Jump to content

ఆడమ్ జాంపా

వికీపీడియా నుండి
ఆడమ్ జాంపా
2023 జనవరిలో మెల్‌బోర్న్ స్టార్స్‌కు ఆడుతూ జాంపా
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1992-03-31) 1992 మార్చి 31 (వయసు 32)
షెల్‌హార్బర్, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా
మారుపేరుZorbs
ఎత్తు175 cమీ. (5 అ. 9 అం.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 212)2016 ఫిబ్రవరి 6 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 7 - దక్షిణాఫ్రికా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.88 (formerly 43)
తొలి T20I (క్యాప్ 82)2016 మార్చి 7 - దక్షిణాఫ్రికా తో
చివరి T20I2023 సెప్టెంబరు 1 - దక్షిణాఫ్రికా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.88 (formerly 43)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012/13న్యూ సౌత్ వేల్స్
2012/13సిడ్నీ థండర్
2013/14–2019/20సౌత్ ఆస్ట్రేలియా
2013/14–2014/15అడిలైడ్ స్ట్రైకర్స్
2015/16–2022/23మెల్‌బోర్న్ స్టార్స్
2016–2017రైజింగ్ పూణే సూపర్‌జైంట్s
2016గయానా Amazon వారియర్స్
2018–2019ఎసెక్స్
2018జమైకా తలావాస్
2020/21–presentన్యూ సౌత్ వేల్స్
2021రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
2022వెల్ష్ ఫైర్
2023రాజస్థాన్ రాయల్స్
2023/24-presentమె;ల్‌బోర్న్ రెనెగేడ్స్
2023/24-presentలాస్ ఏంజెలిస్ నైట్ రైడర్స్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు టి20 లిఎ T20
మ్యాచ్‌లు 79 72 124 232
చేసిన పరుగులు 216 48 728 262
బ్యాటింగు సగటు 9.39 6.00 15.16 6.55
100లు/50లు 0/0 0/0 0/3 0/0
అత్యుత్తమ స్కోరు 36 13* 66 23
వేసిన బంతులు 4,122 1,541 6,641 4,921
వికెట్లు 131 82 202 269
బౌలింగు సగటు 28.46 21.71 29.16 22.25
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 1 1 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/35 5/19 5/35 6/19
క్యాచ్‌లు/స్టంపింగులు 16/– 10/— 26/– 31/—
మూలం: ESPNcricinfo, 2023 మార్చి 30

ఆడమ్ జాంపా (జననం 1992 మార్చి 31) పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ఆస్ట్రేలియన్ అంతర్జాతీయ క్రికెటర్ .

దేశీయ వృత్తి (2010–2016)

[మార్చు]

న్యూ సౌత్ వేల్స్‌లో (2010–2013)

[మార్చు]

ఆస్ట్రేలియా యువ జట్టులో జాంపా ఆట తీరు ఫలితంగా, 2010 అతనికిలో న్యూ సౌత్ వేల్స్‌ కొత్త కాంట్రాక్టు ఇచ్చింది.[1] అయితే న్యూ సౌత్ వేల్స్‌లో నాథన్ హౌరిట్జ్, స్టీవ్ ఒకీఫ్, స్టీవ్ స్మిత్ వంటి అనేక మంది విజయవంతమైన స్పిన్ బౌలర్లు ఉన్నందున రాష్ట్ర స్థాయిలో తనను తాను నిరూపించుకునే అవకాశాలు జాంపాకు రాలేదు. [2] ఫస్ట్-క్లాస్‌లో ప్రవేశానికి ముందు, 2011 హాంకాంగ్ క్రికెట్ సిక్స్‌లలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించే మరో అవకాశాన్ని పొందాడు. [3]

2012–13 షెఫీల్డ్ షీల్డ్ సీజన్‌లో క్వీన్స్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూ సౌత్ వేల్స్ తరపున జాంపా ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేశాడు. ఐదు వికెట్లు పడగొట్టాడు. [4] బిగ్ బాష్ లీగ్లో అతను సిడ్నీ థండర్ కోసం ఆడాడు. ట్రెవర్ హోన్స్ అతన్ని బాగా మెచ్చుకున్నాడు. [2] అతను ఆ సీజనులో మూడు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 23 పరుగుల సగటుతో పది వికెట్లు తీసుకున్నాడు. [5]

సౌత్ ఆస్ట్రేలియాలో (2013–2016)

[మార్చు]

సీజన్ తర్వాత అతను సౌత్ ఆస్ట్రేలియా తరపున, ఫస్ట్-క్లాస్, వన్-డే మ్యాచ్‌లు రెండింటిలోనూ, సౌత్ ఆస్ట్రేలియా ట్వంటీ20 టీమ్, అడిలైడ్ స్ట్రైకర్స్ కోసం ఆడేందుకు ఒక ప్రతిపాదనను అంగీకరించాడు. టెస్ట్ స్పిన్నర్ నాథన్ లియాన్‌ న్యూ సౌత్ వేల్స్‌కు మారడంతో సౌత్ ఆస్ట్రేలియా జట్టులో తనకు గ్యారెంటీగా ఆడే అవకాశం వస్తుందని అతను భావించాడు. [5] 2013 శీతాకాలంలో, అతను 2013-14 సీజన్ కోసం సౌత్ ఆస్ట్రేలియన్ జట్టులో చేరడానికి ముందు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో మూడు నెలల శిక్షణ తీసుకున్నాడు. [6] దక్షిణ ఆస్ట్రేలియాకు వెళ్లడం జాంపా కెరీర్‌లో పురోగతికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ సమయంలో దక్షిణ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా ఉన్న అనుభవజ్ఞుడైన దక్షిణాఫ్రికా స్పిన్నర్ జోహన్ బోథాతో కలిసి పని చేసే అవకాశం లభించింది. [7]


2015–16 వేసవి కాలం జాంపా కెరీర్‌లో అత్యంత విజయవంతమైనది. అతను లిస్ట్ A క్రికెట్, ట్వంటీ 20 క్రికెట్ రెండింటిలోనూ ఆకట్టుకున్నాడు. 2016లో, వన్ డే ఇంటర్నేషనల్స్. ట్వంటీ20 ఇంటర్నేషనల్స్ రెండింటికీ అతన్ని ఆస్ట్రేలియా జట్టులోకి తీసుకున్నారు.[8] అయితే అతను ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో కష్టపడ్డాడు. [9]

ఫ్రాంచైజ్ క్రికెట్

[మార్చు]

2022 ఏప్రిల్‌లో అతన్ని, ది హండ్రెడ్ 2022 సీజన్ కోసం వెల్ష్ ఫైర్ కొనుగోలు చేసింది.[10]

అంతర్జాతీయ కెరీర్ (2016–ప్రస్తుతం)

[మార్చు]

అతను 2015-16 చాపెల్-హాడ్లీ ట్రోఫీ సిరీస్‌లోని రెండవ మ్యాచ్‌లో 2016 ఫిబ్రవరి 6న తన వన్‌డే రంగప్రవేశం చేశాడు. [11] 2016 మార్చి 4న దక్షిణాఫ్రికాపై ట్వంటీ20 ల్లోకి అడుగుపెట్టాడు.[12] జాంపా ఆస్ట్రేలియా వన్‌డే, T20I జట్టుల్లో సాధారణ సభ్యుడయ్యాడు. [8] జాంపా దక్షిణాఫ్రికాలో ఆస్ట్రేలియా తరపున తన T20I రంగప్రవేశం చేయడానికి ముందు 2016 వరల్డ్ ట్వంటీ 20 కోసం ఆస్ట్రేలియా జట్టులో ఎంపికయ్యాడు. [13] అతను జట్టులో చేరింది ఈమధ్యనే అయినప్పటికీ, అతను 13.80 సగటుతో, 6.27 ఎకానమీ రేట్‌తో ఐదు వికెట్లు తీసుకుని ఆస్ట్రేలియా జట్టులో ప్రముఖ వికెట్-టేకర్‌గా నిలిచాడు.[8]

ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు జాంపా ఎదగడంతో అతను విదేశీ ఆటగాడిగా ట్వంటీ 20 ఫ్రాంచైజీల్లో కూడా ఆడడం ప్రారంభించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్ తరఫున ఆడుతూ, అతను 19 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. సోహైల్ తన్వీర్ చేసిన 6/14, అల్జారీ జోసెఫ్ 6/12 తరువాత IPL చరిత్రలో మూడవ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో జాంపా తన మొదటి ఓవర్‌ను బౌలింగ్ చేశాడు. అయితే వెంటనే బౌలింగు నుండి తప్పించారు. మళ్ళీ 16వ ఓవరులో తీసుకువచ్చినపుడు అందులో అతను ఒక వికెట్ తీసుకున్నాడు. కెప్టెన్ MS ధోని అతని వికెట్ తర్వాత అతనికి పొడిగించిన స్పెల్ ఇచ్చాడు. అతను 18వ ఓవర్‌లో రెండు వికెట్లు, 20వ ఓవర్‌లో మరో మూడు వికెట్లు పడగొట్టాడు. [14] అతను తన ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ట్వంటీ 20 చరిత్రలో ఓడిపోయిన జట్టు లోని బౌలరు సాధించిన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కూడా ఇదే. [15] జాంపా గయానా అమెజాన్ వారియర్స్ తరపున కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా ఆడాడు. టోర్నమెంటులో 18.46 సగటుతో 15 వికెట్లతో స్పిన్ బౌలర్లందరిలోకీ అత్యధిక వికెట్లు పడగొట్టాడు. [9]


2016–17లో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో సిరీస్ ఓపెనర్‌లో బాగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టిన తర్వాత జాంపాను ఆస్ట్రేలియా ట్వంటీ20 జట్టు నుండి ఆశ్చర్యకరంగా తొలగించారు. తన ఇటీవలి ఫామ్‌, ప్రపంచంలోని అత్యుత్తమ ట్వంటీ 20 స్పిన్ బౌలర్‌లలో ఒకడినని సూచిస్తోందనీ, ఈ తొలగింపు "కడుపు మీద కొట్టడం లాగా ఉంద"నీ పేర్కొన్నాడు. జాంపా లేని మ్యాచ్‌ను, సిరీస్‌నూ రెండింటినీ ఆస్ట్రేలియా కోల్పోయింది. [16] సిరీస్‌లోని చివరి మ్యాచ్‌కు జాంపా తిరిగి జట్టులోకి తీసుకున్నారు. 3/25తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు,ఆస్ట్రేలియా గేమ్‌ను గెలుచుకుంది. [17]

క్రికెట్ పొట్టి రూపాలలో జాంపా విజయాలు సాధించినప్పటికీ, అతను ఇప్పటికీ ఆస్ట్రేలియా టెస్టు జట్టులోకి ప్రవేశించలేకపోయాడు. అతను షెఫీల్డ్ షీల్డ్‌లో అసాధారణమైన ఫామ్‌ను చేరుకోలేకపోయాడు, సౌత్ ఆస్ట్రేలియాకు చాలా బలమైన పేస్ అటాక్‌ ఉంది. చాడ్ సేయర్స్, కేన్ రిచర్డ్‌సన్ లు అన్ని వికెట్లనూ తామే తీసేవాళ్ళు. జాంపాకు పెద్దగా అవకాశాలను లభించేవి కావు. [17] 2017 ప్రారంభంలో ఆస్ట్రేలియా భారత్‌లో టెస్టు సిరీస్ ఆడింది. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్, భారత పిచ్‌లపై బాగా బౌలింగ్ చేయగల జాంపా సామర్థ్యం కారణంగా ఆస్ట్రేలియా జట్టులో అదనంగా చేర్చవచ్చని అన్నాడు.[18] కానీ అతన్ని జట్టులోకి తీసుకోలేదు. [19] జాంపా షెఫీల్డ్ షీల్డ్‌లో ఆడటం కొనసాగించి, క్వీన్స్‌లాండ్‌పై మొదటి ఇన్నింగ్స్‌లో 6/62తో కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు తీసుకున్నాడు. ఫస్ట్-క్లాస్ ఇన్నింగ్స్‌లో తన మొదటి ఐదు వికెట్ల పంట సాధించాడు. రెండవ ఇన్నింగ్స్‌లో మరో నాలుగు వికెట్లు పడగొట్టి, ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో అతని మొదటి పది వికెట్ల ప్రదర్శనను సాధించాడు. [20] [21]

జాంపా 2017 ICC ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టులో ఉన్నాడు, అయితే ఆస్ట్రేలియా మూడు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లలో రెండు వాష్ అవుట్ అవడాం, ఆస్ట్రేలియా ఫైనల్స్‌కు చేరుకోలేక పోవడంతో అతనికి ఆడేందుకు పెద్దగా అవకాశాలు రాలేదు. [22] 2019 ఏప్రిల్లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టులో ఎంపికయ్యాడు. [23] [24] 2021 ఆగస్టులో, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టులో జాంపా ఎంపికయ్యాడు. [25] 2021 నవంబరు 4న, బంగ్లాదేశ్‌తో జరిగిన ఆస్ట్రేలియా T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో, T20I క్రికెట్‌లో జాంపా తన మొదటి ఐదు వికెట్ల ప్రదర్శనను సాధించాడు. [26]

2022 మార్చిలో, పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో ప్రారంభ మ్యాచ్‌లో, జాంపా వన్‌డే క్రికెట్‌లో తన 100వ వికెట్‌ను తీసుకున్నాడు. [27]

2022 సెప్టెంబరులో, అతను కెయిర్న్స్‌లో న్యూజిలాండ్‌పై వన్‌డేల్లో తన మొదటి ఐదు వికెట్ల ప్రదర్శనను సాధించాడు. [28]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

జాంపా, హ్యారియెట్ పామర్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ఒక కుమారుడు. [29] అతను శాకాహారి. PETA కోసం ప్రకటనలలో కనిపించాడు. [30]

మూలాలు

[మార్చు]
  1. "Adam Zampa". cricket.com.au. Retrieved 12 December 2017.
  2. 2.0 2.1 Wu, Andrew (8 January 2013). "Zampa shines through Thunder's gloom as future spin star". The Sydney Morning Herald. Fairfax Media. Retrieved 12 December 2017.
  3. "Adam Zampa to join Hong Kong sixes squad". cricketnsw.com.au. 25 October 2011. Archived from the original on 12 డిసెంబరు 2017. Retrieved 12 December 2017.
  4. "17th Match, Sheffield Shield at Canberra, Nov 27-30 2012". ESPNcricinfo. Retrieved 12 January 2015.
  5. 5.0 5.1 Earle, Richard (16 April 2013). "South Australia poach young spinner Adam Zampa from NSW but stand to lose Nathan Lyon". The Daily Telegraph. News Corp Australia. Retrieved 12 December 2017.
  6. Walsh, Scott (4 May 2013). "Spin bowler Adam Zampa, described as a 'clone' of Shane Warne, ready for new challenge with South Australia". The Daily Telegraph. News Corp Australia. Retrieved 12 December 2017.
  7. Brettig, Daniel (24 April 2013). "Nathan Lyon to join New South Wales". ESPNcricinfo. Retrieved 12 December 2017.
  8. 8.0 8.1 8.2 "Player Profile: Adam Zampa". ESPNcricinfo. Retrieved 12 January 2015.
  9. 9.0 9.1 Coverdale, Brydon (12 August 2016). "Zampa hoping to improve red-ball credentials". ESPNcricinfo. Retrieved 12 December 2017.
  10. "The Hundred 2022: latest squads as Draft picks revealed". BBC Sport. Retrieved 5 April 2022.
  11. "Debutant Zampa impresses". ESPNcricinfo. 6 February 2016. Retrieved 6 February 2016.
  12. "Australia tour of South Africa, 1st T20I: South Africa v Australia at Durban, Mar 4, 2016". ESPN Cricinfo. Retrieved 4 March 2016.
  13. Brettig, Daniel (9 February 2016). "Australia selectors build a squad from hunches". ESPNcricinfo. Retrieved 12 December 2017.
  14. Venugopal, Arun (10 May 2016). "'It was pretty hard to hit spin today' - Zampa". ESPNcricinfo. Retrieved 12 December 2017.
  15. "Records | Twenty20 matches | Bowling records | Best figures in a innings when on the losing side | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-03-28.
  16. "Zampa axing 'a kick in the guts'". cricket.com.au. 22 February 2017. Retrieved 12 December 2017.
  17. 17.0 17.1 Earle, Richard (24 February 2017). "Adam Zampa to push national selection claims in Sheffield Shield". AdelaideNow. News Corp Australia. Retrieved 12 December 2017.
  18. Landsberger, Sam (11 January 2017). "Leg-spinner Adam Zampa bowls perfect pace for Indian conditions, according to Stephen Fleming". Herald Sun. News Corp Australia. Retrieved 12 December 2017.
  19. Buckley, James (21 January 2017). "Australia v Pakistan: Adam Zampa takes veiled swipe at Test selectors after being left out of India tour squad". The Sydney Morning Herald. Fairfax Media. Retrieved 12 December 2017.
  20. "Zampa six-for scythes through Queensland". ESPNcricinfo. 25 February 2017. Retrieved 12 December 2017.
  21. "South Australia need 121 on final day, Queensland need six wickets". ESPNcricinfo. 27 February 2017. Retrieved 12 December 2017.
  22. Coverdale, Brydon (6 June 2017). "'We're looking at England game as a quarter-final' - Zampa". ESPNcricinfo. Retrieved 12 December 2017.
  23. "Smith and Warner make World Cup return; Handscomb and Hazlewood out". ESPN Cricinfo. 15 April 2019. Retrieved 15 April 2019.
  24. "Smith, Warner named in Australia World Cup squad". International Cricket Council. Retrieved 15 April 2019.
  25. "Josh Inglis earns call-up and key names return in Australia's T20 World Cup squad". ESPN Cricinfo. Retrieved 19 August 2021.
  26. "Zampa takes five wickets as Australia bowl out Bangladesh for 73". Yahoo! News. Archived from the original on 4 November 2021. Retrieved 4 November 2021.
  27. "Returning Head stars as depleted Aussies win big". Cricket Australia. Retrieved 29 March 2022.
  28. "Adam Zampa shines and Aaron Finch fails again as Australia down New Zealand to secure ODI series". ABC News. 8 September 2022. Retrieved 9 September 2022.
  29. Singh, Anirudh. "RCB's Director of Cricket confirms Adam Zampa's marriage". CricketTimes.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-03-25.
  30. Shemilt, Stephan (7 September 2020). "Adam Zampa: Australia's vegan, whisky-loving coffee connoisseur". BBC Sport. Retrieved 11 September 2020.