ఆలపాటి వెంకట్రామయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆలపాటి వెంకట్రామయ్య : స్వాతంత్ర్య సమరయోధుడు. వీరు గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మనుగా, తెనాలి పురపాలకసంఘం ఛైర్మనుగా మంత్రిగా, డి.సి.సి అధ్యక్షులుగా పనిచేసారు.

ఆలపాటి వెంకట్రామయ్య
Alapati Venkatramaiah1.jpg
జననం1917 సెప్టంబర్ 9
గుంటూరు జిల్లా యడ్లపల్లి గ్రామం
మరణం1965 జూన్ 16
పదవి పేరుశాసన సభ్యులు
పదవీ కాలము1952 - 1965 రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి (1962- 1965)
రాజకీయ పార్టీజాతీయ కాంగ్రెస్
మతంహిందువు
భార్య / భర్తశ్రీమతి సామ్రాజ్యమ్మ
పిల్లలుకుమార్తె శ్రీమతి దొడ్డపనేని ఇందిర
తల్లిదండ్రులుఅంజయ్య , చెల్లమ్మ

జననం[మార్చు]

ఆలపాటి వెంకట్రామయ్య గారు గుంటూరు జిల్లా యడ్లపల్లి గ్రామంలో అంజయ్య, చెల్లమ్మ దంపతులకు 1917 సెప్టంబర్ 9న జన్మించారు. వీరి ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలో జరిగింది.

రాజకీయ జీవితం[మార్చు]

1952 లో మద్రాసు శాసన సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఏన్నికైనారు.1955లో ఆంధ్ర రాష్ట్ర శాసన సభకు జరిగిన తొలి ఎన్నికలలో తెనాలి నుండి శాసన సభ్యునిగా ఏన్నికైనారు. 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఆంధ్ర రాష్ట్ర శాసన సభ్యులంతా ఆంధ్రప్రదేశ్ లోనూ సభ్యులుగా కొనసాగారు.

తెనాలి శాసన సభ సభ్యునిగా పనిచేస్తున్న సమయాన 'రణ రంగ చౌక్'ను నిర్మించారు. 1959 డిసెంబరు 20న దీనిని ఆనాటి కాంగ్రెస్ అద్యక్షులు కె, కామరజ్ నాడార్, ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి గార్ల సమక్షంలో అవిష్కరించారు[1]. ఇది ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు కల్లూరి చంద్రమౌళి గారినాయకత్వంలో 1942లో తెనాలిలో క్విట్ ఇండియా ఉద్యమం జరిగినప్పుడు జరిగిన పోలీసు కాల్ఫులలో మరణించిన ఏడుగురు అమర వీరుల స్మృతి చిహ్నంగా ఏడు స్తంభాలతో 'రణ రంగ చౌక్'ను నిర్మించారు.

ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తరువాత 1962లో శాసన సభకు జరిగిన తొలి ఎన్నికలలోనూ తెనాలి నుండి శాసన సభ్యునిగా తిరిగి ఏన్నికైనారు. నీలం సంజీవరెడ్డి గారి మంత్రి వర్గంలో మునిసిపల్ శాఖా మంత్రిగా (1962-64) లో పనిచేసారు.

రవాణా సంస్థల జాతీయీకరణ వివాదంలో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడంతో 1964 ఫిబ్రవరి 29 న సంజీవరెడ్డి మంత్రివర్గం రాజీనామా చేయగా వచ్చిన కాసు బ్రహ్మానంద రెడ్డి గారి మంత్రివర్గంలో ఆలపాటి తిరిగి మునిసిపల్, సహకార శాఖా మంత్రిగా (1964-65) పనిచేసారు.

మరణం[మార్చు]

ఆలపాటి వెంకట్రామయ్య 1965 జూన్ 16న మరణించారు. వీరి ధర్మపత్ని సామ్రాజ్యమ్మ, కుమార్తె శ్రీమతి దొడ్డపనేని ఇందిర గారు.తండ్రి మరణంతో ఈమె రాజకీయ ప్రవేశం చేశారు. ఈమె తెనాలి శాసనసభ నియోజకవర్గం నుండి మూడు సార్లు (1967, 1972, 1978) ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు

2017, ఆగస్టు-26న తెనాలిలో వీరి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు, వీరి కాంస్యవిగ్రహాన్ని ఆవిష్కరించారు., సి.హెచ్.బాబావలి రచించిన ఆలపాటి వెంకటరామయ్య జీవన సాఫల్యం అను పుస్తకాన్ని ఆవిష్కరించారు.[2]

మూలాలు[మార్చు]

  1. The Hindu (14th August, 2014). ""'Ranarang Chowk', a symbol of freedom struggle"". Check date values in: |date= (help)
  2. ఈనాడు గుంటూరు రూరల్; 2017,ఆగష్టు-27; 13వపేజీ