2" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-10-09. Retrieved 2021-10-08.
 9. "Sharing Screen With Akshay Kumar In Laxmii Was One Huge Turning Point In My Career: Howrah Girl Amika - The Lateralz" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-10-09. Retrieved 2021-10-09.
 10. "Interview: Singer-Actress Amika Shail On Her Journey" (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-09-02. Retrieved 2022-11-09.
 11. "Amika Shail on being part of Mirzapur 2: My pulse went ticking on my first day on the sets". PINKVILLA (in ఇంగ్లీష్). 2020-10-21. Archived from the original on 9 October 2021. Retrieved 2021-10-08.
 12. Chakrabarty, Madhushree (2021-06-25). "Amika Shail has partnered with the brand Evolution Sports Nutrition". Media Infoline (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-10-08.
 13. "Amika Shail: It's time to take a break from TV to reinvent myself as a performer'". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-03-11. Retrieved 2022-06-11.
 14. "TV creates boundaries and I don't like to be bound by anything: Amika Shail - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 27 February 2022. Retrieved 2022-06-11.
 15. "Actress & Singer Amika Shail becomes a part of Naagin 5". Vantage Point (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-08-09. Retrieved 2021-10-09.
 16. "From Little Champs to Laxmmi Bomb…". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 2021-10-08.
 17. Mohan, Smrithi (2020-11-10). "#KetchupTalks: Singer turned actress, Amika Shail talks about Mirzapur 2, Laxmmi and more". Social Ketchup (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-10-08.
 18. "Amika Shail did a 'Bhandafod' of singing reality shows, was once seen in Indian Idol - The Post Reader" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-10-09. Retrieved 2021-10-08.
 19. Indiablooms. "Amika burns the dance floor in Malayalam flick alongside Dileep | Indiablooms - First Portal on Digital News Management". Indiablooms.com (in ఇంగ్లీష్). Retrieved 2023-12-02.
 20. "Mirzapur 2 Casting Made Amika Shail Emotional". TeluguStop.com (in ఇంగ్లీష్). 2020-10-21. Retrieved 2021-10-09.
 21. Yalala, Sridhar. "Being the Amika ble actress & singer that she is". The Pynr (in ఇంగ్లీష్). Archived from the original on 2021-10-09. Retrieved 2021-10-09.
 22. HARISINGHANI, HITESH. "Meet Akshay's heroine in Laxmmi Bomb". Rediff (in ఇంగ్లీష్). Retrieved 2021-10-08.
 23. Yalala, Sridhar. "Mirzapur 2 casting made Amika Shail emotional". The Pynr (in ఇంగ్లీష్). Archived from the original on 2021-10-09. Retrieved 2021-10-09.
 24. Murdeshwar, Sachin (2020-12-26). "Open Graph Meta Tags: Everything You Need to Know". Global Prime News (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-10-08.
 25. "Finding her Rhythm - Amika Shail | Kolkata Actress | Hashtag" (in అమెరికన్ ఇంగ్లీష్). 9 June 2021. Retrieved 2021-10-08.
 26. "Amika Shail shines as Dhani in Hotstar's 'Chattis Aur Maina'". Webdunia (in ఇంగ్లీష్). Retrieved 2021-10-08.
 27. "Amika Shail does a Video Call". Retrieved 2021-10-09.
 28. "Amika Shail talks about crimes on women and her web series Khunnas". OTTPlay (in ఇంగ్లీష్). Retrieved 2021-10-08.
 29. "Singer-actress Amika Shail gears up for 'Intention'". Sify (in ఇంగ్లీష్). Archived from the original on September 30, 2021. Retrieved 2021-10-08.
 30. "Amika Shail of 'Hai Taubba 3' talks about playing a bisexual character". IANS Live. Retrieved 2021-10-08.
 31. "Amika Shail Movies And Web Series Watch Online". EkSukoon.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-10-02. Archived from the original on 2021-10-09. Retrieved 2021-10-09.
 32. Service, Tribune News. "Amika Shail is breaking the stereotype once again". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 2022-06-11.
 33. "Amika Shail loves her Bengali roots". Bollyy (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-05-14. Retrieved 2022-06-11.
 34. Ghosh, Aravind (2023-09-21). "Amika Shail Features In Amazon's Builders Web Series, Will Play The Role Of A Fitness Enthusiast". www.indiantvinfo.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-10-03.