Jump to content

ఆకాశరామన్న (1965 సినిమా)

వికీపీడియా నుండి
ఆకాశ రామన్న
(1965 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం జి.విశ్వనాథం
నిర్మాణం భావనారాయణ
తారాగణం కాంతారావు,
కృష్ణకుమారి,
జి.రామకృష్ణ,
రాజశ్రీ,
ఎల్. విజయలక్ష్మి,
రాజనాల,
ప్రభాకరరెడ్డి,
సత్యనారాయణ,
పేకేటి శివరాం,
వాణిశ్రీ,
రాజబాబు
సంగీతం ఎస్.పి.కోదండపాణి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి,
వాణి జయరాం
నిర్మాణ సంస్థ గౌరి ప్రొడక్షన్స్
భాష తెలుగు

కాంతారావు కథానాయకుడిగా నటించిన సినిమా ఆకాశరామన్న.1965 జులై 8 విడుదల .దర్శకుడు జి. విశ్వనాథం. ఈ చిత్రంలో రామకృష్ణ , రాజశ్రీ, వాణీశ్రీ, ఎల్ విజయలక్ష్మీ ముఖ్య తారాగణం.సంగీతం., ఎస్. పి. కోదండపాణి అందించారు.

కథా విషయాలు

[మార్చు]

రామకృష్ణ హీరోగా మొదలై క్రమంగా కాంతారావు పాత్ర పెంచబడింది. నవరాత్రి సినిమాలోని తమిళ కథానాయకుడు (శివాజీ గణేశన్)స్ఫూర్తితో కాంతారావు అనేక ఆహార్యాలతో నటించారు. సాహెబు, పురోహితుడు, ముసలమ్మ వగైరా మారువేషాలతో సరదాగే సాగే ఈ చిత్రం కాంతారావుకు మంచిపేరు తెచ్చి విజయవంతమైంది. భావనారాయణ ఈ చిత్ర నిర్మాత.

తారాగణం

[మార్చు]
  • కాంతారావు
  • జి.రామకృష్ణ
  • కృష్ణకుమారి
  • రాజశ్రీ
  • వాణిశ్రీ
  • ఎల్.విజయలక్ష్మి
  • రాజనాల కాళేశ్వరరావు
  • మందాడి ప్రభాకరరెడ్డి
  • కైకాల సత్యనారాయణ
  • పేకేటి శివరాo
  • రాజబాబు

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: జి.విశ్వనాథం
  • సంగీతం: ఎస్. పి. కోదండపాణి
  • పాటలు: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి
  • నేపథ్య గానం:మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, శిష్ట్లా జానకి, ప్రతివాది భయంకర శ్రీనివాస్
  • నిర్మాత:భావనారాయణ
  • నిర్మాణ సంస్థ: గౌరి ప్రొడక్షన్స్
  • విడుదల:08:07:1965.

పాటలు

[మార్చు]
  1. ఎగరాలి ఎగరాలి రామదండు బావుటా అందరిదీ - ఎస్. జానకి, పిఠాపురం బృందం, రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి
  2. ఓ చిన్నవాడా ఒక్కమాట ఉన్నాను చూడు నీ ఎదుట - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్‌ , రచన: వీటూరి
  3. జలగలా పురుషుల జవసత్వముల (పద్యం) - మాధవపెద్ది
  4. తేనెపూసిన కత్తి నీదేశభక్తి (పద్యం) - ?
  5. తళుకు బెళుకులు చూపించి (పద్యం) - ?
  6. దాగవులే దాగవులే దాగవులే ఉబికి ఉబికి పొంగే - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి, రచన: వీటూరి
  7. నవ్వు నవ్వు నవ్వు నవ్వే బ్రతుకున వరము కన్ను కన్ను కన్నులు - ఎస్. జానకి. రచన :వీటూరి
  8. మంచిగా నిధిని కాచేయదలచిన ( పద్యం ) - ఎస్. జానకి
  9. ముత్యమంటి చిన్నదాని మొగలిరేకువన్నెదాని మొగమాటం - ఎస్. జానకి, రచన: వీటూరి
  10. డుంకు డుంకు ఓ పిల్లవే డుంకవే ఇల్లాలా - మాధవపెద్ది, ఎస్. జానకి, రచన: వీటూరి
  11. చల్ల చల్లగా సోకింది మెల్ల మెల్లగా తాకింది - ఎస్. జానకి, రచన: వీటూరి
  12. నీకోసం ఏమైనా ఐపోనీ నా నాట్యం , ఎస్.జానకి, రచన: వీటూరి.

వనరులు

[మార్చు]