ఆలేటి అన్నపూర్ణ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆలేటి అన్నపూర్ణ
Aleti Annapurna.jpg
Incumbent
Assumed office
1994 - 1999, 2009 - 2014
నియోజకవర్గం ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం మే 7, 1956
వేల్పూరు, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
భాగస్వామి ఆలేటి మహీపాల్ రెడ్డి
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

ఆలేటి అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యడు ఆలేటి మహీపాల్ రెడ్డి భార్యైన ఈవిడ తెలుగుదేశం పార్టీ తరపున ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుండి 1994, 2009లో ప్రాతినిథ్యం వహించింది.[1][2]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

అన్నపూర్ణ 1956, మే 7న వేముల నర్సారెడ్డి, గంగవ్వ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా లోని వేల్పూరు లో జన్మించింది. డిగ్రీ వరకు చదువుకుంది.

వివాహం - పిల్లలు[మార్చు]

1972, మే 25న ఆలేటి మహీపాల్ రెడ్డి తో అన్నపూర్ణ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

1992లో రాజకీయాల్లోకి ప్రవేశించింది. నిజామాబాద్ జిల్లా టిడిపి ఉపాధ్యక్షులుగా పనిచేసింది. 1994లో అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి, స్వతంత్ర అభ్యర్థైన బాజిరెడ్డి గోవర్ధన్ పై విజయం సాధించింది. ఆ సమయంలో రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ ఛైర్మెన్ గా పనిచేసింది. 1999లో భారత జాతీయ కాంగ్రేసు అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో, 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధి శనిగరం సంతోష్ రెడ్డి చేతిలో ఓడిపోయింది. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కె.అర్.సురేష్ రెడ్డిపై విజయం సాధించింది.

మూలాలు[మార్చు]

  1. మననాయకుడు. "ఆలేటి అన్నపూర్ణ". mananayakudu.com. Retrieved 12 May 2017. 
  2. మైనేత. "Annapurna Aleti". myneta.info. Retrieved 12 May 2017. 

ఇతర లంకెలు[మార్చు]