ఆరాధన (1962 సినిమా)
ఆరాధన (1962 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.మధుసూధనరావు |
---|---|
నిర్మాణం | వి.బి. రాజేంద్రప్రసాద్, రంగారావు |
రచన | నార్ల చిరంజీవి, ఆచార్య ఆత్రేయ |
కథ | సాగరిక (బెంగాలీ చిత్రం) |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు (గోపి), సావిత్రి (అనూరాధ), జగ్గయ్య, రేలంగి, గిరిజ (గోపికి నిశ్చయమైన అమ్మాయి), రాజశ్రీ, వాసంతి, అనితా దత్ |
సంగీతం | ఎస్.రాజేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల, పి. సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు, ఎస్. జానకి |
గీతరచన | నార్ల చిరంజీవి, ఆచార్య ఆత్రేయ, శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు రాఘవయ్య |
ఛాయాగ్రహణం | సి. నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | జగపతి పిక్చర్స్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 16, 1962 |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఆరాధన 1962 లో వి. మధుసూదనరావు దర్శకత్వంలో జగపతి పిక్చర్స్ పతాకంపై వి. బి. రాజేంద్రప్రసాద్ నిర్మించిన సినిమా. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య ప్రధాన పాత్రధారులు. బెంగాలీ నవల సాగరిక ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
పాత్రలు-సాంకేతిక వర్గం
[మార్చు]- పాత్రధారులు: అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య, రేలంగి, గిరిజ, రాజశ్రీ, రీటా, డా.శివరామకృష్ణయ్య, ఎల్.విజయలక్ష్మి, రాజారావు, లక్ష్మి, మహంకాళి వెంకయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు - హాస్పిటల్ ఫాదర్, నాగయ్య - నాగేశ్వరరావు తండ్రి, మాస్టర్ హేమంత్ కుమార్, కె.యస్.రెడ్డి, రాజేశ్వరి, ఝాన్సీ, రాజరత్నం, జానకి, నిర్మల, వీరభద్రరావు, జగన్నాధరావు
- కథామూలం: సాగరిక (బెంగాలీ చిత్రం)
- మాటలు: నార్ల చిరంజీవి, ఆచార్య ఆత్రేయ
- పాటలు: నార్ల చిరంజీవి, ఆచార్య ఆత్రేయ, శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు రాఘవయ్య
- నేపథ్యగాయకులు: సుశీల, జానకి, స్వర్ణలత, ఘంటసాల, పిఠాపురం నాగేశ్వరరావు
- ఛాయాగ్రహణము: సి. నాగేశ్వరరావు ; సహాయకులు: ఎం.చంద్రశేఖర్, ఒ.ప్రభాకర్, ఎస్.వెంకటరత్నం
- నిర్మాతలు: రంగారావు, వి.బి.రాజేంద్రప్రసాద్
- దర్శకత్వం: వి. మధుసూదనరావు
పాటలు
[మార్చు]పాట | గీతరచయిత | గాయనీగాయకులు | సంగీతం | నటీనటులు |
---|---|---|---|---|
ఆడదాని ఓర చూపుతో జగన ఓడిపోని | ఆరుద్ర | ఎస్. జానకి బృందం | సాలూరి రాజేశ్వరరావు | |
ఇంగ్లీషులోన మ్యారేజి హిందీలో అర్ధము షాదీ | ఆరుద్ర | ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్. జానకి | సాలూరి రాజేశ్వరరావు | రేలంగి, గిరిజ |
ఏమంటావ్ ఏమంటావ్ ఓయి బావా | కొసరాజు రాఘవయ్య | స్వర్ణలత, పిఠాపురం నాగేశ్వరరావు | సాలూరి రాజేశ్వరరావు | ఎల్.విజయలక్ష్మి, ?? |
ఓహోహో మావయ్య ఇదేమయ్య బలెబలే బాగు ఉందయ్యా | ఆరుద్ర | పి. సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు | సాలూరి రాజేశ్వరరావు | |
నా హృదయంలో నిదురించే చెలీ కలలోనే కవ్వించే సఖీ | శ్రీశ్రీ | ఘంటసాల వెంకటేశ్వరరావు | సాలూరి రాజేశ్వరరావు | అక్కినేని నాగేశ్వరరావు, రాజశ్రీ |
నీ చెలిమి నేడె కోరితిని ఈ క్షణమే ఆశ వీడితిని | నార్ల చిరంజీవి | పి. సుశీల | సాలూరి రాజేశ్వరరావు | సావిత్రి |
వెన్నెల లోని వికాసమే వెలిగించెద నీ కనుల వేదన మరచి ప్రశాంతిగ నిదురించుము ఈ రేయి |
శ్రీశ్రీ | పి. సుశీల | సాలూరి రాజేశ్వరరావు | సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు |
సినిమా విశేషాలు
[మార్చు]ఈ సినిమా కథా నాయకుడు: అక్కినేని నాగేశ్వరావు: అప్పటికే నాగేశ్వరావు రొమాంటిక్ కథానాయకుడిగా అగ్ర స్థానంలో ఉన్నారు. ఆరాధన చిత్రంలోని కథానాయకుడు అంధుడు. దాన్ని అభిమానులు స్వీకరిస్తారా?,,,,, అని సందేహించారు. కథలో బలం వున్నందున చివరికి ఒప్పుకున్నారు. ఈ సినిమాలోని పాట ఒకటి "శ్రీ శ్రీ (శ్రీ రంగం శ్రీనివాసరావు ) వ్రాశారు. అది నాహృదయంలో నిదురించె చెలీ .... భావోద్వేగ గీతాల రచయితగా ముద్ర పడ్డ శ్రీ శ్రీ ఈ పాటను వ్రాసారంటే అప్పట్లో ఎవరూ నమ్మలేదు. అప్పట్లో శ్రీ శ్రీని ఎవరో ఆట పట్టించడానికి నీహృదయంలో నిదురించే చెలి ఎవరు అని ప్రశ్నించగా శ్రీ శ్రీ కమ్యూనిజం అని అన్నారని చాల మంది చెప్పుకున్నారు. ఆ పాట ఈ నాటికి తెలుగు వారి హృదయాలలో నిలిచే ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ సినిమాకు ఖర్చు పెట్టినది కేవలం రెండు లక్షల రూపాయలు మాత్రమే.
మూలాలు
[మార్చు]- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)