ఇద్దరు కిలాడీలు
ఇద్దరు కిలాడీలు | |
---|---|
దర్శకత్వం | రేలంగి నరసింహా రావు |
రచన | భరత్ (కథ, మాటలు), కాశీ విశ్వనాథ్ (మాటలు) |
నిర్మాత | తమ్మారెడ్డి వి. కె. |
తారాగణం | సుమన్, భానుచందర్, జయసుధ, సాధన |
ఛాయాగ్రహణం | బి. కోటేశ్వరరావు |
కూర్పు | సి. హెచ్. మురళి |
సంగీతం | జయ్ రాజా |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1983 |
భాష | తెలుగు |
ఇద్దరు కిలాడీలు 1983 లో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో సుమన్, భానుచందర్, జయసుధ ముఖ్య పాత్రలు పోషించారు.
కథ
[మార్చు]రాజా, రంగా అనే ఇద్దరు యువకులు ధనవంతుల దగ్గర ఉన్న సంపదను దోచుకుని పేదవాళ్ళకి పంచిపెడుతూ, పట్టుబడినప్పుడల్లా జైలుకు వెళ్ళి వస్తుంటారు. అలా ఒకసారి జైలుకు వెళ్ళగా వారిని కొండాపురం అనే ఊరికి చెందిన యువకుడి దీనగాథ కదిలిస్తుంది. అతను అమాయకుడనీ పెద్దిరాజు, బుల్లిరాజు అనే తండ్రి కొడుకుల వల్ల తనకు తీరని అన్యాయం జరిగిందని చెబుతాడు. వారిద్దరి వల్ల ఆ ఊరిలో జనాలు చాలా ఇబ్బందుకు ఎదుర్కొంటున్నారని తెలుసుకుంటారు. అప్పటి దాకా దొంగతనం చేయడం, పేదలకు పంచిపెట్టడం, జైలుకెళ్ళి రావడం తప్ప ప్రత్యేకంగా లక్ష్యమేమీ లేని ఆ ఇద్దరూ, ఆ ఊరి బాగు కోసం పోరాడాలనుకుంటారు.
ఆ ఊరికి వెళ్ళగానే పెద్దిరాజు, బుల్లిరాజు చేతిలో మోసపోయిన అనేకమంది అమాయకులు కనిపిస్తారు. అందులో దమయంతి అనే ఒక ఉపాధ్యాయుడి భార్య. ఆమెను మానభంగం చేసి భర్తను చంపేసి వ్యభిచారి అనే ముద్ర వేస్తారు. నారాయణ అనే రైతుకూలీకి ఇచ్చిన భూమిని బలవంతంగా లాక్కుని అతన్ని పిచ్చివాణ్ణి చేసుంటారు. రైతుల దగ్గర బలవంతంగా పన్నులు చేస్తుంటారు. రాజా, రంగా ఇద్దరూ ఊర్లోకి రాగానే ఈ దురాగతాన్ని ఎదుర్కొని బుల్లిరాజుకు దేహశుద్ధి చేస్తారు.
తారాగణం
[మార్చు]- రాజా గా సుమన్
- రంగా గా భానుచందర్
- దమయంతి గా జయసుధ
- సాధన
- తులసి గా ముచ్చర్ల అరుణ
- పెద్దిరాజు గా హేమసుందర్
- బుల్లిరాజు గా నూతన్ ప్రసాద్
- నాగులు గా రాళ్ళపల్లి
- నారాయణ గా పి. ఎల్. నారాయణ
- పూజారి గా జె. వి. రమణమూర్తి
- నిర్మలమ్మ
- ఆర్. నారాయణ మూర్తి
- మాడా వెంకటేశ్వరరావు
- వందన
- నజీర్
- నాగేశ్వరరావు
- విజయకృష్ణ
- అతిథి పాత్రలో రంగనాథ్
- అతిథి పాత్రలో విజయలలిత
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: రేలంగి నరసింహారావు
సంగీతం: ఇళయరాజా
నిర్మాత: తమ్మారెడ్డి వి కె.
నిర్మాణ సంస్థ: చరిత చిత్ర
కథ, మాటలు: భరత్, కాశీవిశ్వనాథ్
కెమెరా: బి.కోటేశ్వరరావు
గీత రచయితలు: శ్రీ శ్రీ ,గోపి
గాయనీ గాయకులు: ఎస్ జానకి, పి సుశీల, ఎస్ పి శైలజ, జి.ఆనంద్, వింజమూరి కృష్ణమూర్తి .
పాటలు
[మార్చు]ఇందులో పాటలు శ్రీశ్రీ, గోపి రాశారు. పి. సుశీల, ఎస్. జానకి, జి. ఆనంద్, ఎస్. పి. శైలజ, వింజమూరి కృష్ణమూర్తి పాటలు పాడారు.
1.అదురు బెదురు ఎదురు లేని ఉక్కు పిడికిలి , రచన:శ్రీరంగం శ్రీనివాసరావు, గానం.వింజమూరి కృష్ణమూర్తి, జి.ఆనంద్
2.కట్టిందిరా చిట్టి కొత్తకోక , రచన: మైలవరపు గోపి, గానం.వి కృష్ణమూర్తి, ఎస్ పి శైలజ
3.కీలాఢీలు కిలాడీలు ఇద్దరూ కీలాడీలు, గానం.బృందం
4.చంపేసావు ముంచేసావు చిన్నగా వచ్చి , రచన: గోపి, గానం.శిష్ట్లా జానకి
5.చిన్నయ్య సీతయ్యా మంగయ్యా, రచన: గోపి, గానం.శిష్ట్లా జానకి
6.ధనలక్ష్మి భాగ్యలక్ష్మి కామితార్డ(పద్యం), గానం.వి కృష్ణమూర్తి
7 . నాస్వామి కోవెలలో వేణుగానమౌతాను , రచన: గోపి, గానం.పులపాక సుశీల.
మూలాలు
[మార్చు]- ↑ "ఇద్దరు కిలాడీలు పూర్తి సినిమా". youtube.com. Mango Indian films. 28 July 2016. Retrieved 12 April 2018.
. 2. ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు. బ్లాగ్.