Jump to content

ఇడుపుగంటి భూషణరావు

వికీపీడియా నుండి
ఇడుపుగంటి భూషణరావు
జననం(1914-01-06)1914 జనవరి 6
మరణం1976 మే 3(1976-05-03) (వయసు 62)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
దీనదయాళ్ ఉపాధ్యాయ కేసు

ఇడుపుగంటి భూషణరావు (1914 జనవరి 6 - 1976 మే 3) తెలంగాణకు చెందిన వైద్యుడు. ఫోరెన్సిక్ వైద్యంలో పేరొందాడు. 1972లో స్థాపించబడిన ఇండియన్ అకాడమీ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ వ్యవస్థాపక-అధ్యక్షుడిగా పనిచేశాడు.[1]

జననం, విద్య

[మార్చు]

భూషణరావు 1914, జనవరి 6న తెలంగాణ, మహబూబాబాద్ జిల్లా, డోర్నకల్ మండలంలోని డోర్నకల్‌ గ్రామంలో జన్మించాడు. విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాల నుండి 1940లో ఎంబిబిఎస్ డిగ్రీని, 1945లో ఎండి (పాథాలజీ) ని పొందాడు. తరువాత 1956లో కొలంబో ప్లాన్ ఫెలోషిప్‌తో యునైటెడ్ కింగ్‌డమ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ శిక్షణ పొందాడు.

వృత్తిరంగం

[మార్చు]

పదవులు

[మార్చు]
  • టెక్నికల్ కమిటీ సభ్యుడు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కుటుంబ నియంత్రణ విభాగం డిప్యూటీ కమిషనర్.[4][5][6]
  • ఫోరెన్సిక్ సైన్సెస్ సెంట్రల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సెంట్రల్ మెడికో-లీగల్ అడ్వైజరీ కమిటీ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్సెస్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సభ్యుడు.[7]
  • జర్నల్ ఆఫ్ ది ఇండియన్ అకాడమీ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్సెస్ చీఫ్ ఎడిటర్ (1962–66).[8][9]
  • ఇండియన్ అకాడమీ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ వ్యవస్థాపక-అధ్యక్షుడి బాధ్యతలు నిర్వర్తించి, మొదటిసారిగా వైద్యులు, శాస్త్రవేత్తలు, న్యాయవాదులు, క్రిమినాలజిస్టులు, న్యాయమూర్తులను ఒక ప్రొఫెషనల్ ఫోరమ్‌లో (1972–1976) ఒకచోట చేర్చాడు.[1]
  • భూషణరావు జ్ఞాపకార్థం డెక్కన్ క్లబ్ ఆధవర్యంలో డాక్టర్ ఐ. భూషణరావు మెమోరియల్ ట్రోఫీ కోసం వార్షిక బ్రిడ్జ్ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేసింది.[10]

ప్రముఖ హత్య కేసులు

[మార్చు]

దీనదయాళ్ ఉపాధ్యాయ, [11][12] ఇంద్రప్రస్థ ఎస్టేట్, లజపత్‌నగర్ పోలీస్ స్టేషన్, మీనా టాండన్, [13] ట్యాంక్ బండ్ డబుల్ మర్డర్ వంటివి ముఖ్యమైన కేసులలో ఉన్నాయి.[14] అప్పటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అకాల మరణంపై కూడా దర్యాప్తు చేయవలసిందిగా భారత ప్రభుత్వం భూషణరావును కోరింది.[3]

ప్రచురణలు

[మార్చు]
  • వైద్య-చట్టపరమైన సమస్యలు, జెపి మోడీ వైద్య న్యాయశాస్త్రంలో లైంగిక నేరాలపై సవరించిన అధ్యాయం (1959).
  • భారతదేశంలో వైద్య-చట్టపరమైన పద్ధతులపై సర్వే నివేదిక (సహ రచయిత, డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, భారత ప్రభుత్వం, 1964 ప్రచురించింది).[7]
  • ఫైర్ ఆర్మ్, ఫైర్ ఆర్మ్ గాయాలు (ఎం. జౌహరి, ఎంఎన్ సుపనేకర్‌తో, భారత ప్రభుత్వం ప్రచురించినది, 1965).[15]
  • టి.భాస్కర మీనన్ (1898 మే 4 - 1948 సెప్టెంబరు 12), ఐ. భూషణరావు, జర్నల్ ఆఫ్ పాథాలజీ. 61 (3) :478-483, 1949 జూలై.[16]

మరణం

[మార్చు]

భూషణరావు 1976 మే 3న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Governing Council ( 1972-1976). Indian Academy of Forensic Medicine" (PDF). Retrieved 2022-03-31.
  2. House Of The People, India. Parliament; Lok Sabha, India. Parliament (1959). "Lok Sabha Debates. Lok Sabha Secretariat. 1959". Retrieved 2022-03-31.
  3. 3.0 3.1 "The Department of Forensic Medicine. Jawaharlal Nehru Medical College, Karnataka". Archived from the original on 2018-09-25. Retrieved 2022-03-31.
  4. "Family Planning News, Volume 11, Issues 1-11. Directorate General of Health Services, 1970 - Birth control". 1970. Retrieved 22 August 2015.
  5. "Centre Calling. Volume 7. India Dept. of Family Planning.1972". Retrieved 2022-03-31.
  6. "C. Sarkar. Vidura, Volume 8. 1971". 1971. Retrieved 2022-03-31.
  7. "Indian Academy of Forensic Sciences". Retrieved 26 August 2015.
  8. "Journal of the Indian Academy of Forensic Sciences, Volume 16. 1977". Indian Academy of Forensic Sciences. 1977. Retrieved 2022-03-31.
  9. "Deccan Club". Archived from the original on 2017-06-23. Retrieved 2022-03-31.
  10. "The CBI:In Service of the Nation" (PDF). Archived from the original (PDF) on 2016-01-22. Retrieved 2022-03-31.
  11. "Chandrachud, Y V. Report Regarding the Facts and Circumstances Relating to the Death of Shri Deen Dayal Upadhyaya. New Delhi: Ministry of Home Affairs, 1970. Print".
  12. "Meena Tandon Case". Retrieved 2022-03-31.
  13. Mahmood bin muhammad. (1999). A Policeman Ponders: Memories and Melodies of a Varied Life. (1st ed.). New Delhi: APH Publishing.pp 115-118. Retrieved 2022-03-31.
  14. Notes and References.Use of Firearms and Their Control: A Critique, in Special Reference to Assam. Retrieved 2022-03-31.
  15. . "Thotakat Bhaskara Menon. Born 4 May 1898. Died 12 September 1948 by I. Bhooshana Rao. Journal of Pathology. 61(3):478-483, July 1949.".

బయటి లింకులు

[మార్చు]