Jump to content

అసమానత్వం నుంచి అసమానత్వం లోకే

వికీపీడియా నుండి
అసమానత్వం లోనించి అసమానత్వం లోకే పుస్తక ముఖచిత్రం.

అసమానత్వం నుంచి అసమానత్వం లోకే అనే పుస్తకాన్ని రంగనాయకమ్మ 1989లో వ్రాసారు. రష్యన్ కమ్యూనిస్ట్ నాయకురాలు అలెక్సాండ్రా కొల్లొంటాయ్ ప్రతిపాదించిన ఫ్రీ లవ్ సిద్ధాంతాన్ని విమర్శిస్తూ ఈ పుస్తకం వ్రాసారు. మొదట "అసమానత్వం నుంచి అసమానత్వం లోకి" అనే టైటిల్ తో వ్రాసిన ఈ పుస్తకానికి "అసమానత్వం నుంచి అసమానత్వం లోకే" అని టైటిల్ లో చిన్న మార్పు చేసి మళ్ళీ ముద్రించారు. అలెక్సాండ్రా కొల్లొంటాయ్ ప్రతిపాదించిన ఫ్రీ లవ్ సిద్ధాంతం ప్రకారం స్త్రీకి అనేక మంది పురుషులతో సంబంధాలు ఉండొచ్చు. ఈ సిద్ధాంతాన్ని లెనిన్ వ్యతిరేకించాడు. అనేక మంది పురుషులతో పడుకోవడం అనేది పంది లాగ బురదలో దొరలడం లాంటిదని లెనిన్ కొల్లొంటాయ్ తో వాదించాడు. అలా చెయ్యడం వ్యభిచారంతో సమానం అని రంగనాయకమ్మ వాదన.[1]

మూడు తరాల రష్యన్ల కథ పై విమర్శలు

[మార్చు]

హైదరాబాద్ ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ వారు అలెక్సాండ్రా కొల్లొంటాయ్ వ్రాసిన మూడు తరాల ప్రేమ కథని తెలుగులోకి అనువదించారు. ఆ కథ ప్రేమని కాకుండా వ్యభిచారాన్ని ప్రోత్సహించేలా ఉందని రంగనాయకమ్మ విమర్శించారు. ఆ కథలో ముగ్గురు స్త్రీలు అనేక మంది పురుషులతో కలిసి తిరుగుతారు. ఒక స్త్రీ భర్త ఉండగా మరో పురుషునితో పడుకుని బిడ్డని కంటుంది. ఆ విషయం భర్తకి తెలిసినా తన భార్యని విమర్శించడు. పెళ్ళికి ముందు మోసపోవడం వల్లో, రేప్ వల్లో బిడ్డని కన్న స్త్రీని పెళ్ళి చేసుకుంటే ఫర్వా లేదు కానీ భర్త ఉండగా మరో పురుషునితో పడుకుని బిడ్డని కన్న స్త్రీతో కాపురం చేసే వాడు భర్త ఎలా అవుతాడని రంగనాయకమ్మ ప్రశ్నించారు. అలాంటి భర్తలకి కూడా పరాయి స్త్రీలతో సంబంధాలు ఉంటాయి కనుక వాళ్ళు భర్తలు కారని రంగనాయకమ్మ అన్నారు. మరో ఇద్దరు స్త్రీలు మొదటి స్త్రీ కంటే పెద్ద తిరుగుబోతులు. వాళ్ళు అసలు పెళ్ళే చేసుకోకుండా పిల్లల్ని కంటారు. పిల్లలకి తండ్రి పోషణ, బాధ్యత అవసరం లేదని అనుకుంటారు. ఈ కథ పచ్చి బూతు కథ అని రంగనాయకమ్మ విమర్శించారు.

సామ్రాజ్యవాద సంస్కృతి పై విమర్శలు

[మార్చు]

సామ్రాజ్యవాద దేశాల నుంచి దిగుమతి అయిన సంస్కృతిని విమర్శిస్తూ రంగనాయకమ్మ గారు ఈ పుస్తకంలో వ్యాసాలు చేర్చారు. ఒక సినిమా నటి ఒక మీటింగులో తన బ్యాక్ గ్రౌండ్ గురించి ఇలా చెప్పుకుంది "తన తండ్రి ఎవరో తనకి తెలియదట, తన తల్లి ప్రయాణంలో కలిసిన ఒక యాత్రికునితో లైంగిక సంయోగం చెయ్యడం వల్ల తాను పుట్టిందట. తాను తన జీవితంలో ఎన్నడూ తన తండ్రిని చూడలేదట. దారిలో కలిసిన బాటసారితో సంయోగం చేసేది వీధి వ్యభిచారే. ఇలాంటి సంస్కృతిని సామ్రాజ్యవాద దేశాల నుంచి దిగుమతి చేసుకుని మన దేశంలో కూడా కొందరు చెడు తిరుగుళ్ళకి పోతున్నారని రంగనాయకమ్మ వ్రాసారు.

ఇతర రచయితల పై విమర్శలు

[మార్చు]

ఒక రచయిత్రి పురుషులు కూడా పెళ్ళి చేసుకోకుండా తండ్రులు కావచ్చని, ఒక స్త్రీ పురుషునితో ఉచితంగా పడుకుని బిడ్డని కని ఆ బిడ్డని పురుషునికి దానంగా ఇవ్వవచ్చని వ్రాసింది. ఆ రచయిత్రిని విమర్శిస్తూ కొంత మంది స్త్రీలు ఉత్తరాలు వ్రాసారు. రంగనాయకమ్మ కూడా ఆ రచయిత్రిని విమర్శించారు. భూస్వామ్య సమాజంలో పేద స్త్రీ తన బిడ్డని పోషించలేక బిడ్డని అమ్మేస్తుంది. బిడ్డని ఉచితంగా దానం చెయ్యడం అనేది బిడ్డని అమ్ముకునే భూస్వామ్య నీతి కంటే హీనమైన నీతి అని రంగనాయకమ్మ విమర్శించారు.

విమర్శలకు ప్రతి విమర్శలు

[మార్చు]

రంగనాయకమ్మని చందు సుబ్బారావు వంటి మార్క్సిస్టులు కూడా విమర్శించారు. డబ్బులు తీసుకుని పడుకుంటేనే అది వ్యభిచారం అవుతుంది కానీ స్వచ్చందంగా పడుకుంటే వ్యభిచారం కాదని విమర్శకుల వాదన. డబ్బులు తీసుకోకపోయినా ప్రేమ లేని సెక్స్ వ్యభిచారంతో సమానం అని రంగనాయకమ్మ అన్నారు. స్త్రీవాద వివాదాలు అనే పుస్తకంలో కూడా చందు సుబ్బారావు వివరణ ప్రచురితమయ్యింది. సుబ్బారావు ఇలా వివరణ ఇచ్చారు "భూస్వామ్య సమాజంలో పురుషుడు అనేక మంది స్త్రీలతో తిరుగుతాడు కానీ తన భార్య మాత్రం తనతో తప్ప మరే మగవాడితో సంయోగం చెయ్యకూడదని అనుకుంటాడు. ఈ భూస్వామ్య నీతిని వ్యతిరేకించడానికి పెళ్ళైన ఆడవాళ్ళు కూడా పరాయి మగవాళ్ళతో సంయోగం చెయ్యాలి". రంగనాయకమ్మ దీన్ని వ్యభిచారం అనుకున్నా తాను మాత్రం వ్యభిచారం అనుకోను అని అన్నారు. వరవరరావు కూడా ఈ విషయంలో రంగనాయకమ్మని విమర్శించారు. హైదరాబాద్ ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ ని అంత తీవ్రంగా విమర్శించాల్సిన అవసరం లేదన్నారు. వరవరరావు బొనపార్టిస్టు లాగ ఇటు విప్లవవాదులకి, అటు విప్లవ వ్యతిరేక లక్షణాలు కలిగిన వారికి ఒకే సమయంలో దగ్గర అవ్వాలని అనుకుంటున్నారని రంగనాయకమ్మ సమాధానం చెప్పారు. చందు సుబ్బారావు వంటి వారు మానవ పందుల జీవితాన్ని కూడా మార్క్సిజంగా భావిస్తున్నారని కూడా ఆమె అన్నారు.

చలం సాహిత్యం ఆధారంగా విమర్శలు

[మార్చు]

రంగనాయకమ్మ తాను చలం శిష్యురాలినని చెప్పుకున్నపట్టికీ చలం అభిమానులైన వరవరరావు, చందు సుబ్బారావు రంగనాయకమ్మని విమర్శించారు. "భార్యని స్వేఛ్ఛ అంటే ఏమిటో తెలియని జీవఛ్ఛవంగా మార్చడం కంటే పెళ్ళికి ముందు పది సార్లు శీలం పోగుట్టుకున్న స్త్రీని పెళ్ళీ చేసుకోవడం గొప్ప" అని చలం అన్నారు. ఈ సూత్రం ఆధారంగా రంగనాయకమ్మని విమర్శించే వారు కూడా ఉన్నారు. చలం సాహిత్యం పై "వార్త" పత్రికలో వ్రాసిన ఒక వ్యాసంలో రంగనాయకమ్మ ఇలా వ్రాసారు "కొంత మంది నీతి లేని వాళ్ళు తమ తిరుగుబోతుతనాన్ని సమర్థించుకోవడానికి చలం పేరు చెప్పుకుంటున్నారు. వారు చలం రచనలలోని నెగటివ్స్ ని మాత్రమే ఆదర్శంగా తీసుకుంటున్నారు". చలం బతికి ఉంటే అతను ఇలాంటి వారిని సమర్థించరని కూడా ఆమె అన్నారు.

మూలాలు

[మార్చు]
  1. *Based on the theoretical formulations of Lewis H. Morgan, Fredrick Engels and Lenin, RN argued that bourgeios feminism takes women from one form of inequality to another form of inequality.