Jump to content

ఆయుధ పరిశోధన అభివృద్ధి సంస్థ

వికీపీడియా నుండి
ఆయుధ పరిశోధన అభివృద్ధి సంస్థ
స్థాపన1958
డైరెక్టరుDr KM Rajan
చిరునామాArmament PO, Pashan,
Pune-411 021
స్థలంపుణె, మహారాష్ట్ర
యాజమాన్య సంస్థ
DRDO
వెబ్‌సైటుARDE Home Page

ఆయుధ పరిశోధన అభివృద్ధి సంస్థ (ARDE) భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు చెందిన ప్రయోగశాల. పూణెలో స్థాపించిన ఈ సంస్థ సాంప్రదాయిక ఆయుధ సామాగ్రిని అభివృద్ధి చేస్తుంది. 

చరిత్ర

[మార్చు]

ఆయుధ సామాగ్రి తయారీలో స్వయం సమృద్ధిని సాధించేందుకు 1958 లో ఈ సంస్థను ఏర్పరచారు. అతి స్వల్ప సౌకర్యాలతో ఖడ్కీ ఆయుధ కర్మాగార ప్రాంగణంలో సంస్థ ప్రారంభమైంది. జబల్‌పూర్, ఖడ్కీల లోని సాంకేతికత అభివృద్ధి విభాగాల నుండి ఉద్యోగులను ఈ సంస్థ లోకి తీసుకున్నారు. 1966 లో సంస్థ ప్రస్తుత స్థలం - పూణె శివార్లలోని పాషాన్ -కు మారింది. 

కార్యక్షేత్రం

[మార్చు]

భారత సైనిక దళాల కోసం భారత సాయుధ దళాల కోసం సాంప్రదాయిక ఆయుధ సామాగ్రిని డిజైను చేసి అభివృద్ధి చెయ్యడం సంస్థ యొక్క ప్రధాన పరిశోధనా క్షేత్రం. పరిశోధన, అభివృద్ధి, నమూనాల (ప్రోటోటైపు) తయారీ, పరీక్ష, మూల్యాంకనం, సాంకేతికత బదిలీ లాంటివన్నీ సంస్థ కార్యక్రమాల్లో భాగం. మౌలిక పరిశోధన, అనువర్తన, సిమ్యులేషను, సాఫ్ట్‌వేరు అభివృద్ధి కూడా ఇందులో భాగమే. సాయుధ దళాలు ఈసరికే వాడుతున్న ఆయుధ సామాగ్రిని మెరుగుపరచడం, జీవిత కాలాన్ని పెంచడం కూడా సంస్థ కార్యక్రమాల్లో భాగమే. 

పరిశోధన సంస్థ కావడాన పెద్ద ఎత్తున ఉత్పత్తి కార్యక్రమాలేమీ సంస్థ చేపట్టదు. కేవలం కీలకమైన పరికరాల పైలట్ ఉత్పత్తి మాత్రమే చేస్తుంది. ఆ తరువాత, పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు గాను, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆర్డినెంస్ ఫ్యాక్టరీస్ బోర్డ్ వంటి తయారీ సంస్థలకు ఆయా సాంకేతికతలను బదిలీ చేస్తుంది. దీంతో పాటు, తొలిదశ ఉత్పత్తిని సాధ్యపరచడం, నాణ్యతను పర్యవేక్షించడం కూడా సంస్థ చేస్తుంది. 

సాయుధ బలగాలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న అనేక ఆయుధాలను కూడా వాడుతాయి కాబట్టి, ఆ ఆయుధాలను ఈసరికే ఉన్న ఆయుధ వ్యవస్థలతో సమన్వయ పరచడం అవసరం. ARDE ఈ పనిలో సాయుధ బలగాలకు తోడ్పడుతుంది. 

ప్రాజెక్టులు, ఉత్పత్తులూ

[మార్చు]

చిన్న ఆయుధాలు

[మార్చు]

7.62×51 1A1 సెల్ఫ్ లోడింగ్ రైఫిల్

[మార్చు]
A BSF personnel carrying a 7.62mm 1A1 rifle in West Bengal during poll.

ARDE అభివృద్ధి చేసిన తొలి అయుధాల్లో ఒకటి 7.62 mm 1A1 సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (SLR), దాని మందుగుండు సామాగ్రి. భారత సైన్యం అప్పటివరకూ వాడుతున్న రైఫిళ్ళ స్థానంలో వీటిని నియోగిచారు. ఈ రైఫిళ్లను ఈశాపూర్ రైఫిల్ ఫ్యాక్టరీ పది లక్షలకు పైగా ఉత్పత్తి చేసింది. వీటిని 1965, 1971 భారత పాక్ యుద్ధాల్లో వాడారు.[1]

INSAS దాడి రైఫిల్

7.62 మిమీ SLR ను అభివృద్ధి చేసిన అనుభవంతో, ARDE 5.56 మిమీ ల ఇండియన్ స్మాల్ ఆర్స్మ్ సిస్టము (INSAS) ను అభివృద్ధి చేసింది. ఇందువలన మందుగుండు సామాగ్రిని ప్రామాఅణీకరించడం సాధ్యమైంది. ఇంతకుముందు, పదాతి దళం, మూడు రకాల ఆయుధాలతో, రెండు రకాల మందుగుండు సామాగ్రిని ప్రయోగించేవారు. అవి:. 7.62 మిమీ ల ఈశాపూర్ SLR, LMG, 9 mm కార్బైన్. INSAS ఆయుధ కుటుంబం ఓ దాడి రైఫిలు, ఓ లైట్ మెషిన్ గన్, ఓ కార్బైన్‌ను కలిగి ఈ మూడు ఆయుధాల స్థానాన్ని భర్తీ చేస్తుంది. 1998 లో ఉద్భవించిన INSAS, భారత సైన్యానికి సేవలందించింది.

ARDE 40 మిమీ అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచరు

[మార్చు]

ARDE 40 మిమీ అండర్ బ్యారెల్ లాంచరును తిరుచిరాపల్లిలోని అర్డినెంస్ ఫ్యాక్టరీతో కలిసి సంయుక్తంగా తయారు చేసారు. INSAS, AK-47 రైఫిళ్ళలో వాడేందుకు దీన్ని తయారుచేసారు. దీని స్టాండ్ ఎలోన్ కూర్పులు కూడా ఉన్నాయి. ప్రమాదవశాత్తూ పేలకుండా లాంచరులో ఏర్పాట్లు ఉన్నాయి. దృఢత్వం కోసం ఇందులో మూడు పాయింట్ల అటాచిమెంటు ఉంది. ట్రిగ్గరు బ్యారెలుకు పక్కన ఉంది. ఇందువలన, పట్టును మార్చుకోకుండానే రైఫిలు గుళ్ళను, గ్రెనేడులనూ పేల్చవచ్చు. ఈ ఆయుధం ల్యాడర్ సైటు మెకానిజమును వాడారు. రాత్రిళ్ళు పేల్చేందుకు గాను, ట్రిటియంతో కాంతిని ప్రసరింపజేస్తారు. ఈ లాంచరు వాడే మందుగుండు సామాగ్రి, సైన్యం ఈసరికే వాడుతున్న మిల్కోర్ లాంవ్చరు వాడే సామాగ్రీ ఒకటే. దీంతో ప్రామాణీకరణ సాధ్యమైంది.[2]

శతఘ్ని, ట్యాంకు గన్‌లు

[మార్చు]

105 మిమీ భారతీయ ఫీల్డ్ గన్

[మార్చు]

ARDE 1972 లో డిజైను చేసిన 105 mm  ఫీల్డ్ గన్ భారత్ తయారు చేసిన తొలి శతఘ్ని. సాయుధ దళాల్లో చేర్చుకున్నాక అది ప్రధాన ఆయుధంగా మారింది.[3]

పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచరు

[మార్చు]

పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ ను భారతీయ సైన్యం కోసం డిఆర్‌డివో అభివృద్ధి చేసింది.1983 లో దీని అభివృద్ధి మొదలైంది. 30 కి.మీ. పైబడిన దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించేందుకు ఒక ఆయుధ వ్యవస్థ కావాలనే భారత సైన్యపు అవసరాన్ని తీర్చేందుకు ఈ ప్రాజెక్టును మొదలు పెట్టారు. డిఆర్‌డివోకు చెందిన అనేక ప్రయోగశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలూ ఈ పెద్ద ప్రాజెక్టులో పాలుపంచుకున్నాయి. ప్రైవేటు సంస్థలు పాలుపాంచుకున్న తొలి ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. ప్రాజెక్టులో భాగంగా ఎల్ & టి, టాటా సంస్థలు రు. 390 కోట్లకు పైగా ఆర్డర్లు పొందాయి.

అర్జున్ 120 మిమీ గన్

[మార్చు]
అర్జున్ MBT

అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంకులో వాడే 120 మిమీ ప్రధాన గన్‌ను ARDE అభివృద్ధి చేసింది.[4] ట్యాంకుల్లో వాడే అతి కొద్ది రైఫిల్ గన్నుల్లో ఇది ఒకటి. 1650 మీ/సె పైబడిన వేగంతో ఇది గుళ్ళను పేల్చగలదు. 6120 MPa వరకూ పీడనాన్ని ఇది తట్టుకోగలదు. 

ఈ గన్ను యొక్క మందుగుండు సామాగ్రిని కూడా ఏఅర్‌డిఈ తయారుచేసింది. దీనిలో ప్రాథమిక గతిశక్తి రౌండుగా FSAPDS ను వాడారు. LAHAT యాంటీ ట్యాంకు క్షిపణిని ప్రయోగించడంతో పాటు, HEAT, HESH వంటి ఇతర రౌండ్లను కూడా అర్జున్ వాడగలదు. ఈ ఆయుధ, మందుగుండు వ్యవస్థలు ప్రస్తుతం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో ఉత్పత్తి అవుతున్నాయి.

DRDO 155 మిమీ శతఘ్ని

[మార్చు]

155 మిమీ 45 కాలిబర్ దేశీయ హొవిట్జరును అభివృద్ధి చేసే ప్రాజెక్టు

ఇజెక్షన్ సీటు

[మార్చు]

తేజస్ విమానం కోసం ARDE ఎజెక్షన్ సీటును అభివృద్ధి చేసింది. బ్రిటిషు కంపెనీ, మార్టిన్ బేకర్ తయారు చేసిన సీటుపై ఆధారపడి సీటును నమూనాగా ముందు వాడి దానికి మెరుగు పరచారు. మార్టిన్ బేకర్ సంస్థ ఈ మెరుగుపరచిన సీటును సర్టిఫై చేసింది. 

రోబోటిక్స్

[మార్చు]

దక్ష్ రోబో

[మార్చు]

హానికరమైన వస్తువులను భద్రంగా తొలగించేందుకు గాను దక్ష్ అనే రోబోను ARDE తయారుచేసింది.[5]

మూలాలు

[మార్చు]
  1. ARDE Products and Technologies Archived అక్టోబరు 14, 2007 at the Wayback Machine
  2. "Under Barrel Grenade Launcher 40 mm". Ordnance Factories Board. Archived from the original on 11 డిసెంబరు 2014. Retrieved 10 డిసెంబరు 2017.
  3. Shukla, Ajai (29 June 2010). "155-mm gun contract: DRDO enters the fray". Business Standard. New Delhi, India. Retrieved 8 November 2014.
  4. "120 Millimetre MBT Arjun Armament System". DRDO Technology Focus. 10 (1). February 2002. Archived from the original on 2007-06-19. Retrieved 2007-11-06..(DRDO webpage with technical Details of the Arjun Tank Gun).
  5. Kulkarni, Prasad (28 November 2008). "Daksh could be useful in Mumbai operations". The Times of India. Archived from the original on 24 అక్టోబరు 2012. Retrieved 11 December 2014.

బయటి లింకులు

[మార్చు]
  • Pinaka MBRL System on GlobalSecurity.org.