అర్పితా సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అర్పితా సింగ్
2014లో అర్పితా సింగ్
బాల్య నామంఅర్పితా దత్తా
జననం (1937-06-22) 1937 జూన్ 22 (వయసు 86)
బరానగర్, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
భార్య / భర్త
పరంజిత్ సింగ్
(m. 1962)
జాతీయతభారతీయురాలు
అవార్డులుపద్మ భూషణ్ (2011)
లలిత కళా అకాడమీ ఫెలోషిప్ (2014)

అర్పితా సింగ్ (జననం 1937 జూన్ 22) ఒక భారతీయ కళాకారిణి. అలంకారిక కళాకారిణి, ఆధునికవాదిగా పేరుపొందింది. ఆమె కళాత్మక విధానాన్ని గమ్యం లేని యాత్రగా వర్ణించవచ్చు. ఆమె పని ఆమె నేపథ్యాన్ని ప్రతిబింబిస్తుంది.[1] ఆమె పనులలో సాంప్రదాయ భారతీయ కళారూపాలు, సౌందర్యశాస్త్రం, సూక్ష్మ చిత్రలేఖనం, వివిధ రకాలైన జానపద కళలు ఉంటాయి.[2]

ఆమె పెయింటింగ్స్ ప్రధానంగా భారతీయ జీవనశైలిని స్త్రీ కోణం నుండి చూపుతాయి. ఆమె పనిలో ప్రధానంగా మహిళలపై దృష్టి పెడుతుంది. అందుకే, ఆమె చిత్రాలు స్త్రీల సాధారణ జీవితాలు, దినచర్యలను వర్ణిస్తాయి. ఆమె ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వ్యక్తిగతంగా, సామూహికంగా అనేక సార్లు తన కళలను ప్రదర్శించింది. ఆమె తన పనికి చాలా అవార్డులు, ప్రశంసలు కూడా అందుకుంది.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

అర్పితా సింగ్ 1937 జూన్ 22న బెంగాల్ ప్రెసిడెన్సీ (ప్రస్తుతం పశ్చిమ బెంగాల్)లోని బరానగర్‌లో జన్మించింది. 1947లో బ్రిటీష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందటానికి ఒక సంవత్సరం ముందు, 1946లో ఆమె తన తల్లి, సోదరుడితో కలిసి నగరాన్ని విడిచిపెట్టింది.

1954-59 మధ్య న్యూఢిల్లీలోని ఢిల్లీ పాలిటెక్నిక్‌ కళాశాల (Delhi Technological University)లో చదువుకున్న ఆమె ఫైన్ ఆర్ట్స్‌లో డిప్లొమా పూర్తిచేసింది.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1962లో ఆమె తోటి కళాకారుడు పరమజిత్ సింగ్‌ను వివాహం చేసుకుంది. అమృత్‌సర్‌కు చెందిన పరమజిత్ సింగ్ దాదాపు మూడు దశాబ్దాల పాటు న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలో ఫైన్ ఆర్ట్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్నాడు. వారికి 1967లో కుమార్తె అంజుమ్ సింగ్ జన్మించింది. ఆమె కూడా ఒక భారతీయ కళాకారిణి.[4] అయితే, క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం చేసిన అంజుమ్ సింగ్ తన 53వ ఏట 2020 నవంబరు 17న న్యూఢిల్లీలో మరణించింది.[5][6]

కెరీర్

[మార్చు]

భారత ప్రభుత్వంచే టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే న్యూఢిల్లీలోని టెక్స్‌టైల్స్ పరిశ్రమ వీవర్స్ సర్వీస్ సెంటర్ లో అర్పితా సింగ్ టెక్స్‌టైల్ డిజైనర్‌గా పనిచేసింది. 2017లో మొదటి సారిగా తల్వార్ గ్యాలరీ ఎగ్జిబిషన్ 'టైయింగ్ డౌన్'లో ఆమె కళలను ప్రదర్శించింది.[7]

ఆమె భారత ప్రభుత్వ సంస్థ అయిన కుటీర పరిశ్రమల పునరుద్ధరణ కార్యక్రమంలో చురుకుగా పనిచేసింది. ఆ సమయంలో, ఆమె దేశంలోని సాంప్రదాయ కళాకారులు, నేత కార్మికులను కలుసుకుంది. ఇది ఆమె ఆర్ట్‌వర్క్‌పై కూడా ప్రభావం చూపించింది. భిన్నమైన సామాజిక, రాజకీయ అవగాహన ద్వారా అర్పితా సింగ్ గణనీయమైన సహకారాన్ని అందించింది.

ఆమె 1960లలో ఢిల్లీ పాలిటెక్నిక్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లోని ఇతర పూర్వ విద్యార్థులతో కలిసి ఆర్టిస్టుల గ్రూప్ 'ది అన్‌నోన్' వ్యవస్థాపక సభ్యురాలు. 1962లో న్యూ ఢిల్లీలోని రఫీ మార్గ్‌లోని ఐఈఎన్ఎస్ బిల్డింగ్‌లో (ప్రస్తుతం ఐఎన్ఎస్ భవనం) 'ది అన్‌నోన్' మొదటి గ్రూప్ షో జరిగింది.[8][9]

ప్రదర్శనలు

[మార్చు]

అర్పితా సింగ్ దేశవిదేశాలలో పలు షోలను నిర్వహించింది. తన మొదటి ప్రదర్శన 1972లో న్యూ ఢిల్లీలోని రోషన్ అల్కాజీచే నిర్వహించబడిన కునికా కెమోల్డ్ గ్యాలరీలో జరిగింది.[10] చండీగఢ్, భోపాల్, ముంబై, న్యూఢిల్లీలలో ఇరవైకి పైగా సోలో షోలు ఆమె నిర్వహించింది.

 • 2019లో ఆమెకు సంబంధించిన ఆరు దశాబ్దాల పెయింటింగ్ లను న్యూఢిల్లీలోని కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ప్రదర్శించింది.[11]
 • 2018లో న్యూయార్క్లోని తల్వార్ గ్యాలరీలో టైయింగ్ డౌన్ టైమ్ II
 • 2017లో న్యూయార్క్లోని తల్వార్ గ్యాలరీలో టైయింగ్ డౌన్ టైమ్ II[12]
 • 2006లో న్యూఢిల్లీలోని వదేహ్రా ఆర్ట్ గ్యాలరీ, పిక్చర్ పోస్ట్‌కార్డ్ 2003 – 2006[13]
 • 2003లో మెమరీ జార్స్, బోస్ పాసియా మోడరన్, న్యూయార్క్[13]
 • 1994లో న్యూఢిల్లీలోని గ్యాలరీ ఎస్పేస్, డ్రాయింగ్ 94

అవార్డులు

[మార్చు]

అర్పితా సింగ్ ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత, సమూహ ప్రదర్శనలలో ఆమె పెయింటింగ్స్ ప్రదర్శించింది. ఆమె చేసిన కృషికి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. వాటిలో కొన్ని:

మూలాలు

[మార్చు]
 1. Collection Highlights. Kiran Nadar Museum of Art. 2017. ISBN 978-81-928037-6-0.
 2. "Arpita Singh". Vadehra Art Gallery (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2018-03-03. Retrieved 2018-03-03.
 3. "Mojarto Profiles Artist - Arpita Singh". www.mojarto.com. Archived from the original on 23 April 2019. Retrieved 2019-02-02.
 4. Datta, Ella. "The agony and ecstasy of Anjum Singh". @businessline (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2020. Retrieved 18 November 2020.
 5. "Anjum Singh". Saffron Art. Archived from the original on 16 May 2017. Retrieved 18 November 2020.
 6. "Artist Anjum Singh, known for her depictions of urban ecology, passes away at 53". First Post. Archived from the original on 17 November 2020. Retrieved 17 November 2020.
 7. "Press Release – Tying down time « TALWAR GALLERY" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-02-02.
 8. Baruah, Amit (2016-09-11). "Meeting deadlines to beat the eclipse". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-02-02.
 9. "The Personal Space of Woman: Paintings of Arpita Singh" (PDF).
 10. "The Personal Space of Woman: Paintings of Arpita Singh" (PDF).
 11. "Submergence: In the midst of here and there: ARPITA SINGH | Six Decades of Painting". Kiran Nadar Museum of Art. Retrieved 2023-07-20.
 12. "Past Exhibitions « TALWAR GALLERY" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-04-14. Retrieved 2019-03-12.
 13. 13.0 13.1 "Arpita Singh". Vadehra Art Gallery (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2018-03-03. Retrieved 2018-03-03.
 14. "Between the Poetic And the Visual". OPEN Magazine (in ఇంగ్లీష్). 25 November 2015. Retrieved 2019-03-12.
 15. "Arpita Singh". Talwar Gallery. Retrieved 2018-03-30.
 16. Arpita Singh profile Archived 2007-12-23 at the Wayback Machine, contemporaryindianart.com; accessed 6 February 2018.