Jump to content

ఆండ్రాయిడ్ లాలీపాప్

వికీపీడియా నుండి
ఆండ్రాయిడ్
ఆండ్రాయిడ్5.0 లాలీపాప్
దస్త్రం:File:Android Logo (2014).svg
ఆండ్రాయిడ్ ప్రారంభ తెరపట్టు కొన్ని గూగుల్ ఉపకరణాలతో
తయారీ దారులు
గూగుల్
Releases
మునుపటి వర్షన్LPX13D (RC) (17 అక్టోబరు 2014; 10 సంవత్సరాల క్రితం (2014-10-17)) (info)

ఆండ్రాయిడ్ లాలీపాప్ అనునది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థలో భాగంగా గూగుల్ విడుదల చేసిన 5వ వెర్షన్ పేరు. ఇది 2014 అక్టోబరులో విడుదల చేయబడినది.[1][2]

నేపధ్యము

[మార్చు]

గూగుల్‌ ఈ కొత్త నిర్వాహకికి (ఓఎస్‌కు) ఆండ్రాయిడ్‌ 5.0 లాలీపాప్‌ గా నామకరణం చేసింది. దీనిలో అనేక విశేషాలు ఉన్నాయి.

విశేషాలు

[మార్చు]

లాలీపాప్‌ ఓఎస్‌లో చాలా ప్రత్యేకతలున్నాయి.[3]

  • లాలీపాప్‌ ఓఎస్‌ ఉన్న ఫోన్లలో.. స్ర్కీన్‌ లాక్‌ అయి ఉన్నప్పుడు కూడా ఏవైనా నోటిఫికేషన్స్‌ వస్తే, వాటిని తెరిచి చూసుకోవచ్చు. స్ర్కీన్‌ను అన్‌లాక్‌ చేయాల్సిన పని ఉండదు.
  • కేవలం 512 ఎంబీ మెమొరీ (ర్యామ్‌) ఉన్న ఫోన్లలో సైతం ఈ నిరవాకి పనిచేస్తుంది. అంటే చౌకరకం ఫోన్లలోనూ ఇన్‌స్టాల్‌ చేయొచ్చు.
  • ఈ ఓఎస్‌ స్మార్ట్‌ వాచ్‌ల నుంచి పెద్ద టీవీల దాకా పనిచేస్తుంది. తెరకు తగ్గట్టుగా ఐకాన్లు చిన్నవిగా.. పెద్దవిగా అవుతాయి.
  • కెమెరాలో బరస్ట్‌ మోడ్‌ ఉంది. అంటే కేమెరా బటన్‌ నొక్కినంత సేపూ ఫొటోలు తీస్తూనే ఉంటుంది.
  • ఎక్కువ మంది విన్యోగదారులు వినియోగించుకునేలా గెస్ట్‌ యూజర్‌ మోడ్‌ కూడా ఉంది. దీన్ని వేరొక ఆండ్రాయిడ్‌ డివైస్‌తో కూడా కలిపి లాక్‌ చేయొచ్చు.
  • ఫ్లాష్‌ లైట్‌, హాట్‌స్పాట్‌, స్ర్కీన్‌ రొటేషన్‌ వంటి కంట్రోల్స్‌ చేతికి అందుబాటులో ఉంటాయి.

జీ-మెయిల్ ఇన్‌బాక్స్ ఆప్

[మార్చు]

లాలీపాప్ ఓఎస్‌లో జీమెయిల్ అనువర్తనం సరికొత్త రూపు సంతరించుకుంది. డిజైన్‌తోపాటు కొన్ని అదనపు ఫీచర్లు కూడా వచ్చి చేరాయి. గతంలో మాదిరిగా కంపోజ్ ఆప్షన్ మెన్యూలో ఒకవైపున కాకుండా తెర అడుగున కుడివైపు ఫ్లోటింగ్ ఐకాన్‌లో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జీమెయిల్, గూగుల్ క్యాలెండర్లను సింక్ చేసేందుకు ఇన్‌బాక్స్ పేరుతో మరో అనువర్తనాన్ని (ఆప్‌ను) విడుదల చేశారు. ఫలితంగా మెయిల్ సమాచారం ఆధారంగా మీకు రిమైండర్లు అందే వీలేర్పడింది. ఉదాహరణకు మీ ఫ్లైట్ టికెట్ మెయిల్ ఆధారంగా మీ ప్రయాణపు తేదీ ముందురోజు మీకు అలర్ట్ వస్తుంది.

బ్యాటరీ వాడకం

[మార్చు]

ఎన్ని మంచి ఫీచర్లున్నా తగిన బ్యాటరీ బ్యాకప్ లేకపోతే అంతే సంగతులు. కిట్‌క్యాట్ ఓఎస్ ద్వారా బ్యాటరీ మేనేజ్‌మెంట్‌లో కొన్ని కొత్త మెలకువలు చేర్చిన ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోనూ ఆ పంథాను కొనసాగించింది. ఈ కొత్త ఓఎస్‌లోని బ్యాటరీ సేవర్ కనీసం 90 నిమిషాల బ్యాటరీ సమయాన్ని ఆదా చేస్తుందని అంచనా.

సెట్టింగ్స్ మార్పులూ

[మార్చు]

మెబైల్ వాడుకరులు తరచు ఉపయోగించే సెట్టింగ్స్‌ను మార్చుకోవడం కూడా లాలీపాప్ ఓఎస్‌లో సులువు. కేవలం తెరను కిందివైపునకు స్వైప్ చేస్తే చాలు ఇవి ప్రత్యక్షమవుతాయి. వైఫై, బ్యాటరీ ఐకాన్, బ్లూటూత్, లొకేషన్ వంటివన్నీ దీంట్లో ఉంటాయి. పరిసరాలకు తగ్గట్టుగా తెర ప్రకాశాన్ని మాన్యువల్‌గా మార్చుకునే సౌలభ్యమూ ఉండటం మరో విశేషం.

సెక్యూరిటీ ఫీచర్లు

[మార్చు]

వైరస్‌లు, మాల్‌వేర్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌ను సురక్షితంగా ఉంచేందుకు లాలీపాప్‌లో అదనపు ఫీచర్లు ఉన్నాయి. సమాచారం మొత్తాన్ని ఎన్‌క్రిప్ట్ చేసే అవకాశముండటం వీటిల్లో ఒకటి. ఫోన్ పోగొట్టుకున్నా, లేదా ఎవరైనా దొంగిలించినా, మొత్తం డేటా, అప్లికేషన్లు ఎన్‌క్రిప్ట్ అయిపోతాయి. ఇతరులు ఈ డేటాను అసలు చూసే అవకాశముండదు. సామ్‌సంగ్ సిద్ధం చేసిన నాక్స్ టెక్నాలజీలోని ఓ కీలకమైన అంశాన్ని లాలీపాప్ ఓఎస్‌లో చేర్చడం ద్వారా ఇది వీలైంది.

అదనపు భాషలు

[మార్చు]

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో స్థానిక భాషల వాడకం కొత్త కాకపోయినప్పటికీ లాలీపాప్‌తో ఈ భాషల జాబితాలోకి మరో 15 కొత్తగా చేరాయి. తెలుగు, బెంగాలీ, కన్నడలతోపాటు కొన్ని విదేశీ భాషలు ఉన్నాయి. అంతేకాదు... ఈ సరికొత్త ఓఎస్‌లోని ఆడియో, వీడియో ఫీచర్లలోనూ చెప్పుకోదగ్గ మార్పులు జరిగాయి. 5.1, 7.1 ఛానెల్ ఆడియోలను సపోర్ట్ చేయడంతోపాటు యూఎస్‌బీ ఆడియో సపోర్ట్ కూడా ఏర్పాటు చేశారు. కెమెరా ఫుల్ రెజల్యూషన్‌తో సెకనుకు 30 ఫ్రేములను బంధించగలదు. ప్రతి ఫ్రేమ్ తాలూకూ సెట్టింగ్స్‌లో వేర్వేరుగా మార్పులు చేసుకోగలగడం విశేషం.

మూలాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]